breaking news
somayya
-
తాగేందుకు డబ్బివ్వలేదని.. తలనరికి చంపి..
రెబ్బెన: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం పట్టపగలే దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఓ వృద్ధుడిని వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలనరికి చంపాడు. అనంతరం హాహాకారాలు చేస్తూ అందరూ చూస్తుండగానే పారిపోయాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడమే హత్యకు కారణమై ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.కుమార్తెను రైలెక్కిద్దామని వచ్చి.. ఆసిఫాబాద్ మండలం పర్సనంబాలకు చెందిన మాసండి సోమయ్య (65) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య కరుణబాయి, కుమార్తెలు లక్ష్మి, సుజాత, కుమారుడు భిక్కాజీ ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి గురువారం హైదరాబాద్ నుంచి మండలంలోని నంబాలలో ఉన్న తన చెల్లెలు సుజాత ఇంటికి రావడంతో ఆమెను చూసేందుకు భార్యతో కలిసి సోమయ్య నంబాలకు వచ్చాడు. శుక్రవారం లక్ష్మి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతుండటంతో రెబ్బెనలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వేస్టేషన్ రైలెక్కించేందుకు భార్య, చిన్న కూతురుతో కలిసి సోమయ్య వచ్చారు.రైలు వచ్చేలోగా టీ తాగేందుకు బస్టాండ్ వైపు వెళ్లిన సోమయ్య.. తిరిగి వస్తుండగా ఓ మందుబాబు సోమయ్యను వెంబడించాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి సోమయ్య వెళ్లడంతో ఒక్కసారిగా గొడ్డలితో మెడపై దాడి చేయగా తల, మొండెం వేరై సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత నగేశ్ బయటకు వచ్చి చంపేశానని అరుస్తూ అందరూ చూస్తుండగానే పక్కనే ఉన్న నీటి మడుగులో గొడ్డలిని కడిగి రైల్వే కాలనీ గుండా పారిపోయాడు. అప్పటివరకు తమతో ఉన్న కుటుంబ పెద్ద నిమిషాల వ్యవధిలో హత్యకు గురి కావడంతో భార్య, కుమార్తెలు గుండెలవిసేలా రోదించారు. డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ ఘటనాస్థలిని పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు సేకరించారు. నిందితుడిని తుంగెడ గ్రామ పంచాయతీ పరిధి కొత్తగూడకు చెందిన నగేశ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడంతోనే నగేశ్ తాగిన మైకంలో హత్య చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాగుడుకు బానిసైన నగేశ్ రెండ్రోజులుగా రెబ్బెనలోనే తిరుగుతున్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. -
ఆటో, బైక్ ఢీ.. ఇద్దరి దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్రగాయాలు బైక్‌పై శుభకార్యానికి వెళ్లి వస్తూ హైవే దాటుతుండగా ప్రమాదం దురాజ్‌పల్లి వద్ద ఘటన దురాజ్‌పల్లి (చివ్వెంల), న్యూస్‌లైన్ : ఆటో, బైక్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి దురాజ్‌పల్లి స్టేజీ వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అర్వపల్లి మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన మహంకాళి సోమయ్య (50) తన కుటుంబ సభ్యులతో పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు. చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి పెద్దగట్టుపై శుభకార్యం నిర్వహించారు. సోమయ్య తన కుమారుడు మహంకాళి వెంకన్న, మనుమరాలు స్పందన (6), అనంతారం గ్రామానికి చెందిన మామిడి సైదులు నలుగురు ఒకే బైక్‌పై వస్తున్నారు. దురాజ్‌పల్లి శివారులో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లే క్రమంలో హైదరాబాద్-విజయవాడ రహదారి దాటుతుండగా సూర్యాపేట నుంచి హుజూర్నగర్ వెళ్తున్న టాటా ఏస్ ఆటో ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య అక్కడిక్కడే మరణించాడు. బైక్‌పై ఉన్న ముగ్గురిని సూర్యాపేటలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్పందన మృతిచెం దింది. వెంకన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సైదులు చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని చివ్వెంల ఎస్ఐ కె.నర్సింహరావు సందర్శించి రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించారు. కుటుంబంలో విషాదఛాయలు శుభాకార్యంలో అంత వరకు తమ ముందే ఉన్న సోమయ్య, స్పందన మృతిచెందారనే వార్త విన్న బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరిని కంట తడిపెట్టిం చింది.


