
ఎట్టకేలకు టీచర్ల సర్దుబాటు
● ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో
ఆదిలాబాద్‌టౌన్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. డీఈవో శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఉ త్తర్వులు జారీ చేశారు. బుధవారం ‘సాక్షి’లో ‘సర్దుబాటు అయ్యేదెప్పుడో’ శీర్షి కన ప్రచురించిన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. అవసరమైన పాఠశాలలకు 131మంది ఉపాధ్యాయులను కేటాయించా రు. గతనెల 15న సర్దుబాటుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు వివరాలు విడుదల చేశారు. ఈ స ర్దుబాటులో తప్పిదాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక కమిటీ నియమించి సవరణ చేపట్టారు. మైదాన ప్రాంతంలోని పాఠశాలల నుంచి మైదాన ప్రాంతానికి 111 మంది టీచర్లను, ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలల నుంచి మైదాన ప్రాంతానికి 20 మంది టీచర్లను సర్దుబాటు చేశారు.
కేటాయింపు ఇలా
ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయులను ఆదిలా బాద్ అర్బన్, బజార్‌హత్నూర్ మండలాలకు ఒ క్కొక్కరు చొప్పున, బేలకు ఇద్దరు, ఇచ్చోడకు ఏ డుగురు, తలమడుగు, గుడిహత్నూర్‌కు నలుగు రు చొప్పున ఉపాధ్యాయులను సర్దుబాటు చేశా రు. అలాగే మైదాన ప్రాంతంలోని టీచర్లను ఆది లాబాద్‌రూరల్ మండలానికి 11 మంది, ఆదిలా బాద్‌అర్బన్‌కు 25 మంది, బజార్‌హత్నూర్‌కు నలు గురు, బేలకు ఆరుగురు, భీంపూర్‌కు ఐదుగురు, బోథ్‌కు ఏడుగురు, గుడిహత్నూర్‌కు ముగ్గురు, ఇచ్చోడకు ఐదుగురు, ఇంద్రవెల్లికి ముగ్గురు, జైనథ్‌కు ఆరుగురు, నార్నూర్‌కు 11 మంది, నేరడిగొండకు ఒకరు, తలమడుగుకు ఐదుగురు, తాంసికి 11 మంది, ఉట్నూర్‌కు 14 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు డీఈవో తెలిపారు. మైదాన ప్రాంతంలో మొత్తం 111 మందిని, ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి 20 మంది, మొత్తం 131 మందిని సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఎఫెక్ట్..