
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: మధ్యవర్తిత్వంతో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా జడ్జి కె.ప్రభాకర రావు అన్నారు. జిల్లా కో ర్టులో న్యాయవాదులతో శుక్రవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ‘మీడియేషన్ ఫర్ నేషన్’ పేరుతో ప్రారంభించిన 90 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే నలుగురికి శిక్షణ కల్పించినట్లు తెలి పారు. మరో ఐదుగురికి సైతం శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జడ్జీలు పి.శివరాంప్రసాద్, రాజ్యలక్ష్మి, కుమారి లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, గంగారాం, న్యాయవాదులు పాల్గొన్నారు.