
అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● బ్యాంక్, ఏటీఎంల భద్రతపై బ్యాంక్, పోలీస్ అధికారులతో సమీక్ష ● రిటైర్డ్ పోలీసులకు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంక్ లాకర్లు, ఏటీఎంలలో సెన్సార్‌లు, సీసీ టీవీ కెమెరాలు, అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకో వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో భద్రత అంశాలు, ప్రజల ఆర్థిక రక్షణ కోసం గురువారం బ్యాంక్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఖాతాదారుల నమ్మకాన్ని వ మ్ము చేయకుండా బ్యాంక్ నేరాల నియంత్రణకు కృషి చేద్దామని పేర్కొన్నారు. అధిక మొత్తంలో నగదు తరలించే సమయంలో సరిపడా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. సైబర్‌క్రైమ్ పెరిగిపోవడంతో మోసాలకు పాల్పడుతున్న వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా సైబర్‌క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎంలను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్‌రావు, ఫణిదర్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఎస్సై, కానిస్టేబుల్‌కు సన్మానం
జిల్లా పోలీస్ కార్యాలయంలో రిటైర్డ్ పోలీస్ అధికా రులను ఎస్పీ అఖిల్ మహాజన్ శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. రిటైర్డయిన వా రిలో ఏఆర్ ఎస్సైగా పని చేసిన సంతోష్‌రెడ్డి, ఇచ్చో డ ఠాణాలో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ రాథో డ్ గణపతి ఉన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్‌రావు, ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, మురళి, అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వామన్ తదితరులున్నారు.
నేటి నుంచి 30పోలీస్ యాక్ట్
శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకు 30పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజ న్ తెలిపారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో మా ట్లాడారు. డీఎస్పీ, ఆపైస్థాయి అధికారి నుంచి అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.