పట్టుబడితే.. పది లక్షల బాండు ఇవ్వాల్సిందే..

If found Bike Racers in Bengaluru, bond of up to Rs 10 lakh should be Given - Sakshi

దొరికితే రూ.10 లక్షల వరకూ బాండు ఇవ్వాలి 

నగర పోలీసుల నిర్ణయం

బనశంకరి (కర్ణాటక): బెంగళూరులో యువత, పోకిరీలు బైక్‌ వీలింగ్, డ్రాగ్‌ రేస్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లకు పాల్పడుతూ ప్రమాదాలను సృష్టిస్తుండడంతో వాటి నివారణకు పోలీసులు కొత్త చర్యలు తీసుకోనున్నారు. ఇలా పట్టుబడినవారి నుంచి రూ.5-10 లక్షల పూచీకత్తు తీసుకోవాలని, ఈ భయంతోనైనా వీలింగ్‌కు దూరంగా ఉంటారని భావిస్తున్నారు. వీలింగ్‌లో ఎక్కువగా మైనర్‌ బాలలు ఉంటున్నారు.

బైక్‌లను వాయువేగంతో నడుపుతూ ఇతరులను ఢీకొనడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వారిపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 110, 107 కింద కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు. కానీ ఫలితం ఉండడం లేదు. మళ్లీ బైక్‌లపై దూసుకెళ్తూ అందరికీ తలనొప్పిగా మారుతున్నారు. ఇప్పటినుంచి బైకర్లు, తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రూ.5 – 10 లక్షల షూరిటి బాండ్‌ తీసుకుంటామని నగర ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రవికాంతేగౌడ తెలిపారు. వారు రెండోసారి దొరికిపోతే ష్యూరిటీ మొత్తాన్ని జరిమానాగా రాసేస్తారు.
 
గస్తీ పెంపు  
నగరంలో రాత్రివేళ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి లగ్జరీ కార్లు, బైకుల్లో జాలీరైడ్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని అడ్డుకునేందుకు 44 ప్రముఖ స్థలాల్లో గస్తీ పెంచనున్నారు.  

చదవండి: (ఇంటర్‌ విద్యార్థినితో పరిచయం పెంచుకొని.. పలుమార్లు అత్యాచారం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top