breaking news
SRK
-
వాళ్లు స్టార్ హీరోలే కావొచ్చు! కానీ చట్టాన్ని ఉల్లంఘించారు
స్టార్ హీరోలు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్.. కానీ చట్టం ముందు ఇవేవీ పనిచేయవని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు కూడా నిబంధనలకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పారు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు విమల్ యాడ్ వ్యవహారంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మీ దృష్టిలో వాళ్లు స్టార్లు కావొచ్చు. కానీ ఈ కేసులో నా దృష్టిలో వాళ్లు కేవలం అడ్వర్టైజర్లు మాత్రమే. చట్టాన్ని ఉల్లంఘించినవారిగానే చూస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుంటుంది’’ అని తుకారాం ముండే అన్నారు. సెలబ్రిటీలు ప్రకటనల్లో నటించే ముందు తాము ప్రచారం చేస్తున్న ఉత్పత్తి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. తయారీదారుడిదే మొత్తం బాధ్యత అని చెప్పడం సరికాదన్నారు.మహారాష్ట్ర ఎఫ్‌డీఏ గ్రేటర్ ముంబై విభాగం ఆగస్టు 11న షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ ఇలాచీ పేరుతో వచ్చిన ప్రకటన పరోక్షంగా విమల్ పాన్ మసాలాను ప్రచారం చేస్తోందన్నది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో పాన్ మసాలా నిషేధం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నటులు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.ఇద్దరి నుంచి సమాధానం.. ఒకరిపై చర్యలుముగ్గురు నటుల్లో ఇద్దరు నోటీసులకు సమాధానం ఇచ్చారని ముండే తెలిపారు. అయితే ఎవరెవరు స్పందించారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఒక నటుడు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని, ఆ వ్యక్తిపై అడ్జుడికేషన్, ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. షారుఖ్ ఖాన్ టీమ్ స్పందించిందా? అనే ప్రశ్నకు.. ‘‘నాకు ఖచ్చితంగా తెలియదు’’ అని ముండే పేర్కొన్నారు.బాధ్యత తయారీదారుడిదేనా?ప్రకటనలో నటించినంత మాత్రాన బాధ్యత ఉండంటూ ఆ నటులు, వాళ్ల అభిమానులు వాదించడంపైనా ముండే స్పందించారు. ఫుడ్ సేఫ్టీ చట్టం, 2018 రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రకటనదారుల బాధ్యతల గురించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. తాము ప్రచారం చేస్తున్న ఉత్పత్తిపై తగిన పరిశీలన చేయాల్సిన బాధ్యత ఎండార్సర్లకు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదని, చట్టపరమైన బాధ్యత కూడా అని ముండే స్పష్టం చేశారు.ఢిల్లీ హైకోర్టులోనూ దక్కని ఊరటఈ వ్యవహారంలో వమల్ ఇలాచీ మాస్టర్ లైసెన్సీ పీబీ అగ్రో ఎల్ఎల్పీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 14న కొట్టివేసింది. ముంబై ఎఫ్‌డీఏ జారీ చేసిన నోటీసులను సవాలు చేసే విషయంలో ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదంటూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించిన ప్రధాన అంశాలు మహారాష్ట్రలోనే ఉన్నందున అక్కడి న్యాయస్థానమే సరైన వేదికగా కోర్టు అభిప్రాయపడింది. ఇటు ఆస్పత్రి వస్తువుల ధరలపైనా ఫోకస్కొన్ని హాస్పిటల్ కన్జ్యూమబుల్స్పై 150 నుంచి 2,800 శాతం వరకు మార్కప్ ఉన్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించిందని తెలిపారు. ఉదాహరణగా రూ.11కు కొనుగోలు చేసిన ఇంట్రావీనస్ సెట్‌కు రూ.325 ఎంఆర్పీ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ని కోరినట్లు వెల్లడించారు. అయితే వైద్య చికిత్సలో నిత్యం ఉపయోగించే ఇలాంటి వస్తువులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలా అనే అంశాన్ని అన్ని వర్గాలతో చర్చించాల్సి ఉందని ముండే చెప్పారు. ఇది వ్యవస్థాగత దోపిడీగా పరిగణించవచ్చా ? లేదా? అనేది NPPA తదుపరి పరిశీలనలో తేలుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మహిళలు గ్యాస్ మొద్దును ఎత్తలేరా?-సుప్రీం కోర్టు -
NMACC లో బాలీవుడ్ స్టార్ కిడ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల కుమారుడు అబరామ్(AbRam) తన 12వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లో అబ్రామ్ బర్త్‌డే వేడుక జరిగింది. ఆర్ట్స్ కేఫ్‌లో తల్లి గౌరీ ఖాన్, సిస్టర్స్ సుహానాతో కలిసి సందడి చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ,వీడియో నెట్టింట సందడి చేస్తున్నాయి.2013 మే 27న సరోగసీ ద్వారా పుట్టాడీ స్టార్ కిడ్. అబ్రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అందమైన వీడియోను NMACC అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తల్లి గౌరీ ఖాన్, ఆమె తల్లి, సవితా చిబ్బర్, సుహానా ఖాన్‌ను ఈ ఫోటోల్లో చూడవచ్చు. బబర్త్డే బోయ్ మల్టీ-టోన్ల షార్ట్స్‌తో నీలిరంగు పోలో టీ-షర్టులో డాషింగ్‌గా కనిపించాడు, సుహానా వేవ్ ప్యాటర్న్లతో స్ట్రాపీ మల్టీ-కలర్ మిడి-డ్రెస్‌లో అందంగా కనిపించింది. అబ్రామ్ తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య హ్యాపీ బర్త్‌డే అబ్రామ్' పేరుతో ఉన్న కేక్‌ను కట్ చేశాడు. మొత్తం మీద అబ్రామ్ పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు టోటల్ ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. అబ్రామ్ ఖాన్ ఇప్పటికే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ముఫాసా: ది లయన్ కింగ్ హిందీ వెర్షన్‌తో తన వాయిస్ ఓవర్‌తో అరంగేట్రం చేశాడు. చిన్ని'ముసాఫా' కి వాయిస్‌ను అందించగా, షారుఖ్ ఖాన్ ఓల్డ్ 'ముఫాసా'కి వాయిస్ ఇచ్చారు. అంతేకాదు గిటార్ , ఫుట్‌బాల్ వాయించడంలో అబ్‌రామ్‌కు నైపుణ్యం ఉంది. గత ఏడాది డిసెంబర్లో ఇది తిరిగి విడుదలైంది. అంతేకాదు ఇదే మూవీలో ఆర్యన్ ఖాన్ 'సింబా' గా వాయిస్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)> స్టార్ హీరో షారూఖ్‌తో పాటు, ఆయన కుమారుడు అబ్రామ్ను అభిమానులు చాలా ఇష్టపడతారు .. ఒక సందర్భంలో తన కొడుకు పేరు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, ప్రవక్త ఇబ్రహీం , రామ్ పేర్లు కలిసి ఉన్నాయని, తనకు ఆ పేరు చాలా ఇష్టమని చెప్పాడు. -
ముగ్గురు ఖాన్‌లనూ మించిన కుబేరుడు!
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ఎడిషన్ ఇటీవల విడుదలైంది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన బిలియనీర్లు 205 మంది ఉన్నారు. వీరిలో వినోదం, మీడియా ప్రపంచానికి చెందినవారు కొంతమంది ఉండగా ఇందులో బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక బిలియనీర్ రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala). ఒకప్పుడు టూత్ బ్రష్‌లు అమ్మిన ఆయన ఇప్పుడు పరిశ్రమలోని అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడైన పారిశ్రామికవేత్త.బాలీవుడ్ అపర కుబేరుడుఫోర్బ్స్ ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ నుండి ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ఏకైక వ్యక్తి మూవీ మాగ్నెట్, పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త జాబితా ప్రకారం ఈ మీడియా మొఘల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఉన్న ఖాన్ త్రయం కంటే ధనవంతుడు. ఎలాగంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan) (390 మిలియన్ డాలర్లు), అమీర్ ఖాన్ (Aamir Khan) (220 మిలియన్ డాలర్లు) మొత్తం నెట్‌వర్త్ 1.38 బిలియన్ డాలర్లు కాగా ఆ ముగ్గురి సంపద కంటే రోనీ స్క్రూవాలా సంపద అధికం. రోనీ వ్యాపార ప్రస్థానం1956లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా 70వ దశకం చివర్లో టూత్ బ్రష్ ల తయారీ ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. 80వ దశకం ప్రారంభంలో ఆసియా క్రీడల పుణ్యమా అని కలర్ టీవీ దేశంలోకి ప్రవేశించినప్పుడు అ బూమ్‌ను స్క్రూవాలా అందిపుచ్చుకున్నారు. అలా ఎంటర్టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించి 1990లో యూటీవీని స్థాపించారు. అదే తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్‌గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లీ, బర్ఫీమ్ వంటి ఐకానిక్ చిత్రాలను అందించాయి. అలాగే శాంతి, హిప్ హిప్ హుర్రే, షకా లకా బూమ్ బూమ్, కిచిడి, షరారత్ వంటి టీవీ షోలను అందించాయి.తర్వాత రోనీ స్క్రూవాలా 2012లో యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో అమ్మేశారు. అనంతరం ఐదు సంవత్సరాలకు ఆర్ఎస్వీపీ మూవీస్ సంస్థను స్థాపించారు. అలా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కేదార్నాథ్, ఉరీ, ది స్కై ఈజ్ పింక్, సామ్ బహదూర్ చిత్రాలను నిర్మించారు. 2024లో స్క్రూవాలా షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్‌లలో ఒకరిగా వెండితెర అరంగేట్రం చేశారు. రోనీ స్క్రూవాలాకు సినిమాలే ఏకైక ఆదాయ వనరు కాదు. అప్ గ్రాడ్, యూనిలాజర్, యూఎస్ స్పోర్ట్స్ వంటి పలు స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్నింటిని స్థాపించారు. ఈ సంస్థల విజయం, తన సినిమా వ్యాపారం ఆయన భారీ సంపదను పోగుచేసుకోవడానికి దోహదపడ్డాయి. -
డైనోసార్ దెబ్బకు డంకీ వెనక్కి తగ్గుతాడా..
-
స్టార్ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది!
మరో స్టార్ వారసుడు ఈ శుక్రవారం బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకప్పటి టాప్ హీరో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ ‘మీర్జ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో సయామీ ఖేర్ హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. ‘రేయ్’ సినిమాతో ఈ సుందరి ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘మీర్జ్యా’ ప్రివ్యూను చూసిన బాలీవుడ్ ప్రముఖులు పలువురు ’కదిలే కవిత్వంలా’ ఈ సినిమా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హర్షవర్ధన్ కపూర్‌కు శుభాకాంక్షలు తెలుపగా.. బిగ్ బీ అమితాబ్ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్లో ఇచ్చిన రివ్యూ ఇదే.. ‘మీర్జ్యా’ చూశాను. కదిలే కవిత్వం, అద్భుతమైన దృశ్యాలు, కథ చెప్పడంలో కొత్త దృక్పథం.. ఆకట్టుకుంది. - బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఊపిరి సలుపలేనంత అద్భుతంగా ఉంది. దర్శకుడు ఓం ప్రకాశ్ మెహ్రాకు జోహార్లు. అందరూ అద్భుతంగా పనిచేశారు. హర్షవర్ధన్ మరో స్టార్ కాబోతున్నాడు. - అనుపమ్ ఖేర్ సినిమా నిజంగా కదిలే కవిత్వం. మెహ్రా చిత్రకారుడైతే అతనికి హర్షవర్ధన్, సయామీ ఖేర్ కుంచెలు. కథ కన్వాసు. సినిమా ఎంతో అందంగా ఉంది. తమ్ముడు హర్షవర్ధన్ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు మరింతగా పనిచేసి.. అనిల్కపూర్లా పేరు తెచ్చుకోవాలి. సయామీ ఖేర్ కూడా అద్భుతంగా నటించింది. - అర్జున్ కపూర్, హీరో ‘మీర్జ్యా’ సౌందర్యం నన్ను కట్టిపడేసింది. ఎంతో తపనతో ఈ సినిమా తీశారు. అద్భుతమైన దృశ్యాలు, అసాధారణమైన సంగీతం. కలల తొలి సినిమా అంటే ఇలా ఉండాలి. - షబానా ఆజ్మీ తమ సహజ నటనతో హర్షవర్ధన్, సయామి ఖేర్ విస్మయ పరిచారు. - ఫర్హా ఖాన్ -
ఎమోషనల్ గా బందీనయిపోయా
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తాను నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్' కి ఎమోషనల్ గా బౌండ్ అయిపోయాడట. ఈ సినిమా షూటింగ్ ఇంకా ఉంటే బావుండు అని బాద్ షా కు అనిపిస్తోందిట. ఫ్యాన్ సినిమాతో తన ప్రయాణం ఇంత తొందరగా ముగిసిపోతుందని ఎప్పుడూ అనుకోలేదంటూ సోషల్ మీడియాలో షారుక్ షేర్ చేశాడు. తాను మానసికంగా ఫ్యాన్ సినిమాకు బాగా బందీ అయినట్లు షారుక్ ఖాన్ పేర్కొన్నాడు. జీవితం, ప్రేమ, హాస్యం లాంటి మంచి సంగతులు తొందరగా ముగియడం విచారకరమంటూ శుక్రవారం ట్విట్ చేశాడు. కొన్ని సినిమాల్లో నటిస్తున్నపుడు షూటింగ్ లో మమేకమైపోతామని, ఇంకా షూటింగ్ ఉంటే బావుండు అనే ఫీలింగ్ కలుగుతుందన్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న ఫ్యాన్ చిత్రం కూడా అలాంటిదేనన్నాడు. కాగా మనీశ్ శర్మ దర్శకత్వంలో ఒక సూపర్ స్టార్ గా, ఆ సూపర్ స్టార్ కి సూపర్ గా షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ప్రఖ్యాత మోడల్ వలుశ్చా డిసౌజా, మరో హీరోయిన్గా శ్రీయా పిల్గౌంకర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ్యాన్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. 2016, ఏప్రిల్15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
షారూఖ్‌కు కోటిన్నర ఫాలోవర్లు
ముంబై: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ట్విటర్లోనూ తాను సూపర్‌స్టార్ అని నిరూపించుకున్నారు. ఆ సామాజిక వెబ్సైట్లో ఆయన్ను అనుసరించేవారి సంఖ్య కోటీ యాభై లక్షలకు చేరింది. దీంతో ఆయన భారత నటుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాతి స్థానంలో నిలిచారు. అమితాబ్‌ను ప్రస్తుతం కోటీ 67 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా షారూఖ్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'నన్ను ఫాలో చేస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. అది నేనేదో నేతృత్వం వహిస్తున్నందుకు కాదు. కానీ నేను దారి తప్పకుండా చూడటానికి మీరంతా ఉన్నామని భరోసా ఇచ్చినందుకు' అని షారూఖ్ ట్వీట్ చేశారు.


