తూకంలో మోసం చేస్తే చర్యలు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరకు వచ్చిన భక్తులకు ఆహారపదార్థాల విక్రయంలో మోసం చేస్తే కఠి నచర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారి ఎస్.విజయ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరలో ఏర్పా టు చేసిన దుకాణాలు, హోటళ్లను తనిఖీ చేసి కాంటాలు, బాట్లు పరిశీలించారు. పలువురు హోటళ్ల నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు ఎలాంటి పత్రాలు లేకుండా ఉపయోగిస్తున్న కాంటా లను గుర్తించి జరిమానా విధించారు. లీగల్ మె ట్రోలజీ అధికారులు అనుమతించిన కాంటాలతోనే వ్యాపారం చేయాలని సూచించారు. భక్తులను తూకంలో మోసం చేసినట్లు తెలిస్తే కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామ ని, షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.


