
చాంపియన్లుగా నిలవాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయి వేది కలపై ఓవరాల్ చాంపియన్లుగా నిలవాలని డీౖ వెఎస్‌వో జక్కుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో గల జూడో హాలు లో శుక్రవారం నిర్వహించిన సబ్ జూనియర్, కేడేట్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. నిరంతరం సాధన చేస్తేనే గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారినిఈనెల 5నుంచి 7 వరకు వరంగల్ వేదికగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జూడో కోచ్ రాజు, డీఎస్‌ఏ సిబ్బంది సురేశ్, శిక్షకులు కబీర్‌దాస్, రమేశ్, శ్రీధర్ తదితరులున్నారు.