వాతావరణం
ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది.
అయ్యవారికి దండం పెట్టు..
తలమడుగు: సంక్రాంతి నేపథ్యంలో గ్రామాల్లో గంగిరెద్దుల విన్యాసాలు మొదలయ్యాయి. వా టి యజమానులు ముస్తాబై గంగిరెద్దులను అ లంకరించి ఇళ్ల ముంగిటకు వస్తున్నారు. అయ్యవారికి దండం పెట్టు.. అంటూ వాటితో దండాలు పెట్టిస్తున్నారు. విన్యాసాల్లో యజమాని చె ప్పినట్లు బసవన్నలు తల ఆడించడం, ముందు కాళ్లతో దండం పెట్టడం, తల ఊపుతూ కాళ్లు, క డుపుతో గజ్జల శబ్ధం చేయడం లాంటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సుమారు మూడు క్వింటాళ్లున్న బసవన్న నాలుగు కాళ్లను దాని యజమాని పొట్టపై మోసే విన్యాసం కంటతడి పెట్టిస్తుంది. కూటి కోసం వారు పడే తి ప్పలు చూసి కానుకలు వేసి సాగనంపడం నేటి కీ జిల్లాలో కనిపిస్తుండడం విశేషం. కాగా, గంగిరెద్దులే తమకు జీవనాధారమని, వాటి ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నామని గంగిరెద్దుల యజమాని రాము పేర్కొన్నాడు.


