పట్టణ సుందరీకరణకు చర్యలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధి లోని అటెండర్ కాలనీలో ఆదివారం పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటెండర్ కాలనీ ఏర్పాటై 26 ఏళ్లవుతున్నా సరైన సదుపాయాలు లేక వానాకాలంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.300 కోట్ల నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. మరో రూ.600 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఆదిలాబా ద్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చా రు. నాయకులు ధోని జ్యోతి, అజయ్, గంగాధర్‌చారి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.


