
హాస్టల్‌లో విద్యార్థులను కొట్టిన సీఆర్టీ
● విచారణ చేపట్టిన ఐటీడీఏ పీవో ● సీఆర్టీ లాలుసింగ్‌పై బదిలీ వేటు ● వాచ్‌మెన్, కుక్‌లకు నోటీసులు
బోథ్: మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులను సీఆర్టీ లాలుసింగ్ గురువారం చితకబాదారు. దీంతో పలువురు విద్యార్థులకు మోకాళ్లపై గాయాలు కాగా వారు ఆందోళనకు దిగారు. విషయం తె లుసుకున్న ఏఐఎస్‌ఎఫ్ నాయకులు హాస్టల్‌కు చేరుకోగా విద్యార్థులు గోడు వెల్లబోసుకున్నారు. లాలు సింగ్ విధుల్లో చేరిన నుంచి తమకు భోజనం సరిగా అందించడం లేదని, తరచూ కొడుతున్నారని, అ న్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. స మాచారం అందుకున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గు ప్తా హాస్టల్‌కు చేరుకున్నారు. ఘటనపై విచారణ చే పట్టారు. విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్నారు. విద్యార్థులను కొట్టడమేమిటని లాలుసింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి అతడిపై బదిలీ వేటు వేశా రు. వంట పని చేస్తున్న సుకుమాబాయి, కామాటిగా విధులు నిర్వహిస్తున్న సావిత్రీబాయికి షోకాజ్ నోటీసులిచ్చారు. వంట సామగ్రి, రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో ఒక్కరోజులోనే బాగు చేయించాలని ఏఈ సునీల్‌ను ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. గదుల్లో ఫ్యాన్లు తిరగడం లేదని విద్యార్థులు తెలుపగా.. వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల పఠన సామర్థ్యాలను పరిశీలించారు.