స్మృతివనంపై దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

స్మృతివనంపై దాడి అమానుషం

Aug 11 2024 2:36 AM | Updated on Aug 11 2024 2:36 AM

స్మృత

స్మృతివనంపై దాడి అమానుషం

సాక్షి, అమలాపురం: విజయవాడ నడిబొడ్డున దేశం గర్వించదగ్గ స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెలకొల్పిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనంపై అప్రజాస్వామికంగా దాడికి తెగబడిన వారిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశాన్ని అగౌరవపరిచేలా టీడీపీ నాయకులు వ్యవహరించారంటూ దళిత నాయకులు మండిపడ్డారు. సోమవారం జిల్లాలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేయడాన్ని, మాజీ సీఎం జగన్‌ పేరున శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని వారు తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు హోరెత్తించారు. అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పంపై విధ్వంసకాండకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పి.గన్నవరం సెంటర్లో రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కొత్తపేటలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఈ ఆందోళనకు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అంబేడ్కర్‌ స్మృతివనంపై అప్రజాస్వామికంగా దాడికి తెగబడిన వారిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌ ఆధ్వర్యంలో ద్రాక్షారామలో నిరసన తెలిపారు. అక్కడి యానాం సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లూ సామాజిక న్యాయం జరిగిందన్నారు. ఇందులో భాగంగా విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, అంబేడ్కర్‌ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియాలు ఏర్పాటు చేశారన్నారు. దీనిపై అక్కసుతో దాడి చేయడం దారుణమన్నారు.

ఫ అంబేడ్కర్‌ విగ్రహానికి

అవమానంపై నిరసనలు

ఫ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

స్మృతివనంపై దాడి అమానుషం1
1/2

స్మృతివనంపై దాడి అమానుషం

స్మృతివనంపై దాడి అమానుషం2
2/2

స్మృతివనంపై దాడి అమానుషం

Advertisement
 
Advertisement
Advertisement