సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కైలాస్‌నగర్: కొరటా– చనాఖా బ్యారేజ్‌కు మా జీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పె ట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశా యి. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రుల ఫ్లేక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ జాదవ్ మాట్లాడుతూ, దివంగత మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడె గజేందర్, నాయకులు గండ్రత్ సుజాత, సాజి ద్ ఖాన్, సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


