Rajshri Deshpande
-
కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్‌పాండే. తాను కేన్సర్‌తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాజవ్రీ దేశ్పాండ్కు మార్చిలో గ్రేడ్1 రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారామె.పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..ఈ కేన్సర్ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్‌కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..ఈ కేన్సర్‌ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్‌ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. తన ఫ్యామిలీ డాక్టర్ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్‌పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్ మ్యాన్ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్') -
రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ 'సేక్రెడ్ గేమ్స్' నటి
బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్‌పాండే రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ ప్రారంభదశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇన్ఫిల్టరేటింగ్ డక్టల్ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్ 1లో ఉంది. రొమ్ము క్యాన్సర్ఇప్పుడు మీరిది చదువుతున్నారంటే ఈ వ్యాధి గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పేందుకు ధైర్యం కూడదీసుకున్నట్లే లెక్క! నేను రొటీన్ చెకప్‌కు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తూ ప్రారంభం దశలోనే గుర్తించగలిగాం. లెక్కలేనన్ని టెస్టులు, శస్త్రచికిత్సలు.. ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపిస్తోంది. కానీ మీ ప్రేమాభిమానాలే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాయి. భయం పటాపంచలుసర్జరీ తర్వాత అమ్మానాన్న ముఖం చూడగానే నాలో భయం పటాపంచలై కొత్త శక్తి ప్రవహించింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వు స్ట్రాంగ్ లేడీవి.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.కెరీర్రాజశ్రీ దేశ్‌పాండే తలాష్ (2012) చిత్రంతో బాలీవుడ్లో తన కెరీర్ ఆరంభించింది. కిక్, మామ్, ద స్కై ఈజ్ పింక్, జోరం వంటి చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కుచ్ తో లోగ్ కహేంగే, 24: ఇండియా సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది. సేక్రెడ్ గేమ్స్ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో విశేషమైన పాపులారిటీ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) చదవండి: నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి -
ఓటీటీలో నెంబర్‌వన్ సిరీస్.. కానీ దారుణమైన ట్రోల్స్: నటి
బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. 2018లో ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఐఎండీబీ ప్రకటించిన ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సిరీస్ తర్వాతే మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్-5లో నిలిచాయి. అయితే ఈ సిరీస్‌లో నటించిన మరో నటి రాజశ్రీ దేశ్‌పాండే. 'సేక్రెడ్ గేమ్స్'లో సుభద్ర పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో భార్యగా నటించింది. అయితే ఈ సిరీస్‌లో చాలా ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంతో విమర్శలకు గురైంది. గతేడాది ట్రయల్ బై ఫైర్ అనే వెబ్ సిరీస్‌తోనూ అభిమానులను అలరించింది. అయితే తాజాగా ఆమె నటించిన మరాఠీ చిత్రం సత్యశోధక్ జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. నీలేష్ జలంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె సావిత్రి జ్యోతిబాయి పూలే పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజశ్రీ.. సేక్రెడ్ గేమ్స్ రిలీజయ్యాక వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్‌పై స్పందించారు. రాజశ్రీ దేశ్‌పాండే మాట్లాడుతూ..''సేక్రెడ్ గేమ్స్‌లో నా సీన్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతే కాకుండా మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేశారు. ఆ సిరీస్ తర్వాత నాపై వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నన్ను పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. నేను రైతులు, సామాజిక సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడా. కానీ వాటి గురించి ఎవరూ రాయలేదు. ఇలాంటి వాటికే మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ విషయం నాకు చాలా బాధేసింది' అని తెలిపింది. Victory!🌟#RajshriDeshpande shares some beautiful words after winning big at the #FilmfareOTTAwards2023, co-powered by Hyundai Motor India, Ajio and Film Bandhu - Government of Uttar Pradesh, in association with Fura Gems and ITC Fiama.@AJIOLife @FiamaIndia pic.twitter.com/lhwmUSWpo9 — Filmfare (@filmfare) November 27, 2023 View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) -
అడగకూడని ప్రశ్న!
నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో మీకు, నవాజుద్దీన్ సిద్ధిఖీకి మధ్య సెక్స్ సీన్స్ చాలా ఉన్నాయి. ఒక పోర్న్‌స్టార్‌లా నటించారు మీరు. చెయ్యనని చెప్పలేకపోయారా? విలువలకన్నా డబ్బే ముఖ్యం అనుకున్నారా?! రాజశ్రీ దేశ్‌పాండే : డబ్బు సంగతి అలా ఉంచండి. అది ఎప్పటికీ ముఖ్యమే. ‘చెయ్యనని చెప్పలేకపోయారా’ అన్నారు! అంటే.. కథలో ఉన్నదాన్ని చెయ్యనని చెప్పమంటున్నారా? నవల దీనికి ఆధారం. విక్రమ్ చంద్ర అద్భుతంగా ఆ నవలని మలిచినప్పుడు, వరుణ్ గ్రోవర్ అద్భుతంగా ఆ నవలకు మాటలు రాసినప్పుడు, అనురాగ్ కాశ్యప్ అద్భుతంగా ఆ నవలని డైరెక్ట్ చేస్తున్నప్పుడు.. అందులో యాక్ట్ చేస్తున్న నేను కూడా అద్భుతంగానే చేయాలి కదా! ఇదెందుకు ఆలోచించరు మీరు? థీమ్‌ని, యాక్టర్స్‌ని వేర్వేరుగా ఎందుకు చూస్తారు? ఇందులో నవాజుద్దీన్ భార్యని నేను. మా ఇద్దరి మధ్య కొన్ని బెడ్ సీన్స్ ఉన్నాయి. ఐటమ్సాంగ్లా చురుకు పుట్టించడం కోసం పెట్టిన సీన్స్ కావవి. కథకు అవసరమైనవి. అప్పుడు నేను నవాజ్‌కు భార్యగానే నటించాలి తప్ప రాజశ్రీ దేశ్పాండేలా దూరంగా జరిగిపోతే డైరెక్టర్ చెప్పాలనుకున్నది చెప్పగలడా? మీకో సంగతి చెప్పాలి. లైఫ్‌లో నా గోల్ ఒక్కటే.. గ్రామాల్లో స్కూళ్లు, మరుగుదొడ్లు కట్టించడం! కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా నా మనసు గ్రామాల్లోనే ఉంటుంది. నవాజుద్దీన్ పక్కలో ఉన్నట్లు నేను మీకు కనిపిస్తాను కానీ ఎక్కడున్నా నాకు కనిపించేది నా గోల్ ఒక్కటే. గ్రామాల్ని చదివించి, గ్రామాల్ని ఆరోగ్యంగా ఉంచడం. ఇందుకోసం నటిగా నేను సక్సెస్ కావడం కూడా అవసరమే కదా! -
బూతు సైట్లలో నటి క్లిప్ హల్చల్
ఓ బోల్డ్ సీన్లో నటించినందుకుగానూ నటి రాజశ్రీ దేశ్‌పాండేకు ఊహించని షాక్ తగిలింది. వెబ్ సిరీస్ సాక్రెడ్ గేమ్స్‌లో ఓ సీన్లో ఆమె టాప్‌లెస్‌గా నటించారు. అయితే ఆ సీన్‌ను అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసిన కొందరు.. పోర్న్ నటిగా ఆమె పేరును ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె మండిపడుతున్నారు. ‘అడల్డ్ స్టార్.. బోల్డ్ యాక్టర్... ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. కథను అనుగుణంగా ఆ సీన్ అవసరం. అందుకే అలా నటించా, ఆ మాత్రానికే నన్నో పోర్న్ నటిగా ప్రచారం చేయటం దారుణం. అలాగనీ వారికి బదులు చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్‌సీన్లు నటించే క్రమంలో ఇలాంటి విమర్శలు సహజం. పట్టించుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. సాక్రెడ్ గేమ్స్‌లో నవాజుద్దీన్ వైఫ్ క్యారెక్టర్లో నటించిన రాజశ్రీ.. ఓ సీన్లో టాప్ లెస్‌గా నటించారు. ఈ నేపథ్యంలో పోర్న్ సైట్లలో సైతం ఆ సీన్ దర్శనమివ్వటం గమనార్హం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉందంటూ సెన్సార్ బోర్డుకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. అడల్ట్ కంటెంట్.. పచ్చి బూతులు


