మెరుగైన వైద్యం అందాలి
సాత్నాల: గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ సూచించా రు. భోరజ్ మండలం గిమ్మ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. రికార్డులు, ఫార్మసీ, వ్యాక్సిన్ రూమ్, ల్యాబ్, లేబర్ రూమ్, ఇ న్‌పేషెంట్ వార్డులను పరిశీలించారు. సిబ్బంది సకా లంలో విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చిన నుంచి ప్రసవం వరకు వైద్యపరీక్షలు నిర్వహించి సేవలందించాలని, అధిక ప్రమాద గర్భిణులను ముందే గుర్తించి పెద్దాస్పత్రులకు పంపించాలని సూచించారు. ఆశ, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో గ్రా మస్థాయిలో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నిరంత రం పర్యవేక్షించాలని, ప్రసవాలు ప్రభుత్వాస్పత్రిలో నే జరిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఆయన వెంట మండల వైద్యాధికారి సుచల, ఆరోగ్య విస్తీర్ణ అధికారి రాంరెడ్డి, స్టాఫ్ నర్స్ సంస్కృతి, ఏఎన్‌ఎం నీరజ, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.


