breaking news
vehicle purchase
-
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
బాబు ‘సంక్రాంతి’ బాదుడు!
సాక్షి, అమరావతి: పండగ పూట కూడా ప్రజలపై పన్నుల బాదుడే..! అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పేరుతో రోడ్ సెస్ బాదుడుతో వాహనదారులపై ఏటా రూ.1,500 కోట్ల భారీ ఆరి్థక భారాన్ని మోపింది. మరోచేత్తో పండుగ వేళ టీడీపీ సిండికేట్‌కు అడ్డగోలుగా లాభాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. ఏటా రూ.350 కోట్లు సిండికేట్‌కు దోచిపెట్టేందుకు పచ్చ జెండా ఊపింది. అందుకోసం హడావుడిగా మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిది. చంద్రబాబు సర్కారు సంక్రాంతి బాదుడు ఇలా ఉంది..! కేంద్రం కరుణించినా... బాబు పన్నుల కొరడా కేంద్ర ప్రభుత్వం కరుణించినా చంద్రబాబు మాత్రం ససేమిరా అంటూ రాష్ట్ర ప్రజలపై పన్నుల కొరడా ఝళిపించారు. జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించడంతో కాస్త ఊరట లభించిందనుకునేలోపే.. చంద్రబాబు ఆ మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకుని పన్నుల భారం ప్రజలపైనే వేశారు. కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి వాహన కొనుగోళ్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ వచ్చింది. ఇటీవలే జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దాంతో 10 శాతం జీఎస్టీ భారం తగ్గిందని ప్రజలు కాస్త ఊరట చెందారు.కానీ దీన్ని చంద్రబాబు సహించలేకపోయారు. రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం కూడా జీఎస్టీ పన్నుల తగ్గింపు ఊరట మిగల్చకూడదని భావించి రోడ్ సెస్ పేరుతో కొత్త పన్ను రూపొందించారు. ఏపీలో వాహనాల కొనుగోళ్లపై 10 శాతం రోడ్ సెస్ విధించాలని ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఆమేరకు ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం రోడ్ సెస్ విధించేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించింది. సద్వినియోగంపై సందేహాలు.. ప్రజలపై పన్నుల భారానికి చంద్రబాబు ప్రభుత్వం రహదారి భద్రత సెస్సు అనే ముసుగు వేసింది. ఆ సెస్సు ద్వారా వసూలు చేసే నిధులు ఎలా వెచి్చస్తామన్నది వెల్లడించలేదు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా అందుకోసం వెచ్చించడం లేదనే విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. హోం, వైద్య–ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా ఆ నిధులను వెచి్చంచాలి. కానీ ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెస్సు పేరిట ఏటా వసూలు చేసే రూ.1,500 కోట్లను సద్వినియోగం చేస్తారనే నమ్మకం ఏమాత్రం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ రద్దు వాహన కొనుగోలుదారులపై పన్నుల బాదుడు బాదిన చంద్రబాబు ప్రభుత్వం... టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మాత్రం తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లపై విధిస్తున్న 15 శాతం ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ)ని రద్దు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఖజానాకు ఏటా రూ.350 కోట్ల మేర గండి పడనుంది. 2014–15లో కూడా ఇదే రీతిలో టీడీపీ సిండికేట్ బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును ఏకపక్షంగా రద్దు చేసింది. తద్వారా ఖజానాకు రూ.5,400 కోట్ల మేర గండి కొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతోపాటు అప్పటి మంత్రులు కొల్లు రవీంద్ర తదితరులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆ కేసును చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బార్లపై ఏఆర్ఈటీ రద్దు చేస్తూ మరో దందాకు తెర తీసింది. మద్యం బాటిల్‌పై రూ.10 బాదుడు.. ఇక మద్యం ప్రియులపై కూడా చంద్రబాబు ప్రభుత్వం పన్నుల మోత మోగించింది. ప్రతి మద్యం బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 20,135 కోట్ల మేర కరెంట్ చార్జీల బాదుడు కాగా, అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. ఏకంగా రూ. 20,135 కోట్ల మేరకు కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారు. ఏటా పన్నుల భారం రూ.270 కోట్లు కాదు... రూ.1,500 కోట్ల బాదుడేరోడ్ సెస్ పన్నుల భారంపై చంద్రబాబు సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారని... ఆ ప్రకారం కొత్తగా విధించిన 10 శాతం రోడ్ సెస్‌తో వాహనాల కొనుగోలుదారులపై నెలకు రూ.22.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.270 కోట్ల భారం పడుతుందని మంత్రులు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రజలపై పడే పన్నుల భారాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించేందుకు యతి్నంచారు. వాస్తవానికి అందుకు ఏడెనిమిది రెట్లు అధిక భారం పడుతుందని కేంద్ర జీఎస్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.కేంద్ర జీఎస్టీ విభాగం అధికారిక గణాంకాల ప్రకారం వాహనాలపై 28 శాతం జీఎస్టీ పూర్తిగా అమలులో ఉన్న 2024–25లో రాష్ట్రంలో వాహనాల విక్రయాల ద్వారా రూ.4,200 కోట్ల జీఎస్టీ పన్ను ఆదాయం వచ్చింది. అంటే.. 28 శాతం జీఎస్టీ రేటుతో రూ.4,200 కోట్లు వచ్చాయి. జీఎస్టీ రేటును కేంద్రం ఇటీవల 18 శాతానికి తగ్గించింది. దాంతో జీఎస్టీ రేటు 10 శాతం తగ్గడంతో ఏడాదికి రూ.1,500 కోట్లు పన్ను ఆదాయం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.1,500 కోట్ల మేర ఊరట కలుగుతుందని పేర్కొంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ 10 శాతం పన్ను ఉపశమనం లేకుండా చేసింది. వాహనాలపై 10 శాతం రోడ్‌సెస్ విధించింది. అంటే రాష్ట్రంలో వాహనాల కొనుగోలుదారులపై ఏటా రూ.1,500 కోట్ల ఆర్థిక భారం పడనుందన్నది స్పష్టమవుతోంది. -
రవాణా ఆదాయం రయ్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో రవాణా ఆదాయం క్రమంగా పెరుగుతోంది. 2021–22 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో రవాణా ఆదాయంలో 58.70 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2019–20తో పోల్చితే 37.95 శాతం వృద్ధి నమోదైంది. వాహన విక్రయాలు పెరగడంతో జీవిత పన్ను, త్రైమాసిక పన్ను, ఎన్ఫోర్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత వృద్ధి ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో నమోదు కావడం గమనార్హం. ద్విచక్రవాహనాలు మినహా మిగతా అన్ని రకాల వాహనాల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. కార్ల జోరు.. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో కార్ల విక్రయాల్లో 5.11 శాతం వృద్ధి నమోదైంది. ఆటోలు, ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఆటోల విక్రయాల్లో 69.7 శాతం, ప్యాసింజర్ వాహనాలు 57.87 శాతం, గూడ్స్ వాహనాల విక్రయాల్లో 37.28 శాతం వృద్ధి నమోదైంది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లో మాత్రం –3.75 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2019–20 తొలి త్రైమాసికంలో రూ.749.75 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,034.25 కోట్ల ఆదాయం సమకూరింది. జాతీయ స్థాయిలో అన్ని రకాల వాహనాల విక్రయాల్లో ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో ప్యాసింజర్ వాహనాలు కొనుగోళ్లు భారీగా పడిపోగా ఇప్పుడు పెరుగుతున్నాయి. -
కరోనా వేళ మంత్రులకు కొత్త కార్లు
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. అధికారిక వాహనం కొనుగోలు చేసుకోవడానికి విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఇందుకోసం రూ.22.83 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవాల్సింది పోయి మంత్రులకు కొత్త వాహనాలు సమకూర్చడం ఏమిటని మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాయిదా వేస్తూ.. మంత్రుల కోసం ప్రజాధనం ఫలహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
వాహనం కొన్న వ్యక్తిపైనే ఒకశాతం పన్ను బాదుడు!
రూ.10 లక్షలపైబడిన కొనుగోళ్లపై స్పష్టత న్యూఢిల్లీ: ఇకపై రూ.10 లక్షల పైబడిన వాహనం కొనుగోలుచేసిన వినియోగదారుడు... 1% అదనపు పన్ను భారాన్ని భరించాల్సి ఉంటుంది. నిజానికి రూ.10 లక్షలు పైబడిన వాహనం కొనుగోలుపై 2016-17 బడ్జెట్ ఒక శాతం పన్ను ప్రతిపాదనను చేసింది. అయితే ఈ పన్నును కొనుగోలుదారుడు భరించాలా...? లేక అమ్మకందారు భరించాలా? అన్న అంశంపై అస్పష్టత నెలకొంది. దీనికి సంబంధించి గురువారం ఆమోదం పొందిన ఫైనాన్స్‌బిల్లు-2016లో ఆర్థికమంత్రి జైట్లీ ఒక సవరణ ద్వారా స్పష్టతనిచ్చారు. రూ. 10 లక్షలు దాటిన డివిడెండ్ ఆదాయానికి సంబంధించి కంపెనీలు చెల్లించే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నుతోపాటు సదరు ఆదాయం పొందిన వ్యక్తి కూడా అదనపు డివిడెండ్ పన్ను 10 శాతం మేర చెల్లించాల్సి ఉంటుందని తాజా సవరణలో వివరించారు.


