సీఎం పర్యటన అరగంటే..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ కేవలం అరగంట మాత్రమే ఉండనున్నారు. ఈనెల 16న మధ్యాహ్నం 12గంటలకు హై దరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా జిల్లాలోని భో రజ్ మండలం హత్తిఘాట్‌కు నేరుగా రానున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన వెంట జిల్లాలో పర్యటించనున్నారు. కొరా ట–చనాక బ్యారేజ్‌కు కొద్ది దూరంలో హత్తిఘాట్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్ నుంచి మోటార్లను ఆన్‌చేసి నీళ్లు మెయిన్ కాలువలోకి విడుదల చేయనున్నారు. ఆ తర్వాత అక్కడే పూజ కార్యక్రమాల్లో పా ల్గొంటారు. ఎలాంటి బహిరంగ సభ ఏర్పాటు చే యలేదు. 12.30 గంటలకు ఆయన పర్యటన పూర్తవుతుంది. ఇక్కడి నుంచి నిర్మల్ జిల్లాకు బయల్దేరి వెళ్తారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవా రం హత్తిఘాట్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆది లాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేతలు గండ్రత్ సుజాత, సంజీవ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య హత్తి ఘాట్ వద్ద పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అయితే, హత్తిఘాట్ వద్ద పంప్‌హౌస్ నుంచి నీళ్లు విడుదల చేసే కార్యక్రమ కవరేజ్‌కు మీడియాకు స్థలాభావం, భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించిన ట్లు సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయి.
సెంటిమెంట్‌గా జిల్లా పర్యటన
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రేవంత్‌రెడ్డి అప్పట్లో జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించిన బహిరంగ సభ హాజరయ్యారు. సభ సక్సెస్ కా వడంతో పార్టీలో ఉత్సాహం నింపింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ఇలా జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. 2024 ఫిబ్రవరిలో మొదటిసారి సీఎం హోదాలో ఆయన ఇంద్రవెల్లికి వచ్చారు. నాగోబా కు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రానికి ప్రధాన మంత్రి మోదీ వచ్చినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలకు ముందు గత డిసెంబర్‌లో ఆయన రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. నెల తర్వాత మళ్లీ ఆయన జిల్లాకు వస్తున్నారు. ఒకవిధంగా ఆయన తన పర్యటనను సెంటిమెంట్‌గా జిల్లా నుంచి కొనసాగిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, ఆదిలాబాద్‌కు మరోసారి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పక డ్బందీ ఏర్పాట్లు చేయాలి
సాత్నాల: ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించా రు. మంగళవారం భోరజ్ మండలం హత్తిఘాట్ గ్రామంలోని చనాక–కొరాట బ్యారేజీ పంప్‌హౌస్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన సాఫీగా సాగేలా అన్ని శాఖల అ ధికారులు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. భద్రత కా రణాల దృష్ట్యా గుర్తింపుకార్డులు, పాస్‌లున్నవారి నే అనుమతించనున్నట్లు తెలిపారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీ హెలిప్యాడ్ ప్రాంతాన్ని, పంప్‌హౌస్, ప్రధాన కాలువ, ప్రధాన కాలువ డె లివరీ సిస్టమ్ (డీసీ) వద్ద పూజాకార్యక్రమ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రా జేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి, నీటి పారుదలశాఖ ఎస్‌ఈ విశ్వకళ్యాణ్, ఇంజినీర్లు, తహసీ ల్దార్లు రాజేశ్వరి, శ్రీనివాస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ ఇతర శాఖల అధికారులున్నారు.


