‘అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం’
నేరడిగొండ: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మండలంలోని గౌలిగూడ గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గౌలిగూడలో అర్హు లకు ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామానికి రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు మంజూరు చేయించానని తెలిపారు.
మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటాం
ఇచ్చోడ: మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తెలిపారు. మండల కేంద్రంలో హసన్ మదర్సా ఆవరణలో జరగనున్న జల్సా కార్యక్రమాన్ని పరిశీలించి మైనార్టీ మత పెద్దలతో మాట్లాడారు. సమస్యలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, నాయకులు గాడ్గే సుభా ష్, సర్పంచ్ జలైజాకు, మత పెద్దలు పాల్గొన్నారు.
బోథ్: మండలంలోని కౌఠ బీ గ్రామంలో నిర్వహించిన గాంగేవార్ విశాల్ స్మారక తాలూకా స్థాయి క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. విజేతగా నిలిచిన నేరడిగొండ క్రికెట్ క్లబ్ జట్టుకు ప్రథమ, రన్నరప్‌గా నిలిచిన పొచ్చర జై భీమ్ జట్టుకు ద్వితీయ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


