breaking news
Vaastu Dosh
-
అమరావతి: అసెంబ్లీకి మళ్లీ వాస్తుదోషం
-
ఆ టాయ్లెట్ల వల్లే ప్రతి ఎన్నికల్లో ఓటమి!
భోపాల్: ఎన్నికల్లో నెగ్గిన పార్టీ నేతలు తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు తమను నమ్మి మరోసారి అవకాశం ఇచ్చారని గొప్పలు చెబుతుంటారు. అదే విధంగా ఓడిపోయిన పార్టీ నేతలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందనో.. లేక అమలుసాధ్యం కాని హామీలతో మోసం చేసిన పార్టీ నెగ్గిందని చెప్పడమో తరచుగా చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం వింత వాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో గత 14 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్ చెప్పిన సాకు 'వాస్తుదోషం'. నాయకత్వలోపం వల్లో, లేక ప్రజల్లో నమ్మకం కోల్పోవడం కాదని... వాస్తు దోషం వల్లే కాంగ్రెస్ ఓటమి పరంపర కొనసాగుతుందన్నారు. భోపాల్లోని కాంగ్రెస్ ఆఫీస్ ఇందిరాభవన్లోని టాయ్లెట్ల కారణంగానే ఓడిపోతున్నామని చెప్పారు. ఈ భవనంలో మూడో అంతస్తులోని టాయ్లెట్లు తూర్పు ముఖంగా ఉండటం వాస్తు ప్రకారం దోషమేనట. ప్రతి ఎన్నికల్లో ఓటమికి కారణం ఇందిరాభవన్లోని వాస్తు లోపాలేనని తమ పార్టీ నేతలు చెప్పడాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మిశ్రా తప్పుపట్టారు. ప్రజల మద్ధతుతోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. 'వాస్తు అంశాన్ని మూఢనమ్మకంగా నేను భావించను. వేదాలు, పురాణాలలో వాస్తు గురించి పేర్కొన్నారు. అయితే వాస్తు వంటి సాకులు చూపడం మానేసి చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం ఎవరికైనా సొంతమవుతుందని' హితవు పలికారు