surety
-
HI నాన్న
‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు నాన్న. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి. నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు. ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.శిక్షణ కోసం రిక్షా అమ్మి..!కొందరి కలలు నిద్రకే పరిమితమవుతాయి. మరికొందరి కలలు చరిత్రలో నిలిచిపోతాయి. కల సాకారం చేసుకోవాలన్న తపన ఎన్ని కష్టాలనైనా దిగమింగి, ఎంతటి అవాంతరాన్నైనా దాటేందుకు సిద్ధమైనప్పుడు విజయం కాళ్ల దగ్గరకు వస్తుంది. ఇందుకు ఉదాహరణే వారణాసికి చెందిన నారాయణ జైస్వాల్ జీవితం. జైస్వాల్ జీవితమంతా రిక్షాల చుట్టూతానే తిరిగింది. పగలంతా రిక్షా తొక్కడం, అద్దెలకు ఇవ్వడం, రాత్రయితే భార్యాపిల్లలతో భోంచేసి నిద్రపోవడం తప్ప వేరే ధ్యాసలేదు తనకి... కాని జైస్వాల్ కొడుకు గోవింద్ జైస్వాల్ కల మాత్రం చాలా పెద్దది. చిన్నప్పటి నుంచి తను ఐఏఎస్ అధికారి కావాలని ఆశపడ్డాడు. ఐఏఎస్ కావాలంటే ఆశ ఉంటే సరిపోదు ఆశయం కూడా కావాలి. కాని ఆ ఆశయానికి ఇంధనం కూడా డబ్బే... ఢిల్లీలోని మంచి సివిల్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటే తప్ప గోవింద్ ఐఏఎస్ పాస్ కాలేడని జైస్వాల్ తెలుసుకున్నాడు. రిక్షా తొక్కితే వచ్చే ఆదాయం కంటే వాటిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో మాత్రమే శిక్షణ ఇప్పించవచ్చని అనిపించింది. అంతే... తన కుటుంబానికి ఆధారమైన రిక్షాలన్నింటినీ అమ్మేసి కోచింగ్ ఇప్పించాడు. కాని జైస్వాల్ కష్టం ఊరికే పోలేదు. 22 ఏళ్ల గోవింద్ జైస్వాల్ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ ర్యాంకు సాధించి చూపించాడు.కిడ్నీ అమ్మి చదివిస్తా..!తాను దెబ్బతిన్నా తన బిడ్డ బాగుండాలని కోరుకునే ఓ తండ్రి ప్రేమకు అద్దం పట్టే మరో సంఘటన ఇది. గుజరా™Œ లోని నవసారి జిల్లాకు చెందిన జయేష్ పటేల్ ఓ ప్రమాదం వల్ల చూపు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఉపాధి లేకపోవడంతో భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాని తన కుమారుడు సాహిల్ పటేల్ ఎప్పటికైనా డాక్టర్ కావాలన్నది తన కల. ఆ కల తన పేదరికం వల్ల మరుగునపడిపోకూడదని భావించిన జయేష్ తన కిడ్నీని అమ్మేసి తన కుమారుడిని చదివిస్తానని ప్రకటించాడు. నా కంట్లో వెలుగు పోయింది. కాని బిడ్డ బతుకు మాత్రం చీకట్లోనే మగ్గిపోకూడదు అంటూ బాధపడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు వచ్చి సాహిల్ చదువుకి తమ వంతు సహకారం అందించారు. అలాగే భవిష్యత్‌లో కూడా సాహిల్‌కి అన్ని విధాల అండగా ఉంటామని మాటిచ్చారు. కొడుకు భవిష్యత్ బాగుండాలని అందుకు తను ఏమైపోయినా పర్లేదని మాట్లాడిన ఆ తండ్రి ఆవేదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.వైభవ్ కోసం భూమిని అమ్మి..!దేశవ్యాప్తంగా క్రికెట్ పేరు చెబితే మొదట వినేమాట బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ టీంలో తన అప్రతిహత ప్రతిభను చాటి భళా అనిపించుకున్నాడు. కాని వైభవ్ అంతలా రాణించడం వెనుక అతని తండ్రి సంజయ్ సూర్యవంశీ కృషి ఉంది. బీహార్ లోని తాజ్ పూర్‌కి చెందిన ఈ మైథాలీలది మధ్య తరగతి కుటుంబం. అయితే చిన్నప్పటి నుంచి వైభవ్ క్రికెట్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపేవాడు. ఇది గమనించిన అతని తండ్రి మరింత ఉన్నత శిక్షణ కోసం తమ పూర్వీకుల భూములను అమ్మేశాడు. తాజ్పూర్కి, ట్రెయినింగ్ సెంటర్ మధ్య దాదాపు వంద కి.మీ దూరం ఉండేది. వైభవ్ కోసమే ఓ కారుని కూడా కొని అతనికి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచాడు సంజయ్.. తరతరాల ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు..అది అనాదిగా వచ్చే వారసత్వం, బాధ్యత. కానీ అదేది అక్కర్లేదని, కేవలం తన బిడ్డ కలని నిజం చేయడమే లక్ష్యమని సంజయ్ సూర్యవంశీ భావించాడు కాబట్టే ఇండియాకి ఈరోజు వైభవ్ లాంటి చిచ్చరపిడుగు దొరికాడు.మీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి. 9281020501మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com -
పూచీకత్తుగా రూ.96 కోట్లు
బీరుట్: లిబియా దివంగత నేత కల్నల్ గఢాఫీ కుమారుడు హానిబాల్ గఢాఫీని బెయిల్‌పై విడుదల చేసేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే, బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు విడుదల కావచ్చని పేర్కొంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన గఢాఫీ తిరుగుబాటుదార్ల చేతిలో 2011 అక్టోబర్‌లో చనిపోయారు. అయితే, ఆయన పాలనాకాలంలో 1978లో లిబియాకు వచ్చిన షియాల గురువు మౌసా అల్ సదర్ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అయితే, గఢాఫీ కుమారుడు హానిబాల్‌కు ఆ విషయం తెలుసని అనుమానించిన మిలిటెంట్ల గ్రూపు 2015లో ఆయన్ను అపహరించి బాల్బెక్లో ఉంచింది. అనంతరం లెబనాన్ పోలీసులు అతడిని మిలిటెంట్ల చెరనుంచి విడిపించి బీరుట్ జైలులో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు దశాబ్దకాలంగా ఎలాంటి విచారణ లేకుండా జైలులోనే మగ్గుతున్నారు. శుక్రవారం అధికారులు ఆయన్ను జస్టిస్ ప్యాలెస్‌లో జడ్జి జహెర్ హమాదెహ్ ఎదుట హాజరుపరిచారు. హానిబాల్ బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా ఆయన నిర్ణయించారు. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే జైలు నుంచి విడుదల కావచ్చని తెలిపారు. అయితే, రెండు నెలలపాటు దేశం విడిచి వెళ్లరాదనే షరతును విధించారు. హానిబాల్ తరఫు లాయర్ చర్బెల్ మిలాడ్ అల్–ఖౌరీ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. హానిబాల్ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని చెప్పారు. ఆయన బ్యాంకు అక్కౌంట్లపై నిషేధం ఉందని చెప్పారు. కాగా, షియా గురువు మౌసా అల్ సదర్ అదృశ్యం వ్యవహారం లెబనాన్‌లో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. లెబనాన్‌లోని ఏదో ఒక జైలులో ఆయన సజీవంగా ఉండి ఉంటారని కుటుంబీకులు భావిస్తుండగా, ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. జీవించి ఉంటే ఆయనకు ఇప్పుడు 96 ఏళ్లుంటాయని అంచనా. -
పట్టుబడితే.. పది లక్షల బాండు ఇవ్వాల్సిందే..
బనశంకరి (కర్ణాటక): బెంగళూరులో యువత, పోకిరీలు బైక్ వీలింగ్, డ్రాగ్ రేస్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు పాల్పడుతూ ప్రమాదాలను సృష్టిస్తుండడంతో వాటి నివారణకు పోలీసులు కొత్త చర్యలు తీసుకోనున్నారు. ఇలా పట్టుబడినవారి నుంచి రూ.5-10 లక్షల పూచీకత్తు తీసుకోవాలని, ఈ భయంతోనైనా వీలింగ్‌కు దూరంగా ఉంటారని భావిస్తున్నారు. వీలింగ్‌లో ఎక్కువగా మైనర్ బాలలు ఉంటున్నారు. బైక్‌లను వాయువేగంతో నడుపుతూ ఇతరులను ఢీకొనడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వారిపై సీఆర్పీసీ సెక్షన్ 110, 107 కింద కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. కానీ ఫలితం ఉండడం లేదు. మళ్లీ బైక్‌లపై దూసుకెళ్తూ అందరికీ తలనొప్పిగా మారుతున్నారు. ఇప్పటినుంచి బైకర్లు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రూ.5 – 10 లక్షల షూరిటి బాండ్ తీసుకుంటామని నగర ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతేగౌడ తెలిపారు. వారు రెండోసారి దొరికిపోతే ష్యూరిటీ మొత్తాన్ని జరిమానాగా రాసేస్తారు. గస్తీ పెంపు నగరంలో రాత్రివేళ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి లగ్జరీ కార్లు, బైకుల్లో జాలీరైడ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని అడ్డుకునేందుకు 44 ప్రముఖ స్థలాల్లో గస్తీ పెంచనున్నారు. చదవండి: (ఇంటర్ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం) -
కోర్టులో జామీను పత్రాలు సమర్పించనున్న లాయర్లు
-
మళ్లీ ‘మైక్రో’భూతం
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : ఎలాంటి ష్యూరిటీలు లేకుండా బ్యాంకుల కంటే సులభంగా రుణాలివ్వడంతోపాటు వారంవారం కిస్తీలు చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తామంటూ మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు మహిళలను ఆకర్షించినట్లు సమాచారం. మరోవైపు రుణం పొందేందుకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ఇళ్ల వద్దకు ఇచ్చి అడిగినంత డబ్బు ఇస్తామనడంతో పలువురు మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. సిరిసిల్లలో 2008 వరకు పలు మైక్రోఫైనాన్స్ సంస్థలు వడ్డీ వ్యాపారం సాగించాయి. మహిళా సంఘాలకు రూ.కోట్లలో రుణాలిచ్చి అప్పుల ఊబిలోకి నెట్టివేశాయి. అప్పులు చెల్లించేక, వేధింపుల భరించలేక పలువురు బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో అప్పటి వైఎస్సార్ సర్కారు మైక్రోఫైనాన్స్ రుణాలపై మారటోరియం విధించింది. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా స్వశక్తి సంఘాలకు పావలావడ్డీ రుణాలందించి అప్పుల ఊబి నుంచి గట్టెక్కించింది. ఇటీవల బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో మహిళలు ఆర్థిక అవసరాల కోసం మళ్లీ మైక్రోఫైనాన్స్‌ల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా సిరిసిల్లలో తిరిగి రంగప్రవేశం చేసేందుకు పలు సంస్థలు ఉబలాటపడుతున్నాయి. ఒక్కసారి మైక్రో ఉచ్చులో చిక్కుకుంటే పీకల్లోతు అప్పుల్లో మునిగిపోవడం ఖాయం. ఇదే జరిగితే మళ్లీ నేతన్న కుటుంబాలు ఆర్థికంగా ‘చితికి’పోయే ప్రమాదముందని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. ఐదేళ్ల కిందట.. 2008లో సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలకు మైక్రోఫైనాన్స్ వేధింపులే కారణమని అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేల్లో తేల్చారు. సిరిసిల్లలో స్వయంకృషి, షేర్ముల్లా, స్పందన, కృషిబేసిక్స్ వంటి మైక్రోఫైనాన్స్‌లు వేల మందికి రూ.కోట్లలో రుణాలిచ్చాయి. పదిమంది సభ్యులు గల మహిళా గ్రూపులకు ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున రూ.లక్ష వరకు అప్పులిచ్చాయి. రుణాల వసూళ్లలోనూ అంతే కఠినంగా వ్యవహరించాయి. వారం వారం వాయిదాలు చెల్లించకుంటే సంఘ సభ్యులపై ఒత్తిళ్లు తెచ్చి బాధితుల ఇళ్ల ముందు ధర్నాలు చేయించి వారి పరువు మర్యాదలను రోడ్డుకీడ్చాయి. ఇలాంటి ఒత్తిళ్లతో మానసికవేదనకు గురై సిరిసిల్లలో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రుణాల వసూళ్లపై 2008లో మారటోరియం విధించారు. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలందించారు. ఒక్కో మహిళకు రూ.50 వేలకు తగ్గకుండా 1400 సంఘాల్లోని 15వేల మంది మహిళలకు రూ.70 కోట్లను ఏకకాలంలో 2009 జనవరి 1న హైదరాబాద్‌లో అందించారు. దీంతో మైక్రోఫైనాన్స్‌ల ఆగడాలు ఆగిపోయాయి. ఆదర్శ సిరిసిల్లకు అందని వడ్డీమాఫీ రుణాలు తిరిగి చెల్లించడంతో సిరిసిల్ల మహిళా సంఘాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ వారికి వడ్డీమాఫీ మాత్రం మంజూరు కావడం లేదు. గతంలో పావలావడ్డీ మంజూరు కాగా, జీరో వడ్డీ అమలుకు సర్కారు బడ్జెట్ విడుదల చేయడం లేదు. సిరిసిల్లలో 1636 సంఘాలు ఉండగా, ఇందులో 20,926 మంది సభ్యులున్నారు. వీరికి రూ.105.43 కోట్లు రుణాలివ్వగా, జీరోవడ్డీగా రూ.7 కోట్లు ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. జీరో వడ్డీ రాకపోవడంతో మహిళా సంఘాల నిర్వహణ భారంగా మారింది. అప్పులు తీసుకున్న మహిళలు వడ్డీతో సహా చెల్లిస్తుండగా, సంఘాల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. బ్యాంకు రుణం అన్న పేరేగాని వడ్డీ రాయితీ లేక నెలనెలా వాయిదాలు చెల్లించలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం జీరో వడ్డీ అమలు చేసి తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే మహిళా సంఘాలకు భరోసా ఇచ్చినట్లవుతుంది. మహిళా బ్యాంకు జాడేదీ? సిరిసిల్లలో స్వశక్తి సంఘాలకు ప్రత్యేకంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలవుతోంది. ఇప్పటికే స్త్రీనిధి పరస్పర సహకార బ్యాంకు ద్వారా రూ.3.33 కోట్లు సిరిసిల్లకు మంజూరు కాగా, ఆ డబ్బును ఎప్పట్లాగే స్లమ్ సమాఖ్యలకు పంపిణీ చేశారు. మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తే రుణాల మంజూరు, రికవరీ సులభవుతుందని ప్రతిపాదనలు పంపగా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. బ్యాంకు రుణాల మంజూరులో జాప్యం కారణంగానే మైక్రోఫైనాన్స్లకు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుందని కొందరు మహిళలు పేర్కొంటున్నారు. పట్టణంలో మళ్లీ మైక్రో భూతం చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థపై ఉంది. రుణాల్లో జాప్యం లేదు - ఎం.రాజేశం, మెప్మా పీఆర్పీ సిరిసిల్లలో రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం లేదు. ఇటీవలే స్త్రీనిధి మంజూరైంది. 335 సంఘాలకు రూ.3.33 కోట్లు వచ్చాయి. కమ్యూనిటీ ఫండ్‌గా రూ.9 లక్షలు వచ్చాయి. ఎప్పటికప్పుడు మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. మైక్రోఫైనాన్స్ మాయలో పడొద్దు. రుణాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి.


