breaking news
vijayanagara police
-
కాళ్లు నరికి ఇంట్లో పూడ్చేశాడు
సాక్షి,బెంగళూరు: బతుకుతెరువు కోసం చిత్రదుర్గ జిల్లా నుంచి విజయనగర జిల్లాకు వచ్చి కొట్టూరులో స్థిరపడిన భీమరాజ్ కుటుంబాన్ని కన్న కొడుకే కాలయముడై హత్య చేశాడు. కొట్టూరు పట్టణంలో తల్లిదండ్రులు భీమరాజ్ (50), (45) సోదరి అమృత (17) కాళ్లు నరికేసి, ఇంట్లో పాతిపెట్టినట్లు అక్షయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆదివారం ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కర్కోటక తనయుడు అక్షయ్ కుమార్ పోలీసుల విచారణలో పలు విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈ హత్యలు పరువు కోసమా లేదా డబ్బు కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది.చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మి, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృతతో కలిసి కొట్టూరులో నివసిస్తున్నారు. అమృత ఓ యువకుడితో ప్రేమలో పడి గర్భవతి అయినట్లు తెలిసింది. ఈ విషయమై కుమారుడు అక్షయ్.. తల్లిదండ్రులు, చెల్లి అమృతతో గొడవ పడ్డాడు. అమృతకు అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని ఈ హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో అక్షయ్ నోరు విప్పినట్లు తెలుస్తోంది. డబ్బు కోసమేనా? అయితే ఇది పరువు హత్య కాదని.. డబ్బు కోసమే తల్లిదండ్రులు, సోదరిని అక్షయ్ కుమార్ హత్య చేసి ఉంటాడనే మరో కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇటీవల భీమరాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలని అక్షయ్ పట్టుబట్టాడు. అయితే చెల్లి పెళ్లికి డబ్బు అవసరం అవుతుందని కొడుకుకు నచ్చజెప్పాడు. డబ్బు ఇవ్వలేదని కక్ష పెంచుకున్న అక్షయ్.. జనవరి 26వ తేదీన ముందుగా తల్లి, సోదరిని హత్య చేశాడు.ఆ తర్వాత తండ్రిని హతమార్చాడు. బాడుగ ఇంట్లో గుంత తవ్వి ముగ్గురిని ఒకే గుంతలో పాతిపెట్టే క్రమంలో తండ్రి కాళ్లు పొడవు ఉండటంతో రెండు కాళ్ల నరికి పక్కన పడేశాడు. మృతదేహాలను గుంతలో ఒకటిపై ఒకటి వేసి పూడ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా టైల్స్‌తో కప్పేశాడు. అనంతరం బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లీదండ్రులు, సోదరి కనబడటం లేదని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. -
అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..
విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్‌లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రెండో పెళ్లి.. ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.భర్తపై భార్య దాడి బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్‌ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కేసు భయంతో తల్లీకొడుకు ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: పోలీసుల కేసుకు భయపడి తల్లి కొడుకు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో బుధవారం వెలుగు చూసింది. మోహన్‌గౌడ (18) అనే యువకునిపై బైక్ చోరీ కేసు నమోదు కావడంతో పోలీసులకు భయపడి ఆత్మహత్యాయత్నం చేశాడు. తల్లి లీలావతి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు మరణం, మరోవైపు పోలీసులు తనను కూడా విచారణ చేస్తారని భయపడి ఆస్పత్రి బయట ఉన్న కారుకు తలకొట్టుకోవడంతో ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ మేరకు విజయనగర పోలీస్ స్టేషన్ ద్వారా వివరాలు తెలిశాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: శారీరక శ్రమకు దూరంగా.. అనారోగ్యానికి దగ్గరగా -
ఎమ్మెల్సీ కుమారుడి కబ్జాపర్వం: కేసు నమోదు
మైసూరు: బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కుమారుడు అమిత్ దేవరహట్టిపై మైసూరు విజయనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మైసూరు హినకల్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని దేవరహట్టి మద్దతుదారులతో కబ్జా చేసి, కాంపౌండ్ కట్టాడని, అడ్డుకున్న యజమాని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు కేసు నమోదు అయింది. స్థలం యజమాని యోగీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్, పటేల్, అనూప్, వైకుంఠాచార్ తదితర 8 మందిపై కేసు నమోదు చేశారు. -
కర్నూలు జిల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మైసూరు: కర్నూలు జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కర్ణాటకలోని మైసూర్లో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహమైన ఏడాదిలోనే కుటుంబ కలహాల కారణంగా ఆయన ప్రాణాలు తీసుకుని ఉంటారని స్థానిక విజయనగర పోలీసులు గురువారం తెలిపారు. వివరాలు.. * కర్నూలు నగరానికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు లక్ష్మీనారాయణ (26) మైసూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే విజయనగర ప్రాంతంలో నివాసముంటున్నారు. ఏడాది కిందట అరుణ అనే యువతిని వివాహం చేసుకున్నారు. అయితే, కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. దీంతో అరుణ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. * ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ ఫోన్లోనే ఘర్షణ పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో అరుణ మరోసారి లక్ష్మీనారాయణకు ఫోన్ చేసింది. అయితే, ఆయన లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో యజమాని పైఅంతస్తుకు వెళ్లి చూశారు. అయితే, అప్పటికే లక్ష్మీనారాయణ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. * సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృత దేహంతోపాటు తెలుగులో రాసివున్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.


