
చెరువులు నిండలే!
తాంసి మండలంలోని సావర్గాం గ్రామ చెరువు ఇది. దీనికింద సుమారు వంద ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 70 శాతం మేర మాత్రమే నిండింది. వానాకాలంలో జలకళ సంతరించుకోవాల్సిన చెరువు ఈసారి ఆగస్టు వచ్చినా ఇంకా పూర్తిగా నిండకపోవడం గమనార్హం. యాసంగి సాగుతో పాటు భూగర్భజలాల వృద్ధిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తుంది.
ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంట గ్రామ శివారులోని గురుదేవ్ చెరువు ఇది. ఈ వానాకాలంలో 80 శాతం వరకు నిండింది. అలుగు పారాల్సిన సమయంలో ఇంకా బోసిపోయి కనిపిస్తోంది. దీనికింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. యాసంగిలో ఆయా రైతులు ఈ చెరువును నమ్ముకొని పంటలు సాగు చేస్తారు.

చెరువులు నిండలే!