సెర్ప్‌లో ‘ఎఫ్‌ఆర్‌ఎస్’
యాప్‌లోనే హాజరు నమోదు..
గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పనిచేసే సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ విధానాన్ని ఈనెల 1నుంచి అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రతీ ఉద్యోగి అందులోనే అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నారు. లోకేషన్ షేర్ అవుతుంది కనుక వారు ఎక్కడ ఉన్నారనే విషయం తెలుస్తుంది. తద్వారా ఉద్యోగుల అనధికార గైర్హాజరు తగ్గి సేవలు మెరుగుపడుతున్నాయి.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
కై లాస్‌నగర్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప రిధిలో పనిచేసే సెర్ప్ ఉద్యోగుల విధి నిర్వహణలో పారదర్శకతపై రాష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక దృష్టి సారించింది. కొంతమంది అధికా రులు, ఉద్యోగులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే వెళ్లినట్లుగా, విధులకు రాకున్నా హాజరైనట్లుగా అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానం రూపొందించింది. ఈ నెల 1నుంచి జిల్లాలో అమల్లోకి తెచ్చింది. అధికారులు, ఉద్యోగుల పనితీరును నేరుగా రాష్ట్రస్థాయి నుంచి పర్యవేక్షించేలా ప్రత్యేక విభాగం సైతం ఏర్పాటు చేసింది. దీంతో ఇన్నాళ్లు కార్యాలయాలకే పరిమితమైన వారు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సి వస్తోంది.
వ్యక్తిగతంగా హాజరు నమోదు..
జిల్లా పేదరిక నిర్మూలన సంస్థలో 170 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఆ ఫీస్ సబార్డినేట్ మినహా ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఉదయం10.30గంటలకు వ్యక్తిగతంగా తమ అటెండెన్స్‌ను ఈ యాప్‌లో న మోదు చేసుకుంటున్నారు. ఇప్పటికి ఎలాంటి చర్యలు లేనప్పటికీ రానున్న రోజుల్లో మూడుసార్లు 15 నిమిషాలు ఆలస్యంగా హాజరైతే ఒకరోజు సెలవుగా, మూడుసార్లు గైర్హాజరైతే ఒక రోజు వేతనం కోత విధించనున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రస్థాయి నుంచే నేరుగా పర్యవేక్షణ..
ఉన్నతాధికారులు గతంలో మాదిరి ఉద్యోగు ల పనితీరు వ్యక్తిగతంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో జిల్లాలో పనిచేసే అన్ని క్యాడర్‌ల ఉద్యోగుల వివరాలు నమోదై ఉంటాయి. వారు నమోదు చేసే అటెండెన్స్‌తో వారు ఉన్న లొకేషన్ అందులో షేర్ అవుతుంది. దీంతో ఏ అధికారి, ఉద్యోగి ఎక్కడ ఉండి పనిచేస్తున్నారనే దా న్ని ఉన్నతాధికారులు నేరుగా ఉన్న చోట నుంచే తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఉద్యోగుల పనితీరు, అటెండెన్స్ ప ర్యవేక్షించేందుకు గాను రాష్ట్రస్థాయిలో ప్రత్యే క విభాగం ఏర్పాటు చేశారు. దీంతో విధుల కు గైర్హాజరయ్యే, ఆలస్యంగా వచ్చే, విధుల కు రాకున్నా వచ్చినట్లుగా నమోదు చేసుకు నే ఉద్యోగులకు చెక్ పడినట్లయింది. తద్వారా ఉద్యోగుల పనితీరులో మార్పుతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే సేవలు మెరుగుపడుతున్నట్లుగా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో పనిచేస్తున్న సెర్ప్ అధికారులు,
ఉద్యోగుల వివరాలు
క్యాడర్ ఉద్యోగుల
సంఖ్య
అదనపు డీఆర్డీవో 01
ప్రాజెక్ట్ మేనేజర్ 09
అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ 26
కమ్యూనిటీ కోఆర్డినేటర్ 73
మండల సమాఖ్య సీసీ 47
పరిపాలన అసిస్టెంట్ 09
ఆఫీస్ సబార్డినేట్ 05


