ప్రకృతి ఫుడ్స్ సొసైటీ నెలకొల్పి..
గుడిహత్నూర్: రసాయనిక ఎరువుల వినియోగంతో విసిగిపోయిన మండలంలోని తోషం గ్రామానికి చెందిన పస్తాపురే రవీందర్ అనే రైతు ఎనిమిదేళ్ల క్రితం తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేయాలని భావించాడు. 2017 లో సేంద్రియ విధానంలో కూరగాయల సాగుకు అంకురార్పణ చేశాడు. దశపత్రి కషాయం, నీమ్‌ఆస్త్రం, అగ్నిఆస్త్రం, పంచగవ్య, జీవామృతం వినియోగంతో మంచి ఫలి తాలొచ్చాయి. తనలాగా జిల్లాలో సేంద్రీయ సాగు చేస్తు న్న 93 మంది రైతులను ఏకం చేశాడు. మార్కెట్ సమస్యను అధిగమించాలని వీరితో అప్పటి కలెక్టర్ దివ్యదేవరాజ్ కలిశాడు. ఆ తర్వాత సేంద్రియ రైతులతో కలిసి ప్ర కృతి ఫుడ్స్ సొసైటీని నెలకొల్పాడు. దీంతో కలెక్టర్ వీరికి కలెక్టర్ చౌక్‌లో ఆదిలాబాద్ నాచురల్స్ పేరిట స్టోర్ కోసం స్థలాన్ని కేటాయించారు. నాటి నుంచి వీరంతా సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు ఇక్కడ అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు వీరు మహా రాష్ట్రలోని నాగ్‌పూర్ నాచురల్, నాసిక్‌లోని సహ్యాద్రి నాచురల్స్ జత కట్టారు. అవసరమైన కూరగాయలు, ఇతర సేంద్రీయ ఉత్పత్తులు అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం, అక్కడి వారికి అవసరమైనవి ఎగుమతి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పస్తాపురే కుటుంబ సభ్యులు రంజిత్, మనోజ్ కూడా సేంద్రియ సాగులో ముందుకుసాగుతున్నారు. కాగా, ప్రకృతి ఫుడ్ సొసైటీ సభ్యులు ఈ నెల 14న సేంద్రీయ విజ్ఞానయాత్రకు వెళ్లనున్నారు. యాత్రలో భాగంగా నాసిక్‌నాచరుల్స్, బారామతిలోని కిసాన్‌మేళా సందర్శించి సేంద్రియ విజ్ఞానాన్ని తెలుసుకోనున్నారు.


