breaking news
Shabad Mandal
-
షాబాద్ హత్యల కేసులో కీలక పరిణామం
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు మైనర్ బాలిక, ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో, అతడి మొబైల్ ఫోన్లో లభించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడి మరణం ఆత్మహత్యేనా? లేదంటే ఇతర కోణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జులై 10 తేదీ అర్ధరాత్రి సమయంలో రాజ్‌కుమార్ దైవాలగూడలో నరమేధం సృష్టించాడు. రెండు రోజుల తర్వాత.. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్‌కుమార్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.సెల్ఫీ వీడియోలో ఏముంది?రాజ్‌కుమార్ మొబైల్ ఫోన్లో పోలీసులు గుర్తించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో తనపై నమోదైన పోక్సో కేసు, తన జీవితంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. బాధితులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు కొన్ని గంటల ముందే ఈ వీడియోను రికార్డు చేసినట్లు గుర్తించారు.అలాగే రాజ్‌కుమార్ రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.మృతిపై కూడా కేసు నమోదురాజ్కుమార్ మృతికి సంబంధించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్ఫీ వీడియో, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఏం జరిగింది?పోక్సో కేసు నమోదుపై కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్.. గత శుక్రవారం రాత్రి బాలిక, ఆమె తల్లి, నానమ్మలను హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా చంపేశాడు. కేవలం అరగంట వ్యవధిలోనే.. మొత్తం ఆరు హత్యలు చేశాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి.. తాను చనిపోతున్నానంటూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు.రెండు రోజుల వేట తర్వాత..ఆరు హత్యల అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పెంజర్ల సమీపంలో అతడి మృతదేహం లభించడంతో గాలింపు ముగిసింది.కుటుంబం నిరాకరించడంతో..రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీసుల అదుపులో హంతకుడు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ షాద్‌నగర్/ షాబాద్: తనపై పోక్సో కేసుకు కారణమయ్యారంటూ కక్ష పెంచుకొని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చిన కిల్లర్ రాజ్‌కుమార్ పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉదయం కొత్తూరు మండలం కుమ్మరిగూడ వద్ద ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 24 గంటలపాటు సమీప అటవీ ప్రాంతంలో దాక్కున్న రాజ్‌కుమార్ ఆదివారం ఉదయం టిఫిన్ కోసం రోడ్డుపైకి రాగా ఓ ఎస్ఓటీ కానిస్టేబుల్ వెనుక నుంచి పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తూరు మండలం కుమ్మరిగూడకు చెందిన సుధాకర్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది. కానీ ఈ విషయాన్ని ఫ్యూచర్‌సిటీ పోలీసులు ధ్రువీకరించడం లేదు. నిందితుడు చేగూరు రైల్వేట్రాక్ దాటి అడవిలోకి వెళ్లాడని.. 9 బృందాలతో అతడి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేసిన తర్వాత రాజ్‌కుమార్ షాబాద్‌కు కారులో వెళ్లి అక్కడ కారును వదిలేసి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో రైలెక్కి పరారయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. రాజ్‌కుమార్ వాడిన ఫోన్ నంబర్లలో ఒకటి బిహార్‌లో లొకేషన్ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి రాజ్‌కుమార్ రైల్లో బిహార్‌కు వెళ్లి ఉండొచ్చని అనుమానంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే నిందితుడు ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన నేపథ్యంలో షాబాద్, కొత్తూరు, శంషాబాద్, పాల్మాకుల పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల వద్ద గాలించినట్లు తెలిసింది. మరోవైపు నిందితుడి తల్లిదండ్రులు సహా నిందితుడి ఫోన్‌కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు.. అతనికి సహకరించిన కొందరు సన్నిహితులను శనివారం విచారించారు. రాజ్‌కుమార్ జాడ కోసం షాద్‌నగర్, షాబాద్, నందిగామ, కొత్తూరు, శంషాబాద్ పరిసరాలను జల్లెడపట్టారు. మా అదుపులో లేడు: డీసీపీ యోగేష్ గౌతం రాజ్‌కుమార్ తమ అదుపులో ఉన్నాడనేది వదంతి మాత్రమేనని... అందులో వాస్తవం లేదని ఫ్యూచర్ సిటీ (చేవెళ్ల జోన్) డీసీపీ యోగేష్ గౌతం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ‘శుక్రవారం రాత్రి 11:47 గంటలకు దైవాలగూడలోనే నిందితుడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత కారు చేగూరు సమీపంలో వదిలి, రైల్వేట్రాక్ దాటి రాజ్‌కుమార్ అడవిలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నాం. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇచ్చి సహకరించాలి’అని డీసీపీ కోరారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రేమ పేరుతో బాలికను వేధించి చివరకు ఆ కుటుంబాన్ని హతమార్చిన నిందితుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్లముందే చెల్లి, తల్లి, నానమ్మను పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిన దివ్యాంగురాలు మేఘనను ఆదివారం ఆయన పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. ఆరు హత్యలు.. ఏడురాళ్లు నిందితుడు రాజ్‌కుమార్.. దైవాలగూడలో బాలికను హత్య చేసిన చోట ఏడు రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. భార్య, ఇద్దరు పిల్లలు సహా బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు ఏడాది క్రితం మరణించిన బాలిక తండ్రిని కూడా తానే అంతమొందించినట్లు సంకేతం ఇచ్చేందుకే ఏడు రాళ్లను పేర్చి ఉంటాడన్న వాదన వినిపిస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెయిల్ డీల్ రూ. 25 లక్షలు? పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌కు ముందస్తు బెయిల్ లభించేలా పోలీసులు, అధికార పార్టీ నేతలు సహకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సహా చేవెళ్లకు చెందిన మరో అధికార పార్టీ నేత పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా నిందితుడు రాజ్‌కుమార్ సదరు పోలీసులకు రూ. 25 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ లభించాక రాజ్‌కుమార్ పోలీసు స్టేషన్ సిబ్బందితో కలిసి మద్యం సేవించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వ్యవహారంపై ఎస్ఐ రమేష్‌పై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ..సీఐ కాంతారెడ్డికి నోటీ సులు జారీ చేశారు. మరికొందరు పోలీసు సిబ్బందిపైనా చర్యలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
‘పోక్సో’ నిందితుడి పగ.. ఆరుగురి దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోక్సో కేసులో నిందితుడు పగతో రగిలిపోయాడు. రాక్షసుడిలా మారాడు. వరుసబెట్టి ఆరుగుర్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. తనపై ఫిర్యాదు చేసిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను మట్టుబెట్టిన ఈ రాక్షసుడు, వారికి మద్దతుగా నిలిచిందనే కోపంతో కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని ఇద్దరు కొడుకుల్నీ కడతేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ హత్యాకాండ చోటు చేసుకోగా, శనివారం ఉదయం ఈ ఘోరం సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఈ మారణకాండ జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆస్తులమ్ముతూ.. అప్పులు చేస్తూ దైవాలగూడకు చెందిన పార్వతి అరుణ్‌కుమార్, శకుంతల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కొడుకైన రాజ్‌కుమార్ (28)కు చదువు సంధ్యా లేదు. జులాయిగా తిరిగేవాడు. తల్లిదండ్రులను బెదిరించడం..ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు చేయడం, ఖరీదైన కార్లలో తిరుగుతూ జల్సాలు చేయడం, యువతులను వేధించడం..ఇదే పని. మరోవైపు ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆర్థికంగా నష్టపోయాడు. స్నేహితులు, బంధువుల వద్ద రూ.కోటికి పైగా అప్పు చేశాడు. చెల్లించమని అడిగితే మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. రాజ్కుమార్ప్రేమించానంటూ వెంట పడి..పెళ్లి చేసుకుని.. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన తనకంటే వయసులో ఐదేళ్లు పెద్దదైన కప్పెర సరిత (32)ను ప్రేమించానంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె కుటుంబసభ్యులు అప్పటికే మరో వ్యక్తితో వివాహం నిశ్చయించినా దాన్ని చెడగొట్టాడు. 2018లో గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సరితను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు తన తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో భార్యతో కలిసి షాబాద్‌లోని ఇంట్లో కాపురం పెట్టాడు. వారికి పరీక్షిత్ (4), దైవిక్షిత్ (2) పుట్టారు. మైనర్ బాలికపై కన్నేసి.. షాబాద్‌లో పక్కింట్లో నివసిస్తున్న ఓ కుటుంబంతో రాజ్‌కుమార్ సన్నిహితంగా మెలిగేవాడు. ఆ ఇంట్లో ఉండే బాలిక (17)పై కన్నేశాడు. శంషాబాద్‌లోని కాలేజీకి వెళ్లి వచ్చేటప్పుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆమె తండ్రిని మంచి చేసుకునేందుకు నిత్యం మత్తులో ముంచి తేల్చేవాడు. ఏడాది క్రితం బాలిక తండ్రి మరణించడంతో రాజ్‌కుమార్ అకృత్యాలకు అడ్డులేకుండాపోయింది. విషయం తెలియడంతో బాలిక తల్లి లక్ష్మి (38) పద్ధతి మార్చుకోవాలని రాజ్‌కుమార్‌ను పలుమార్లు హెచ్చరించింది. ఫలితం లేకపోవడంతో ఆరు నెలలుగా కూతుర్ని ఇంట్లోనే ఉంచింది. స్వయంగా తానే తీసుకెళ్లి వార్షిక పరీక్షలు రాయించింది. ఈ సమయంలో బాలికను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో మే 16న లక్ష్మి షాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 78, 351, 11, ఆర్/డబ్ల్యూ12 కింద కేసు నమోదు చేశారు. దీంతో రాజ్‌కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉండగా.. కొద్దిరోజుల తర్వాత రాజ్‌కుమార్ ముందస్తు బెయిల్ తెచ్చుకుని బయట తిరగడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో షాబాద్‌లోని ఇంటిని ఖాళీ చేసి, స్వగ్రామమైన దైవాలగూడకు వచ్చి రెండు నెలలుగా భార్య, పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. తనపై కేసుకు భార్య కూడా కారణమని.. తనపై పెట్టిన పోక్సో కేసుకు బాలిక కుటుంబ సభ్యులతో పాటు భార్య సరిత కూడా కారణమని భావించిన రాజ్‌కుమార్ ఆమెపై కూడా కక్ష పెంచుకున్నాడు. అందరినీ చంపేస్తానంటూ తరచూ భార్యతో అనేవాడు. శుక్రవారం రాత్రి బిర్యానీ ప్యాకెట్లు, బీరు బాటిళ్లు తీసుకుని దైవాలగూడలోని ఇంటికి చేరుకున్నాడు. పిల్లలకు బిర్యానీ తెచ్చానని భార్యకు చెప్పి స్వయంగా తినిపించాడు. కొద్దిసేపటి తర్వాత భార్యతో గొడవపడి కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు కుమారుల గొంతు కోసి మృతదేహాలను మంచంపై పడేశాడు. ఈ సమయంలో అరుపులు, కేకలు బయటకు వినిపించకుండా ఏసీ, కూలర్, టీవీ ఆన్‌చేసి ఉంచాడు. పీకలదాకా తాగి..బాలిక ఇంటికి వెళ్లి.. భార్యాపిల్లల హత్యల అనంతరం పీకల దాకా మద్యం తాగి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తన కారులో షాబాద్‌కు చేరుకున్నాడు. పీఆర్ఆర్ స్టేడియంలో కారును పార్కు చేసి స్టేడియం ప్రహరీ దూకి బాలిక ఇంటికి చేరుకున్నాడు. బాలిక తల్లి లక్ష్మి తలుపులు తెరవగా వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. ఈ అలికిడికి మంచంపై నిద్రిస్తున్న బాలిక నానమ్మ రుక్కమ్మ (60) అరవడంతో ఆమె గొంతుకోసి చంపాడు. అక్కడే ఉన్న బాలిక సోదరి (దివ్యాంగురాలు)ని మాత్రం వదిలేశాడు. రాత్రి 11.10 గంటల సమయంలో బాలిక జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లాడు. ఈ దృశ్యం ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది. బాలికను కారులో ఎక్కించుకుని తాను నివసించిన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న నాగరికుంట చెరువు వద్దకు తీసుకెళ్లాడు. కత్తితో బాలిక గొంతు కోసి హత్య చేశాడు. అంతకుముందు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు తెలిసింది. 11:40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రాజ్‌కుమార్.. తనపై పోక్సో కేసు పెట్టిన బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను చంపేశానని, భార్యా పిల్లల్ని కూడా చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికతో పాటు లక్ష్మి, రుక్కమ్మ మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, దైవాలగూడలోని భార్యాపిల్లల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే రాజ్‌కుమార్.. తొలుత బాలికతో పాటు ఆమె తల్లి, నాన్నమ్మను హత్య చేశాడని, ఆ తర్వాత దైవాలగూడలో భార్య, పిల్లలను హతమార్చాడని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 8712665324 నంబర్‌కు ఫోన్ చేయాలి: సీపీ హంతకుడు రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడని, ప్రత్యేక పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి విలేకరులకు చెప్పారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నజరానా అందజేస్తామని అన్నారు. నిందితుడి వివరాలు తెలిస్తే చేవెళ్లలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూం 8712665324 నంబర్‌కు ఫోన్ చేయాలని, లేదంటే వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు షాబాద్‌లోని బాలిక ఇంటికి చేరుకున్న రాజ్‌కుమార్..వరుసబెట్టి ఆమె తల్లి లక్ష్మి, నాన్నమ్మ రుక్కమ్మతో పాటు ఆ తర్వాత బాలికను చంపాడని చెప్పారు. అనంతరం దైవాలగూడకు వచ్చి భార్య, పిల్లలను హత్య చేశాడని తెలిపారు. నిందితుడిపై ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉండటంతోనే బెయిల్ వచ్చిందని వివరించారు. బాలిక తండ్రిని కూడా రాజ్‌కుమార్ చంపినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయన గుండెపోటుతోనే చనిపోయినట్లు వైద్యుల నివేదికను బట్టి తెలుస్తోందని సీపీ చెప్పారు. పోక్సో కేసు తర్వాత రాజ్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా నిర్లక్ష్య చూపారనే ఆరోపణల నేపథ్యంలో షాబాద్ సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. ఉలిక్కిపడిన షాబాద్ ఆరు హత్యలతో షాబాద్ మండలం ఉలిక్కిపడింది. స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, ఉరి తీయించాలని డిమాండ్ చేస్తూ బాలిక బంధువులు, గ్రామస్తులు షాబాద్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఇటు షాద్‌నగర్, అటు చేవెళ్ల నుంచి వచ్చే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆ రోడ్డు మార్గాలను మూసివేశారు. బాధితులతో మాట్లాడేందుకు వచ్చిన మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రా«థోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను చేవెళ్ల సమీపంలోని మల్కాపూర్ స్టేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం మధ్యాహ్నం షాబాద్ చేరుకున్నారు. బాలిక బంధువులను పరామర్శించారు. న్యాయం చేస్తామని చెప్పారు. ఆందోళన విరమించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన దివ్యాంగురాలైన బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. ఇలావుండగా ఆరుగురిని హత్య చేసిన అనంతరం రాజ్‌కుమార్ ఎర్రటి కారులో షాద్‌నగర్‌కు చేరుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం నందిగామ మండల పరిధిలోని చేగూరు శివారులో కారును వదిలేసి, శ్రీశైలం మార్గంలో వెళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ రూట్లోని సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాలికతో పాటు ముగ్గురి అంత్యక్రియలు చేవెళ్ల/షాబాద్: రాజ్‌కుమార్ చేతిలో హత్యకు గురైన బాలికతో పాటు ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మ అంత్యక్రియలను శనివారం రాత్రి షాబాద్‌లో నిర్వహించారు. రుక్కమ్మ చిన్న కొడుకు రాజు తల్లితో పాటు వదిన, అన్న కుమార్తెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా నిందితుడు రాజ్‌కుమార్ భార్యాపిల్లల మృతదేహాలు మాత్రం రాత్రి పొద్దుపోయే వరకు గ్రామానికి చేరలేదు. నిత్యం టార్చర్ చేసేవాడు.. ప్రేమిస్తున్నానని వెంట పడటంతో మా కుటుంబానికి ఇష్టం లేకపోయినా రాజ్‌కుమార్‌కు మా ఆడపడుచు సరితను ఇచ్చి పెళ్లి చేశాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమెను ఏనాడూ ప్రేమగా చూడలేదు. నిత్యం టార్చర్ చేసేవాడు. పిల్లలు పుట్టిన తర్వాత సరిత అందవిహీనంగా తయారైందని వేధించేవాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి పిల్లలముందే ఆమెను కొట్టేవాడు. మైనర్ బాలిక కోసం గడ్డి మందుతాగి ఆత్మహత్యకు కూడా యత్నించాడు. – మౌనిక, (సరిత ఆడపడుచు) నడిరోడ్డుపై ఉరి తీయాలి రాజ్‌కుమార్ మా కోడలు సరితను నమ్మించి గొంతుకోశాడు. ఆమె ఎంతో కష్టపడి చదువుకుంది. బీఈడీ పూర్తిచేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేసేది. అప్పట్లో ఆమెకు వచ్చిన మంచి సంబంధాన్ని కూడా చెడగొట్టాడు. పసిపిల్లల ప్రాణాలు తీసిన నరరూప రాక్షసుడు వాడిని అరెస్టు చేసి నడిరోడ్డుపై ఉరి తీయాలి. – ఆంజనేయులు (సరిత మేనమామ) అత్తమామలు కూడా పట్టించుకోలేదు మా చెల్లెలు సరితకు హైతాబాద్‌లో మంచి సంబంధం చూశాం. ఎంగేజ్మెంట్ కూడా చేశాము. కానీ రాజ్‌కుమార్ చెడగొట్టాడు. తప్పని పరిస్థితుల్లో అతనికే ఇచ్చి పెళ్లి చేశాము. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు అత్తమామలు కూడా సరితను కోడలిగా అంగీకరించలేదు. వంట చేసినా తినే వాళ్లుకాదు. తొలి కాన్పులో బిడ్డ పుట్టి చనిపోయింది. అప్పుడు కూడా మా చెల్లిని పట్టించుకోలేదు. ఆ తర్వాత పుట్టిన పిల్లలను చూడటానికి కూడా ఆసుపత్రికి రాలేదు. రాజ్‌కుమార్ కఠినంగా శిక్షించడంతో పాటు అతని తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలి. – సంజీవ, (సరిత సోదరుడు) -
షాబాద్ ఘటన.. పోలీసులపై గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, రంగారెడ్డి: షాబాద్ మండలం దైవాలగూడలో చోటుచేసుకున్న సామూహిక హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోక్సో కేసులో నిందితుడిగా అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్ ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ శనివారం ఉదయం షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి నినాదాలు చేశారు. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టలేదని, బాధిత కుటుంబానికి ఎలాంటి భద్రత కల్పించలేదని ఆరోపించారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా అతడి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసినా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.ఆరుగురి హత్యలకు షాబాద్ సీఐ, ఎస్సైల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయినప్పటికీ.. కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం, పైగా రెండు నెలల్లోనే అతను బయటకు రావడం చర్చనీయాంశంగా మారాయి. దీంతో పోలీసులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఒకే కుటుంబానికి చెందిన అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో, గ్రామ పెద్దలతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి బెయిల్, అనంతర పరిణామాలు, స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై కూడా విచారణ జరిపే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో బాధ్యతను పెంచాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధమే మహిళ హత్యకు దారితీసింది. మే 27న షాబాద్ పహిల్వాన్ చెరువులో పడి మృతి చెందిన ఓ మహిళ కేసును పోలీసులు మొదట అనుమానాస్పద ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసి విచారణ చేయగా ఇది హత్యగా తేలింది. సదరు మహిళతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తే హత్యచేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో షాబాద్ పోలీసులు సోమవారం ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పహిల్వాన్ చెరువులో మే 27న బైండ్ల భారతమ్మ(30) మృతదేహం లభించిన విషయం విదితమే. అయితే పోలీసులు అమె మృతికి సంబంధించిన విషయాలు తెలియకపోవటంతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా ఈ కేసులో ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్న షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్, అతనికి సహకరించిన కమ్మరి లక్ష్మీబాయి, స్నేహితుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. షాబాద్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్ 15ఏళ్లుగా చికెన్షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. కానీ ఇతనికి పెళ్లికి ముందు నుంచే మృతురాలు బైండ్ల భారతమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఈ విషయం నలుగురికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత నెల 22న ఆమె గపూర్‌కు పోన్ చేయటంతో ఆమెను షాబాద్‌కు రమ్మనాడు. షాబాద్‌లో అతనికి తెలిసిన కుమ్మరి లక్ష్మీబాయి ఇంటికి పిలిపించాడు. చదవండి: మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న 3 గ్రాముల పుస్తెను సహకరించినందుకు లక్ష్మీబాయి తీసుకుంది. మృతదేహాన్ని తన స్నేహితుడైన సయ్యద్ సాదుల్లా హుస్సేన్ సహాకారంతో గోనే సంచిలో పెట్టుకొని స్కూటర్‌పై తీసుకెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో పడేశాడు. కానీ పోలీసులు మృతురాలి ఫోన్‌కాల్ డాటా ఆధారంగా ఆరోజు ఆమె చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసు విచారించారు. దీంతో చివరిగా చేసిన ఫోన్ గపూర్ది కావటంతో అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
మహిళను బైక్‌పై ఎక్కించుకొని.. మద్యం తాగించి.. స్పృహ కోల్పోడంతో
సాక్షి, రంగారెడ్డి: నమ్మించి, మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా దొరికిపోయిన నిందితుడు.. ఇంటి అప్పు తీర్చేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, షాబాద్ సీఐ అశోక్ గురువారం తెలిపారు. షాబాద్ మండలం పోతుగల్‌కు చెందిన కామారెడ్డి జయమ్మ (40) ఈనెల 20న శంకర్పల్లి మండలం బుల్కాపూర్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కేశపల్లి మల్లారెడ్డి.. తానూ బుల్కాపూర్ వెళ్తున్నానని చెప్పి ఆమెను బైకుపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెకు మద్యం తాగించాడు. దీంతో జయమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చిన జయమ్మ ప్రతిఘటించింది. దీంతో చీరకొంగు మెడకు బిగించి హతమార్చాడు. తర్వాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కాళ్ల కడియాలు, పట్టాగొలుసులు తీసుకుని పరారయ్యాడు. కాగా, జయమ్మ భర్త జంగయ్య.. భార్య కనిపించట్లేదని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా, కేశపల్లి మల్లారెడ్డి ఆమెను బైకుపై తీసుకువెళ్తున్నట్టు కనిపించింది. దీంతో మల్లారెడ్డిని గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిట్లు ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్ మీడియాకు వెల్లడించారు. చదవండి: దారుణం: ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. ఆపై ఉరేసుకున్న తండ్రి -
గొర్రెలు, బర్రెలు కాదు..
సాక్షి, షాబాద్(చేవెళ్ల): బీసీ కార్పొరేషన్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్లో రుణాలకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్లో 5,47 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు నెలలోపు రుణాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేయడం కాదు, వారి అభ్యున్నతి కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. చదువుకున్న చదువులకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందూరి రాములు, జిల్లా కార్యదర్శి రాపోల్ నర్సింలు, నాయకులు సూద యాదయ్య, రామకృష్ణ, శ్రీశైలం, చందు, రమేష్, కృష్ణ, రామకోటి, శివ, తదితరులు ఉన్నారు. -
లయను కాపాడండి
కాచిగూడ: ఆ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు అప్పొసొప్పో చేసి రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.16 లక్షలు ఖర్చు చేస్తే పాప ప్రాణం నిలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన పి.కృష్ణస్వామి, కల్పన దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు లయ(6)కు చిన్నతనంలోనే అరుదైన వ్యాధికి గురైంది. ఆమెకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించేందుకు తమ దగ్గర డబ్బులు లేవని గురువారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిరుపేదలమైన తాము కూతురుని ఎలా కాపాడుకోవాలో తెలియక దాతల సహాయం కోసం వచ్చినట్లు చెప్పారు. రోజురోజుకీ పాప ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు తెలిపారన్నారు. వెంటనే చికిత్స చేయాలని అందుకు రూ.16 లక్షలు ఖర్చు అవుతాయన్నారు. తమ కుమారుడు సాయితేజ(4) బోన్ మ్యారోతీసి పాపకు సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారని, దాతలు డబ్బులు సమకూరిస్తే పాప బతుకుతుందని వేడుకున్నారు. ఇప్పటికే ఇంట్లోని వస్తువులు, బంగారం, పుస్తెలతాడు అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశామని, తమకు సహాయం చేసే వారు 9676541393, 9100785185 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు. -
షాబాద్ మండలాన్నిశంషాబాద్ జిల్లాలో కలపాలి
షాబాద్: షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేవరకు అఖిలపక్షం ఆధర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఎ.రవీందర్‌రెడ్డి, బీసీ సేన రాష్ర్ట అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్అండ్బి అథితి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేంత వరకు బంద్ ప్రకటిస్తామన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహార దీక్షలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేయిస్తామన్నారు. షాబాద్ మండల ప్రాంతం శంషాబాద్ కు 30 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. నిత్యం విద్యా, ఉద్యోగంకోసం శంషాబాద్‌కు ఎక్కువగా వెళ్తుంటారన్నారు. రైతులు ప్రతిరోజు శంషాబాద్ మార్కెట్‌కు నిత్యం కూరగాయలు, నిత్యవసర వస్తువుల కోసం వెళ్తుంటారని తెలిపారు. షాబాద్‌ను వికారాబాద్ జిల్లాల్లో కలిపితే పెద్దెత్తున ఉద్యమం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మంగలి శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు రాము, నరేందర్‌రెడ్డి, సర్పంచులు రవీందర్ నాయక్, శివకుమార్, మద్దూర్ మల్లేష్, కాంగెస్ నాయకులు తమ్మళి రవీందర్, అష్మత్ పాష, జనార్దన్‌రెడ్డి, పామెన నర్సింలు, మల్లేష్, జంగయ్య, మాణిక్యప్రభు, అఖిల పక్షం నాయకులు కర్రె శ్రీశైలం, హరిశంకర్, కిరన్, రాపోల్ నర్సింలు, మల్లేష్, శివకుమార్, తదితరులున్నారు. ప్రతాప్‌రెడ్డి, తదితరులున్నారు.


