గాలిపటాల సందడి..
మరోవైపు గాలిపటాలతో చిన్నారులు, యువత సందడి ప్రారంభమైంది. చైనా మాంజాతో జిల్లాలో ఇటీవల పలువురు గాయపడ్డారు. ఈక్రమంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దీంతో ఎక్కువగా సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగరేయడం కనిపించింది.
సాధారణ దారంతో ఎగిరేస్తున్నాం..
ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటాం. పతంగి ఎగరేయడమంటే నాకేంతో ఇష్టం. స్నేహితులమంతా పోటీపడుతుంటాం. చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ సారి సాధారణ దారంతోనే ఎగరవేస్తున్నాం.
– దుర్గాప్రసాద్, కోలిపుర
గాలిపటాల సందడి..


