● వ్యవసాయంలో నేటికీ ఎద్దుల సాయం ● జిల్లాలో పెరిగిన ‘సేం
హర్కపూర్‌తండాలో ఎడ్లతో దుక్కి చదును చేస్తున్న రైతు చవాన్ అంబాజీ
అంబాజీకి దేవ్‌డియా, పావిడ్యానే పెద్ద దిక్కు
ఇంద్రవెల్లి: మండలంలోని హర్కపూర్‌తండాకు చెందిన రైతు చవాన్ అంబాజీ నేటికీ ఎద్దుల సాయంతోనే వ్యవసాయం చేస్తున్నాడు. తన మూడెకరాల్లో రెండు సీజన్లలోనూ పత్తి, ఆయిల్‌పాం లాంటి పంటలు వేస్తూ అంతరపంటలుగా జొన్న, శనగ, కూరగాయలు సాగు చేస్తున్నాడు. సహజ పద్ధతిలో ఎద్దుల నాగలితో దుక్కి దున్ని సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నాడు. తనకు సాగులో చేదోడువాదోడుగా నిలిచే ఎద్దులను దేవ్‌డియా, పావిడ్యా పేర్లతో ముద్దుగా పిలుచుకుంటాడు.
వ్యవసాయ పనుల్లో ఎద్దుల వినియోగం ఘననీయంగా తగ్గిన ఈ రోజుల్లోనూ జిల్లాలో పలువురు రైతులు వాటినే నమ్ముకుని వ్యవసాయంలో ‘సాగు’తున్నారు. రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఇంకొందరు కర్షకులు. క్రమంగా పశుసంపద తగ్గుతుండడంతో వాటి పెంపకం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశుపోషకులు.. ఇక బసవన్నలతో వివిధ విన్యాసాలు చేస్తూ.. చేయిస్తూ.. కుటుంబాలను పోషించుకుంటున్నారు గంగిరెద్దులవారు. ఇలా పశువుల సాయంతో విభిన్న రీతుల్లో ముందుకు సాగుతూ.. తమదైన ముద్ర వేసుకుంటున్న పలువురిపై ప్రత్యేక కథనం..


