breaking news
Samrat Choudhary
-
బీజేపీకి వార్నింగ్ బెల్స్.. సీఎం కుర్చీకే ముప్పు?
బీహార్ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక.. ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో ఆ పార్టీని ఓడిస్తూ జన సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా.. ఈ విజయాన్ని ముందుగానే బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా చిత్రీకరించిన పీకే.. ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు టార్గెట్ బంకీపూర్ సీటా? లేక బీహార్‌లో బీజేపీ నాయకత్వమా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.బంకీపూర్ అంటే బీజేపీకి సాధారణ నియోజకవర్గం కాదు. 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన బలమైన కోట. నితిన్ నబీన్ ఈ సీటును ఐదుసార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి అంత బలమైన సీటు కావడంతో.. మొదట బీజేపీ వర్గాల్లో ఈ ఎన్నికను పెద్ద సవాలుగా భావించలేదు. పైగా బీజేపీ శిబిరం పోటీని ‘నో కాంటెస్ట్’ అన్నంత ధీమాతో చూసింది. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి.. తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా పీకేకు భారీ బూస్ట్‌గా మారింది.అసలు ట్విస్ట్ ఇక్కడే..ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు. సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది సీఎం నాయకత్వానికి ప్రజల ఆమోదంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే.. ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాట్ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నది పీకే వ్యూహం. దీంతో, ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్ దాటి.. నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీహార్‌కు ‘సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్న’ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాట్ చౌదరినే రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు.అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కు ఉంది. బంకీపూర్ ఓటమి కేవలం సీఎం చౌదరికి సంబంధించినదేనా? లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యక్తిగత కంచుకోట కోల్పోవడమా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు రెండో కోణాన్నీ బలంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఓటమి సామ్రాట్ కంటే నితిన్ నబిన్ కుటుంబానికి, మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు కోల్పోవడానికే ఎక్కువ సంకేతమని అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బంకీపూర్‌లో గెలిచింది మరో సంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్ పార్టీనో కాదు. 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జన సురాజ్ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి.. బీజేపీకి చెందిన అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు. ఇది జన సురాజ్‌కు ఒక సీటు మాత్రమే కాదు.. ‘బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు’ అనే రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునే తొలి పెద్ద అవకాశంగా మారింది.ఆర్జేడీకి ఝలక్..మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు. బంకీపూర్‌లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంక్‌లో కొంత భాగం జన సురాజ్ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థపై పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే.. పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండింటికీ మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.అయితే. పీకే గెలిచింది ఒక సీటు మాత్రమే కావచ్చు.. కానీ ఆయన గెలిచిన చోటు మాత్రం బీజేపీకి అత్యంత బలమైన కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రచారంగా మలిస్తే? ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువతను ఆకర్షించగలిగితే? సంప్రదాయ కుల సమీకరణాలకు అతీతంగా ఓటర్లను కూడగట్టగలిగితే? అప్పుడు బీహార్‌లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. మూడో శక్తిగా జన సురాజ్ ఎదగడం మొదలైతే.. అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుంది. -
బిహార్ బీజేపీ తొలి సీఎం చదువు, నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
సాక్షి,పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత,సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి బిహార్‌లో తొలి ముఖ్యమంత్రి ఈయనే కావడం విశేషం. ఆయనతో పాటు, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే నూతన సీఎం సమ్రాట్ చౌదరి ఆస్తులు, విద్యార్హతలపై నెట్టింట ఆసక్తి నెలకొంది.ఆస్తుల వివరాలుసమ్రాట్ చౌదరి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన రూ.9.29 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా, ఆయన సతీమణి మమతా కుమారి రూ.2.01 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. వీరిద్దరి చర, స్థిరాస్తుల మొత్తం విలువ కలిపి మొత్తం రూ.11.31 కోట్లకు పైమాటే. గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయన చరాస్తులు మరియు స్థిరాస్తుల వివరాలను అందించారు. దీని ప్రకారం తారాపూర్ ఎమ్మెల్యే అయిన సమ్రాట్ చౌదరి కుటుంబం వద్ద రూ. 1,71,550 నగదు ఉంది. అఫిడవిట్లో తనకు ఎలాంటి అప్పులు లేవని చౌదరి ప్రకటించారు.pic.twitter.com/Fy8rLbcc6T— Samrat Choudhary (@samrat4bjp) April 15, 2026 ఈ దంపతుల పేరిట బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.27 లక్షలు ఉండగా, ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల విలువైన బంగారం ఉంది. అంతేకాకుండా, వీరి వద్ద రూ.75,000 విలువైన వెండితో పాటు, షేర్లు, బాండ్లు , మ్యూచువల్ ఫండ్లలో రూ.32 లక్షల విలువైన పెట్టుబడులు కూడా ఉన్నాయి. విద్యార్హతలు, వివాదాలుసమ్రాట్ చౌదరి విద్యా అర్హతలు చర్చనీయాంశంగా మారాయి. బిహార్‌లోని ముంగేర్ జిల్లా, లఖన్‌పూర్ గ్రామంలో 1968 నవంబర్ 16న జన్మించారు. ఆయన తండ్రి శకునీ చౌదరి కూడా బిహార్‌లో సీనియర్ నాయకుడు. రికార్డుల ప్రకారం ఆయన తమిళనాడులోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ప్రీ-ఫౌండేషన్ కోర్సు (PFC) పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ఆధారాలు, ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్లు (కొన్నిసార్లు) సాహిత్యంలో డాక్టరేట్ (డి.లిట్.) ఉందని పేర్కొంటుండగా, ప్రశాంత్ కిషోర్ వంటి ప్రతిపక్ష నాయకులు ఆయన పదో తరగతి పరీక్షలోకూడా ఉత్తీర్ణుడు కాలేదని ఆరోపించారు. -
బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం
-
బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
పట్నా: బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్‌కు ఆయన రాజీనామా సమర్పించారు. క్యాబినెట్‌ను రద్దు చేస్తూ నితీశ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు నితీశ్. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేసిందని నితీశ్ కుమార్ రాజీనామా తర్వాత ఎక్స్‌లో తెలిపారు. “హిందువులు, ముస్లింలు, ఉన్నత వర్ణాలు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు.. ఇలా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేసింది. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రతి రంగంలో అభివృద్ధి పనులు జరిగాయి. మహిళలు, యువత కోసం ఎంతో చేశాం” అని నితీశ్ చెప్పారు. కాగా, నితీశ్ కుమార్ మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. నితీశ్ కుమార్ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశం. సీఎంగా సామ్రాట్ చౌదరి? బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15న) బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. నితీశ్ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా ఇటీవల మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు.


