
జిల్లాలో వనమహోత్సవం వివరాలు
● డీఆర్డీఏ లక్ష్యం 27.87 లక్షలు ● నాటిన మొక్కలు 20.07 లక్షలు ● జిల్లా వ్యాప్తంగా 72.05 శాతం ● 90 శాతంతో తాంసి ప్రథమం
కైలాస్‌నగర్: పచ్చదనాన్ని పెంపొందించాలనే ల క్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న వనమహోత్సవం జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. మొక్కలు నాటడంలో ఆ శాఖకు కేటాయించిన ల క్ష్యానికి చేరువవుతోంది. ఇళ్లలో నాటేందుకు వీలుగా మొక్కలు అందించడంతో పాటు ఎంపిక చేసిన ప్ర దేశాల్లో ఉపాధిహామీ సిబ్బంది విరివిగా మొక్కలు నా టుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 72.05శాతం మొక్కలు నాటారు. ఈ నెలాఖరులో పు పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే నాటిన మొక్కలను సంరక్షిస్తేనే పచ్చదనం పెరిగి ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుందని, ఆ దిశగా శ్రద్ధ చూపాల్సిన అవసరముందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
లక్ష్యానికి అనుగుణంగా ముందుకు..
2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు 27.87లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం విధించారు. ఇందులో 8,46,762 మొక్కలు ఇళ్లలో నాటాల్సి ఉండగా ఇప్పటివరకు అంతే మొ త్తంలో మొక్కలు పంపిణీ ప్రక్రియ పూర్తయింది. మరో 19,40,238 మొక్కలను ఎంపిక చేసిన ప్ర భుత్వ, ప్రైవేట్ స్థలాలు, రైతుల పంట చేలల్లో నా టాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 2,129 స్థలాలను ఎంపిక చేశారు. వాటిలో ఇప్పటివరకు 11,53,875 మొక్కలు నాటగా, మొత్తంగా జిల్లాలో 20,07,923 మొక్కలు నాటారు.
సంరక్షణే అసలు సవాల్
ఏటా అధికసంఖ్యలో మొక్కలు నాటుతున్నా సంరక్షించే దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా మొక్కలను మూగజీవాలు తినేస్తున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవతుందే గాని పచ్చదనాన్ని పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కొందరు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి మొక్కలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చోట్ల మాత్రమే మొక్కలు వృక్షాలుగా ఎదుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ దిశగా చొరవ చూపి మొ క్కలను సంరక్షిస్తేనే వనమహోత్సవ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రభుత్వం ఆశించిన పచ్చదనం పెంపు సాధ్యమవుతుంది. ఆ దిశగా అధికారులు ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తే మొక్కల సంరక్షణ సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మండలం లక్ష్యం నాటినవి
ఆదిలాబాద్ 2,00,000 1,32,274
గాదిగూడ 1,50,000 99,335
భీంపూర్ 1,50,000 1,00,375
తలమడుగు 1,65,000 1,11,971
నార్నూర్ 1,50,000 1,02,155
నేరడిగొండ 1,70,000 1,16,190
బేల 2,00,000 1,37,129
బోథ్ 2,00,000 1,40,269
గుడిహత్నూర్ 1,60,000 1,13,222
ఇంద్రవెల్లి 2,00,000 1,44,262
ఇచ్చోడ 2,00,000 1,47,505
సిరికొండ 1,10,000 83,758
జైనథ్ 2,10,000 1,59,960
ఉట్నూర్ 2,52,000 1,93,415
బజార్‌హత్నూర్ 1,70,000 1,35,535
మావల 20,000 17,996
తాంసి 80,000 72,572
అగ్రస్థానంలో తాంసి..
అట్టడుగున ఆదిలాబాద్ రూరల్..
తాంసి మండలం 90.72 శాతం మొక్కలు నాటి అగ్రస్థానంలో నిలిచింది. 26,346 మొక్కలను ఇళ్లలో నాటేందుకు పంపిణీ చేయగా, 46,226 మొక్కలను ఎంపిక చేసిన 70 ప్రాంతాల్లో నా టారు. మొత్తంగా 72,572 మొక్కలు నాటి జి ల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ రూరల్ మండలం 66.14 శాతంతో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. ఈ మండలంలో 1,32,274 మొక్కలు నాటగా, 80,866 మొక్కలను ఎంపిక చేసిన 164 ప్రాంతాల్లో నాటారు. మరో 51,408 మొక్కలను ఇంటి ఆవరణల్లో నాటేందుకు ప్రజలకు పంపిణీ చేశారు. గాది గూడ, భీంపూర్ మండలాల్లో 66శాతం మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయింది. తలమడుగులో 67శాతం మొక్కలు నాటారు. మిగతా మండలాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.
సంరక్షణకు ప్రత్యేక చర్యలు
కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కలు నాటుతున్నాం. నర్సరీల్లో పెంచిన పూలు, పండ్ల మొక్కలను ఇళ్లలో నాటేందుకు ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలాఖరులోపు వందశా తం మొక్కలు నాటుతాం. నాటిన ప్రతీ మొక్క వృక్షంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మండల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉంది. ఆ దిశగా వారు శ్రద్ధ చూపాలి. మొక్కలను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో

జిల్లాలో వనమహోత్సవం వివరాలు

జిల్లాలో వనమహోత్సవం వివరాలు