ఆదివాసీల నిరసన దీక్ష విరమణ
కై లాస్‌నగర్: సాత్నాల మండలం దుబ్బగూడ కొలాం ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షను బుధవారం విరమించారు. వారికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఆందోళన చేపట్టారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు తహసీల్దార్ రామారావు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అటవీ అడ్డంకులు తొలగించి ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వారికి భరోసానిచ్చారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు.


