ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల● | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల●

Aug 1 2025 11:25 AM | Updated on Aug 1 2025 11:25 AM

ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల●

ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల●

ఆదిలాబాద్‌టౌన్‌: టీచర్ల ప్రమోషన్ల షెడ్యూల్‌ ను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈనెల 2 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 26మంది పీజీహెచ్‌ఎంలుగా, 118మంది స్కూ ల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

ఈనెల 2న వెబ్‌సైట్‌లో పీజీహెచ్‌ఎం ఖాళీల ప్రదర్శన, 3న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 4, 5 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 6న వెబ్‌ ఆప్షన్లు, 7న ప్రమోషన్ల జాబితా విడుదల, 8, 9 తేదీల్లో ఎస్జీటీ ఖాళీల జాబితా విడుదల, 10న స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్‌ కోసం వెబ్‌ ఆప్షన్లు, 11న ప్రమోషన్‌ కల్పించనున్నారు.

144 మంది టీచర్లకు ప్రమోషన్‌

జిల్లాలో 144 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్‌ లభించనుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నలుగురికి, లోకల్‌బాడీలో 22 మందికి అవ కాశం దక్కనుంది. జిల్లాలో 27 ఖాళీలున్నప్పటికీ, ఇచ్చోడ మండలం తలమద్రి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేక ఆ పోస్టు భర్తీ చేసే అవకాశం కానరావడం లేదు. ప్రభుత్వ యాజమాన్యంలో 40, లోకల్‌బాడీలో 102 ఎస్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70శాతం పో స్టులను భర్తీ చేయనుండగా ప్రభుత్వ యాజ మాన్యంలో 28 ఎస్‌ఏ పోస్టులు, లోకల్‌బాడీలో 71 పోస్టులలో ప్రమోషన్లు కల్పించనున్నారు. 26 మంది ఎస్‌ఏలు ప్రమోషన్లు పొందడంతో ఈ పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని ఎస్జీటీల కు ఎస్‌ఏలుగా ప్రమోషన్‌ కల్పించనున్నారు.

సబ్జెక్టుల వారీగా ఇలా..

ప్రభుత్వ యాజమాన్యంలో పీఎస్‌ హెచ్‌ఎంలు –2, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం–2, ఫిజికల్‌ సై న్స్‌–4, బయోసైన్స్‌–3, సాంఘిక శాస్త్రం–6, తె లుగు–2, హిందీ–1, ఇంగ్లిష్‌–2, ఉర్దూ–2, పీడీ–1, మరాఠీ–1, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌–1, పీ జీహెచ్‌ఎంలు–4 పోస్టుల్లో ప్రమోషన్లు చేపట్ట నున్నారు. లోకల్‌బాడీలో పీఎస్‌ హెచ్‌ఎం–27, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం–4, ఫిజికల్‌ సైన్స్‌–4, బయోసైన్స్‌–9, సాంఘిక శాస్త్రం–19, హిందీ–2, ఇంగ్లిష్‌–6, ఉర్దూ–1, పీడీ–1, మరాఠీ–1, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌–9, పీజీహెచ్‌ఎం–22 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement