మెనూ మారినా.. భోజనం మారలే..! | Sakshi
Sakshi News home page

మెనూ మారినా.. భోజనం మారలే..!

Published Wed, Jul 19 2023 11:56 PM

- - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ మార్చినప్పటికీ పాఠశాలల్లో మాత్రం తీరు మారలేదు. వారికి నాసిరకం భోజనమే దిక్కవుతుంది. దీంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా రు. గతంలో పలుమార్లు చిన్నారులు ఆస్పత్రి పా లైన ఘటనలు ఉన్నా మేమింతే.. మా తీరు మారద న్న విధంగా అధికారులు, కొంత మంది ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు.

వీరి నిర్లక్ష్యం కారణంగా సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల కు అవస్థలు తప్పడం లేదు. ఉడకని అన్నం, నీళ్లప ప్పు పెడుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణంగా తెలుస్తోంది.సంఘటనలు జరిగినప్పుడు మెమోలు ఇవ్వడం, సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం తప్పా శాశ్వ త పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి.

గుడ్డు మింగేస్తున్నారు..

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారానికి మూడు రోజులు కోడిగుడ్ల ను అందజేస్తోంది. ఇందు కోసం ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పున కేటాయిస్తుంది. ప్రాథమిక విద్యార్థులకు కుగింగ్‌ కాస్ట్‌ కోసం రూ.5.45, 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.8.17లతో పాటు 9,10 త రగతుల విద్యార్థుల కోసం రూ.10.67లను కేటాయిస్తుంది. అయితే చాలా పాఠశాలల్లో వారానికి ఒక రోజు మాత్రమే గుడ్డు పెడుతున్నారు. మిగతా రోజుల్లో మామూలు భోజనం అందిస్తున్నారు.

పర్యవేక్షణ కరువు..

అధికారుల పర్యవేక్ష లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, కోడిగుడ్డుతో భోజనం వండి పెట్టాల్సి ఉండగా, చాలా పాఠశాలల్లో నాసిరకం భోజనమే అందిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేస్తుండగా, మరికొంత మంది టిఫిన్‌ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఎంఈవోలు రోజుకు మూడు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితం కావడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి.

ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యానగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం కేవలం పప్పు, అన్నం మాత్రమే వడ్డించారు. కోడిగుడ్డు ఇవ్వలేదు. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో భోజనం పెట్టాల్సి ఉండగా, కేవలం నీళ్ల పప్పే దిక్కయ్యింది.

నార్నూర్‌ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకులంలో గత మార్చిలో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు.

ఇదివరకు ఆదిలాబాద్‌ పట్టణంలోని రూరల్‌ కేజీబీవీలో, అలాగే జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న భీంపూర్‌ కేజీబీవీలో, నేరడిగొండ కేజీబీవీలో, తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలల్లో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయినా జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం భోజనమే దిక్కవుతుంది.

మెనూ ఇది.. వారం పెట్టాల్సిన భోజనం, సోమ కిచిడీ, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, కోడిగుడ్డు, మంగళ అన్నం, పప్పు, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, బుధ అన్నం, ఆకుకూరలతో పప్పు, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, కోడిగుడ్డు, గురు వెజిటెబుల్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, శుక్ర అన్నం, సాంబార్‌, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రి, కోడిగుడ్డు, శని అన్నం, ఆకుకూరలు, వెజిటెబుల్‌ కర్రి.

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం పెట్టాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు మఽ ద్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. వంట గదులు శుభ్రంగా ఉంచాలి. వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందించాలి. – ప్రణీత, డీఈవో

Advertisement
 
Advertisement
 
Advertisement