breaking news
Second class Student
-
పదేళ్ల బాలుడిపై 150 దెబ్బలు
గోండా(యూపీ): రెండో తరగతి చదువుతున్న విద్యార్థి హోమ్‌వర్క్ చేయకపోతే ఎందుకు చేయలేదు? మర్చిపోయావా? నిర్లక్ష్యమా? ఇంకేదైనా కారణమా? అని ముందు ఆరా తీయాల్సిందిపోయి ఉన్నపళంగా బెత్తంతో విరుచుకుపడి బాలుడిని ప్రైవేట్ స్కూల్ టీచర్ చితకబాదిన వైనం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లిష్ టీచర్ ప్రఖార్ సింగ్ ఏకధాటిగా 150 సార్లు బెత్తంతో పిల్లాడిని కొట్టాడు. దెబ్బల ధాటికి పదేళ్ల పిల్లాడి కాళ్ల నిండా బెత్తం గాయాల బొబ్బలు తేలాయి. గోండా జిల్లాలోని కర్నేల్‌గంజ్ గ్రామ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఈ దారుణం జరిగింది. పిల్లాడిని ఇష్టారీతిగా కొట్టిన ఘటనలో టీచర్‌పై కేసు నమోదైంది. ఈ వివరాలను పిల్లాడి తండ్రి మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇంటికొచ్చిన పిల్లాడు కనీసం నడవలేకపోయాడు. కుంటుతూ రావడంతో ఏం జరిగిందని ఆరాతీశా. 105 సార్లకుపైగా టీచర్ కొట్టాడని మా అబ్బాయి చెప్పాడు. కాళ్లు మొత్తం వాచిపోయి బొబ్బలొచ్చాయి. కొట్టిన విషయం ఎవరికైనా చెబితే మళ్లీ కొడతానని టీచర్ బెదిరించాడు. ఏడ్వడం ఆపేయాలని మావాడికి టీచర్ బిస్కెట్లు కూడా ఇచ్చాడు. రెండో తరగతి విద్యార్థిని ఎవరైనా ఇంతలా కొడతారా? వెంటనే ఈ విషయమై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదుచేశా. తర్వాత వెంటనే పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చా’’ అని తండ్రి వెల్లడించారు. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదురావడంతో ఇంగ్లిష్ టీచర్‌ను విధుల నుంచి తప్పించామని ఎంఆర్జీ పాఠశాల ప్రిన్సిపల్ మీడియాకు స్పష్టంచేశారు. ‘‘భారతీయ న్యాయసంహితలోని 115(2), 351(3), 352 సెక్షన్ల ప్రకారం ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేశాం. కేసు దర్యాప్తు మొదలుపెట్టాం. ఈ అంశంలో ప్రత్యేక చట్టపర చర్యలు తీసుకుంటాం’’ అని కర్నేల్‌గంజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అభిషేక్ దబాఛా చెప్పారు. -
రెండో తరగతి విద్యార్థి అదృశ్యం
గుత్తి : పట్టణంలోని అగాపే కేర్ హోమ్‌లో నివాసముంటూ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎస్.అబ్దుల్ హఫీజ్ శనివారం అదృశ్యమైనట్లు అగాపే కేర్ హోమ్ (రైడ్స్) పీడీ జోసఫ్ ఆదివారం సీఐ ప్రభాకర్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
రెండో తరగతి విద్యార్ధిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన
-
చెంపలు వాసేలా కొట్టేసింది
ఒంగోలు (వలేటివారిపాలెం) : చిన్నారులకు ప్రేమగా పాఠాలు బోధించాల్సిన పంతులమ్మ సహనం కోల్పోయింది. ఎక్కాలు సకాలంలో రాయలేదన్న కోపంతో రెండో తరగతి విద్యార్థి చెంపలు వాసేలా కొట్టింది. ఈ సంఘటన వలేటివారిపాలెం మండలంలోని నూకవరం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొనుగోటి రాజు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలానే సోమవారం పాఠశాలకు వెళ్లాడు. కాగా, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు రెండో తరగతి విద్యార్థులు ఎక్కాలు రాయడానికి పది నిమిషాల సమయం ఇచ్చారు. రాజు సకాలంలో రాయలేకపోవడంతో ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయి తీవ్రస్థాయిలో ఆగ్రహంతో గట్టిగా చెంపదెబ్బలు కొట్టారు. దీంతో రాజు బుగ్గలు బూరెల్లా వాచిపోయూయి. టీచర్ చితకబాదడంతో భయాందోళన చెందిన రాజు.. ఆ తరగతి అనంతరం చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు వెతుక్కుంటూ పాఠశాలకు వచ్చారు. అక్కడ లేకపోవడంతో ఊరంతా గాలించారు. చివరకు పొలాల్లో కనిపించిన రాజు..అసలు విషయం చెప్పడంతో టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సదరు ఉపాధ్యాయురాలు గతంలో కూడా ఇదేవిధంగా వేరే విద్యార్థిని చితకబాదిందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రాజు తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


