breaking news
sunset
-
‘నీలి విషం’ బారిన 61 శాతం భారతీయులు
అది.. చీకటి గది.. నిశ్శబ్ద వాతావరణం.. కానీ మీ కళ్లపై స్మార్ట్‌ఫోన్ వెలుగు పడుతోంది. ఒక్క నిమిషం రీల్స్ చూసి పడుకుందాం అనుకుంటే, అది కాస్తా తెల్లవారుజామున రెండు గంటలవుతోంది. చేతిలో ఫోన్ ఉన్నంత సేపు సమయం తెలియదు.. అయితే మరుసటి రోజు ఉదయం నీరసం, తలనొప్పి, చిరాకు వెంటాడుతుంటాయి. దీనినే నిపుణులు ‘డూమ్ స్క్రోలింగ్’ వ్యసనం అంటున్నారు. ఈ మాయలో పడి కోట్లాది మంది తమ విలువైన నిద్రను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘డిజిటల్ సన్ సెట్’ మంత్రం వైరల్ అవుతోంది.‘డిజిటల్ సన్ సెట్’ అంటే?ప్రకృతిలో సూర్యుడు అస్తమించినట్లే, మన ఇంట్లో కూడా డిజిటల్ పరికరాలకు ‘సూర్యాస్తమయం’ ప్రకటించడమే ఈ పద్ధతి. అంటే రాత్రి పడుకోవడానికి కనీసం ఒకటి లేదా రెండు గంటల ముందే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలకు స్వస్తి పలకాలి. వినడానికి ఇది కొత్తగా అనిపించినా, దీని వెనుక ఒక బలమైన కథనం ఉంది. 2018లో అన్నా ఫిర్త్, లిండెన్ కెమ్కరాన్ అనే ఇద్దరు మహిళలు తమ పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ అడిక్షన్‌ను తగ్గించడానికి ‘డిజిటల్ సన్ సెట్ ఛాలెంజ్’ ప్రారంభించారు. నేడు అది అందరికీ ఒక సంజీవనిలా మారింది.61 శాతం భారతీయుల నిద్ర గల్లంతుభారతదేశంలో నిద్రలేమి సమస్య భయంకరంగా ఉంది. గణాంకాల ప్రకారం సుమారు 61 శాతం మంది భారతీయులు కనీసం ఆరు గంటల ప్రశాంతమైన నిద్రకు కూడా దూరమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్క్రీన్ల నుంచి వచ్చే ‘బ్లూ లైట్’ (నీలి కాంతి). మనం నిద్రపోయేందుకు మన మెదడు 'మెలటోనిన్' అనే హార్మోన్‌ను విడుదల చేయాలి. అయితే అర్ధరాత్రి ఫోన్ వెలుగును చూడగానే, మన మెదడు అది ఇంకా పగలే అనుకుని భ్రమపడుతుంది. ఫలితంగా మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోయి, నిద్ర కరువవుతుంది. నైట్ మోడ్ లేదా ఫిల్టర్లు వాడినా మెదడుపై ఒత్తిడి తగ్గదని, కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పరిష్కార మిదే..కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని డాక్టర్లు సూచిస్తుంటారు. రాత్రివేళ అధిక సమయంపాటు ఫోన్ చూసే అలవాటు క్రమంగా డిప్రెషన్‌కు దారితీస్తుందని క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ నైనా శర్మ తెలిపారు. బెంగళూరులోని డాక్టర్ సుమలత వాసుదేవ పర్యవేక్షణలో.. ఆన్లైన్ షాపింగ్‌కు బానిసైన యువత నుంచి, టీవీ సీరియల్స్ చూస్తూ గడిపే వృద్ధుల వరకు ‘డిజిటల్ సన్ సెట్’ పాటించి అద్భుతమైన మార్పులు సాధించారు. వారిలో ఏకాగ్రత పెరగడమే కాకుండా చిరాకు కూడా తగ్గింది. ముఖ్యంగా నేటి తరం పిల్లల విద్యాబుద్ధులు మెరుగుపడాలంటే తల్లిదండ్రులే ముందుగా ఫోన్ పక్కన పెట్టి, ఆదర్శంగా నిలవాలని డాక్టర్ పూజా కపూర్ సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్? -
విహారాల సీజన్ వింటర్..! సన్‌రైజ్ కోసం అక్కడ వాలిపోదామా..!
నిండా దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకోడానికి ఇష్టపడే పాత రోజులకు భిన్నంగా సూర్యోదయ కాంతిని ఆస్వాదించాలి అనుకుంటున్నారు నేటి తరం యువత. కురిసే మంచుకు చిక్కకుండా దాక్కునే ఒరవడికి భిన్నంగా మంచుకురిసే వేళ.. మెరిసే అందాలను వెతుక్కుంటున్నారు. ప్రతి చలికాలం కనిపించే ఈ సరదాలు.. సిసలైన చలిపులిని రుచి చూపిస్తున్నసీజన్లో సాహసికుల సరదాలు సిటీలో మరింత ఊపందుకున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షణకు కొండలు, గుట్టలమీదకు చేరుతున్నారు ఔత్సాహికులు. బ్రేక్‌ఫాస్ట్ టూర్స్ నుంచి బోన్ ఫైర్ వరకూ రెడీ అంటూ ఏడాదికి ఓసారి వచ్చే ఈ సీజన్లో అరుదుగా కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. స్వభావరీత్యా హైదరాబాద్ నగరం చల్లగా ఉండే ప్రాంతం.. శతాబ్దాల క్రితం మన సిటీని వేసవి విడిదిగా కూడా ప్రముఖులు పరిగణించేవారనే విషయం తెలిసిందే. అయితే రాను రాను కాంక్రీట్ జంగిల్లా మారిన నగరం తన అసలు స్వభావానికి దూరమైపోతోంది. అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే శీతాకాలంలో మాత్రం సిటీ పరిసరాలు రెట్టింపు ఆకర్షణతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ అందాలు ఆస్వాదించమంటూ సిటీజనులను ఆహ్వానిస్తున్నాయి. సన్‌రైజ్.. సర్‘ప్రైజ్’పొగమంచుతో కూడిన ఉదయాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఈ సీజన్లో ఆకట్టుకునే సన్‌రైజ్‌లు వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం బద్ధకాన్ని పక్కనబెట్టి తెల్లవారుఝామున 5 గంటలకే నిద్రలేని పలు ప్రాంతాలకు పయనమవుతున్నారు. అందమైన సూర్యోదయాల కోసం ఔటర్ రింగ్ రోడ్ (కోకాపేట్/నార్సింగి) లతో పాటు మహేంద్ర హిల్స్, ఖాజాగూడ హిల్స్ (బౌల్డర్ హిల్స్), మౌలాలీ హిల్స్.. వంటి కొండ ప్రాంతాలకు అలాగే నీటిలో తేలియాడే సూర్య కిరణాలను వీక్షించేందుకు అమీన్పూర్ సరస్సు, గండిపేట (ఉస్మాన్ సాగర్) రాజేంద్రనగర్ సమీపంలోని పీరంచెరువు సరస్సు, కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు అనుకునేవారు పోచారం ఆనకట్ట/సరస్సును విహారాలకు విడిదిగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో, అద్భుతమైన సహజ కాంతి కోసం కోహెడ గుట్ట ఎక్కువ మంది ఛాయిస్. వర్కవుట్.. ట్రెక్కింగ్ శరీరం నిదానంగా కదులుతూ క్రమక్రమంగా చురుకుగా మారే వాతావరణ పరిస్థితుల్లో తక్కువ అలసట, ఎక్కువ సంతృప్తి అందిస్తుంది. అందుకే యువత క్రీడలు, ముఖ్యంగా తెల్లవారుజామున ట్రెక్కింగ్ ఎంచుకునేందుకు అనువైన సీజన్ ఇది. ‘హైదరాబాద్‌లోని ప్రకృతి అందాలను అన్వేషించడానికి శీతాకాలం ఉత్తమ సమయం. మేం ఈ సీజన్లో వికారాబాద్ లేదా నగర శివార్లలో ట్రెక్కింగ్‌కు వెళ్తాం. చల్లని వాతావరణం, మా శారీరక సామర్థ్యాన్ని సానపెడుతోంది.ఓ ఆరోగ్యకరమైన ఈవెంట్‌ను ఆస్వాదించేలా చేస్తుంది’ అని కళాశాల విద్యారి్థని దీపా సమిరవ్ దేశాయ్ అంటున్నారు. వ్యాయామాలు, ఆటలు కూడా సిటిజనుల సీజనల్ ఫన్‌లో భాగమే. ‘మా స్నేహితుల బృందం శీతాకాలపు ఉదయాలను ఎక్కువగా సద్వినియోగం చేసుకునేందుకు సైక్లింగ్‌కు వెళ్తాం.. అలాగే ప్రశాంతమైన పరిసరాల్లో యోగా సాధన చేస్తాం.. దీని కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి ప్రాంతాలకు వెళతాం’ అని కార్పొరేట్ ఉద్యోగిని సోనియా గాలా చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ టూర్స్ షురూ.. ఈ సీజన్లో ఉదయాన్నే అల్పాహారపు వింటర్ టూర్స్ ఆస్వాదించే సమూహాలు కూడా ఉన్నాయి. అటువంటి క్లబ్ ది పొంగల్ గ్రూప్, ఇది ఈ సీజన్లో శాఖాహార అల్పాహారం కోసం బృందాలుగా బయటకు వెళుతుంది. సఫిల్‌గూడ నివాసి రాజేష్ కళ్యాణన్ మాట్లాడుతూ.. ‘మా బృందంలో చాలా మంది సభ్యులు ముఖ్యమైన సంస్థల్లో అధికారులు, కాబట్టి ఆదివారాలను విహారయాత్రల కోసం ప్రత్యేకిస్తాం. ఇతర శీతాకాలపు ఉదయాలు మాకు రైట్ టైమ్’ అని చెప్పారు. సన్‌సెట్స్.. అదిరే స్పాట్స్సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాలు కూడా ఈ సీజన్లో కనువిందు చేస్తాయి. నగరం చుట్టుపక్కల అటువంటి అందమైన సూర్యాస్తమయాల కోసం మౌలాలీ హిల్స్, విస్పర్ వ్యాలీ, ట్యాంక్ బండ్, ఖాజాగూడ హిల్స్, బుద్ధ విహార్, బిర్లా మందిర్, ఉస్మాన్ సాగర్, కుతుబ్ షాహీ టూంబ్స్, గోల్కొండ కోట, షామీర్పేట్ లేక్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, లాస్ట్ హౌస్ కాఫీ, వంటి ప్రదేశాలు బాగా పేరొందాయి. నగరంలోని బైద బాటిల్ వంటి కేఫ్స్, ఆక్వా ది పార్క్ వంటి హోటల్స్ కూడా ప్రత్యేకంగా సన్ రైజ్, సన్‌సెట్స్ ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. సాహసాల సీజన్.. ఈ సీజన్లో వారాంతాల్లో సాయంత్రం వేళ బహిరంగ సాహసాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది. మన్నెగూడలోని డెక్కన్ ట్రైల్స్ మేనేజర్ ఫిలిప్ ప్రసాద్ ప్రకారం, ‘బోన్ ఫైర్లు, తెల్లవారుజామున ట్రెక్కింగ్, టెంట్లలో ఆకాశం కింద క్యాంపింగ్ చేయడానికి చాలా డిమాండ్ ఉంది. ఎక్కువ. వీటి కోసం వారాంతాల్లో కార్పొరేట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి’ అని చెప్పారు. (చదవండి: వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..) -
ఆకాశహర్మ్యాల నడుమ... అద్భుత దృశ్యం!
ఎత్తైన గుట్టలు, మధ్యలో అస్తమిస్తున్న సూర్యుడు. ఇలాంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించని, ఆనందించని వారుండరు. అలాంటి దృశ్యాల కోసమే చాలామంది ప్రత్యేకంగా ప్రయాణాలు కూడా చేస్తుంటారు. మరి మహానగరాల్లో సూర్యస్తమయం ఎలా ఉంటుంది? ఉరుకుల పరుగుల జీవితాల్లో ఎవరూ అంతగా పట్టించుకోరు! కానీ న్యూయార్క్ మహానగరంలో మాత్రం బుధవారం నాటి అందమైన సాయంత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. హడ్సన్ నదికి ఆవల సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుండగా ఆకాశహర్మ్యాల నడుమ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. న్యూయార్క్‌లోని మన్హాటన్ వీధుల్లో ఆకాశాన్ని తాకే భవనాల మధ్య సూర్యుడు పసుపు, నారింజ, ఎరుపు రంగుల్లో వెలిగిపోతూ అస్తమించే దృశ్యన్ని చూడటానికి జనం ఎగబడతారు. దీన్ని మన్హాటన్హెంజ్గా పిలుస్తారు. ఈ అందమైన దృశ్యం ఈ ఏడాది మే 28, 29ల్లో తిరిగి జూలై 11, 12 తేదీల్లో మాత్రమే కనిపిస్తుంది. తొలి మన్హాటన్హెంజ్ బుధవారం రాత్రి 8:13 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5.43కు కనిపిస్తుంది. మన్‌హాటన్‌లోని 14, 23, 34, 42, 57వ నంబర్ వీధుల్లో ఈ దృశ్యాన్ని చూడవచ్చు. షికాగో, బాల్టిమోర్, కెనడాలోని టొరంటో వంటి నగరాల్లోనూ ఇలాంటి సూర్యాస్తమయాలు కనువిందు చేస్తాయి. కానీ అన్నింట్లోకీ మన్హాటన్హెంజే బాగా ప్రసిద్ధమైనది.మన్హాటన్ అనే పదాన్ని ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ 1997లో ప్రయోగించారు. ఆయన యుక్తవయసులో ఉండగా ఇంగ్లండ్‌లోని స్టోన్‌హెంజ్‌ను సందర్శించారు. ఆ నిలువురాళ్ల గుండా కనువిందు సూర్యాస్తమయం ఆయనను అమితంగా ఆకట్టుకుంది. తర్వాత తన స్వస్థలమైన న్యూయార్క్‌లోని మన్హాటన్ భవనాల గుండా సూర్యాస్తమయ హొయలు స్టోన్‌హెంజ్ సూర్యాస్తమయాన్ని పోలి ఉండటం ఆయనను ఆశ్చర్యపరిచింది. అందుకే ఆ పేరు పెట్టారు. -
‘చెప్పు’కోలేని బాధలు..
సైదాపూర్ (హుజూరాబాద్): యూరియా తదితర ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం యాసంగి నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎరువులు తీసుకెళ్తుంటారు. కానీ ఆ సమయంలో గేటు తీయకపోవడంతో.. గోడపై నుంచి లోపలికి దూకి చెప్పులను క్యూలో పెట్టారు. గోడపై ఉదయం 10 గంటల వరకు కూర్చుని నిరీక్షించారు. అధికారులు ఎరువుల కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.పంటలు తడారి.. పొలాలు ఎడారిరాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వరినాట్లు వేసిన రైతులు పంట పొలాలకు నీరు సరిపోకపోవడంతో ఎండుతున్న పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు. మండల కేంద్రానికి చెందిన కాకల్ల ఎల్లయ్య, గొల్లపల్లి శ్రీనులు తమకున్న భూమిలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వరి సాగు చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం.. వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరు అందడం లేదు. దీంతో ఎండిపోయిన వరి పొలంలో మూగజీవాలను తోలి మేపుతున్నారు. వర్ణాల పొద్దుఉదయాస్తమయాలు ఎప్పుడూ మనోహరమే. ప్రకృతి ప్రేమికులకు పరవశమే. పగలంతా వెలుగులు నింపే భానుడు.. సాయం సంధ్య వేళ కాషాయరంగులో నిష్క్రమించడం అద్భుతమే. పెద్దపల్లి శివారులో సూర్యాస్తమయమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి స్కానర్ కొట్టు.. కల్లు పట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన గీత కార్మికుడు గంగపురపు వెంకన్న ఇందుకు నిదర్శనం. వెంకన్న వద్దకు కల్లు తాగడానికి వచ్చే వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వెంకన్న వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడి.. గిరాకీ దెబ్బ తింది. దీంతో చేసేదిలేక వెంకన్న ఇటీవల తన బ్యాంక్ ఖాతాపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కల్లు ప్రియులంతా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. డబ్బు చెల్లించి కల్లు తాగుతున్నారు. – కేసముద్రంయక్షగాన కళాకారుల భిక్షాటన టీవీలు, స్మార్ట్ ఫోన్ల రాకతో వీధి నాటకాలు అంతరించి పోయాయి. నేటి తరానికి యక్షగానం అంటే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదరణ లేక యక్షగాన కళాకారులు.. బతుకు కోసం భువనగిరిలో భిక్షాటన చేస్తూ కనిపించారు. – భువనగిరి టౌన్చదవండి: ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరుగుమ్మి.. జ్ఞాపకాలు విరజిమ్మి గ్యాస్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిల్ని మరిచిపోయారు. కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయాలంటే.. కంకిబెండ్లు, పిడకలు, కట్టెలు.. సేకరించి.. ఇలా గుమ్మిలో దాచుకోవలసిందే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనుకుల గ్రామ శివారులోని ఓ ఇంట్లోని గుమ్మిలో దాచిన కంకిబెండ్లు పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేశాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
Photo Feature: అబ్బురపరచిన సంధ్యారాగం
మంగళవారం సాయంత్రం సూర్యుడు పడమటి వైపు వాలుతూ రాజవొమ్మంగిలో కనువిందు చేశాడు. అక్కడ కారుమబ్బులను చీల్చుకుంటూ కాసేపు వలయాకారంలో ఆకాశాన్ని ఎరుపెక్కించి తిరిగి 6–38 నిముషాలకు అదృశ్యమయ్యాడు. ఈ దృశ్యం స్థానికులను అబ్బురపరచగా, కొంత మంది తమ సెల్ఫోన్లలో బంధించారు. – రాజవొమ్మంగి -
మాట మీద నిలబడలేకపోయిన ఆనంద్ మహీంద్రా.. కారణం ఇదే!
ఇండియన్లకు పరిచయం అక్కర్లేని ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. వేల కోట్ల వ్యాపారాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ద్వారా సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. తనకు నచ్చిన విషయాలు, దేశంలో తాను చూసిన అద్భుతమైన విషయాలను సాటి భారతీయులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో సూర్యస్తమయానికి సంబంధించిన ఓ ట్వీట్ చేస్తూ.. స్పందించమని నెటిజన్లు కోరారు. A few days ago, social media was inundated with pics of Mumbai’s clear post-shower sky & spectacular sunset. Never too late to join that bandwagon! Pic on the left was apparently somewhere in Alibaug. A Rothko painting (on the right) come to life-or is it the other way around?? pic.twitter.com/7PTepGHXxJ — anand mahindra (@anandmahindra) January 11, 2022 అరుణ వర్ణంలో ఆకాశం ఆనంద్ మహీంద్రా ఇచ్చిన పిలుపుకి దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కన్యాకుమారి మొదలు కశ్మీర్ వరకు చాలా మంది తమ ఊర్లు, గ్రామాలకు సంబంధించిన సన్‌సెట్ ఫోటోలను అరుణ వర్ణంలో మెరిసిపోతున్న ఆకాశం ఫోటోలను ట్వీట్ చేశారు. ఇందులో తనకు నచ్చిన ఫోటోలకు కామెంట్ చేస్తూ పోయారు ఆనంద్ మహీంద్ర. కొంత సమయం తర్వాత ఇదే నా ఆఖరి స్పందన అంటూ సమాధానం ఇచ్చారు. And let me make this the last RT. Because, at the end of the day, the most important & memorable sunsets are not necessarily those that are the most visually spectacular, but those that are part of our own, personal experiences.. https://t.co/g88YLVDENe — anand mahindra (@anandmahindra) January 11, 2022 బంగారుకొండ కానీ, ఆ తర్వాత కొద్ది సేపటికే భైరవీ జైన్ అనే ఓ నెటిజన్ చేసిన ట్వీట్ చూసి ఆనంద్ మహీంద్రా తన మాట మీద నిలబడలేక పోయారు. సాయంత్రం వేళ హిమలయాల్లో పంచశీల్ శ్రేణి కొండల్లో సూర్యుడు ఒదిగి పోతుంటే.. కిరణాల కాంతి పరావర్తనం చెంది తెల్లని మంచు కొండరు ఒక్కసారిగా బంగారు కొండలుగా మారిపోయాయి. ఆ ఫోటోను చూసిన ఆనంద్ మహీంద్రా తిరిగి రీట్వీట్ చేశారు. ఈ ఫోటోను రీట్వీట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇన్క్రెడిబుల్ ఇండియా అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న హిమలయాలను చూస్తే ఆనంద్ మహీంద్రా మాట తప్పడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. Oh I couldn’t resist retweeting this one… Beautiful. Truly our Incredible India https://t.co/zeRJibl1I6 — anand mahindra (@anandmahindra) January 11, 2022 చదవండి: స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ -
SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా?
స్పేస్ టూరిజం టార్గెట్‌గా రంగంలోకి దిగిన స్పేస్ ఎక్స్ సంస్థ మరో అద్భుతానికి సాక్షిగా నిలిచింది. ఆ సంస్థ ప్రయోగించిన డ్రాగన్ క్యూపోలా భూమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో బంధించింది. 585 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌లో భాగంగా గత బుధవారం డ్రాగన్ క్యూపోలాను అంతరిక్షంలోకి పంపించింది. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ డ్రాగన్ స్పేస్ షిప్లో అంతరికక్షానికి చేరుకున్నారు. భూమి నుంచి 585 కిలోమీటర్ల ఎత్తులో ఇప్పుడా డ్రాగన్ చక్కర్లు కొడుతోంది. చూసేందుకు వీలుగా గతంలో నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు అంతరిక్షంలోకి స్పేస్షిప్లను పంపినప్పటికీ ఎందులో కూడా పై నుంచి భూమిని చూసేందుకు అనువైన ఏర్పాట్లు లేవు. కానీ స్పేస్ఎక్స్ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌లో ప్రత్యేక పద్దతిలో ట్రాన్స్పరెంట్ మెటీరియల్‌తో అతి పెద్ద క్యూపోలాను రూపొందించారు. అక్కడి నుంచి భూమిని స్పష్టంగా చూసే వీలుంది. చీకటి పడుతుండగా డ్రాగన్ క్యూపోలా నుంచి శుక్రవారం సాయంత్రం భూమిపై చీకటి పడే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియో ఫుటేజీని స్పేస్ ఎక్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఆకాశం నుంచి చూస్తుంటే సగం భూమిపై చీకటి ఉండగా సగం భూమిపై వెలుతురు ఉంది. క్రమంగా సగ భాగం చీకటిగా మారిపోయింది. ఆ తర్వాత స్పేస్ షిప్ ఉన్న వైపు భూమి మొత్తం చిమ్మ చీకటిలో కలిసిపోయింది. View of an orbital sunset from Dragon's cupola pic.twitter.com/Fl1fLrXD9o — SpaceX (@SpaceX) September 18, 2021 చదవండి: విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం -
హృదయాలను కదిలిస్తున్న ఫొటో
ప్రపంచాన్ని కుదేలు చేస్తోన్న కోవిడ్-19(కరోనా వైరస్)ను నివారించేందుకు ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కరోనా బాధితులు, అనుమానితులను వైద్యబృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇక దాని బారిన పడ్డవారు మృత్యువు ఎటువైపు నుంచి తరుముకొస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా ఈ మహమ్మారి చైనాలోని వూహాన్లో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అదే వూహాన్లో ఓ కరోనా బాధితుడు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటో అందరి మనసులకు కదిలించివేస్తోంది. 87ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో గత నెల ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి పాజిటివ్ అని తేలడంతో అప్పటినుంచి హాస్పిటల్లోనే బందీగా మారిపోయాడు. అతన్ని పరీక్షించే వైద్యుడు రోగిని సిటీస్కాన్ కోసం తీసుకెళుతూ ఏదో తట్టినవాడిలా ఒక్కసారిగా ఆగిపోయాడు. (కరోనా జయించాలంటే ఇవి తినాలి) రోగివైపు తిరిగి ‘సూర్యాస్తమయం చూస్తావా?’ అని అడిగాడు. వెంటనే అతను ఆనందంతో ‘తప్పకుండా చూస్తా’నని చెప్పడంతో.. నిర్మానుష్యంగా ఉన్న ఆసుపత్రి బయటకు తీసుకెళ్లాడు. నిర్మలంగా, వెలుగులు విరాజిమ్ముతూ అస్తమిస్తోన్న సూర్యుడిని, నిశ్శబ్ధంగా పలకరిస్తున్న ప్రకృతిని.. రోగి, అతన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న వైద్యుడు తనివితీరా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతని జీవితం అస్తమించకూడదని, సూర్యోదయంలా మరింత ప్రకాశవంతంగా మారాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ‘అద్భుతమైన ఫొటో, అతను త్వరగా కోలుకోవాలి’ అని నెటిజన్లు మనసారా కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు 85 దేశాల్లో సంక్రమించిన ఈ వ్యాధి వల్ల 3345మంది మరణించారు. ఒక్క చైనాలోనే 80వేలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.(ముందు జాగ్రత్తలతో కోవిడ్ కట్టడి!) -
సూర్యోదయం, సూర్యాస్తమయం
సూర్యోదయం : 5.47 సూర్యాస్తమయం : 6.26 రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు -
సూర్యాస్తమయానికి ఎరుపు రంగెందుకు?
సూర్యుడు ఉదయించేటప్పుడు, సాయంత్రం అస్తమించేటప్పుడు ఎర్రగా బంతిలా ఉంటాడు. ముఖ్యంగా సాయంత్రపు వేళల్లో ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. మిగతా సమయాల్లో అంటే రోజంతా మాత్రం సూర్యుడు తెల్లగా ఉంటాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యకాంతిని గ్రహించే భూభాగంలో వెలుతురు ఉంటుంది. దీన్నే మనం పగలు అంటాం. తెల్లని సూర్యకాంతిలో ఏడు రంగులు ఉంటాయి. అది వంకాయరంగు, ఊదా, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగులు. సాయంత్రం వేళలో సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో సూర్యరశ్మి భూమి మీదకు చేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. మధ్యాహ్నం సూర్యరశ్మి భూమిని చేరడానికి పట్టే సమయం కంటే ఉదయం, సాయంత్రాల్లో భూమిని చేరడానికి పట్టే సమయం యాభై రెట్లు ఎక్కువ. వాతావరణంలో ఉన్న ధూళి, పొగ, నీటికణాలు సూర్యరశ్మిలోని పసుపు, నారింజ, ఎరుపు... ఈ మూడు రంగులను మినహాయించి, తక్కిన రంగులను చెల్లాచెదురు చేస్తాయి. ఈ మూడు రంగులలో ఎరుపురంగుకు కాంతి ఎక్కువ. కాబట్టి మూడు రంగులు కలిసి ఎక్కువ ఎర్రగా కనబడతాయి. అందువల్ల ఉదయించినప్పుడు, అస్తమించినప్పుడు సూర్యుడు ఎర్రగా కనబడతాడు. -
గ్రహం అనుగ్రహం
శ్రీ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం తిథి శు.పంచమి ఉ.6.40 వరకు తదుపరి షష్ఠి తె.5.34వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం కృత్తిక ఉ.6.47 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం రా.10.36 నుంచి 12.13 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు సూర్యోదయం : 6.05 సూర్యాస్తమయం: 6.07 రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీకమాసం, తిథి బ.సప్తమి ఉ.6.52 వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.12.31 వరకు వర్జ్యం ప.12.11 నుంచి 1.45 వరకు దుర్ముహూర్తం ఉ.8.21 నుంచి 9.11 వరకు తదుపరి ప.12.09 నుంచి 1.00 వరకు అమృతఘడియలు రా.10.44 నుంచి 12.29 వరకు సూర్యోదయం: 6.07 సూర్యాస్తమయం: 5.21 రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు నమాజ్ వేళలు ఫజర్ : 5.16 జొహర్ : 12.10 అస్ : 4.06 మగ్రిబ్ : 5.48 ఇషా : 6.57


