డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Telangana Association of Denmark Celebrates Bathukamma in Copenhagen - Sakshi

కొపెన్‌హెగెన్‌ : తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌(టాడ్‌)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో 500 మందికి పైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొని ఆటా పాటలతో హోరెత్తించారు. ప్రకృతిని, పూలను, పూలలో దేవతలను పూజించే ఆడపడుచుల పండగ బతుకమ్మ అని టాడ్‌ అధ్యక్షుడు సతీష్‌ రెడ్డిసామ అన్నారు. మన సంస్కృతి, పండుగలు, భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా అసోసియేన్‌కి సహకరించిన  సభ్యులకు, తెలంగాణ కుటుంబ సభ్యులకు, బోర్డు సభ్యులకు టాడ్‌ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంబరాల్లో టాడ్‌ బోర్డు సభ్యులు రమేష్‌ పగిళ్ల, కరుణాకర్‌ బయ్యపు, జయచందర్‌ కంది, సంగమేశ్వర్‌ బిళ్ల, వాసు నీల, రాజ్‌ కుమార్‌ కలువల, దామోదర్‌ లట్టుపల్లి, సులక్షణ కోర్వ, నర్మదా దేవిరెడ్డి, యాదగిరి ప్యారం,రఘు కలకుంట్ల, రంజిత్‌ రెడ్డి, విజయ్‌ మోహన్‌, రాజు ఎం, జగదీశ్‌ వంజ, వెంకట రెడ్డి టేకుల, సత్య బద్దం, రఘు భీరం, మానస కొదురుపాక, లైఫ్‌ టైం సభ్యులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top