breaking news
vasanta pancami
-
Mahakumbh: వసంత పంచమికి ముమ్మర ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణీ సంగమంలో కుంభమేళా పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం(ఫిబ్రవరి 2) కావడంతో ఉదయం నుంచే పవిత్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలున్నాయి.వసంతపంచమి(Vasanta Panchami) నాడు స్నానాలు ఆచరించేందుకు రెండురోజుల ముందుగానే భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంనకు దారితీసే అన్ని మార్గాలు భక్తుల వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా రోడ్లపై జనసమూహం కనిపిస్తోంది. దీనిని గుర్తించిన అధికారులు ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.జనవరి 29 మౌని అమావాస్య రోజున దాదాపు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు కూడా ఇదే తీరు కనిపించింది. తరువాత శుక్ర, శనివారాల్లో రద్దీ కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే ఈరోజు (ఆదివారం) ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. సోమవారం వసంత పంచమి. ఆరోజు అమృత స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కాళీ మార్గ్, ఆనకట్ట, సంగమం వైపు వెళ్లే రహదారులలో భద్రతను మరింత కట్టిదిట్టం చేశారు. మరోవైపు మౌని అమావాస్య స్నానోత్సవంలో జరిగిన ప్రమాదం తర్వాత, ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది.వసంత పంచమి రోజున సంగమ ఘాట్(Sangam Ghat) వద్ద జనం గుమిగూడకుండా చూసుకోవాలని పోలీసులకు, సైనికులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భక్తులు స్నానం చేసిన వెంటనే ఘాట్ నుంచి బయటకు వెళ్లేలా చూడాలని అధికారులు వారిని ఆదేశించారు. వసంత పంచమినాడు ఎవరూ కూడా బారికేడ్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బారికేడ్లు దాటవద్దని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!
ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు. బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్) రాజస్థాన్‌లోని పుష్కర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. శృంగేరి శారదా ఆలయం(కర్నాటక) జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు. మూకాంబిక ఆలయం(కేరళ) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్) మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. భోజశాల (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. -
బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆదిలాబాద్ జిల్లా: బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి సందర్భరంగా భక్తుల రద్దీ పెరిగింది.అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గోదావరి స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.