sri vasavi kanyaka parameswari
-
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం) -
స్త్రీల ఆత్మాభిమానానికి ప్రతీక శ్రీవాసవీ కన్యక
వైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి. పదకొండవ శతాబ్దంలో పెనుగొండను పాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబల ముద్దుబిడ్డగా ఆమె జన్మించింది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యజ్ఞ ఫలితంగా విరూపాక్షుడు అనే కవల సోదరునితో బాటు ప్రభవించిన కన్యక అందచందాలతో, విద్యావినయాలు, గుణ గణాలతోబాటు ఆధ్యాత్మిక విలువలనూ కలిగి అందరి మన్ననలనూ పొందింది. వివాహం చేసుకోకుండా కన్యగానే జీవించాలనే ప్రగాఢేచ్ఛ ఆమె తల్లితండ్రులను కూడా విస్మితులను చేసింది. ఆమె నిర్ణయానికి తలొగ్గి ఆమె సోదరుడు, విరూపాక్షుని వివాహం రత్నావతితో అతి వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు. ఇలా ఉండగా... వేంగిరాజ్య పాలకుడు,పాండవుల వంశంలోని వాడైన నాటి చాళుక్యరాజు విష్ణువర్ధనుడు తన సామంతరాజ్యమైన పెనుగొండకు పర్యటనకు రాగా, కుసుమశ్రేష్ఠి, తదితరులు ఆ చక్రవర్తికి సకల రాజోచిత మర్యాదలనూ చేశారు. విమలాదిత్యు డనే మరొక పేరూ కలిగిన విష్ణువర్ధనుడు పెనుగొండ వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంతకంటే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెడుతున్న వాసవాంబ అసామాన్యమైన సౌందర్యానికి విమోహితుడైపోయాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించవలసిందిగా కుసుమ శ్రేష్ఠికి తన మంత్రులతో కబురంపాడు. వయసులో వాసవాంబ కన్నా చాలా పెద్దవాడు, పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఉన్నవాడు అయిన చక్రవర్తి వాసవాంబను కోరడం కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి నచ్చలేదు. పైగా తన కూతురు కన్యగానే జీవింపదలచి ఉంది. అలాగని బలవంతుడైన చక్రవర్తిని ఎదిరించనూ లేడు. దిక్కుతోచని స్థితిలో కుసుమ శ్రేష్ఠి తన కులగురువైన భాస్కరాచార్యుని అధ్వర్యంలో 714 గోత్రాలుగా విస్తరించి ఉన్న తమ ఆర్య వైశ్యులతో సమావేశమయ్యాడు. వారిలో 612 గోత్రాలవారు విష్ణువర్ధనుని ఎదిరించడం బలవద్విరోధాన్ని కొని తెచ్చుకోవడమేననీ, వాసవాంబను అతనికిచ్చి పెండ్లి జరిపిస్తే యుద్ధప్రమాదం, అందువలన కలిగే కులక్షయం అనే ముప్పూ తప్పుతాయని భావించగా; 102 గోత్రాల వారు మాత్రం కుల ధర్మానికి విరుద్ధంగా, దైవాంశగా భావించబడుతున్న వాసవిని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చక్రవర్తికి అప్పగించడం తప్పని అభిప్రాయ పడ్డారు. ఇంతలో అనూహ్యంగా వాసవీదేవి ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించింది. ‘అన్నలారా, తండ్రులారా! ఒక వినూత్న ప్రణాళికతో చక్రవర్తిని దెబ్బ తీయాలనుకొంటున్నాను. నేనతనిని నిరాకరిస్తే, అతడు మనపైకి దండెత్తి వచ్చి మన సైన్యాన్ని, పౌరులను ఊచ కోత కోస్తాడు. అహింస, సత్యాగ్రహం అనే విధానంతో మనలను మనం ఆత్మార్పణ గావించుకొని అతనికి బుద్ధి చెబుదాం. దృఢమైన సంకల్పదీక్షతో నన్ను అనుసరించ గలవారు మాత్రమే ఈ నా పోరాటంలోపాల్గొనగలరు’ అని ఆమె పలికిన పలుకులకు ఆమె తల్లిదండ్రులతోబాటు, 102 గోత్రాల వారు తమ అంగీకారాన్ని తెలిపారు.గోదావరీ తీరంలో బ్రహ్మకుండమనేపావన ప్రదేశంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘ శుద్ధ పాడ్యమి. తమ కన్ను పడిన కన్నె పిల్లలు తమ వశం కావలసిందే అని విర్రవీగే నాటి రాజుల ఆగడాలకు చరమ గీతం పాడడానికి; ఆడపిల్లల అభిప్రాయాలకూ విలువనివ్వాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి; ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ్ర΄ాణాలు గొప్పవి కావని నిరూపించడానికి, ‘ఆత్మార్పణ‘ మార్గాన్ని ఎంచుకొన్నది వాసవీమాత. తనతోబాటూ ఆ యజ్ఞంలో ఆహుతి కావడానికి సంసిద్ధులై ఉన్న 102 గోత్రాల వారికి తన నిజరూపాన్ని ప్రదర్శించింది ఆమె. తనతోబాటు తన 102 గోత్రాల వారికీ మోక్షం కావాలని కోరుకొన్న ‘సమాధి’ అనే వైశ్యశ్రేష్ఠుడే ఇప్పుడు తన తండ్రియైన కుసుమ శ్రేష్ఠి అంటూ తమ జన్మవృత్తాంతాన్ని వివరించింది వాసవీదేవి.దేశభక్తి, నిజాయితీ, దేహ బలం, బుద్ధిబలం, సమాజసేవల గురించి ప్రబోధించింది. ‘రాజా! చేతనైనే నన్ను ఇప్పుడు చెరబట్టు’ అంటూ అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యం చూసి తన గర్వం మట్టిలో కలిసిపోగా, రక్తం కక్కుకొని, తల పగిలి రాజు మరణించాడు. కోరుకొన్న కన్య లభించక పోగా అపకీర్తి, ఆకస్మిక మరణం రాజును వరించాయి. గురజాడ వారు అన్నట్లు ‘పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను/ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‘. వాసవీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి పోయాయి. విషయం తెలుసుకొని విష్ణువర్ధన చక్రవర్తి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు తరలిరాగా, విరూపాక్షుడు అతడిని స్నేహపూర్వకంగా పరామర్శించి, ‘గతాన్ని మరచి నవ్యమైన భవిష్యత్తును నిర్మించుకొందాం‘ అంటూ చేయి కలిపాడు. అంగీకరించిన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలోని నగరేశ్వర స్వామి దేవస్థానం లోనే వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిపాడు. అప్పటినుండీ వైశ్యుల కుల దేవతగా వాసవీ కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలందుకొంటూ ఉంది. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఆమెకు ఆలయాలు వెలిశాయి.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
శక్తిస్వరూపిణి పుట్టిన రోజు
అమ్మవారి అవతారంగా పూజలందుకునే దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి. వైశాఖ శుద్ధ దశమి నాడు కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు పరమేశ్వర వరప్రసాదంగా జన్మించింది వాసవాంబ. దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ, యవ్వనవతి అయిన ఆ కన్యకను విష్ణువర్థనుడనే రాజు చెరబట్టబోతాడు. అప్పుడు వాసవి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్రస్థలంలో తనకు అండగా నిలిచిన 102 గోత్రాలకు చెందిన బంధువులతో కలసి అగ్నిప్రవేశం చేస్తుంది. ఆమె బలిదానానికి చిహ్నంగా విష్ణువర్థనుడి కొడుకు ఆమె గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. అప్పటినుంచి వైశ్యులందరూ వాసవి కన్యకాపరమేశ్వరిని తమ కులదైవంగా పూజించడం మొదలు పెట్టారు. అమ్మవారి జయంతి సందర్భంగా అంతటా విశేష పూజలు జరుగుతాయి. (25, బుధవారం కన్యకాపరమేశ్వరి జయంతి) ఇందుగలడందులేడను సందేహంబు వలదు శ్రీమన్నారాయణుని దివ్యావతారాలలో నాలుగవదైన నృసింహావతారం అత్యంత విశిష్టమైనది. వైశాఖ శుద్ధ చతుర్దశినాటి సాయంకాలం నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించేందుకు ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. తన భక్తుడైన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి చూపడానికి స్తంభం బద్దలు కొట్టుకుని వచ్చాడు. జగత్తు అంతటా తానున్నానని నిరూపించాడు. ఈ రోజు ఏం చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో లేచి తలంటుకొని స్నానం చేసి స్వామివారికి షోడశోపచార పూజ జరిపి, శ్రీ నృసింహస్తోత్రం–శ్రీ నృసింహ సహస్ర నామ జపం చేసి పానకం–వడపప్పు, చక్రపొంగలి–దద్ధ్యోదనం నివేదించాలి. సర్ప, మృత్యు, అగ్ని, అకాల మరణ, శస్త్ర, వ్రణ, శతృపీడలవల్ల బాధపడ్డవారు, చెరసాల పాలబడ్డవారు శ్రీ నృసింహస్వామిని పూజిస్తే, తక్షణమే కష్టాలనుండి విముక్తి పొందుతారు. (28, శనివారం నృసింహ జయంతి) -
వాసవీ ట్రస్ట్‌లో పరి‘భక్షణ’ కమిటీ
ఏలూరు సెంట్రల్ : చిన్నతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకాతిరుమలలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కల్యాణ మండప ట్రస్ట్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. శ్రీవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చే ఆర్యవైశ్య భక్తుల కోసం దాతల సాయంతో కల్యాణ మండపం నిర్మించగా, నిధుల వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ట్రస్ట్ పరిరక్షణ కమిటీ పేరిట కొందరు నిధుల భక్షణకు పూనుకున్నారంటూ ట్రస్ట్ మాజీ కార్యదర్శి ఓబులశెట్టి గంగరాజు కుమార్ (శేఖర్), ఫౌండర్ ట్రస్టీ యిమ్మడి రామ్మోహనరావు తనయుడు, దాత యిమ్మడిరత్నాజీ ఆరోపించారు. ట్రస్ట్‌కు సంబంధించి ఆంధ్రాబ్యాంక్‌లో ఉన్న ఖాతాను స్తంభింప చేయూలంటూ బ్యాంక్ మేనేజర్‌కు లేఖ కూడా పంపించారు. ఇందుకు సంబంధించి గంగరాజుకుమార్, రత్నాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. ఆర్యవైశ్య కల్యాణ మండపం నిర్వహణకు సంబంధించి 1999 జనవరి 1న దాతలంతా కలసి ఏకగ్రీవ ఆమోదంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత మరింతమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడంతో అక్కడ నిత్యాన్నదాన పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఏడాది క్రితం సుమారు రూ.30లక్షల మేర అవినీతి జరిగిందని, ట్రస్ట్ మేనేజర్ ఆ మొత్తాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చా రుు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ట్రస్ట్ సభ్యులు, దాతలు పట్టుబట్టడం, అనుమానితులపై కోర్టులో కేసులు వేయడం వంటి పరిణామాలు అప్పట్లో చోటుచేసుకున్నారుు. దీంతో ఆర్యవైశ్య కల్యాణ మండపం ట్రస్ట్ ప్రతిష్ట మసకబారిందని భావించిన దాతలు జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడు అంబికా కృష్ణ ఎదుట పంచారుుతీ పెట్టారు. ఆయన సల హాతో ట్రస్ట్ స్థానంలో ఏడాదిన్నర క్రితం పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తొలుత కల్యాణ మండప కార్యక్రమాలను సక్రమంగానే సంస్కరిస్తూ వచ్చిన పరిరక్షణ కమిటీ కాలక్రమంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్రస్ట్ మాజీ కార్యదర్శి గంగరాజు కుమార్, దాత యిమ్మడిరత్నాజీ ఆరోపిస్తున్నారు. చివరకు అన్నదానం నిధులు కూడా కైంకర్యం చేసేందుకు పరిరక్షణ కమిటీ సిద్ధమైందని వారు పేర్కొంటున్నారు. అందుకే కొత్త ట్రస్ట్ ఏర్పాటు అన్నదానం కోసం ఉద్దేశించిన సుమారు రూ.2 కోట్లకు పైగా ధనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంది. ఆ మొత్తాన్ని బ్యాంకునుంచి విత్‌డ్రా చేయడం అంత తేలికైన పని కాదని, అది ట్రస్ట్ వల్ల మాత్రమే అవుతుందని గుర్తించిన పరిరక్షణ కమిటీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేశారని గంగరాజుకుమార్, రత్నాజీ ఆరోపించారు. కోట్ల సాయివెంకట రాజా చైర్మన్‌గా, గాదంశెట్టి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా ఈ ట్రస్టు ఏర్పాటైంది. వారు అన్నదానం నిధులను విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నిం చగా, పాత ట్రస్ట్ సభ్యులు అప్రమత్తం అవడంతో కథ అడ్డం తిరిగిందని వారు తెలిపారు. పాత ట్రస్ట్‌ను రద్దు చేయకుండా రెండో ట్రస్టు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని పాత ట్రస్ట్ కార్యదర్శి శేఖర్, దాత రత్నాజీ వాదిస్తున్నారు.


