breaking news
property purpose
-
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
‘బావ’మరిదినే చంపేశాడు
- ఆస్తి కోసమే హత్య - 15 రోజలకు వీడిన మిస్టరీ జ్యోతినగర్: ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నచందంగా ఆస్తికోసం స్వయాన బావమరిదినే హతమార్చి.. అనక రైలు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. పదిహేను రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఎన్టీపీసీ పోలీసులు చేధించి నిందితుడి అరెస్టు చూపించారు. ఆ వివరాలను ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం గోదావరిఖని డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ నారాయణ విలేకరులకు వెల్లడించారు. రామగుండం మండలం లక్ష్మీపురానికి చెందిన మిట్టపల్లి రవీందర్రావు కూతురు శిరీష, కొడుకు చంద్రశేఖర్‌రావు సంతానం. శిరీషను సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన కోదాటి సంపత్రావుకిచ్చి వివాహం చేశారు. అయితే రవీందర్‌రావుకు గ్రామంలో 20 గుంటల విలువైన స్థలం ఉండడంతో దానిని ఎలాగైనా చేజిక్కుంచుకోవాలనుకున్నాడు సంపత్‌రావు. దీనికి చంద్రశేఖర్‌రావు అడ్డుగా ఉన్నాడని భావించి ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నాడు. కొద్దిరోజులుగా బావమరిదితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి 16న ఎన్టీపీసీ ప్రాంతంలో విందు చేసుకుందామని బావమరిదిని పిలిపించుకున్నాడు. ఇద్దరు కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌రావును మల్యాలపల్లి చెట్ల పొదలలోకి తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అదేనెల 17న రవీందర్రావు తన కుమారుడు కనిపించడం లేదని ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సంపత్‌రావు మూడు రోజుల అనంతరం చెట్ల పొదల్లో కుళ్లిపోయిన చంద్రశేఖర్ మృతదేహాన్ని రైలుపట్టాలపై పడేశాడు. అదేనెల 24న రైల్వేపోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి 25న లుక్అవుట్ నోటీస్ ద్వారా సమీప పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. అప్పటికే చంద్రశేఖర్‌రావు మిస్సింగ్ కేసు ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో నమోదు కావడంతో వారు రవీందర్రావు కుటుంబ సభ్యులను పిలిపించి శవాన్ని చూపించారు. వారివెంట ఏమీ ఎరగనట్లు సంపత్‌రావు కూడా వెళ్లాడు. ఆనవాళ్లను చూసి చంద్రశేఖర్‌గా గుర్తించారు. అయితే రైలు ఢీకొన్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రవీందర్రావు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ ప్రారంభించారు. చంద్రశేఖర్‌రావు సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ లిస్టు ఆధారంగా సంపత్‌రావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆస్తి కోసమే బావమరిదిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ వివరించారు. అతని నుంచి సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులుగా గుర్తించామని, వారు పరారీలో ఉన్నారని వివరించారు. హత్యకేసును ఛేదించిన సీఐ నారాయణ, ఎస్సైలు సాగర్, లక్ష్మయ్య కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, సుధాకర్, అశోక్, హోంగార్డు మీస శ్రీనివాస్‌ను డీఎస్పీ అభినందించారు.


