రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు విజయవంతం చేయాలి
ఆదిలాబాద్: ఈనెల 18న పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేయాలని అథ్లెటిక్స్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి కోరారు. గురువారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ విడుదల చేశారు. అనంతరం స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటిసారిగా అథ్లెటిక్ స్టేట్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అండర్–8, 10, 12, 14 బాలబాలికలకు వివిధ రకాల పోటీలుంటాయని పేర్కొన్నారు. ఇందులో 33 జిల్లాల నుంచి 990 మంది క్రీడాకారులతో పాటు పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీఎస్‌వో పార్థసారథి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్, రాకేశ్, దయానంద్ పాల్గొన్నారు.


