స్టార్‌ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది! | Sakshi
Sakshi News home page

స్టార్‌ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది!

Published Wed, Oct 5 2016 7:25 PM

స్టార్‌ వారసుడి సినిమాపై రివ్యూ వచ్చేసింది!

మరో స్టార్‌ వారసుడు ఈ శుక్రవారం బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒకప్పటి టాప్‌ హీరో అనిల్‌ కపూర్‌ కొడుకు హర్షవర్ధన్‌ ‘మీర్జ్యా’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు ఓం ప్రకాశ్‌ మెహ్రా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సయామీ ఖేర్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నది. ‘రేయ్‌’ సినిమాతో ఈ సుందరి ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

‘మీర్జ్యా’ ప్రివ్యూను చూసిన బాలీవుడ్‌ ప్రముఖులు పలువురు ’కదిలే కవిత్వంలా’ ఈ సినిమా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ హర్షవర్ధన్‌ కపూర్‌కు శుభాకాంక్షలు తెలుపగా.. బిగ్‌ బీ అమితాబ్‌ ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఈ సినిమా గురించి బాలీవుడ్‌ ప్రముఖులు ట్విట్టర్‌లో ఇచ్చిన రివ్యూ ఇదే..

‘మీర్జ్యా’ చూశాను. కదిలే కవిత్వం, అద్భుతమైన దృశ్యాలు, కథ చెప్పడంలో కొత్త దృక్పథం.. ఆకట్టుకుంది.
- బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌

ఊపిరి సలుపలేనంత అద్భుతంగా ఉంది. దర్శకుడు ఓం ప్రకాశ్‌ మెహ్రాకు జోహార్లు. అందరూ అద్భుతంగా పనిచేశారు. హర్షవర్ధన్‌ మరో స్టార్‌ కాబోతున్నాడు.
- అనుపమ్‌ ఖేర్‌

సినిమా నిజంగా కదిలే కవిత్వం. మెహ్రా చిత్రకారుడైతే అతనికి హర్షవర్ధన్‌, సయామీ ఖేర్‌ కుంచెలు. కథ కన్వాసు. సినిమా ఎంతో అందంగా ఉంది. తమ్ముడు హర్షవర్ధన్ నన్ను గర్వపడేలా చేశావు. నువ్వు మరింతగా పనిచేసి.. అనిల్‌కపూర్‌లా పేరు తెచ్చుకోవాలి. సయామీ ఖేర్‌ కూడా అద్భుతంగా నటించింది.
- అర్జున్‌ కపూర్‌, హీరో

‘మీర్జ్యా’ సౌందర్యం నన్ను కట్టిపడేసింది. ఎంతో తపనతో ఈ సినిమా తీశారు. అద్భుతమైన దృశ్యాలు, అసాధారణమైన సంగీతం. కలల తొలి సినిమా అంటే ఇలా ఉండాలి.
- షబానా ఆజ్మీ

తమ సహజ నటనతో హర్షవర్ధన్‌, సయామి ఖేర్‌ విస్మయ పరిచారు.
- ఫర్హా ఖాన్‌
 

Advertisement
 
Advertisement
 
Advertisement