
బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ ఆయన కుమారుడు అమిత్ దేవరహట్టి (ఫైల్)
మైసూరు: బీజేపీ ఎమ్మెల్సీ విశ్వనాథ్ కుమారుడు అమిత్ దేవరహట్టిపై మైసూరు విజయనగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. మైసూరు హినకల్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని దేవరహట్టి మద్దతుదారులతో కబ్జా చేసి, కాంపౌండ్ కట్టాడని, అడ్డుకున్న యజమాని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు కేసు నమోదు అయింది. స్థలం యజమాని యోగీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్, పటేల్, అనూప్, వైకుంఠాచార్ తదితర 8 మందిపై కేసు నమోదు చేశారు.