By Poll Elections
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, తాడేపల్లి : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ కేడర్ ఎదురొడ్డి పోరాడింది. అక్రమ కేసులు, కిడ్నాపులు, దాడులను ఎదుర్కొని వైఎస్సార్సీపీ గెలిచింది. రాష్ట్రంలో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకంగా 32 పదవులను కైవసం చేసుకుంది. వాస్తవానికి ఆ 53 పదవులూ గతంలో వైఎస్సార్‌సీపీవే. అయితే, పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది. రెడ్‌బుక్ అమలు చేసి గెలవటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. అన్నిటినీ ఎదర్కొని ధైర్యంగా వైఎస్సార్సీపీ కేడర్ నిలిచింది. దీంతో టీడీపీ కేవలం తొమ్మిది స్థానాల్లో గెలుపును సరిపెట్టుకుంది. ఆ గెలుపును కూడా వైఎస్సార్సీపీ సభ్యులను తమవైపు తిప్పుకుని ఆ గెలుపుని తమ ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్యులైన బీజేపీ, జనసేనలు పోలీసులను ప్రయోగించి చెరో ఎంపీపీని కైవసం చేసుకున్నాయి.కోరం లేక 10 చోట్ల ఎన్నికలు వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కేడర్ పోరాట స్పూర్తికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పది నెలల్లోనే మోసకారి ప్రభుత్వంపై ఇది తిరుగుబాటుగా ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. -
ఉప ఎన్నికల్లో గెలుపు మాదే.. తెలంగాణలో బైపోల్స్ ఖాయం
సాక్షి, సిద్దిపేట జిల్లా: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి తలసాని శశ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశాం.త్రాగు నీరు,వసతి గదులు,బంగారు కిరీటం వంటి అనేక విధాలుగా మల్లన్న ఆలయం అభివృద్ధి చేశాం. కేసీఆర్ హయాంలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టే గతంలో సుమారు ఐదు కోట్లు ఉన్న ఆదాయం .. ఇప్పుడు గణనీయంగా సుమారు 20కోట్లకు పైగా చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్న రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు,420హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ అయిపోయింది. ఇకపై ప్రజల ఇబ్బందులపై శ్రద్ధ చూపాలి.కులగణనపై ఏ కుల సంఘాల నాయకులు సంతృప్తి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం మబ్బే పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ విధానాలను అన్ని గమనిస్తున్నారు. రాష్ట్ర జనాభా 4కోట్లకు పైగా జనాభా ఉంటే ప్రభుత్వం 3కోట్ల 70లక్షలుగా చూపిస్తుంది. కులగణనపై హడావిడిగా అసెంబ్లీలో చేయాల్సి తీర్మానం చేయాల్సిన అవసరం లేదు.గతంలోనే మాజీ సిఎం కేసీఆర్ అసెంబ్లీలో కులగణనపై తీర్మానం ప్రవేశ పెట్టారు. మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టీ చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బిసి సొరంగం ఘటనపై ఎవరు భాధ్యత వహిస్తారు. నోరు ఉందిగా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. కేసీఆర్ దూరదృష్టి తోనే ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారు.అన్నివర్గాల ప్రజలను కదిలిస్తే ఏ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేసింది వాళ్ళే చెబుతారు. న్యాయస్థానం తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం,ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. -
యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్ఎస్ఎస్!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ భారీ ఎదురుదెబ్బ నుంచి బీజేపీ పాఠం నేర్చుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌తో సమన్వయంతో పనిచేస్తోంది. ఇండియా కూటమి కులాధారిత సామాజిక న్యాయ రాజకీయాన్ని హిందూత్వ కార్డుతో ఢీ కొట్టనుంది. ‘ఏక్ హై తో సేఫ్ హై ’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) నినాదాన్ని వచ్చే ఐదు రోజులు విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రయాగ్‌రాజ్‌లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో నిర్ణయించారు. సమాజ్‌వాదీ పార్టీ తెరపైకి తెచ్చిన పీడీఏ (పీడిత్, దళిత్, ఆదివాసీ) ఫార్ములాను ఎదుర్కొనే వ్యూహాలపై భేటీ చర్చించింది. హిందూత్వ అజెండాకు పదును పెట్టాలని సంఘ్ నొక్కి చెప్పింది. ‘బటేంగేతో కటేంగే’ (విడిపోతే చెల్లాచెదురవుతాం) అన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత, ఓబీసీ ఓటర్ల మధ్య విభజనకు యత్నాలకు చెక్ పెట్టాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. -
సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి
జైపూర్ : పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై (ఎస్డీఎం)పై దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్ బూత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్‌డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరిపై దాడి చేశారు. ఎస్డీఎం అమిత్ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్ మీనాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబెర్, రామ్‌గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. मैं देवली उनियारा से नरेश मीणा का समर्थन कर रहा था परंतु आज जिस प्रकार का गंदा रवैया उनके द्वारा देखा गया वह शर्मनाक है।@NareshMeena__ की अभी कोई हैसियत नहीं है कि वह एक एसडीएम के ऊपर हाथ उठाएं, यह लोकतंत्र व भारतीय प्रशासन पर कलंक है। एकतरफ देश की सबसे कठिन परीक्षा देकर आया एक… pic.twitter.com/urAxAjR3BI— Priyanshu Kumar (@priyanshu__63) November 13, 2024 -
వయనాడ్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Updates వాయనాడ్‌లో సాయంత్రం 6 గంటల వరకు 64.27% ఓటింగ్ నమోదైంది. వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. వాయనాడ్ నియోజకవర్గంలో 64.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇది 72.92 శాతంగా ఉంది.కలపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 65.01%, సుల్తాన్ బతేరిలో 62.10%, మనంతవాడిలో 63.48%, తిరువంబాడిలో 66.05%, ఎర్నాడులో 68.97%, నిలంబూరులో 61.46%, వండూరులో 64.01% పోలింగ్ నమోదైంది. వయనాడ్‌లో పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.వాయనాడ్ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 1 గంటల వరకు 40% పైగా ఓటింగ్ నమోదైందివాయనాడ్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34.38 శాతం పోలింగ్ నమోదైంది#WayanadElection | Chanda, an 80-year-old woman of the Kallumala tribal settlement, after casting her vote at a booth at Meppadi in #Wayanad #Byelections2024 📸E.M. Manoj pic.twitter.com/PPDIf8unGL— The Hindu - Kerala (@THKerala) November 13, 2024 ఉదయం 11 గంటల వరకు వయనాడ్‌లో 27.04 శాతం పోలింగ్ నమోదైంది. #JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 కేరళ: వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు వాయనాడ్‌లో 13.04 శాతం ఓటింగ్ నమోదైంది.#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారుషిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు#WATCH | | Karnataka | BJP leader and Former CM Basavaraj Bommai casts his vote at a polling booth in Shiggaon, as voting in bypoll to the assembly constituency is underwayHis son Bharath Bommai is the BJP candidate for bypoll to the Shiggaon assembly constituency pic.twitter.com/x2ta1ZaFDw— ANI (@ANI) November 13, 2024 కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను తిరిగి చెల్లించడానికి, వారి కోసం పని చేయడానికి తమ ప్రతినిధిగా ఉండటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నా #WATCH | Kerala: Congress candidate for Wayanad Lok Sabha by-elections Priyanka Gandhi Vadra says, "My expectation is that the people of Wayanad will give me the chance to repay the love and affection they have shown and to work for them and to be their representative. I hope… pic.twitter.com/LYg9Sgg4OE— ANI (@ANI) November 13, 2024 రాజస్థాన్: దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మురారీ లాల్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.దౌసా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి దీనదయాళ్ బైర్వా, బీజేపీ నుంచి జగ్మోహన్ మీనాను బరిలోకి దిగారు.#WATCH | Dausa, Rajasthan: Congress MP from Dausa Murari Lal Meena casts his vote for the Dausa Assembly by-election.Congress has filled Deendayal Bairwa from the Dausa assembaly seat. BJP has fielded Jagmohan Meena from this seat. pic.twitter.com/0qtmoLyimy— ANI (@ANI) November 13, 2024 కేరళవయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలకు అట్టడుగు స్థాయిలో పని చేయగల, పార్లమెంటులో తమ సమస్యలను పరిష్కరించగల నేత కావాలి. కిట్లు, డబ్బు, మద్యం, అన్నీ అందించి ఈసారి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయం కాంగ్రెస్‌కు ఉంది#WATCH | Kerala: BJP candidate from Kerala's Wayanad Lok Sabha constituency, Navya Haridas says, "... People of Wayanad need a person who can work with them at the grassroots level and who can address their issues in Parliament and find solutions. Congress is trying to influence… pic.twitter.com/2TjyrKKiVx— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్:బుద్ని ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.సెహోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికే చౌహాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Sehore: Kartikey Chouhan, son of Union Minister Shivraj Singh Chouhan shows his inked finger after casting his vote at a polling station in Sehore for Budhni by-elections. Kartikey Chouhan says "I would like to request everyone to come out and cast their votes. There… pic.twitter.com/FUrPIsYGur— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఓటు వేయడానికి కర్ణాటకలోని చన్నపట్నాలోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు.ఎన్డీయే తరఫున ఈ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ నేత నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీ యోగేశ్వర్ పోటీలో ఉన్నారు. #WATCH | Karnataka: People queue up at a polling station in Channapatna, Karnataka to vote for Channapatna Assembly by-electionsNDA has fielded JDS leader Nikhil Kumaraswamy from this seat; five-time MLA CP Yogeshwar is contesting against him on a Congress ticket pic.twitter.com/YO5DLC32Cp— ANI (@ANI) November 13, 2024 కేరళపాలక్కాడ్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్: పశ్చిమ్ మేదినీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శ్రీతికోన అరబింద హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లో ఉన్నారు. కేరళ:వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు. ఛత్తీస్‌గఢ్:రాయ్‌పూర్ సిటీ సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.బీజేపీ మాజీ ఎంపీ, మేయర్ సునీల్‌కుమార్ సోనీని, కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆకాశ్ శర్మను పోటీలో ఉన్నారు. #WATCH | Chhattisgarh: Voting underway for Raipur City South Assembly by-elections BJP has fielded Sunil Kumar Soni, a former MP and mayor, while Congress has fielded Akash Sharma, the president of the Youth Congress state unit. pic.twitter.com/KEDX8M4but— ANI (@ANI) November 13, 2024 అస్సాం:సమగురి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటు వేయడానికి ప్రజలు నాగాన్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Assam: People queue up at a polling station in Nagaon to vote for the Samaguri Assembly by-polls. pic.twitter.com/XH1fLEZPPu— ANI (@ANI) November 13, 2024 కేరళవాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు వాయనాడ్‌లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Kerala: People queue up at a polling station in Wayanad to vote for the Wayanad Lok Sabha by-polls pic.twitter.com/lBF0ykyJNn— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్: షియోపూర్ జిల్లాలోని బుద్ని అసెంబ్లీలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.పోలింగ్ స్టేషన్ నంబర్ 170 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల కొత్త భవనం (విజయపూర్) వద్ద పోలింగ్ ప్రారంభమైంది.#WATCH | Madhya Pradesh: Voting for the by-election to be held today in the Budhni assembly of Sheopur district. Preparations underway at polling station number 170 Government Higher Secondary School New Building Vijaypur. pic.twitter.com/SopzxUBWBH— ANI (@ANI) November 13, 2024 కేరళలో వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారుఇక్కడ 14 లక్షల మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఈ రోజు(బుధవారం) 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్‌లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్‌లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
Priyanka Gandhi: సొంతబిడ్డల్లా సంరక్షిస్తా
వయనాడ్(కేరళ): కేరళలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యరి్థగా బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. పిల్లల ఆలనాపాలనా తల్లి ఎంత శ్రద్ధగా, జాగ్రత్తగా చూస్తుందో అదేరీతిలో తాను పౌరుల బాగోగులను పట్టించుకుంటానని ప్రియాంక వ్యాఖ్యానించారు. మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలాంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అకంపదం, పొథుకల్లు పట్టణాల్లో ప్రియాంక ప్రసంగించారు. ‘‘గెలిపించి నాకొక అవకాశం ఇస్తే మీ సమస్యలపై ఒక్క పార్లమెంట్లోనేకాదు వేర్వేరు సందర్భాల్లో ప్రతి ఒక్క భిన్న వేదికపై పోరాడతా. గతంలో గెలిపించిన రాహుల్‌పై వయనాడ్ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నన్ను గెలిపిస్తే నా కుటుంబానికి ఇంత మద్దతుగా ఉన్న మీకందరికీ సాయపడతా’’అని ఓటర్లునుద్దేశించి అన్నారు. ‘‘మోదీ ప్రభు త్వం సాయం అందక వయనాడ్‌లోని కొండలు, గ్రామీణ ప్రాంత రైతులు, చిరువ్యాపారులను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలే ఇందుకు కారణం’’అని అన్నారు. వయనాడ్ స్థానానికి నవంబర్ 13వ తేదీన పోలింగ్ జరగనుంది. -
బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత
కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పారీ్టకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచి్చందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ ‘ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)’ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. ‘స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు’ అని మమత అన్నారు. మార్పునకు సంకేతం: కాంగ్రెస్ బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కారి్మకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు. -
7 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ముగిసిన పోలింగ్
Updates..👉ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 👉పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. 👉ఇక, సాయంత్రం ఐదు గంటల వరకు బెంగాల్ ఉప ఎన్నికల్లో 62.71 శాతం పోలింగ్ నమోదైంది. 👉ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.👉బీహార్‌లోని రూపాలి, రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్ మానిక్తలా (పశ్చిమబెంగాల్లో), విక్రవాండి (తమిళనాడు), అమర్‌వార (మధ్యప్రదేశ్), బద్రీనాథ్, మంగ్లార్ (ఉత్తరాఖండ్‌లో), జలంధర్ వెస్ట్ (పంజాబ్)..డెహ్రా, హమీర్పూర్, నలాఘర్ (హిమాచల్ ప్రదేశ్)లో పోలింగ్ కొనసాగుతుంది.👉ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీలకు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జూలై 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. #WATCH | Uttar Dinajpur, West Bengal: BJP candidate from Raiganj assembly bypolls, Manas Kumar Ghosh casts his vote at a polling booth, in Raiganj.By-election is being held on 4 assembly seats of West Bengal including the Raiganj assembly seat. pic.twitter.com/uZEBJifcAK— ANI (@ANI) July 10, 2024 -
ఇంకా తేలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం
-
జైమల్లన్న, జై రాకేశ్‌రెడ్డి, ఐ లవ్యూ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసే సమయంలో కొందరు అత్యుత్సాహంతో నినాదాలు రాయగా, ఇంకొందరు ఇతర అభ్యర్థుల ఫొటోలు నలిపేయడం, బ్యాలెట్ పేపరు వెనుక అంకెలు వేయడం, మరికొందరు ఐలవ్యూ అంటూ రాశారు. చెల్లని ఓట్లు 7.69 శాతం వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 7.69% ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 4, 63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 3,36,013 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొందరి అవగాహన రాహిత్యం, అత్యుత్సాహం కారణంగా 25, 824 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. 3,10,189 చెల్లిన ఓట్లుగా అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి రౌండ్లో అధిక సంఖ్యలో చెల్లుబాటుకాని ఓట్లు బయటపడ్డాయి. కొందరు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయకుండా ఇతర ప్రాధాన్యత ఓట్లు వేయడం, టిక్కులు పెaట్టడం చేశారు. బ్యాలెట్ పేపరుపై ఇష్టానుసారంగా రాతలు బ్యాలెట్పేపర్లపై ప్రాధాన్యతక్రమంలో అంకెలు మాత్రమే వేయాలి. ఇతర ఎలాంటి రాతలు రాయొద్దని ఎన్నికల అధికారులు పలుమార్లు చెప్పారు. అయినా అవేమీ పట్టించుకోకుండా బ్యాలెట్ పేపర్లపై కొందరు జైమల్లన్న, జైరాకేశ్రెడ్డి అంటూ రాశారు. ఓ పట్టభద్రుడైతే బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థి ఫొటో కట్ చేసుకుపోయాడు. మరికొందరు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ వెనుక అంకెలు వేయగా, మరికొందరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో ప్రాధాన్యత ఓటు వేశారు. కొందరు పట్టభద్రులు ఒక అడుగు ముందుకేసి ఐలవ్యూ అంటూ రాసినట్టు తెలిసింది. -
TG: ‘మండలి’ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, సాక్షి: నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్.. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్లగొండ కలెక్టరేట్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. -
యెల్లో బ్యాచ్ ఏడుపే.. వైఎస్సార్సీపీ ఎదుగుదల
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తాజా గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్సీపీ మద్దతు దారులు గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. ► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. ► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. ► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► ఎన్టీఆర్ జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. ► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు. ► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. ► నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► వైఎస్సార్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పరాభవం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. -
ByPolls: ఉప ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ
ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడ్డాయి. అయితే.. ఈ ఫలితాల్లోనూ కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. పంజాబ్ లోని జలంధర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూ విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ మరణంతో జలంధర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిపారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌కు పెద్దదెబ్బ పడినట్లయ్యింది. ఇక ఒడిశాలోని జార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేడీ (బిజూ జనతాదళ్) విజయం సాధించింది. బీజేడీ అభ్యర్థి దీపాలీ దాస్ గెలిచారు. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని బిజూ జనతాదళ్ నిలబెట్టుకుంది. ఇక, ఉత్తరప్రదేశ్‌లో సువార్, ఛన్బే అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా అప్నాదళ్ (సోనేలాల్)నే విజయం వరించింది. అప్నాదళ్.. అక్కడ అధికార బీజేపీకి భాగస్వామిగా ఉంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజామ్ ఖాన్ తనయుడు అబ్దుల్లా అజామ్ ఖాన్ కు కోర్టు 15 ఏళ్ల నాటి కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో సువార్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఛన్బే నియోజకవర్గంలో రింకీ కోలే గెలిచారు. -
ప్రచారం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు: శివసేన నాయకుడు
ముంబై: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సచిన్ భోంస్లేపై దాడి జరిగింది. ఈ ఘటన పూణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భోంస్లే తెలిపిన వివరాల ప్రకారం..‘ఉప ఎన్నికల కోసం చించ్వాడ్ ప్రాంతంలో ఎన్సీపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాం. అంతలో బీజేపీ కార్యకర్తలు నేరుగా వచ్చి మమ్మల్ని కొట్టారు. వారితో నాకు వ్యక్తిగత వాదనలు లేవు. గతంలో బీజేపీ అభ్యర్థి నాపై పోటి చేశారు. వీళ్లు ఆయన కార్యకర్తలే’ అని చెప్పారు. ఈ క్రమంలో భోంస్లే సహా ఎన్సీపీ కార్యకర్తలపై వారు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో భోంస్లే చేతికి గాయం కాగా, ఎన్సీపీ కార్యకర్త గోరఖ్ పాశంకర్ కాలు విరిగిందని చెప్పారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్తా తిలక్ గత ఏడాది డిసెంబర్ 22న మరణించగా, చించ్వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ దీర్ఘకాలిక అనారోగ్యంతో జనవరి 3న కన్నుమూశారు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపి నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే సహా అన్ని పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కస్బా పేట, చించ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. చదవండి అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం -
‘స్థానిక’ ఉప ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల వివరాల సేకరణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కేఈఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి సోమవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోయినవి కాకుండా 2021లో ఎన్నికలు జరిగి, గెలిచిన అభ్యర్థుల మరణం, రాజీనామాల కారణంగా ప్రస్తుతం ఐదు జెడ్పీటీసీ, 102 ఎంపీటీసీ, 53 సర్పంచి, 770 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 11 డివిజన్ కార్పొరేటర్, నాలుగు వార్డు కౌన్సిలర్ పదవులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 945 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమని గుర్తించారు. మరోవైపు ఒక మున్సిపల్ చైర్మన్, ఏడు ఎంపీపీ, తొమ్మిది వైస్ ఎంపీపీ, ఐదు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు కూడా పరోక్ష పద్ధతిలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తేల్చారు. కొత్త ఓటర్ల జాబితాలతోనే... కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరిలో కొత్త ఓటర్ల జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ జాబితాల ప్రకారమే స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. -
థాక్రే వర్గానిదే ‘అంధేరీ’.. కానీ, ఇక్కడో సర్ప్రైజ్ఉంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్ప్రైజ్గా చెప్పాలి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్‌గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు -
ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. పోటీ ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పారీ్టలకు మధ్యనే నడిచింది. అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చు.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్ సీటు ఉన్నాయి. 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించారు. ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ మహారాష్ట్రలోని తూర్పు అంధేరి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఉద్ధవ్ ఠాక్రే, షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరి తూర్పులో ఆయన భార్య రుతుజా ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో శివసేన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు) భవ్య బిష్ణోయ్ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది. ఇక బిహార్‌లో 'మహాఘట్బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెదురుమదురు ఘటనలు.. రాజకీయ విమర్శల పర్వంతో ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఆ పార్టీలిచ్చింది తీసుకోండి.. ఆడబిడ్డకు ఓటేయండి: రేవంత్ రెడ్డి
చండూరు: మునుగోడు ఉపఎన్నికలో ఆ రెండు పార్టీల ద్వారా వచ్చింది తీసుకోండి కానీ, ఆడబిడ్డ స్రవంతికి ఓటు వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చండూరు మండలం కొండాపురం, గుండ్రపల్లి, బంగారిగడ్డ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏనాడు కూడా ఆడబిడ్డకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదు. ఈసారి సోనియాగాంధీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతికి టికెట్ ఇచ్చింది. కడుపులో పెట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మీది’అని అన్నారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలిచి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మద్యం ఎవరు పోసినా తన్నండని మహిళలకు రేవంత్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, చలమళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. వెంటనే ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్, సభలు, ర్యాలీ లపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారని, రాజగోపాల్ రెడ్డికి ఉన్న ముప్పు కారణంగా ఆయన భద్రతను బలో పేతం చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) దాదాపు 12 వేల బోగస్ ఓట్లను తొలగించినప్పటికీ ఇంకా ఉన్న 14 వేల ఓటర్లలో ర్యాండమ్ వెరిఫికేషన్ సందర్భంగా 1,800 కంటే ఎక్కువ బోగస్ ఓటర్లు ఉన్నారని ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి టీఆర్ఎస్పై ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 13న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘాన్ని కలసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లా డుతూ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని, రిటర్నింగ్ అధికారి, డీఈవో అనుమతి లేకుండానే భారీ సంఖ్యలో వాహనాలను టీఆర్ఎస్ మోహరించిందని తెలిపారు. అంతేగాక టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వనరుల దుర్వినియోగం, ఓటర్లను ప్రలోభపెట్టడంతోపాటు ఆ పార్టీ నాయకులు, మంత్రులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా మద్యం, నగదును చెక్‌పోస్టుల ద్వారా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు చెందిన అనధికార వ్యక్తులను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బోగస్ ఓట్లను పునఃపరిశీలించి, ఓటర్ల జాబితాలో నిజమైన ఓటర్లు మాత్రమే ఉండేలా చూడాలని కోరారు. మైక్రో జనరల్ అబ్జర్వర్లను, మైక్రో పోలీస్ అబ్జర్వర్లను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాయుధ బలగాల ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్లకు భద్రత కల్పించడంతో పాటు పోలింగ్ బూత్‌లలో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ చేయాలని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. -
కొత్త ఓటర్లకు డిజిటల్ కార్డులు.. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు
నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ ఓటర్ గుర్తింపు కార్డు లను తొలిసారిగా రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు వినియోగించబోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ–ఎపిక్ కార్డులుగా పేర్కొనే ఈ కార్డులు ఆరు ప్రధాన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కలిగిన) ఓటరు గుర్తింపు సంఖ్య, ఓటరు ఫోటో, చిరునామా, ఇతర వివరాలు ఈ కార్డులో ఉంటాయి. మునుగోడులో కొత్తగా పేరు నమోదు చేసుకున్న ఓటర్లకు ఈ కార్డులను గురువారం నుంచి ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిని పోస్టు ద్వారా మునుగోడుకు పంపించినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. పాత ఓటర్లు సైతం మీ–సేవా కేంద్రాల్లో డబ్బులు చెల్లించి ఈ డిజిటల్ ఓటరు కార్డులను పొందవచ్చు. 22,350 మంది అర్హులకు పంపిణీ ఈ కార్డులను సెక్యూర్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ పరికరంలో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఈ–ఎపిక్ కార్డు అందుబాటులో లేకున్నా పీడీఎఫ్ ఫైల్ ప్రింట్‌ను పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ కార్డులను టాంపర్ /ఎడిట్ చేయడం సాధ్యం కాదు. ఈ మేరకు పటిష్ట రక్షణ చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. నకిలీ ఓటరు కార్డుల తయారీ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను ఎన్నికల సంఘం పరిశీలించి 22,350 మంది అర్హులని తేల్చింది. వారందరికీ చెన్నైలో ముద్రించిన కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. -
ప్రజలతో కలిసి పండుగ.. మునుగోడులో బీజేపీ వినూత్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక తుదివిడత ప్రచారాన్ని బీజేపీ వినూత్నంగా సాగిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం స్థానిక ప్రజలకు పార్టీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు అందజేశారు. బీజేపీకి మద్దతు పలకాల్సిందిగా కోరారు. దీంతో పాటు నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాల వారితో కలిసి పార్టీ ముఖ్యనేతలు బాణాసంచా కాల్చి పండుగ సంబరాలు జరుపుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. పండుగ రోజున ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర మెజారిటీ ఓట్లున్న కుటుంబాలు, సామాజిక వర్గాలతో మమేకం కావడం బీజేపీకి ఉపకరిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా.జి.వివేక్ వెంకటస్వామి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు మేనిఫెస్టో విడుదల బుధవారం మునుగోడు ప్రజలకు బీజేపీ అభ్యర్థి ఎన్నికల హామీపత్రాన్ని విడుదల చేయనున్నారు. కేవలం ఈ నియోజకవకర్గం వరకే పరిమితమై, తాను గెలిస్తే చేయ బోయే కార్యక్రమాల గురించి ఇందులో వివరించనున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అభ్యర్థులు ఇలాంటి మినీ మేనిఫెస్టోలను ప్రకటించిన విషయం తెలిసిందే. రంగంలోకి జిల్లాల అధ్యక్షులు.. బుధవారం నుంచి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఒక్కో జిల్లా నుంచి 200 మంది దాకా అనుచరగణం ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 31న చండూరులో నిర్వహిస్తున్న పార్టీ బహిరంగ సభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ నెల 30న టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నందున దానికి దీటుగా నడ్డా సభ విజయవంతానికి రాష్ట్రపార్టీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక నవంబర్ 1న ప్రచార గడువు ముగియనున్నందున, ఆరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలంతా మునుగోడు వ్యాప్తంగా రోడ్డుషోలు నిర్వహిస్తారు. సమన్వయకర్తల నియామకం ఎన్నికల ప్రచారం, నిర్వహణ, ఇతర అంశాల పర్యవేక్షణకు తాజాగా మళ్లీ సమన్వయకర్తలను నియమించినట్టు సమాచారం. నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఒక్కొక్కరు చొప్పున 9 మందిని నియమిస్తున్నారు. మునుగోడు మండలానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మర్రిగూడకు ఏపీ జితేందర్‌రెడ్డి, చండూరు మండలానికి డీకే అరుణ, చండూరు మున్సిపాలిటీకి గరికపాటి మోహన్‌రావు, గట్టుప్పల్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్, చౌటుప్పల్ అర్బన్ మండలానికి ఇంద్రసేనారెడ్డి, రూరల్ మండలానికి బూర నర్సయ్యగౌడ్, సంస్థాన్ నారాయణ్‌పూర్ మండలానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాంపల్లికి ఈటల రాజేందర్‌లను సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలుస్తోంది. -
రెండు జిల్లాల్లో ఎస్ఏ–1 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 1–10 తరగతులకు నవంబర్ 1 నుంచి జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ –1 (ఎస్ఏ–1) పరీక్షను నవంబర్ 9 నుంచి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్ఏ–1 షెడ్యూల్ అమలులో ఉంటుందని వెల్లడించింది. -
పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఉపఎన్నిక నుంచి బీజేపీ ఔట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న అంధేరీ(తూర్పు) నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాక్రే, షిండే నేతృత్వంలోని బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే.. కీలక ఉప ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు.. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం గమనార్హం. పోటీ నుంచి తప్పుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కోరిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీని తప్పుకోవాలని సూచించారు. అలాగే.. ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎన్ఎన్ఎస్ చీఫ్ కోరారు. నాగ్‌పూర్‌లో చంద్రశేఖర్ బవన్కులే అంధేరీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినప్పుడు ఆ స్థానంలో వారి బంధువులపై ఎవరూ పోటీ చేయకూడదనే రాష్ట్ర సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థి ముర్జి పటేల్ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ థాక్రే వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు మార్గం సుగమమైంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించటంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఆయన భార్య రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Shiv Sena Symbol: గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు -
ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయి
బోధన్/బోధన్‌టౌన్: ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక రావడంతోనే గిరిజనబంధు, మైనారిటీలకు రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటాకుర్దు నుంచి బోధన్ వరకు సాగింది. అనంతరం నిర్వహించినసభలో షర్మిల మాట్లాడారు. లిక్కర్ స్కాంలో కూతురు అరెస్టు కాకుండా ఉండేందుకు కేసీఆర్ ఢిల్లీలో తిప్పలు పడుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్నా రని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పాలన స్థంభించిపోయిందని అన్నారు. కేసీఆర్ చెప్పే ప్రతి పథకంలోనూ మోసం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అబివృద్ధి చేసినట్లు చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగించి ఇంటి వెళ్తానని పేర్కొన్నారు. ప్రజలకు సమస్యలు ఉన్నాయని తాను నిరూపిస్తే కేసీఆర్ పదవికి రాజీనామా చేసి దళితనేతను ముఖ్యమంత్రి చేస్తారా అని ఆమె సవాల్ విసిరారు. -
బీజేపీ దీపావళి ధమాకా..!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మోత మోగించేందుకు బీజేపీ సిద్ధమైంది. దీపావళి దాకా వచ్చే 7, 8 రోజులు గ్రామస్థాయిలో, ఆ తర్వాత చివరి వారంరోజులు మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించనుంది. ఇప్పటిదాకా ఒక మోస్తరుగా సాగిన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నుంచి 10 మంది స్టార్ క్యాంపెయినర్లు వేడెక్కించనున్నారు. వెయ్యిమంది చొప్పున జనం పాల్గొనేలా 200 గ్రామసభలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 1, 13, 17 వార్డుల్లో, జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం, పీపల్‌పహాడ్, తూప్రాన్‌పేటలో, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో, సినీనటుడు బాబూమోహన్ నాంపల్లి మండలంలోని గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహిస్తారు. ఆదివారం ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాంపల్లి మండలంలోని మహ్మదాపురం, దామెర, బీటీపురం, దేవత్పల్లిలో, కిషన్‌రెడ్డి మునుగోడు మండలంలోని మునుగోడు, చీకటి మామిడిలో ప్రచారకార్యక్రమాల్లో పాల్గొంటారు. 6 మండలాల్లో సంజయ్ రోడ్ షో ఈ నెల 18 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 12 రోజులు మునుగోడులోనే బస చేయనున్నారు. 6 మండలాల్లో ఆరురోజులు వరుసగా రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు. వీరితోపాటు స్టార్ క్యాంపెయినర్లు మురళీధర్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, విజయశాంతి ఐదారు రోజులపాటు తమకు కేటాయించిన గ్రామాల్లోని పోలింగ్‌బూత్ స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్ర బీజేపీ మహిళ, ఎస్సీ, యువ, ఇతర మోర్చాల ద్వారా ప్రచారానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 20 మహిళా మోర్చా బృందాలు పోలింగ్‌బూత్ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఆడవారికి బొట్టుపెట్టి కరపత్రమిచ్చి పార్టీ గుర్తు, అభ్యర్థి పేరును ప్రచారం చేస్తాయి. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితవాడల్లో సమావేశాలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేస్తారు. దీపావళి తర్వాత తుదిదశ ప్రచారంలో భాగంగా 7 మండల కేంద్రాలు, 2 మున్సిపాలిటీలలో రెండేసీ చొప్పున నిర్వహించే పెద్ద బహిరంగసభల్లో సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలతోపాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. నెలాఖరులో నిర్వహించే ప్రచార ముగింపు బహిరంగసభలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్గానీ పాల్గొననున్నట్టు సమాచారం. ఢిల్లీ బృందాల ప్రత్యక్ష పర్యవేక్షణ మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారా లేదా అన్నదానిపై ఢిల్లీ బృందాలు గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మోహరించిన ఈ బృందాలను ఢిల్లీ నుంచి జాతీయ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తీరుపై రాష్ట్రనాయకులు టెలీ కాన్ఫరెన్స్‌లు, ఇతరత్రా రూపాల్లో ఆరా తీస్తున్నారు. -
మునుగోడులో ఓటమి ఒప్పుకున్న టీఆర్ఎస్
మునుగోడు: ఎనిమిదేళ్లు గా ప్రజా సమస్యలు పట్టించుకోని సీఎం కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికకు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి.. మొత్తం 88 మందిని పంపడం ద్వారా పరో క్షంగా ఓటమిని అంగీకరించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్‌కుమార్ మునుగోడు మండలం కొంపల్లి, చల్మెడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రోజు కూడా ఫామ్ హౌస్‌ని వదిలి బయటకురాని సీఎం.. నేడు కేవలం ఒక ఎంపీటీసీ పరిధిని ఎంచుకొని ప్రచారం చేయడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. వెల్మకన్నె గ్రామానికి ప్రచారానికి వెళ్లి మహిళలతో మాట్లాడారు. మాటల సందర్భంలో తాము ఎప్పుడూ ఏసీ కారులో తిరగలేదని ఆ మహిళలు చెప్పారు. దీంతో ప్రవీణ్‌కుమార్ వారిని కారులో ఎక్కించుకుని కాసేపు తిప్పారు. -
బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు: బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గొర్రె పిల్లలిచ్చింది కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులవారి జీవనోపాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పువ్వాడ చెప్పారు. నిన్నటివరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లలను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, మొదటిసారిగా వారికి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమ సంఘం నేతలు పాల్గొన్నారు. -
బోగస్ ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్. ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
లెక్కలు లేని.. 3.5 కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగదు అక్రమ రవాణాపై దృష్టిపెట్టారు. గతవారం మూడు ఘటనల్లో రూ.3.7కోట్లు పట్టుకోగా..సోమవారం రాత్రి నగరంలోని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లెక్కలు లేని రూ.3.5 కోట్లను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిర్మాణ రంగ వ్యాపారైన హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వర్రావు సైదాబాద్‌కు చెందిన మరోవ్యాపారి బాలు మహేందర్‌కు రూ.3.5 కోట్లు నగదు రూపంలో ఇవ్వాలని భావించారు. అయితే ఈ నగదు తీసుకునేందుకు బాలు మహేందర్ కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన తన స్నేహితులు గండి సాయికుమార్ రెడ్డి, మహేశ్, సందీప్‌కుమార్, మహేందర్, అనూష్‌రెడ్డి, భరత్‌లను పంపాడు. ఈ ఆరుగురూ సోమవారం రాత్రి రెండుకార్లలో మారియట్ హోటల్ వెనుక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు మరో కారులో వచ్చిన వెంకటేశ్వర్రావు నాలుగు అట్టపెట్టెల్లో సీల్‌వేసి తీసుకువచ్చిన నగదును వీరికి అప్పగించాడు. వాటిని తమ కార్లలో పెట్టుకుని ఆరుగురూ సైదాబాద్ వైపు బయల్దేరారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వారిపై దాడిచేసి నలుగురిని పట్టుకున్నారు. వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్‌లు పారిపోయారు. కాగా, వీరి వాహనాలను తనిఖీ చేయగా రూ.3.5 కోట్లు బయటపడ్డాయి. ఈ నగదుకు సంబంధించిన లెక్కలు వారి వద్ద లేకపోవడంతో కార్లతో సహా స్వాధీనం చేసుకుని గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్రావు, బాలు మహేందర్ కోసం గాలిస్తున్నారు. ఈ నగదుతో మునుగోడు ఉప ఎన్నికలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
దశలవారీగా బీజేపీ ప్రచార జోరు.. ఆ సభకు అమిత్ షా లేదా నడ్డా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ జాతీయ, రాష్ట్రనేతలు హోరెత్తించనున్నారు. దశలవారీగా ప్రచార వేగం పెంచాలనే వ్యూహంతో పార్టీ నాయకత్వముంది. ఈ నెల 14న ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే దాకా ఒక మోస్తరుగా, 17న ఉపసంహరణల పర్వం ముగిశాక మరోస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చివరి వారం రోజులు పూర్తిస్థాయి ప్రచారంతోపాటు మొత్తం 298 పోలింగ్‌బూత్‌ల స్థాయిలో ఎన్నికల మేనేజ్మెంట్పై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా మోహరించిన వివిధ స్థాయిల్లోని నాయకులపై, వారి కార్యక్షేత్రాలపై పార్టీకి ఓ స్పష్టత వచ్చింది. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలు, మునుగోడులో అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలోభాగంగా ఓటర్ల జాబితాపైనా కమల దళం దృష్టి కేంద్రీకరించింది. ఈ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలోనే 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 6, 7 నెలల్లో వెయ్యిదాకా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఉప ఎన్నిక తేదీ ప్రకటించాక 23 వేల ఓట్లు కొత్తగా జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలో భాగంగానే కొత్తగా ఓటర్లను చేర్చిందని ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. ముగింపు సభకు అమిత్ షా లేదా నడ్డా! ఈ నెల 15 నుంచి మునుగోడులో ముఖ్యనేతలు పూర్తిస్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర నేతలు వారం పదిరోజుల పాటు అక్కడే బసచేయనున్నట్టు సమాచారం. 18 నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, కార్యదర్శి అర్వింద్ మీనన్ ఇతర నేతలు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచార ముగింపు సభలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు. -
టీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం తాకట్టు
చండూరు, మునుగోడు: ప్రాజెక్టులు, పథకాల పేరు తో రూ. లక్షల కోట్లు దోచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 2014కు ముందు సీఎం కేసీఆర్ బ్యాంకు రుణం తీసుకొని కొనుగోలు చేసిన కారు, పార్టీ ప్రచార రథానికి వాయిదాలు చెల్లించకపోతే బ్యాంకు అధికారులు వాటిని తీసుకువెళ్లా రని... అలాంటి కేసీఆర్ సీఎం పదవి లభించాక రూ. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసి నేడు రూ. 100 కోట్లతో విమానం కొనుగోలు చేస్తున్నారన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, ఎన్నికల సమన్వయకర్త సునీల్ బన్సల్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలసి నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన రోడ్ షోలో సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు వచ్చినా అక్కడ గెలిచేందుకు అభివృద్ధి పనులకు నిధులు, దళితబంధు, ఇతర పథకాలతో ఓటర్లని బుట్టలో వేసుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. అందులో భాగంగానే నియోజక వర్గంలోని యాదవులకు గొర్రెల పంపిణీ పథకం కింద ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 1.54 లక్షలు జమ చేశారన్నారు. అయితే లబ్ధిదారులు డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా ఆ సొమ్మును స్తంభింపజేశారని... ఎన్నికలు పూర్తయ్యాక నిధులను వెనక్కి తీసుకొనే కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. గౌడ కులస్తుల వృత్తిని నిర్వీర్యం చేసేందుకు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు పెట్టించి కల్లు తాగేవారు లేకుండా సీఎం కుట్రలు పనుతున్నారని సంజయ్ ఆరోపించారు. నవంబర్ 3న జరిగే ఉపఎన్నికలో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సంజయ్ కోరారు. ఓటుకు రూ.లక్ష ఇచ్చినా బీజేపీదే గెలుపు... సీఎం కేసీఆర్ మునుగోడులో గెలిచేందుకు ఓటుకు రూ. లక్ష ఇచ్చినా గెలిచేది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మండలం ఏర్పడిందని, యాదవులకు గొర్రెల పంపిణీ, ఆసరా పెన్షన్లు, రోడ్ల మరమ్మతులకు నిధులను కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు మునుగోడు ఉప ఎన్నికతో చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆ పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడులో ఎలాగైనా గెలవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, సర్వశక్తులూ ఒడ్డాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకు తగినట్టుగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీ కేడర్‌ను కదిలించేలా ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటోంది. ఉప ఎన్నిక ప్రచారం సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండటంతో రెండు కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ఇన్చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, టీపీసీసీ ముఖ్య నాయకులందరూ ఈనెల 14 వరకు అక్కడే ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా స్థానిక కేడర్‌తో కలిసి ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తీర్మానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శంషాబాద్‌లో రాహుల్ గాంధీతో నిర్వహించనున్న మునుగోడు బహిరంగ సభ ద్వారా మంచి ఊపు తీసుకురావాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. గెలుపు తమదేనంటున్న నేతలు సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మిత్రభేదమే తప్ప శత్రు వైరుధ్యం లేదన్నారు. వాటాల పంపకం విషయంలోనే టీఆర్ఎస్, బీజేపీ మ«ధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. ఆ రెండు పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని మునుగోడు ఓటర్లకు రేవంత్ పిలుపునిచ్చారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో విజయం కాంగ్రెస్ పార్టీదేనని, నవంబర్ ఆరో తేదీన అద్భుతమైన ఫలితం చూస్తారని పేర్కొన్నారు. పార్టీలోని ముఖ్య నాయకులందరం మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి సారించామని, కచ్చితంగా గెలిచి తీరుతామని సీఎల్పీ నేత భట్టి ధీమా వ్యక్తం చేశారు. -
మునుగోడులో ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్?
అల్వాల్: నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆదివారం మహోబోధి విద్యాలయంలో కోదండరాం ఇతర ప్రజా సంఘాల నాయకు లతో కలసి గద్దర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే కొందరు దానిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారుల్లో గద్దర్ ఒకరని, ప్రజాశాంతి పార్టీ నుంచి కాకుండా ప్రజాస్వామిక వాదుల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను పోటీ చేయించడానికి చర్చలు జరుపుతు న్నామని కోదండరాం తెలిపారు. కాగా, ప్రజా సంఘటన ద్వారానే మునుగోడులో పోటీ చేయాలని నిర్ణయించామని, అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని గద్దర్ చెప్పారు. 1978లో కాళోజీ నారాయణరావు ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేశారని, ఆయన బాటలోనే ప్రస్తుతం తాను పోటీ చేయాలని ప్రజా సంఘాల నుంచి అభ్యర్థ నలు వస్తున్నాయని, దీనిపై మరింత చర్చించిన తరువాతే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. -
‘మునుగోడు’లో ఓటర్ టర్నౌట్ యాప్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు (రియల్ టైమ్‌లో) ప్రకటించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ టర్నౌట్’ పేరుతో అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో వినియోగించనుంది. సామాన్య ప్రజలు సైతం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అసెంబ్లీ/లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. యాప్ ఇలా పనిచేస్తుంది... నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ వివరాలను యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. యాప్‌లో ఎంట్రీల నమోదుకు 30 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. ఉదాహరణకు ఉదయం 9 గంటల్లోగా జరిగిన పోలింగ్ శాతం వివరాలను రిటర్నింగ్ అధికారి ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య నమోదు చేస్తారు. ►ఉదయం 9 గంటలు, 11 గంటలు, మధ్యాహ్నం 1 గంట, 3 గంటలు, సాయంత్రం 5 గంటలు, 7 గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను ఆ తర్వాతి అర్ధగంటలోగా ప్రకటిస్తారు. తుది పోలింగ్ వివరాలను అర్ధరాత్రి 12 గంటలలోగా విడుదల చేస్తారు. ►పోలింగ్ ముగిసిన తర్వాత పురుషులు, మహిళలు, ఇతర ఓటర్లు ఎంత మంది ఓటేశారు? మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? వంటి వివరాలను యాప్‌లో అప్లోడ్ చేసి, ధ్రువీకరించుకున్న తర్వాత సబ్మిట్ చేస్తారు. ►అనంతరం సీఈఓ నియోజకవర్గాల వారీగా వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకున్నాక వాటిని ప్రకటిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి సుమారుగా ఇంత పోలింగ్ జరిగిందని యాప్‌లో వివరాలు అందుబాటులోకి వస్తాయి. -
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆయనకు పార్టీ బీ ఫామ్‌ను అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల విలువైన చెక్కును కూడా ఇచ్చారు. కాగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని చెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
12న మునుగోడులో వామపక్షాల బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు వామపక్షాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన, దానికి దారితీసిన పరిస్థితు లను కేడర్‌కు తెలియజెప్పాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. అందులోభాగంగా ఈ నెల 12న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ ఎన్నికలు రావడానికి కారణం ఎవరనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి. బీజేపీ ఎత్తుగడతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యవ హరిస్తోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీ నామా చేయించి, అనంతరం ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయా లన్నది ఎత్తుగడ. బీజేపీ వ్యూహాన్ని ఎండగట్టడం, దాని మతోన్మాద వైఖరిని తూర్పార బట్టడం ఈ సభ ఉద్దేశమని సీపీఐ, సీపీఎం నాయకులు వెల్ల డించారు. అంతేకాదు దేశంలో బీజేపీ ఆర్థిక విధానాల వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియచేస్తామన్నారు. బీజేపీ ప్రమా దాన్ని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని కేడర్‌లోకి తీసుకెళ్తారు. రెండు కమ్యూనిస్టు పార్టీల్లోని కేడర్‌లో టీఆర్ఎస్పై అక్కడక్కడ అసంతృప్తి నెలకొంది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలన్న అంశంపైనా కేడర్‌లో కొంత విముఖత వ్యక్తమవుతోంది. దాన్ని పసిగట్టిన రెండు పార్టీలు సభ నిర్వహించడం ద్వారా తమ విధానాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లనున్నాయి. -
సంబురాల నుంచి... ఎన్నికల సమరానికి
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఎన్నికల ప్రచారం, ఇతర బాధ్యతలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఆదేశాలతో పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రికల్లా తమ తమ కార్యస్థానాలకు చేరుకున్నారు. దసరా వేడుకలు ముగియడంతో తమ అప్పగించిన ప్రాంతాల్లో మెజారిటీ నాయకులు బస చేశారు. శుక్రవారం నుంచి నేతలు తమకు అప్పగించిన విధులు, బాధ్యతల్లో నిమగ్నం కానున్నట్టు పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. ఈ నియోజకవర్గంలోని 298 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ప్రతి ఒక్క ఓటరును కలుసుకునే విధంగా నాయకత్వం రూపొందించిన కార్యాచరణ అమలుకు నేతలు సిద్ధమౌతున్నారు. వివిధ సామాజికవర్గాల ఓట్లు రాబట్టేందుకు వీలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 7 మండలాల (కొత్తగా ఏర్పడిన గట్టుప్పల్‌తో సహా) ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిలు, రెండు మున్సిపాలిటీల పరిధిలోని కాలనీలు, ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి మద్దతు కూడగట్టేలా వ్యూహం అమలు చేస్తున్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా పెద్ద పెద్ద సభల కంటే చిన్న చిన్న సమావేశాలకే ప్రాధాన్యమివ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగ సభ ఉంటుందని పార్టీవర్గాలు వెల్లడించాయి. మరోవైపు బండి సంజయ్ 10 రోజుల పాటు మునుగోడులోనే బస చేయనున్నట్టు తెలిపాయి. బైక్ ర్యాలీలు వాయిదా రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం నుంచి చేపట్టాల్సిన బైక్ ర్యాలీలను ఆదివారానికి వాయిదా వేశారు. మునుగోడు మొత్తం చుట్టివచ్చేలా ఈ మోటార్ బైక్ ర్యాలీలకు రూపకల్పన చేశారు. శనివారం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నిర్వహించాల్సిన మునుగోడు ఎన్నికల సన్నాహక భేటీ కూడా సోమవారానికి వాయిదా పడింది. మునుగోడుపై సంఘ్ సమీక్ష గురువారం సాయంత్రం మునుగోడుపై సంఘ్ పరివార్ సమీక్ష నిర్వహించింది. బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ ఎన్నికను బీజేపీతో పాటు సంఘ్ పరివార్ సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు పరివార్ క్షేత్రాల కార్యకర్తలు సిద్ధమైనట్టు సమాచారం. -
టార్గెట్.. 76 వేల ఓట్లు
చౌటుప్పల్ రూరల్: ‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు 90 రోజులకుపైగా సమయం ఉంది. రెండు బూత్‌లకో ఇన్చార్జిని, పది బూత్‌లకో క్లస్టర్ ఇన్చార్జిని, మండలానికో టీపీసీసీ నేతను పెట్టాం. వచ్చే వారం రోజుల్లో గ్రామాలవారీగా తిరగాలి. 25 మంది సభ్యులతో బూత్ కమిటీని వేయాలి. అందులోంచి ఇద్దరు యువకులను గుర్తించాలి. వారి సాయంతో ఓటరు లిస్టు ఆధారంగా కాంగ్రెస్ కుటుంబాలను గుర్తించాలి. కనీసంగా బూత్‌కు 254 ఓట్లను సాధించాలి. ఈ లెక్కన మునుగోడులో మొత్తంగా 76 వేల ఓట్లువస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవారం టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, అంజన్‌కుమార్‌యాదవ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, పాల్వాయి స్రవంతితో పాటు 107మంది బూత్ ఇన్చార్జిలతో ఉప ఎన్నికపై సమీక్షించారు. కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి.. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఉప ఎన్నికలకు 22 రోజుల గడువు మాత్రమే ఉండే. అక్కడ కూడా ఇలాగే పనిచేసినం. 26వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఆరు బూతుల్లోనే మెజారిటీ ఓట్లు సాధించినం. ఆ బూత్ ఇన్చార్జులకు తగిన గుర్తింపునిచ్చాం, పార్టీ పదువులిచ్చినం. మునుగోడులోనూ పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌కు 76వేల ఓట్లు వచ్చాయి. బూత్‌కు కనీసంగా 254 ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నెల 18 నుంచి బూత్ ఇన్‌చార్జులంతా కార్యక్షేత్రంలోకి దిగాలి. బూత్‌లవారీగా కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి. వారం రోజుల్లోగా ఇదంతా పూర్తి చేయాలి. ఈ నెల 25న మరోసారి మండలాల వారీగా సమీక్షిస్తాం. కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో 13రోజుల పాటు సాగే రాహుల్‌గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలి’అని ఠాగూర్ కోరారు. సమావేశంలో ఇంకా టీపీసీసీ నాయకులు విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ, అనిల్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేమొస్తే టీఎస్ బదులు టీజీ!
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సంచలన కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్య నేతలు, గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హాజరై సెప్టెంబర్ 17, మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రపై చర్చించారు. అనంతరం పలు కీలక తీర్మానాలను చేశారు. ఈ తీర్మానాల వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్‌టైం పనిచేస్తున్నాయి సెప్టెంబర్ 17కు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, కానీ చరిత్రను కనుమరుగు చేసే విధంగా టీఆర్ఎస్, బీజేపీల అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీలు ఓవర్‌టైం పనిచేస్తూ తమను భాగస్వాములుగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ, హైదరాబాద్ స్వాతంత్య్ర ఉద్యమంలో కానీ బీజేపీ, దాని మూలాలున్న ఏ సంస్థ కూడా పాల్గొనలేదని అన్నారు. కానీ వాళ్లే తెచ్చినట్టుగా ప్రజలకు భ్రమలు కల్పించేందుకు రెండు పార్టీలు పోరాడుతున్నాయని చెప్పారు. వాస్తవానికి ఆ డీఎన్ఏ తమదని, 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించే హక్కు, అధికారం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, తమ తర్వాత కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని చెప్పారు. మునుగోడులో కలిసికట్టుగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అన్ని స్థాయిల్లోని నాయకులు కలిసికట్టుగా పనిచేస్తారని రేవంత్ చెప్పారు. ఇందుకోసం మంగళవారం చౌటుప్పల్‌లో ఇన్చార్జులందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ హాజరవుతారని తెలిపారు. నాలుగు చోట్ల బహిరంగ సభలు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర విజయవంతం కోసం త్వరలోనే అందరితో మాట్లాడి కమిటీలను నియమిస్తామని చెప్పారు. తెలంగాణలో ప్రవేశించి మహారాష్ట్రకు వెళ్లేంతవరకు రాహుల్ యాత్రలో అందరినీ భాగస్వాములను చేసా్తమని అన్నారు. కాగా రాహుల్‌యాత్ర సమయంలో మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ తీర్మానాలివే.. ►సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు ఏడాది పొడవునా తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణ ►తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీజీ అని రాసుకుని ఉద్యమాలు చేస్తే టీఆర్ఎస్ కుట్రతో, వారి పార్టీకి అనుసంధానించేలా తెరపైకి తెచ్చిన టీఎస్ (టీఆర్ఎస్లో ఆర్‌ను సైలెంట్ చేసి)ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. టీఎస్‌ను టీజీగా మార్చాలి. అధికారంలోకి వచ్చాక పాలన మొత్తాన్ని టీజీ పేరుతో నిర్వహించాలి. ►అందెశ్రీ అందించిన అద్భుతమైన ‘జయ జయహే తెలంగాణ’ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా మార్చాలి. దొరల తల్లి స్థానంలో.. ►ప్రస్తుతమున్న తెలంగాణ తల్లి దొరల తల్లి. దొరసానిగా భుజకీర్తులు, కిరీటాలున్న ఈ తల్లిని తిరస్కరించాలి. టీఆర్ఎస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాల తల్లిగా కనిపించే విధంగా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఆవిష్కరించాలి. కడుపులో పెట్టుకుని కాపాడుకునే తెలంగాణ తల్లిని తెలంగాణ సమాజానికి సెప్టెంబర్ 17 నుంచి అంకితం చేయాలి. ►సెప్టెంబర్ 17 పురస్కరించుకుని జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా తెలంగాణ జెండా రూపొందించాలి. ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఎగురవేయాలి. -
అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. అదే దూకుడుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. టికెట్ ఆశించిన ముగ్గురు నాయకులను బుజ్జగించే పనిలో పడింది. వారికి ప్రచార బాధ్యతలనూ అప్పగించింది. మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, స్రవంతిలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో భేటీ అయి చర్చించారు. మరో ఇద్దరు నేతలు పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం అంతా పనిచేయాలని.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. రేవంత్ విజ్ఞప్తి పట్ల ముగ్గురు నేతలు సానుకూలంగా స్పందించారని, స్రవంతి అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ, కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. గాంధీ భవన్‌లోనూ కీలక భేటీ శుక్రవారం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కీలక భేటీ నిర్వహించింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, సంపత్ కుమార్, బలరాం నాయక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచార కార్యాచరణపై చర్చించిన టీపీసీసీ నేతలు.. మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మండలానికి ఇద్దరు రాష్ట్ర నేతలను ఇన్చార్జులుగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మండలానికో ముఖ్య ఇన్చార్జిని నియమించింది. ఇప్పటికే ఉన్న నేతలు వీరికి సహాయకులుగా ఉంటారని పేర్కొంది. ఈ ఇన్చార్జుల జాబితాలో రేవంత్‌తోపాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ ఉన్నారు. ఇక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రచార బాధ్యతలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులకు అప్పగించారు. నియోజకవర్గంలోని 300 పోలింగ్ బూత్‌లకు గాను 150 మందిని (ప్రతి రెండు బూత్‌లకు ఒకరిని), ప్రతి పది బూత్‌లకు ఒకరిని ఇన్చార్జులుగా నియమించాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని.. మునుగోడులో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. ఇదీ చదవండి: అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు -
పక్కా ప్లాన్‌తోనే! అభ్యర్థిగా స్రవంతి ఖరారు వెనుక కాంగ్రెస్ పెద్ద స్కెచ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడుపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీఆర్ఎస్, బీజేపీల కంటే ముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి పేరును అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక అనేక కారణాలున్నాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలు కూడా టికెట్ ఆశించినప్పటికీ స్రవంతిని ఖరారు చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పెద్ద స్కెచ్చే వేసిందని అంటున్నారు. ప్రత్యర్థులకు షాక్..! మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనలో వ్యూహాన్ని మార్చింది. ముందు నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ మొదట్లోనే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కానీ టీఆర్ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు నిర్వహించి కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో వేచి చూద్దామనే ధోరణిని ప్రదర్శించింది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం ఇలాంటి సంకేతాలనే ఇచ్చారు. కానీ ఉన్నట్టుండి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటిస్తూ శుక్రవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు బరిలో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చే వ్యూహంతోనే అనూహ్యంగా అభ్యర్థి పేరు వెల్లడించిందని అంటున్నారు. ప్రచారంలో వెనుకబడకుండా.. ప్రచారంలో వెనుకబడకుండా ఉండటం, నియోజకవర్గంలోని కేడర్‌ను ముందుండి నడిపే సారథిని చూపించడం, అభ్యర్థిని త్వరగా ప్రకటించాలంటు న్న ఆశావహులు, స్థానిక కేడర్ ఒత్తిళ్లు.. ఇవన్నీ దృష్టి లో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ముందే అభ్యర్థిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు అధి కారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. కానీ కాంగ్రెస్ మా త్రం ప్రజాక్షేత్రంలో పెద్దగా సత్తా చూపించలేకపోతోంద నే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. మరో వై పు నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం, అయినా వారితో కనీసం మాట్లాడేవారు లేకపోవడం, హైదరాబాద్ నుంచి వచ్చే రాష్ట్ర స్థాయి నాయకులు అడపాదడపా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అ వుతుండడంతో పరిస్థితి చేయి జారుతోందనే అభిప్రాయానికి కాంగ్రెస్ పెద్దలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్రవంతివైపే మొగ్గు అభ్యర్థి విషయంలో జరిపిన అభిప్రాయసేకరణలో ఎక్కువ మంది స్రవంతి పేరు సూచించినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతల్లో కొంత అభిప్రాయ భేదాలున్నప్పటికీ స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కొందరు చల్లమల్ల కృష్ణారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారనే చర్చ జరిగినా, చివరకు రేవంత్ టీం కూడా పూర్తి అధికారాలు అధిష్టానానికే అప్పగించింది. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఇటీవల ప్రియాంకాగాంధీని కలిసిన సమయంలో స్రవంతి పేరునే సూచించినట్టు తెలిసింది. వెంకట్‌రెడ్డి కూడా సిఫారసు చేయడం, ప్రచారంలో వెనుకబడిపోతున్నామనే భావన నేపథ్యంలో.. ఇప్పుడే ప్రకటించడం మేలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందనే వార్తలు కూడా వస్తుండటంతో.. రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. -
మునుగోడు ఎన్నిక: వాళ్లంతా బిజీబిజీ.. రూ.25 లక్షల వరకు ప్యాకేజీ!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు వస్తున్నాయంటే సర్వేలు నిర్వహించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సర్వేలు నిర్వహించి పార్టీల బలాబలాలు అంచనా వేసి చెబుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పార్టీలు, వ్యక్తులు కూడా సర్వేలు జరిపిస్తుంటారు. తమతో పాటు ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు, ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో ఈ విధమైన సర్వేలు జరిపిస్తుంటారు. సర్వేల ఫలితాలను బట్టి, వ్యూహాలను మార్చడం, అవసరమైన కార్యాచరణ చేపట్టడం వంటి చర్యలు పార్టీలు చేపడ తాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి రావడంతో.. పదుల సంఖ్యలో సంస్థలు, యూట్యూబ్ చానళ్లు సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో నిమగ్నమయ్యాయి. సంస్థను బట్టి ప్యాకేజీ... ప్రస్తుతం మార్కెట్లో పదుల సంఖ్యలో సర్వే సంస్థలున్నా యి. వీటిల్లో కొన్ని మునుగోడులో రంగంలోకి దిగాయి. పార్టీలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసే పనిలో ఉన్నా యి. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఆయా సంస్థలు సదరు పార్టీకి లేదా అభ్య ర్థికి సర్వేల్లో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి వివరాలను నివేదిక రూపంలో సమర్పిస్తాయి. ఇందుకు గాను ఒక్కో సర్వే సంస్థ తమకున్న విశ్వసనీయత ను బట్టి సంబంధిత పార్టీ, అభ్యర్థుల నుంచి ప్యాకేజీ తీసు కుంటున్నాయి. మూడు, నాలుగు ఎన్నికల్లో పనిచేయడంతో పాటు ఆయా ఎన్నికల్లో సర్వే సంస్థ అంచనాలు నిజమైన పక్షంలో సదరు సర్వే సంస్థకు విశ్వసనీయత పెరుగుతుంది. రూ.5 లక్షల నుంచి మొదలు... రాష్ట్రంలో ఉన్న ఓ ఎనిమిది సర్వే సంస్థలు మునుగోడు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. వీటిలో నాలుగు సంస్థలు బీజేపీకి పనిచేస్తుండగా, ఒకటి కాంగ్రెస్‌కు, మరో మూడు టీఆర్ఎస్కు పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంస్థలు మునుగోడులోని అన్ని వర్గాలు, అన్ని వయస్సుల వారి నుంచి కులాలు, మతాల వారీగా అభిప్రాయాలను తీసుకుంటున్నాయి. మునుగోడులో 2.18 లక్షల మంది ఓటర్లున్నారు. సర్వే సంస్థలు ఇందులో 1 శాతం లేదా 2 శాతం జనాభాను శాంపిల్ కింద తీసుకొని అభిప్రాయాలను సేకరిస్తాయి. ప్రజలను గుచ్చిగుచ్చి లోతుగా ప్రశ్నించడం ద్వారా వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేట్టుగా చేస్తారు. వారు వెల్లడించిన అంశాల మేరకు నివేదికలు తయారు చేసి క్లయింట్లకు అందజేస్తారు. ఇందుకు ఒక్కో సంస్థ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పని మొదలెట్టిన 6 చానళ్లు.. మునుగోడులో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏయే సమస్యలున్నాయి, ఏయే అభ్యర్థి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న అంశాలను పలు యూట్యూబ్ చానెళ్లు అభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు చేస్తున్నాయి. ఇలా ప్రధానంగా 6 చానళ్లు మునుగోడులో పనిచేస్తున్నాయని తెలిసింది. ఆయా చానళ్ల వారు వివిధ సమస్యలపై స్థానికులతో మాట్లాడింపజేస్తున్నారు. వారి అభిప్రాయాలను రికార్డు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 50 మందితో మాట్లాడి మొత్తంగా 350 మంది ఒపీనియన్ పోల్‌ను తమ తమ క్లయింట్లకు అందజేస్తున్నాయి ఒక్కో యూట్యూబ్ చానల్ వారికున్న విశ్వసనీయతతో పాటు వారికున్న సబ్స్క్రైబర్ల సంఖ్యను బట్టి ప్యాకేజీ తీసుకుంటున్నాయి. చానెళ్లు తక్కువలో తక్కువ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీగా స్వీకరిస్తున్నట్టు తెలిసింది. రేటింగ్.. విశ్వసనీయతకోసం.. చానళ్లు, సర్వే సంస్థలు కాకుండా కొన్ని సంస్థలు కేవలం తమ విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు, రేటింగ్ కోసం మునుగోడులో పనిచేస్తున్నాయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా, అభ్యర్థికి వత్తాసు పలకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిద్వారా సబ్స్క్రిప్షన్ పెంచుకోవడంతో పాటు భవిష్యత్‌లో పార్టీలు తమను సంప్రదించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ విధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. -
బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్కు మద్దతు
కూసుమంచి: మతతత్వ పార్టీ అయిన బీజేపీకి తాము వ్యతిరేకమని, ఆ పార్టీని తెలంగాణలో నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని, ఈ క్రమంలోనే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్– బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉందని భావించి, తమతోపాటు సీపీఐ కూడా టీఆర్ఎస్కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో అక్కడ సీపీఐ ఐదుసార్లు గెలిచినా, ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసినా ప్రధాన పార్టీలను ఎదుర్కొనేశక్తి లేదని, అందుకే ఓట్లు చీలకుండా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ కూడా తమ మద్దతును కోరినప్పటికీ బీజేపీని అడ్డుకునే శక్తి టీఆర్ఎస్కే ఉందని భావించామన్నారు. టీఆర్ఎస్కు తమ సహకారం ఈ ఎన్నిక వరకే పరిమితమని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కానందునే తాను రాజీనామా చేశానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పడం సరైంది కాదన్నారు. తెల్దారుపల్లిలో వ్యక్తిగత కారణాలతోనే తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యారని, ఈ ఘటనకు, సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కృష్ణయ్య హత్య నేపథ్యంలోనే తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామనడం అవాస్తవమని కొట్టిపారేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. -
4 రోజుల పాటు హైదరాబాద్‌లో తరుణ్ ఛుగ్ మకాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ శనివారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారుతో పాటు పార్టీపరంగా చేపడుతున్న కార్యక్ర మాలు, సాధిస్తున్న ఫలితాలపై శనివారం నుంచి వరుసగా ఆయన ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ‘ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ’ని ప్రకటిస్తారు. ఈ కమిటీ కింద పనిచేసే సమన్వయ కమిటీకి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్‌ను చైర్మన్‌గా, గంగిడి మనో హర్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనితో పాటు మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతవరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు విడతల పాదయాత్ర, ఒక విడత బైక్‌ర్యాలీ, ఇతర కార్యక్రమాలను తరుణ్ ఛుగ్ సమీక్షిస్తారు. -
లోక్‌సభ స్థానాల్లో రాజకీయ వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర మంత్రులు రాజకీయ దుమారం రేపుతున్నారు. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో పర్యటన చేపట్టారు. గురువారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె ఘాటైన విమర్శలు చేయడం తెలిసిందే. ఇక శుక్రవారం బీర్కూర్‌లో జిల్లా కలెక్టర్‌ను రేషన్ బియ్యంపై నిలదీయడం చర్చనీయాంశమ య్యింది. ఈ పథకం కింద కిలో బియ్యానికి రూ.35 వరకు ఖర్చవుతుంటే, కేంద్రం 28 చెల్లిస్తున్న విషయాన్ని వెల్లడించడంతో పాటు రేషన్ షాపుల్లో మోదీ చిత్రపటాలు పెట్టాలంటూ ఆదేశించడం టీఆర్ఎస్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో పర్యటించిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర సర్కార్, గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రాష్ట్ర మంత్రులు స్పందించడం తెలిసిందే. 14 ఎంపీ స్థానాల్లో..పక్కా వ్యూహంతో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో (బీజేపీ సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహాయించి) పర్యటించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయా లని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని సూచించింది. విభిన్న పథకాల ద్వారా వివిధ వర్గాల పేదలకు కేంద్రం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర వాటాగా అందజేస్తున్న నిధులు కేంద్రమంత్రుల ద్వారా వివరిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుందనే భావనతో బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు జిల్లాల్లో మకాం వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా.. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా ఈ పర్యట నలు కొనసాగనున్నాయి. ఇప్పటికే హైదరా బాద్ లోక్‌సభ పరిధిలో జ్యోతిరాధిత్య సింధియా, ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానంలో పురు షోత్తం రూపాలా, మల్కాజిగిరిలో ప్రహ్లాద్ జోషి, నల్లగొండలో కైలాష్‌చౌదరి, భువనగి రిలో దేవీసింగ్, ఖమ్మంలో బీఎల్ వర్మ పర్యటించారు. తాజాగా నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పర్యటన చేపట్టారు. ఇక మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శుక్రవారం నుంచి పర్యటన ప్రారంభించారు. ఈ నెల 4,5 తేదీల్లో మహబూబా బాద్ ఎంపీ స్థానంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు. ఇప్పటికే పర్యటించినా మళ్లీ నెలా, రెండునెలల వ్యవధిలో మరోసారి తమకు కేటాయించిన లోక్‌సభ సీట్ల పరిధిలో పర్యటిస్తారు. -
Munugode By Election 2022: మునుగోడుపై బీజేపీ ‘ఫుల్ ఫోకస్’!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ అధినాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. కచ్చితంగా గెలిచి రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను నిరూపించుకోవాలని ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బా క, హుజూరాబాద్ తరువాత మునుగోడులోనూ గెలవడం ద్వారా సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నదనే విషయం ప్రజలకు తేటతెల్లం చేయడానికి దోహదపడుతుందని అంచనా వేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ముందుకెళ్లేందుకు, టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలని రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను కేంద్రహోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే అమిత్ షా, నడ్డాల పర్యవేక్షణలో ఎన్నికల వ్యూహరచన ఖరారు చేస్తున్నారు. పాదయాత్ర–4 సందర్భంగానూ పర్యవేక్షణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 12 నుంచి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ప్రజాసంగ్రామయాత్ర–4 ముగింపు సభను అదేనెల 22 లేదా 23 తేదీల్లో రంగారెడ్డి జిల్లా శివారు, మునుగోడుకు కాస్త దగ్గరగా ఉండే అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఊపు తెచ్చేందుకు ఈ సభలో అమిత్ షా లేదా నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. మునుగోడుకు సంబంధించిన ప్రచార నిర్వహణపై నాయకత్వం పర్యవేక్షణకు అనువుగా ఉంటుందనే మల్కాజిగిరి ఎంపీ సీటు పరిధిలో పాదయాత్ర–4ను చేపడుతున్నట్టు చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పకడ్బందీగా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 3 రోజులు ఇక్కడే మకాం వేయనున్న తరుణ్ ఛుగ్ వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో మకాం వేయనున్న ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ తరుణ్ ఛుగ్ మునుగోడు ప్రత్యేక కార్యా చరణను ఖరారు చేయనున్నారు. మును గోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామిని ఈ ఎన్నికల ఇన్చార్జిగా నియమించనున్నారు. ఈ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డిని కూడా మరో ఇన్‌చార్జీగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ మండలం, మున్సిపాలిటీలో ముగ్గురేసి రాష్ట్ర ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతోపాటు మునుగోడుకు సంబంధం లేని బయటినేతలకు ముఖ్యమైన బాధ్యతలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలకు ఎన్నికల ప్రచారం, బూత్‌స్థాయి కమిటీల పర్యవేక్షణ, ఇతర కీలక బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ ఖరారైనట్లు పార్టీవర్గాల సమాచారం. -
ఎదురుదాడిలో ఎక్కడా తగ్గొద్దు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పావులు కదిపి రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించడం ద్వారా పట్టుసాధించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు దీటుగా ప్రతిస్పందించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ, బండి సంజయ్ పాదయాత్ర, కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో టీఆర్ఎస్పై ముప్పేట దాడిని ప్రారంభించిన బీజేపీపై అదేస్థాయిలో ఎదురుదాడి చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. తెలంగాణను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని చూడటంతోపాటు ఈడీ, సీబీఐ దాడులంటూ బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఇన్నాళ్లూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్ కుటుంబపాలన, ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. తాజాగా కవితను లక్ష్యంగా చేసుకోవడాన్ని టీఆర్ఎస్ సవాలుగా తీసుకుంటోంది. అటు సోషల్ మీడియాలో ప్రచారం, ఇటు క్షేత్రస్థాయిలో ఆందోళనల పేరిట ఉద్వేగాన్ని సృష్టించడం ద్వారా లబ్ధి పొందేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను అడ్డుకోవడంపైనా గులాబీ దళం దృష్టి కేంద్రీకరించింది. బీజేపీతో శాంతిభద్రతల సమస్య రాష్ట్రంలో బీజేపీ ఉద్రిక్తతలు, ఉద్వేగాలను సృష్టించి హింసను ప్రేరేపించాలని చూస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ చర్యలపై సంయమనం పాటిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నా.. ఎక్కడా తగ్గకుండా ఎదురుదాడికి దిగాలని పార్టీ కేడర్‌కు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో దేవరుప్పుల, గద్వాల, మునుగోడు తదితర చోట్ల టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణలు ఈ కోవకు చెందగా, తాజాగా హైదరాబాద్‌లో కవిత నివాసం వద్ద జరిగిన ఘటనను టీఆర్ఎస్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. భౌతిక దాడులను ప్రేరేపించడం లక్ష్యంగానే బీజేపీ చర్యలు ఉంటున్నందున అదే రీతిలో ప్రతిస్పందించకపోతే పలుచనవుతామనే భావన టీఆర్ఎస్లో కనిపిస్తోంది. బీజేపీ దుందుడుకు చర్యల వల్ల తలెత్తుతున్న శాంతిభద్రతల సమస్యను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలనే వ్యూహంలో భాగంగానే మంగళవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కవిత నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించినట్లు సమాచారం. ఆరోపణలు చేసిన నేతలపై ఫిర్యాదులు ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పరవేశ్ వర్మను అరెస్టు చేయాలంటూ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశాయి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు కవిత సన్నద్ధమవుతుండగా, మరోవైపు పరవేశ్ అరెస్టుకు ఒత్తిడి కోసం టీఆర్ఎస్ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజాసింగ్ అరెస్ట్, దీక్ష పేరిట ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే జరుగుతోందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
సాగదీయొద్దు.. సాగనంపుదాం!
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య వైరాన్ని మరింత పెంచుతున్నట్లే కనబడుతోంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది మొదలు మొన్నటి హోంగార్డు వ్యాఖ్యల వరకు అన్నింటినీ సమర్ధిస్తూ వస్తున్నారంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపేందుకు మాణిక్యం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఢిల్లీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వద్ద సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీలోనూ వెంకట్‌రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపే విషయమై మాణిక్యం కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారని కాంగ్రెస్‌లోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. భేటీ సందర్భంగా ప్రియాంకతో ప్రత్యేకంగా మాట్లాడిన మాణిక్యం ‘వెంకట్‌రెడ్డికి పీసీసీ రాలేదన్న అక్కసును తొలి నుంచి వెళ్లగక్కుతున్నారు. నాపైనా విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వైఖరితో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. పీసీసీ అధ్యక్షుడు నిర్వహిస్తున్న భేటీలకు ఆయన హాజరుకావడం లేదు. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకే నష్టం. ఆయన పార్టీని వీడాలనుకుంటే వీడనిద్దాం’అని అన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వెంకట్‌రెడ్డి పార్టీలో ఉన్నా ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలిచే సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలుపునకే కృషి చేస్తారని, అది జరుగకుండా ఉండాలంటే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపడమే మేలనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొంటున్నాయి. ప్రియాంక జోక్యంతో నేడు చర్చలు ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంశంపై చర్చ జరిగినా ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. సస్పెండ్ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్‌రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లను వెంకట్‌రెడ్డితో చర్చించేందుకు పంపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు బుధవారం ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి. చర్చలు ఎందుకంటూ ప్రియాంక ముందే మాణిక్యం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే సమయంలో సీనియర్ నేతలతో సఖ్యత విషయంలో వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొనిపోవాలని రేవంత్‌కు ప్రియాంక చెప్పినట్లు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు వద్దని, సొంతపార్టీ నేతలపై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తంగా ఉండాలని సూచించారని తెలిసింది. -
మునుగోడు బాధ్యత అందరిదీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తెలంగాణ ముఖ్య నేతలందరి భుజాలపై పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీకి రావాలని, సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని పార్టీ నేతలను హైకమాండ్ ఆహ్వానించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు నల్లగొండ జిల్లా ముఖ్య నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ప్రణాళిక, వ్యూహ కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఈ సమావేశానికి వెళ్తారని తెలుస్తోంది. వీరితో పాటు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి, పార్టీ తరఫున సర్వేలు నిర్వహిస్తున్న సునీల్ కనుగోలు కూడా ప్రియాంకతో జరిగే భేటీలో పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అంశమే ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల నివేదికలను పరిశీలిస్తారని, నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి అభ్యర్థి ఎవరయితే బాగుంటుందన్న దానిపై కూడా సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానానికి ఫీడ్‌బ్యాక్ ఏఐసీసీ పిలుపు అందిన నేపథ్యంలో తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది. ఇప్పటివరకు పూర్తయిన సర్వే నివేదికల ప్రకారం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందనే అంచనాకు ఆ పార్టీ ముఖ్య నేతలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం, టీఆర్ఎస్–బీజేపీలు ఒక్కటై ఈ ఉప ఎన్నికను తెరమీదకు తెచ్చాయన్న వాదనలను నియోజకవర్గ ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారని సర్వేలో తేలినట్టు సమాచారం. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని, అదే సమయంలో పాల్వాయి స్రవంతికి కూడా ప్రజల్లోకి వెళ్లగలిగే సామర్థ్యం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. సర్వేల ఆధారంగా మునుగోడు అభ్యర్థిపై టీపీసీసీ నేతలు కసరత్తు చేశారని, సోమవారం జరిగే భేటీలో తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తారని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో వారి అభిప్రాయాన్ని కూడా అధిష్టానం అడిగి తెలుసుకోనుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం మునుగోడులో గెలుపు తెలంగాణ నేతల సమిష్టి బాధ్యతని స్పష్టం చేయడంతో పాటు, ఈ మేరకు వెంటనే కార్యరంగంలో దిగాల్సిందిగా దిశానిర్దేశం చేయనుంది. -
బీజేపీకి వ్యతిరేకమని ఒట్టేసి చెప్పండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి తాను నిజంగా వ్యతిరేకమని సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే మళ్లీ బీజేపీకే మద్దతు ఇస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఎంఐఎం వయా టీఆర్ఎస్ నుంచి బీజేపీకి మద్దతు అందుతోంటే, ఇప్పుడు సీపీఐ వయా టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేలా చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, యువజన కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. మళ్లీ వంచించే ప్రయత్నం మునుగోడులో కేసీఆర్ సభతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో ఆ నియోజకవర్గానికి ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా జాతీయ రాజకీయాలు మాట్లాడి కేసీఆర్ మళ్లీ వంచించే ప్రయత్నమే చేశారని విమర్శించారు. డిండి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో, ఎస్సెల్బీసీని ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో, పోడు భూముల సమస్యలను ఎలా తీరుస్తారో, చర్లగూడెం, కిష్టరాంపల్లి భూనిర్వాసితుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చెప్పకుండా ఈడీ, సీబీఐల గురించి మాట్లాడితే ఏం లాభమని నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు కేసీఆరే ఆద్యుడు పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, ఏకలింగంగా ఉన్న బీజేపీని మూడు తోకలుగా చేసింది ఆయనేనని రేవంత్ అన్నారు. లేని బీజేపీని ప్రత్యా మ్నాయంగా సృష్టించిందీ, తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడికి కారణమైంది కూడా కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని గతంలో ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు కేసీఆర్ ఉచ్చులో ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వారి నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. మునుగోడులోని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. మధుయాష్కీ మాట్లాడుతూ.. మునుగోడు సభలో కాంగ్రెస్ పార్టీనుద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారో ఆలోచించుకోవాలని, ఆయన భాషను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. -
10 రోజుల్లో తేల్చేద్దాం! మునుగోడు అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులు ఎవరనేది దాదాపు ఖరారైన నేపథ్యంలో గందరగోళానికి తావు లేకుండా.. వీలైనంత త్వరగా తమ అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తోంది. మరో 10 రోజుల్లో అంటే సెప్టెంబర్ మొదట్లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వేలు కూడా చేపట్టింది. వీటి నివేదికల ఆధారంగా అధిష్టానానికి టీపీసీసీ ప్రతిపాదనలు పంపనుంది. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు విషయంలో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సుకూ ప్రాధాన్యత ఉంటుందని, ఆయనతోపాటు జిల్లాలోని కీలక నేతలందరి అభిప్రాయం తీసుకున్నాకే అభ్యర్థి ఎవరనేది నిర్ణయించనున్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రేసులో ఐదుగురు మునుగోడులో పోటీకోసం కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు నేత లు టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణి భర్త పల్లె రవికుమార్‌గౌడ్, ఇటీవల కాంగ్రెస్‌లో చేరి న తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్, టీపీసీసీఅధి కార ప్రతినిధి పున్నా కైలాశ్ నేత, వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి తదితరులు రేసులో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తు న్నా యి. ఇందులో స్రవంతి అభ్యర్థిత్వంపై అధిష్టానం పెద్దలు ఇప్పటికే ఆరా తీశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగు తోంది. గోవర్ధన్‌రెడ్డి కుమార్తెగా ఆమెకు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ నేతకు చాన్స్‌పై చర్చ కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందని టీపీసీసీ నేతలు, అధిష్టానం పెద్దల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బీసీలు ఉండడం, అక్కడ బీసీ వాదానికి కొంత సానుకూల పరిస్థితి ఉందని సర్వేలో తేలడం, ఇతర ప్రధాన పార్టీల నుంచి అగ్రవర్ణాల అభ్యర్థులు బరిలో ఉండనుండటం నేపథ్యంలో బీసీ నేతలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ క్రమంలో పల్లె రవి, చెరుకు సుధాకర్, కైలాశ్ నేతలలో ఎవరైతే బాగుంటుందన్న దానిపై టీపీసీసీ సర్వే చేయించినట్టు సమాచారం. మొత్తంగా సర్వే నివేదికల ఆధారంగా జాబితాను అధిష్టానానికి పంపనున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా 10 రోజుల్లో పూర్తవుతుందని, సెప్టెంబర్ నెల మొదట్లోనే తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
Munugode Politics: కారు వైపే కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కల్లో టీఆర్ఎస్కే మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉంటుందని, ఇది ఇతరపార్టీల విజయావకాశాలను ప్రభావితం చేస్తు ందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు చివరిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు దూరమే! మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్టు సీపీఐ నేత ఒకరు పేర్కొ న్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నందున.. కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలుతాయని, ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని ఆయన విశ్లేషించారు. ఇక కొంతకాలం నుంచి బీజేపీ, ప్రధాని మోదీల తీరుపై సీఎం కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని వామపక్షాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్కు ఇచ్చే మద్దతుతో కుదిరే పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశముంటుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లో కొత్తగూడెం, భద్రాచలం, మిర్యాలగూడ, ఖమ్మం లేదా పాలేరు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని వామ పక్షాలు కోరే చాన్సుందని అంటున్నాయి. టీఆర్ఎస్ నేతలతో చర్చలు షురూ.. బీజేపీకి బ్రేక్ వేయడంపై అధికార టీఆర్ఎస్ గట్టిగా దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ విధానాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సీపీఐ, సీపీఎంల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొంటున్నాయి. తమ పార్టీ నేతలను చర్చలకు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని.. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ నేతలతో మాట్లాడారని సీపీఐ, సీపీఎం నేతలు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌నేత మల్లు రవి కూడా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసి తమకు మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. బీజేపీని ఓడించగల పార్టీకే మద్దతు ఇస్తామని తమ్మినేని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్రస్థాయి సమావేశాల్లో చర్చలు మునుగోడు ఎన్నిక విషయంగా సీపీఐ, సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీపీఎం రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీలు శుక్రవారం జరుగగా.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్త్రృతస్థాయి సమావేశాలు శనివారం కూడా కొన సాగనున్నాయి. ఈ సమావేశాల్లో మునుగోడులో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలు చర్చించారు. నిజానికి మునుగోడులో పలుసార్లు సీపీఐ అభ్య ర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీకి కేడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎంకు కూడా కొంత ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలో కొందరు సీపీఐ నేతలు పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలని, టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం ఏమేరకు సమంజసమని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే గతంలో గెలిచినప్పుడు పొత్తుల వల్లే సాధ్యమైందని, పైగా నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఓటు బ్యాంకు తగ్గిందని మరికొందరు పేర్కొన్నట్టు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించి టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడమే సరైనదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక సీపీఎం కూడా టీఆర్ఎస్కు మద్దతివ్వడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టవచ్చన్న అంచనాకు వచ్చినట్టు సమాచారం. తమ నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించాలా, ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చాక చెప్పాలా అన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారుతాయోనన్న ఆలోచన ఉన్నట్టు సమాచారం. అందువల్ల రెండు పార్టీల సీనియర్లు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
కుటుంబపాలనకు చరమగీతం పాడాలి
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రజలను కోరారు. శుక్రవారం వరంగల్ వెళ్తూ మార్గమధ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులోని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందన్నారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడానికే ఈ నెల 21 మునుగోడులో అమిత్‌షా బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి సీఎం కేసీఆర్ చేసిన పాపాలను గోదావరి మాతా వెలుగులోకి తెచ్చిందన్నారు. కాగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్‌ను ఆ పార్టీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి సన్మానించారు. -
బల ప్రదర్శనకు ‘ప్రజాదీవెన’!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన టీఆర్ఎస్ శనివారం అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా టీఆర్ఎస్ బలాన్ని చూపించాలని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి రెండు వేల కార్లు, ఇతర వాహనాలతో అతి భారీ ర్యాలీగా మును గోడు బహిరంగ సభకు వెళ్లేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ సభను అత్యంత సవాల్‌గా తీసుకుని భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదిరోజులుగా క్షేత్రస్థాయిలోనే ఉండి శ్రమిస్తున్నారు. అమిత్ షా సభకు ముందే.. మునుగోడులో ఆదివారం జరగనున్న బీజేపీ బహి రంగ సభకు అమిత్‌షా హాజరవుతుండటంతో ఒక రోజు ముందే భారీ బల ప్రదర్శనకు టీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి మధ్యా హ్నం 2 గంటల సమయంలో మునుగోడుకు చేరు కుంటారు. ఈ కాన్వాయ్‌ను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రెండు వేలకుపైగా కార్లతో అనుసరించనున్నారు. ఇందులో వెయ్యి వాహనాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని నుంచి బయలుదేరుతాయి. మిగ తావి మార్గం వెంట ర్యాలీలో కలవనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చే కార్లు, వాహనాలు మధ్యాహ్నం 12 గంటలకల్లా పెద్ద అంబర్‌పేటకు చేరుకుని, అక్కడి నుంచి ర్యాలీగా మునుగోడుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ర్యాలీలో మునుగోడు సభకు వెళ్లనున్నారు. ‘ప్రజా దీవెన’ సభగా పేరు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు ‘మునుగోడు ప్రజాదీవెన’ సభగా పేరుపెట్టారు. ‘చలో మునుగోడు’ పేరిట ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల స్టిక్కర్లతో ఉన్న వాహనాల్లో పార్టీ శ్రేణులు సభకు తరలనున్నాయి. మరోవైపు మార్గం వెంట, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అభివృద్ధి.. సెంటిమెంట్.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు.. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, ఆర్థిక దిగ్బంధం ద్వారా ఇబ్బందిపెడుతున్న తీరును ఎండగట్టనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ రాజీనామాలు చేస్తే.. ప్రస్తుతం బీజేపీ తెలంగాణను కబళించడం కోసం రాజీనామాలను అడ్డు పెట్టుకుంటోందంటూ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని అంటున్నాయి. సభ వివరాలివీ.. ►మునుగోడు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ ‘మునుగోడు ప్రజాదీవెన’ సభ ప్రారంభమవుతుంది. ►సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి పెద్ద అంబర్పేట్, పోచంపల్లి ఎక్స్ రోడ్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకుంటారు. మధ్యలో పార్టీ శ్రేణులు కలుస్తాయి. ►సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ►వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఆరు చోట్ల పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. -
ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్... నియోజకవర్గ కేంద్రంలో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరవుతుండటంతో జనసమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ కోసం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మునుగోడులో మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు భారీ జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, క్రియాశీల నాయకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి గ్రామాలు, వార్డులవారీగా జనసమీకరణపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ సభ మర్నాడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌కు ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ సభ ద్వారానే బీజేపీలో చేరనున్న నేపథ్యంలో బీజేపీ సభను దృష్టిలో పెట్టుకొని జనసమీరణను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు మునుగోడు సభకు జనసమీకరణపై దృష్టి పెడుతూనే మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరికలను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుదారులైన 20 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. శనివారం మనుగోడు సభలో సీఎం సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు సభ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. -
సత్తా చాటేలా సభలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వాతావరణం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యమ పార్టీకి భారీ సభల నిర్వహణ కొత్త కాకపోయినా మంగళవారం వికారాబాద్‌లో, 20న మునుగోడులో నిర్వహించే సభలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పాదయాత్రల పేరిట ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ, వైఎస్సార్టీపీ వంటి పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు వికారాబాద్, మునుగోడు సభలను వేదిక చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మీడియా సమావేశాల్లో తరచూ ప్రధాని మోదీ పాలన వైఫల్యాలు, బీజేపీ ఎజెండాను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేస్తున్నా.. విపక్ష పార్టీలు క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలను పెంచుతుండటంతో బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను మొదలు పెట్టారు. జన సమీకరణపైనే దృష్టి.. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ (వికారాబాద్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్), కాలే యాదయ్య (చేవెళ్ల), మహేశ్‌రెడ్డి (పరిగి) పూర్తిగా జన సమీకరణపై దృష్టి పెట్టారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నడుమ విభేదాలు ఉన్నా రెండు వర్గాలు వేర్వేరుగా జనసమీకరణపై దృష్టి పెట్టాయి. వికారాబాద్ కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభించడంతో పాటు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేస్తారు. మునుగోడులో మరింత దూసుకుపోయేలా.. ఇతర పార్టీలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతలో ఒక అడుగు ముందున్న టీఆర్ఎస్ ఈనెల 20న భారీ బహిరంగ సభ ద్వారా మరింత దూసుకుపోయేందుకు సన్నాహలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా జన సమీకరణ బాధ్యతలు అప్పగించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు బహిరంగ సభ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఓ వైపు జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై మండల, మున్సిపల్ ఇన్చార్జిలు దృష్టి సారించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మందికి పైగా సర్పంచ్‌లు, పలువురు ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి మరిన్ని చేరికలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 21న మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ నేపథ్యంలో, 20న జరిగే బహిరంగ సభ వేదికపై బీజేపీని ఇరకాటంలోకి నెట్టే రీతిలో కేసీఆర్ ప్రసంగం ఉంటుందని పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు. సభ తర్వాతే అభ్యర్థి ప్రకటన! ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సర్వేల సంస్థల ద్వారా ఆశావహులు, వారి బలాబలాలపై ఆయన ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. టికెట్ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డికి అది సాధ్యం కాదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు, పార్టీ పరంగా గుర్తింపునిస్తామని రెండురోజుల క్రితం స్వయంగా హామీ ఇచ్చారు. గతంలో పార్టీలో చురుగ్గా పనిచేసిన వేనేపల్లి వెంకటేశ్వర్రావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడం ద్వారా అధినేత కేసీఆర్ రాజకీయ సమీకరణపై లోతుగా దృష్టి సారించారు. ఇక్కడ సభ ముగిసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘మునుగోడు’కు మండలాల వారీ ఇన్చార్జులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు కీలక నేతలను కేటాయించింది. ఆయా మండలాలను పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇటీవల గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను మొత్తం 14 మందికి బాధ్యతలను అప్పగించనుంది. మునుగోడు ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీగౌడ్ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇంచార్జులుగా బాధ్యతలు తీసుకున్న నాయకులు పూర్తి స్థాయిలో ఆయా మండలాల్లోనే మకాం వేస్తారని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి పూర్తయ్యేంతవరకు పర్యవేక్షిస్తారని తెలిపాయి. -
టీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లడిగే హక్కు లేదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక వేదికగా ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుటిల యత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రేవంత్‌రెడ్డి ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఉప ఎన్నికలో ప్రజాసమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు రాజేస్తూ రాజకీయలబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సాధారణ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బీజేపీ నెరవేర్చలేదని, ప్రతి పౌరుడి అకౌంట్లో రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను వంచించిందని విమర్శించారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించి పేదలను ఆదుకోవాలన్న ఆలోచనే బీజేపీకి రాలేదని, అలాంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను హామీలుగానే మిగిల్చిన టీఆర్ఎస్కు కూడా ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు, కోదండరాంతో కలసి పోరాడుదామని, సమన్వయంతో ముందుకెళదామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీజేపీ, టీఆర్ఎస్లకు బుద్ధి చెపుదామని రేవంత్‌రెడ్డి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. నిఖార్సైన కాంగ్రెసోడా... డిసైడ్ చేద్దాం రా! ట్విట్టర్ వేదికగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు మరో పిలుపునిచ్చారు. ‘మునుగోడు ఎజెండా ఏంటి? చర్చనా.. రచ్చనా? బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలా.. వ్యక్తిగత పంచాయితీలా? నిఖార్సైన కాంగ్రెసోడా... డిసైడ్ చేద్దాం రా... మన మునుగోడు... మన కాంగ్రెస్’అంటూ ఆయన తన ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. రేవంత్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎనమల రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం.. వీరుల త్యాగం.. నేటి మన స్వాతంత్య్రమని పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, సేవ రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పాలకులదని తెలిపారు. బీజేపీ పాలకులు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని విమర్శించారు. -
Munugode Politics: ఒక్క ఉప ఎన్నిక.. రెండు పార్టీలకు దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి, నల్లగొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరవేయడం ద్వారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈక్రమంలోనే ఎక్కడా చిన్న అవకాశం కూడా వదులుకోకుండా.. ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని.. చేరికలు, ఇతర మార్గాల ద్వారా టీఆర్ఎస్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. ఈ నెల 21న అమిత్‌షా సభ నిర్వహించడం, ఆ సభలోనే రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరనుండటం ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం బండి సంజయ్ పాదయాత్ర మధ్యలో నిర్వహించిన సమావేశం సందర్భంగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు, బొమ్మ శ్రీరాం తదితరులు తరుణ్ చుగ్‌తో భేటీఅయ్యారు. 21న అమిత్ షా సభ సందర్భంగా బీజేపీలో చేరనున్నారని, ఈ మేరకు చర్చలు జరిపారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెక్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీపై ఎలాంటి విమర్శలూ చేయలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ పట్ల వ్యతిరేకతతో వ్యవహరించాడని.. ఆయన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందనే ఆరోపణలు చేశారు. తద్వారా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. అంతేగాకుండా రాజగోపాల్‌రెడ్డితోపాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీలో చేరుతున్నారు. తద్వారా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెక్ పెట్టవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక బీజేపీ టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుంది. బండి పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల పర్యటనలన్నీ టీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జనంలోకి వెళుతున్నవే. 21న మునుగోడు నియోజకవర్గంలో జరిగే అమిత్‌షా సభలోనూ టీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అట్టహాసంగా అమిత్ షా సభ మునుగోడుతోపాటు తెలంగాణ ప్రజలను ఆకర్షించేందుకు అమిత్ షా సభను అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. గణనీయ సంఖ్యలో జనాన్ని తరలించి అమిత్‌షా సభను విజయవంతం చేయడం, పార్టీలో చేరికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, ఉప ఎన్నిక ఊపుతో పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. -
మునుగోడు కాంగ్రెస్ కంచుకోట
వైరా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా అని, అక్కడ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై పార్టీ ఎన్నికల కమిటీ పూర్తిస్థాయిలో పని చేస్తోందన్నారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా ‘ఆజాదీ కా గౌరవ్’ పేరుతో ఖమ్మం జిల్లాలో 75 కి.మీ. మేర భట్టి చేపట్టిన పాద యాత్ర శుక్రవారం కొణిజర్ల, వైరాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్లమెంట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ కబళించి దేశ ద్రోహు లను చేరదీసి ఈడీ తదితర దర్యాప్తు వ్యవస్థలను గిట్టని రాజకీయ పార్టీ నాయకులపై ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టాలనే కుట్ర జరుగుతోందన్నారు. దేశ చరి త్రను తప్పుగా చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బాధ కలిగి స్తున్నాయని చెప్పారు. దేశానికి లౌకికవాదం, ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ యాత్రలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో భట్టికి పలుచోట్ల మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి వైరా మీదుగా వెళ్తున్న ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పినపాక వద్ద భట్టి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. -
మునుగోడు మనదే!
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నిక మునుగోడులో జరగబోతోందని.. ఇక్కడ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధి కారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక్కో మోదీగా మారి బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంజయ్ పాదయాత్ర సాగింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, మరికొందరు సీనియర్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని కొంత దూరం నడిచారు. మధ్యాహ్నం ఎన్నారంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర భోజన శిబిరం వద్ద బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జులతో సంజయ్, తరుణ్ చుగ్, ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికలో ఓటుకు రూ.30 వేలు, మద్యం పంచేందుకు టీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చినా బోల్తాపడ్డారని గుర్తుచేశారు. గెలుపు ఖాయమైనట్టే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఇప్పటికే ఖాయమైందని సంజయ్ పేర్కొ న్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆటలు సాగబోవన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే పైసలకు ఆశ పడి సీపీఐ నేతలు ఇప్పటికే పొత్తుకు సిద్ధమ య్యారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ కేడరే ఆ పార్టీ నాయకత్వంపై కోపంతో ఉందని, ఆ పార్టీ నేతలు కొట్లాడుకోవడమే తప్ప తమకు పోటీ కాదని పేర్కొన్నారు. ఉప ఎన్నిక సమ యంలో తాను మునుగోడులోనే మకాం వేస్తానని చెప్పారు. మునుగోడు నియోజక వర్గంలో కేంద్ర మంత్రి అమిత్‌షా సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. ఈ నెల 21న సభ జరుగుతుందని సంజయ్ స్పష్టం చేశారు. ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చే కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదేనని చెప్పారు. మహిళా సాధికారతకు తోడ్పాటు మహిళా సాధికారతకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రపతి పీఠంపై ఎస్టీ మహిళను కూర్చోబెట్టడంతోపాటు ఆరుగురు మహిళ లకు గవర్నర్లుగా, నలుగురికి సీఎంలుగా, 12 మందిని కేంద్ర మంత్రులుగా చేశారని సంజయ్ చెప్పారు. అదే తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు తొలి ఐదేళ్లు ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. జనం కసితో ఉన్నారు: తరుణ్ చుగ్ మునుగోడులో బీజేపీ విజయానికి అవసర మైన వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు తరుణ్ చుగ్ సూచించారు. మునుగోడులో బీజేపీ గెలిచి తీరాలన్నారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చే కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై జనం కసితో ఉన్నారని, బీజేపీ కార్యకర్తలు హనుమంతుడి వారసులుగా మారి కేసీఆర్ కోటను కూల్చేయాలని పిలుపునిచ్చారు. 15 కిలోమీటర్లు యాత్ర శుక్రవారం సంజయ్ పాదయాత్ర పల్లివాడ స్టేజీ నుంచి ఎన్నారం, పెద్దబావిగూడెం, కుంకుడుపాముల, పల్లెపహాడ్ క్రాస్‌రోడ్డు, పెరు మాండ్లబావి మీదుగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వరకు 15 కిలోమీటర్ల మేర సాగింది. రాఖీ పండుగ కావడంతో దారిపొడవునా మహిళలు సంజయ్‌కు రాఖీలు కట్టారు. -
మన మునుగోడు.. మన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక జరిగితే సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక నినాదంతో వెళ్లాలని నిర్ణయించింది. ‘మన మునుగోడు–మన కాంగ్రెస్’పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టుమట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మూడంచెల కార్యాచరణను రూపొందించింది. ఈ మేరకు గురువారం గాంధీ భవన్లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉపఎన్నికపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ మునుగోడు వ్యూహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, నల్లగొండ, భువనగిరి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్‌నాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి, ఇటీవలే పార్టీలో చేరిన డాక్టర్ చెరుకు సుధాకర్ పాల్గొన్నారు. కార్యాచరణ ఇలా.. ►ఈ నెల 13 నుంచి 16 వరకు నియోజకవర్గంలో ‘ఆజాదీ గౌరవ్ యాత్ర’లు. 13న నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు 13 కి.మీ. నిర్వహించే ఈ యాత్రకు రేవంత్, భట్టి హాజరుకానున్నారు. ►16 నుంచి 19వ తేదీ వరకు మండలస్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలి. 16న నాంపల్లి, 17న మర్రిగూడ, 18న చండూరు, 19న మునుగోడులో నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు చెందిన కార్యకర్తలతో భేటీ కావాలి. ఈ సమావేశాల్లో రేవంత్, భట్టి ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ►20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ‘మన మునుగోడు–మన కాంగ్రెస్’నినాదంతో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో ముఖ్య నాయకులు పర్యటించాలి. ►21న అమిత్ షా సభ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించాలి. అక్కడ కేఏ పాల్.. ఇక్కడ ఆర్జీ పాల్: రేవంత్ పార్టీ అనుబంధ సంఘాల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ అక్కడ కేఏ పాల్ ఉంటే... ఇక్కడ ఆర్జీ పాల్ ఉన్నాడని, ఇక నుంచి రాజగోపాల్‌రెడ్డిని ఆర్జీ పాల్ అని పిలవాలని ఎద్దేవా చేశారు. పట్టుదలతో పనిచేసి మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించాలని.. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమర్పించిన నిమిషాల వ్యవధిలోనే స్పీకర్ ఆమోదించారంటేనే ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని అర్థమవుతోందని అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మధుయాష్కీగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉపఎన్నికలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన పార్టీలో ఉందని చెప్పారు. అయితే అభ్యర్థి ఎవరన్నది సర్వేల ఆధారంగా అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. -
ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్19, 2021 నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి కాలపరిమితి మార్చి29, 2027వరకు ఉండడంతో ఆ కాలపరిమితికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి కె.విజయానంద్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. శాసన సభ్యుల కోటాలో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియను మార్చి 28లోగా ముగించాలని తెలిపింది. మార్చి 14 నుంచి నామినేషన్ల స్వీకరణ, మార్చి 15న నామినేషన్ల పరిశీలన, మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, అవసరమైతే మార్చి 24న ఎన్నిక జరుగుతుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా ఏపీ శాసనసభ ఉపకార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి, సహాయరిటర్నింగ్ ఆఫీసర్‌గా ఏపీ శాసనసభ ఉపకార్యదర్శి ఆర్.వనితారాణిని నియమిస్తూ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం
మొత్తానికి ఉపఎన్నికల పండుగ ముగిసింది. ఉత్తరాదిన బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ మళ్లీ పాగా వేసింది. కానీ ఆంధ్ర, తెలంగాణల్లో డిపాజిట్ కోల్పోయినందుకు కాంగ్రెస్ చాలా సంతోషంగా ఉన్నట్లుంది. వ్యూహాత్మకంగా తెరాసను ఓడించింది తానే అనే భావనతో ఉంది. అయితే బీజేపీకి తన ఓట్లను ధారాదత్తం చేయలేదని, చేయిగుర్తుకు కాకుండా కమలానికే ఓటు వేయాలని ప్రచారం చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. మన అవకాశవాదాలు ఆకాశానికి ఎదగడం, మన సిద్ధాంతాలు (ఉంటే గింటే) పాతాళానికి పడిపోవడం మామూలేకదా బ్రదర్. రాజకీయాల్లో విలువలు వలువలు అని కొందరు చేసే గోల పక్కకు బెట్టి అందరూ ఓటుకు నోటు విలువ పెంచారని మనమంతా గర్వించాలి. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈసారి ఓటర్లు డబ్బుల పంపిణీ విషయమై సమానత్వం కోసం పోరాడారు. అందరికీ సమానావకాశాలు ఉండాలనే సూత్రం ఈసారి ఓటర్లకు బాగా వంట బట్టింది. కొందరికి 6 వేల రూపాయల కవర్లు ఇచ్చి మమ్మల్ని కవర్ చేయకుండా వెళ్లిపోతారా అని రోడ్లెక్కి ధర్నా చేసారు మరి. పక్క ఇంట్లో ఓటుకు ఆరువేల చొప్పున నలుగురికి 24 వేలిచ్చి, తమ ఇంట్లో ఓటర్లను నోట్లతో గుర్తించకపోవడం ఎంత ఘోరమైన అన్యాయం? దాన్ని నిలదీసి అడగడమే కరెక్టు. అడక్కపోవడం రాజ్యాంగ వ్యతిరేకం. ఓటుకు నోటు గురించి ప్రజాస్వామ్యవాదులు అంతగా గాభరాపడడం దండగ అనిపిస్తుంది. డబ్బు తీసుకుని కూడా ఓట్లేయలేదనడం, వాళ్లిచ్చే డబ్బు తీసుకోండి కాని మాకే ఓటేయండి అనడం చాలా దారుణం. రాకరాక అవకాశంవస్తే ఎందుకు తీసుకోగూడదనే తర్కం జనంది. డబ్బు తీసుకుని ద్రోహం చేస్తారని కూడా అనలేము. అందుకే ఈటెల మెజారిటీ 25 వేలు దాటలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థుల కాట్లాట కాదు. ప్రభుత్వాల కొట్లాట. అటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ఎన్నికల కమిషన్, ఆల్ పవర్ ఫుల్ బీజేపీ, తనచేతిలో అంతకు ముందు చావుదెబ్బతిన్న పార్టీలో చేరి ఆ పార్టీకి మనుగడ ఇచ్చేంత మంచితనం కలిగి, చాలా పలుకుబడి ఉన్న ఉత్తమ అభ్యర్థి ఈటెల, బీసీ కులం వెన్నుదన్ను, వాటికన్న గొప్పగా డబ్బు, దాన్ని మించిన మతం మత్తు, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడానికి కూడా సంసిద్ధంగా ఉండడం ఒకవైపు కలిసి వచ్చాయి కదా. ప్రత్యర్థులెవరు? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, గొప్ప వ్యూహకర్త హరీశ్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డబ్బు ఇవ్వకున్నా పనిచేసిన కార్యకర్తలు, డబ్బు తీసుకుని నీతిమంతంగా ఓటేసిన ఓటర్లు కలిసి ఇటునించి ఎదురీత ఈదారు. పాపం ఈ మత్త మత్తు గజాల తొక్కిసలాటలో పార్టీలు, నేతలు, అభ్యర్థులు, ఓటర్లు నలిగిపోయారు. ఈ మహాసంకుల కులసమరంలో సామాన్యుడి మీద పడిన గ్యాస్ బండధర గురించి ఎవడికి పట్టింది? హమ్మయ్య పెట్రోల్ ధర తగ్గిం చారని అనుకుంటే డొమెస్టిక్ వర్కర్ లక్ష్మి ‘ఏం లాభమయ్యా బండ ధర బెంచెగద’ అన్నది. పెట్రోల్ ధర వంద దాటించినంత మాత్రాన 5 రూపాయలు తగ్గిస్తే మోసమంటారా? వాణిజ్య గ్యాస్ బండ ధర 266 రూపాయలు పెంచి రూ.2,130కి తీసుకుపోయినా వంట గ్యాస్ పెంచలేదని భజనపరుల తర్కం. పరోక్షంగా దీని దెబ్బ సామాన్యుల మీదే కదా. అలాగే వంట గ్యాస్ బండ ధర 2021 జనవరిలో రూ. 746లు ఉండగా, అక్టోబర్‌లో ఇది రూ. 952కు పెరిగింది. ఇదివరకు ఎన్నికలు ఉంటే ధరలు పెంచడానికి కాస్త సిగ్గుపడే వారు. నేడు నాయకులను చూసి సిగ్గు గారు సిగ్గుపడి పారిపోతారు. నేతల భజన చేస్తూ ఓట్లు వేస్తుంటే, గ్యాస్ ధర పెంచడానికి రాజ కీయ పార్టీలు ఎందుకు సిగ్గుపడతాయి? సారా మత్తు, డబ్బు మత్తు, కులం మత్తు, వీటన్నింటికి మించి దేవుడి మత్తులో ఓటర్లు మునిగిపోతే నాయకులు ధరలు పెంచకుండా తగ్గిస్తారా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ డీన్,స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
ఆటలో అరటి పండులా మారిన తెలంగాణ కాంగ్రెస్
-
మూడు స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. ఉప ఎన్నికలు జరిగిన దిన్హత, గోసబా, ఖర్దహా, శాంతిపూర్ నాలుగు నియోజకవర్గాల్లో అధికార తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ నాలుగు స్థానాల్లో ఓటమిపాలు కాగా ఏకంగా మూడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ విజయం ప్రజల విజయం. విద్వేషంతో రాజకీయం చేసేవారిని కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే టీఎంసీని బెంగాల్ ప్రజలు ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బెంగాల్‌ను అన్ని రంగాల్లో ఉన్నతస్థానంలో నిలుపుతాము’ అని సీఎం మమతా ట్విటర్లో పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ, సీపీఐ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడ్డాయని ట్వీటర్లో తెలిపారు. -
ఆ ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలు ఆపాలి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు, నియోజకవర్గాలకు అనుకునే ఉండే ప్రాంతాల్లో ఉప ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పార్టీలను కోరింది. కొన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు, నియోజకవర్గాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నికల కార్యకలాపాలు చేపట్టడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు జరిగే పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గంలో అమలయ్యే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు సంబంధిత జిల్లా అంతటికీ వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లా, నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఎన్నికల నియమావళితోపాటు భౌతికదూరం పాటించడం వంటి కోవిడ్–19 నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. -
నేడే భవానీపూర్ ఉప ఎన్నిక
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పోలింగ్ బూత్‌ల నుంచి 200 మీటర్ల వరకు సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ తరఫున మమతా బెనర్జీ బరిలో ఉంటే, బీజేపీ ప్రియాంక టైబ్రెవాల్‌ను బరిలో దింపింది. ఇక సీపీఐ(ఎం) తరపున స్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని 97 పోలింగ్ కేంద్రాల్లోని 287 బూత్‌ల లోపల సెంట్రల్ పారా మిలటరీకి చెందిన ముగ్గురేసి జవాన్లను మోహరించారు. ఇక పోలింగ్ బూత్ వెలుపల భద్రత కోసం కోల్‌కతాకు చెందిన పోలీసు అధికారులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో అయిదుగురికి మించి గుమిగూడడాన్ని నిషేధించారు. -
2023 ఎన్నికలకు సెమీఫైనల్‌గా హుజురాబాద్ ఉప ఎన్నిక ..!
-
నామినేషన్ దాఖలు చేసిన మమత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి టీఎంసీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఉపఎన్ని కలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీకి మెజారిటీ రావడంతో సీఎం పదవి చేపట్టారు. ఆరు నెలల తర్వాత కూడా సీఎంగా కొనసాగాలంటే ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో ఆమె గెలిస్తేనే సీఎంగా కొనసాగుతారు. నామినేషన్ వేసే సమయంలో మమతతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రి భార్య ఫిర్హాద్ హకిమ్‌తో కలసి వెళ్లారు. అనంతరం పిర్హాద్ మాట్లాడుతూ.. నంది గ్రామ్‌లో మమతపై కుట్రపన్ని ఓడించారని, ఇప్పు డు భవానీపూర్ ప్రజలు మమతను రికార్డు మెజా రిటీతో గెలిపించి చరిత్రను తిరగరాస్తారని వ్యాఖ్యా నించారు. భవానీపూర్ నుంచి 2011, 2016 ఎన్ని కల్లో మమత పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ తరఫున ప్రియాంక తిబ్రేవాల్.. భవానీపూర్‌లో మమతకు పోటీగా బీజేపీ నేత ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఆమె పేరును నామినేట్ చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తే ఈ ప్రియాంక తిబ్రేవాల్. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది. ఆమెతో పాటు సంసేర్గంజ్‌కు మిలాన్ ఘోష్, జంగీపూర్‌కు సుజిత్ దాస్‌లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. -
కొండా సురేఖ కండిషన్స్
-
ఏం చేశారని ఓట్లు అడుగుతారు?
హుజూరాబాద్(కరీంనగర్): హుజూరాబాద్ నియోజకవర్గానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఓట్లు అడుగుతారని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని అడిగారు. పెట్రోల్ధర పెంచామని ఓట్లు అడుగుతారో.. ప్రభుత్వ రంగసంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతున్నందుకు ఓట్లు అడుగుతారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆదివారం మండలంలోని సింగాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన యువ చైతన్య సంఘం,ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన వాల్మీకీ బోయ సంఘం నేతలు,జమ్మికుంట మండలం నగురం గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరగా.. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతేడాది వ్యవసాయ పనులకు ట్రాక్టరు కిరాయి ఎకరానికి రూ.3వేలు ఉంటే.. నేడు రూ.5వేలు అడుగుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రూ.5వేలు రైతుబంధు కింద రైతులకు ఇస్తే డీజిల్‌ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం రూ.2,500 వసూలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలను భర్తీచేశామని, త్వరలో మరో 50నుంచి 60వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏమీలేదని,ఇక్కడ అభివృద్ధి మాత్రం కుంటుపడుతుందని తెలిపారు. గడియారాలు, కు ట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను పంచుతూ ఈటల హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారని అన్నారు. చదవండి: దళిత బంధు రాదంటూ ఈటల తప్పుడు ప్రచారం: మంత్రి హరీశ్ రావు -
కాంగ్రెస్ పార్టీలో మొదలైన సందడి.. ఆ ఎన్నికల కోసం ఏకంగా..
కరీంనగర్‌టౌన్: కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు, పాతతరం కార్యకర్తలు మళ్లీపార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు సంస్థాగత కసరత్తును ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలోనే టీఆర్ఎస్కు, హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ వ్యవహారంతో జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపడంతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ల ఎత్తులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనే ఏకైక లక్ష్యంతో హుజూరాబాద్ టికెట్ విషయంపై పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో కసరత్తునుముమ్మరం చేసింది. ఇటీవలనే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్కంఠాగూర్‌తో పాటు రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో సమావేశం నిర్వహించి హుజూరాబాద్‌లో గట్టిపోటీ ఇస్తూ సీటును కైవసం చేసుకునే దిశగా కార్యకర్తలకు నిర్దేశనం చేశారు. దీంతో జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఇన్చార్జి మేడిపల్లి సత్యం, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు అనుబంధ విభాగాల నాయకులంతా పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టారు. హుజురాబాద్ టికెట్‌కు దరఖాస్తుల సందడి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక కోసం మొదట మాజీ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే సాంబయ్యల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ పీసీసీ సమావేశంలో స్థానిక నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని వచ్చిన సూచన మేరకు ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు డీసీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో 18 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక, ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేత ఈటల ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి.. ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా మాణిక్యం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Huzurabad Bypoll: ‘రాజేందరన్న నువ్వు బాధపడకు.. గెలిచేది మనమే’ -
సాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో ఇది కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ తరఫున బరిలో నిలబడి విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ జానా రెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన తనయుడు రఘువీర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘సాగర్’లో పోటీకి.. నన్నెవరూ అడగలేదు) ఈ నేపథ్యంలో నేడు జానా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు. అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ప్రకటించారు. -
సాగర్ ఉప ఎన్నిక వరకు వాయిదానే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి అభిప్రాయాన్ని గౌరవించి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక విషయంలో జానారెడ్డికి చిన్న ఇబ్బంది కలిగినా అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారాన్ని తేల్చకపోవడమే మంచిదని వారు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ భేటీ రేవంత్ మినహా మిగిలిన నలుగురు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తామని, అయితే సాగర్ ఉప ఎన్నిక కూడా రెండు నెలల్లోపు ముగిసే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధ్యక్షుడు ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన చేయకపోవడమే మేలని దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో మాణిక్కంకు వారు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ముందే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎల్పీ నేత భట్టికి హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన భట్టి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాష్ట్ర ఇన్చార్జికి చెప్పినట్టు సమాచారం. పార్టీలోని ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సాగర్ ఉప ఎన్నిక వరకు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఆయన వెల్లడించారు. అలాగే ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు జరిపారు. ప్రకటనలో ఆలస్యం వద్దని.. వెంటనే వెల్లడిస్తే బాగుంటుందని సంపత్ అభిప్రాయపడగా, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, వంశీలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని చెప్పారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఇన్చార్జీ.. ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని నేతలకు చెప్పి సమావేశాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో సోనియా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఇతర కమిటీల నియామక ప్రక్రియలు వాయిదా పడటం లాంఛనమే. -
మా అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: సుబ్బారెడ్డి
సాక్షి, చిత్తూరు: తిరుపతి ఉపఎన్నికపై చర్చించామని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి ఉపఎన్నికపై వైఎస్సార్సీపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపఎన్నికపై సమాలోచనలు చేశారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తిరుపతి బై ఎలక్షన్‌పై చర్చించాము. మా అభ్యర్థి ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాము. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి మాత్రమే మేము ప్రచారం చేస్తాం. గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించటమే లక్ష్యంగా పనిచేస్తాము. మేము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి’అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాధరెడ్డి, శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, వెంకటేగౌడ్, ఎంపీ రెడ్డెప్పలు పాల్గొన్నారు. -
‘తిరుపతి’పై బీజేపీ, జనసేన చర్చలు
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు మిత్రపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. బీజేపీ తరఫున పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీలు పాల్గొనగా.. జనసేన నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే బీజేపీ, జనసేన కలసి పోటీ చేసే విషయాన్ని మాత్రం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని పవన్‌కల్యాణ్ అన్నట్లు సమాచారం. కేంద్ర బృందంతో విచారణ జరిపించాలి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యానికి గురికావడంపై ప్రత్యేక కేంద్ర బృందంతో అధ్యయనం, విచారణ చేయించాల్సిందిగా ప్రధాని మోదీని కోరాలని సమావేశంలో నిర్ణయించినట్టు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. నివర్ తుపాను మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనబరుస్తోందని బీజేపీ, జనసేనలు అభిప్రాయపడినట్టు ఆ ప్రకటన పేర్కొంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఫలితంగా ఉపాధి అవకాశాలు క్షీణించాయని సమావేశం అభిప్రాయపడినట్టు వివరించింది. -
సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. చదవండి: జమిలి ఎన్నికలకు సిద్ధం కండి.. ఈ ఎన్నికలో గెలిచి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తన సత్తాను నిలుపుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తక్షణ చర్యలు ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలోని హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే రైతులందరి ఖాతాల్లో ఈ ఏడాది రెండో విడత రైతుబంధు డబ్బులను జమ చేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి యాసంగి సాగు కోసం రైతు బంధు పంపిణీపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు సాగర్ నియోజకవర్గంలో చేపట్టదలిచిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో పాటు మరో పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కోసం.. మొత్తంగా దాదాపు రూ.600 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. బోతలపాలెం–వడపల్లి ఎత్తిపోతల పథకాన్ని దామరచెర్ల మండలం వడపల్లి వద్ద నిర్మించేందుకు రూ.229.25 కోట్లతో పరిపాలన అనుమతులు ఇవ్వగా, సాగర్ కాల్వలపై దున్నపోతులగండి– బాల్నేపల్లి–చంపాల తండా ఎత్తిపోతల పథకాన్ని అడవిదేవునిపల్లి మండల పరిధిలోని చిట్యాల గ్రామం వద్ద నిర్మించేలా రూ.219.90 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా అప్రోచ్ చానల్, ఫోర్‌బే, పంప్‌హౌస్, ప్రెషర్‌మెయిన్, డెలివరీ సిస్టమ్, గ్రావిటీ కెనాల్ల నిర్మాణ పనులు చేయనున్నారు. ఇక రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మూసీ నదిపై కేశవాపురం–కొండ్రపోల్ ఎత్తిపోతల పథకాన్ని దామరచర్ల మండల పరిధిలోని కేశవాపురం గ్రామం వద్ద నిర్మించేలా రూ.75.93 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఈ ఎత్తిపోతల ద్వారా 5,875 ఎకరాలు సాగులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక టీఎస్ఐడీసీ కిందే నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఫోర్ షోర్లో నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు అనుమతులిచ్చారు. రూ.72.16 కోట్లతో దీనికి అనుమతులు ఇవ్వగా, 4,175 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందివ్వాలని నిర్ణయించారు. వీటితో పాటే ఏఎంఆర్పీ హైలెవల్ కెనాల్ పరిధిలోని డి్రస్టిబ్యూటరీ 8, 9లకు లో లెవల్ కెనాల్ పంప్‌హౌస్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాతో పాటు, ఈ డి్రస్టిబ్యూటరీల పరిధిలోని పొదలు, పూడిక తీసివేత కోసం 2.76 కోట్లతో అనుమతులు ఇచ్చారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వగా, ప్రస్తుతం ఏ సమయమైనా ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ముందే వీటికి అనుమతులిచ్చారు. -
‘సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సుదీర్ఘ కాలం.. వరుస విజయాలతో రికార్డు నమోదు చేసిన జానారెడ్డి(కాంగ్రెస్)పై 2018 ఎన్నికల్లో నోముల(టీఆర్ఎస్) విజయం సాధించారు. ఇక, ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న క్రమంలో.. తిరిగి తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికార పార్టీ ఆరా తీయడం మొదలుపెట్టింది. పార్టీ వర్గాల ద్వారా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసూ్తనే.. నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోందని సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల అనుభవం నేపథ్యంలో ఈసారి గులాబీ అధినాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సవాల్‌గా నిలవనున్న ఉప ఎన్నిక?.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, దుబ్బాకలో అపజయం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గ్రేటర్’ ఫలితాలు కూడా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఆ పార్టీకి సవాల్‌గా మారింది. దీని కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేస్తోంది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో 9 చోట్ల టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. కానీ, ఆ వెనువెంటనే 2019లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాల్లోనూ (నల్లగొండ, భువనగిరి) ఓటమిని చవి చూసింది. అయితే, తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయినా, ఇప్పుడు.. నాగార్జునసాగర్‌లో తన స్థానాన్ని తానే నిలబెట్టుకోవాల్సిన ఆత్మరక్షణలో ఆ పార్టీ ఉంది. సమాచార సేకరణలో నిఘా వర్గాలు.. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నోముల నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణంతో ఈ స్థానం నుంచి ఎవరిని పోటీకి పెడతారన్నది చర్చనీయాంశం అయింది. నోముల తనయుడు, భార్యలో ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపైనే ప్రచారం సాగుతోంది. కానీ, దుబ్బాక ఫలితం తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం వారసత్వ రాజకీయాలపై పునరాలోచన చేస్తోందన్న చర్చ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థి ఎంపికకు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి ఓ నివేదిక సీఎం కేసీఆర్‌కు అందిందని చెబుతున్నారు. -
డిసెంబర్లో హజీపూర్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: బిహార్‌లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్‌కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్‌తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం) -
మాట తప్పడమే బాబు నైజం!
సాక్షి, తిరుపతి: చంద్రబాబు అసలు నైజం బట్టబయలైంది. మాటకు కట్టుబడే అలవాటు తనకు లేదనే విషయం మరోసారి రుజువైంది. ప్రజాప్రతినిధి ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఏకగ్రీవంగా అవకాశం కల్పించడమనే సంప్రదాయం రాష్ట్రంలో ఉంది. దీనికి కట్టుబడి అప్పట్లో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ మృతితో వచ్చిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ సమయంలో ఎంత ఒత్తిడి వచ్చినా సంప్రదాయాన్నే గౌరవించింది. అలాగే తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఆయన కుటుంబంలోనే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అంతా అనుకున్నారు. నాటి విలువలకు నేడు టీడీపీ, బీజేపీ తిలోదకాలిచ్చాయి. (పోలవరంపై తప్పుడు ప్రచారం) ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తిరుపతి ఉపపోరులో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సోమవారం చంద్రబాబు సైతం టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించారు. అయితే పనబాక కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగింది. ఆమె కూడా టీడీపీ నుంచి జారిపోకుండా చూసుకునేందుకు అభ్యర్థిగా ఖరారు చేశారని సమాచారం. బీజేపీ అభ్యర్థి ఎంపిక సైతం కొలిక్కివచ్చినట్లు తెలిసింది. ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిని బరిలో దింపనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈక్రమంలో టీడీపీ, బీజేపీ దొందూ.. దొందే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమే అనుకుంటున్నారు. చదవండి: ‘అచ్చోసిన’ ఆరు అబద్ధాలు -
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, దుబ్బాక: కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందని ఉత్కంఠ నెలకొంది. టీవీల ముందుకూర్చున్న నేతలు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ బ్రేకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్‌లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. చదవండి: (దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!) 10వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా, మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలుకానుంది. ఈ ప్రక్రియలో14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 రౌండ్లలో అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రికార్డ్ చేస్తూ లెక్కింపు చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పాసులు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఇందూర్ కాలేజి వరకు అనుమతి ఇస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో 14 టేబుళ్ల మధ్య 6 అడుగల భౌతిక దూరం ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. -
దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!
సాక్షి, హైదరాబాద్: గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్ సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. నామినేషన్ల షెడ్యూల్‌కు ముందే టీఆర్ఎస్తోపాటు బీజేపీ పోటాపోటీ ప్రచారపర్వంలో అడుగుపెట్టగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఖరారులో కొంత ఆలస్యం చేసింది. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు. గెలుపు తథ్యం: టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో 2014 మినహా వరుస ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు ఓటింగ్ రూపంలో కలిసి వచ్చాయని టీఆర్ఎస్ శిబిరం అంచనా వేస్తోంది. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా ప్రచారం సందర్భంగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండగా మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఆరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 78 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలు తమకు అనుకూలంగా ఓటు వేశాయని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసినా క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పార్టీ యంత్రాంగం కలసి వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేసిన హడావుడి ఎంతమేర ప్రభావం చూపిందనే అంశాన్ని టీఆర్ఎస్ విశ్లేషించుకుంటోంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లోనూ తమదే పైచేయిగా ఉంటుందని అంచనాకు వచ్చింది. విజయం నల్లేరు మీద నడక: బీజేపీ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు తర్వాతి కాలంలో పార్టీ రాష్ట్రస్థాయి యంత్రాంగం కూడా తోడైంది. చాలా గ్రామాల్లో కనీస స్థాయిలో కేడర్ కూడా లేని బీజేపీ ప్రచారపర్వంలో మెరుగైనట్లు లెక్కలు వేసుకుంటోంది. తొలుత యువత తమకు అనుకూలంగా ఉందనే లెక్కలతో బరిలోకి దిగిన బీజేపీ... ప్రచారపర్వంలో బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గతంలో రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన రఘునందన్... ఈసారి ఓటర్లలో తనపై కొంత సానుభూతి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, సిద్దిపేట, హైదరాబాద్‌లో డబ్బు పట్టుబడటం వంటి పరిణామాలతో పార్టీపై సానుభూతి పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో రెండో స్థానానికి పరిమితమవుతామని భావించిన బీజేపీ... మంగళవారం జరిగిన పోలింగ్ సరళి తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని భావిస్తూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. చాప కింద నీరులా ఫలితం: కాంగ్రెస్ దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా పార్టీ ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో మకాం వేసి చేసిన ప్రచారం కలసి వస్తుందనే ధీమాతో ఉంది. అయితే అధికార టీఆర్ఎస్కు ఉండే అనుకూలత, బీజేపీ దూకుడుకు తగ్గట్టు తాము హడావుడి చేయలేకపోయామనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే అంశాన్ని చెప్పగలిగామని, కానీ బీజేపీ మాత్రం హడావుడికి మాత్రమే పరిమితం అయిందని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ కేడర్‌ను పదిలపరచుకోవడంతోపాటు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలన్న తమ వ్యూహం ఫలించినట్టేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజున ఏకంగా పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లోకి వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. -
దుబ్బాక పోలింగ్ 82.61%
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. 82.61% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 1,98,807 ఓటర్లు ఉండగా.. ఇందులో 1,64,192 మంది (82.61%) తమ ఓటు హక్కును విని యోగిం చుకున్నారు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 1,90,463 మంది ఓటర్లు ఉండగా 1,64,280 మంది (86.24%) తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.63% పోలింగ్ తగ్గింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ లన్నీ దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ప్రతీ ఓటు కీలకంగా భావించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరుగుతుందని అం దరూ భావించారు. కానీ కోవిడ్ నేపథ్యంలో గతం కన్నా పోలింగ్ శాతం తగ్గిందని అధి కారులు చెబుతున్నారు. ఇది ఎవరికి నష్టమనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయంగా ఉద్రిక్తతలకు తావిచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో పోలీసు సిబ్బంది, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గమంతటా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. –దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్, శేరుపల్లి బంధారం, తొగుట మండలం పెద్దమాసాన్ పల్లి, ఇందిరానగర్లలో పోలీసులకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. –రాయపోల్ మండలం మంతూర్, బేగంపేట, దుబ్బాక రూరల్ మండలం బొప్పాపూర్, రామక్కపేట, చేగుంట మండలం కర్నాలపల్లి పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లో, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బొప్పాపూర్‌లో ఓటు వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తొగుట మండలం తుక్కాపూర్‌లో ఓటు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ సరళి, ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ పరిశీలించారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, తర్వాత చేగుంట మండలం వడియారం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందితో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. కోవిడ్ నిబంధనల అమలు, శాంతి భద్రతలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతి హోళికేరి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జిల్లాలోని పోలింగ్ తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరాడని ప్రచారం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్లో చేరాడని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల మద్దతు తనకే ఉందని గ్రహించిన ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన ప్రతిష్టకు భంగం కల్గించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌కు ఫిర్యాదు చేశారు. -
ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
-
ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఉప ఎన్నికలో మొత్తం 82.61 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 10న వెలువడనుంది. కాగా సాయంత్రం చూసుకుంటే 81.14 శాతం పోలింగ్ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్ బాధితులకు అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా పోలింగ్ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. దీంతో పోలింగ్ శాతం మరోసారి 85శాతంకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. హరీష్‌రావు సమీక్ష దుబ్బాకలో పోలింగ్ సరళిని సిద్దిపేట తన నివాసం నుంచి మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి వివిధ మండలాల ఇంచార్జ్‌లు ఆయనతో పాటు ఉన్నారు. కాగా, తొగుట మండలం వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చేగుంటలో దొంగ ఓటు.. చేగుంటలో దొంగ ఓటు నమోదయ్యింది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లారు. పోలింగ్ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్ ఓటుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్ళీకేరి పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతీ ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజరు అందిస్తూ.. చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు. ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు.. తాను పార్టీ మారుతున్నట్లుగా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా అసత్య ప్రచారాలు చేస్తున్న టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తోగుట మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కు వినియోగించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాస్క్,గ్లౌస్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేస్తున్నారు. దుబ్బాక మండలం పోతారంలో కుటుంబసభ్యులతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు. ఓటు వేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితుల కోసం ప్రత్యే సమయం కేటాయించారు. 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు. -
దుబ్బాక దంగల్ నేడే
సాక్షి, సిద్దిపేట: రాజకీయంగా తీవ్ర వేడిని పుట్టించి... కాకరేపిన దుబ్బాక ఉప ఎన్నికలో మంగళ వారం ఓటరు తీర్పు నిక్షిప్తం కానుంది. పోలింగ్ సరళి ఎలా ఉం టుంది, ఎంతశాతం ఓటింగ్ జరుగుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పోలింగ్ శాతం ఎంతుంటే ఎవరికి లాభమని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. కరోనా భయం పూర్తిగా వీడనం దున ఎంతమంది ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వస్తార నేది చూడాలి. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే కరోనా భయం పూర్తిస్థాయిలో వీడలేదు కాబట్టి పోలింగ్ శాతం తగ్గుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్ నమోదైంది. ఈసారి 1,98,807 మంది ఓటర్లు ఉండగా ఏ మేరకు పోలింగ్ నమోదవుతుందో వేచి చూడాలి. మొత్తం ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఎవరి లెక్క వారిది... దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటివరకు 78,187 మంది రైతులు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. 5,599 మందికి కల్యాణలక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, వీరందరి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏ కులం వారివి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే అంచనాలు వేశారు. అత్యధికంగా ముదిరాజులు 41,214 మంది, గొల్ల కురుమలు 16,190, గీత కార్మికులు 22,512, మాదిగ 23 వేల మంది, 11 వేల మంది మాల, 13 వేల మంది చేనేత కార్మికులు, 7 వేల మంది రజకులు, 6వేల మంది మున్నూరు కాపులు, 10,012 మంది రెడ్లు ఉన్నారు. ముస్లిం, దూదేకుల, బ్రాహ్మణ, వెలమ, బుడిగ జంగాలు, క్రిస్టియన్ మైనార్టీలు, లంబాడీలు కూడా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారు. కుల సంఘాలకు భవనాలు, ఇతర హామీలిచ్చారు. యువత ఓట్లు కీలకం యువత ఎటువైపు ఓటు వేస్తుందో అనేది అంతుపట్టకుండా ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు 30 వేలకు పైగా ఉన్నారు. వీరిపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బైక్ ర్యాలీలు, యువజన సదస్సులు నిర్వహించాయి. యువతను మచ్చిక చేసుకునేందుకు పలు తాయిలాలు కూడా అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువత ఎటువైపు మొగ్గు చూపుతుందనేది విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
బీజేపీవి చిల్లర ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో నాలుగు ఓట్లు సంపాదించేందుకు భారతీయ జనతా పార్టీ చిల్లర ప్రయత్నాలన్నీ చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమ ర్శించారు. ఇప్పటికే డబ్బుల డ్రామా ఫెయిలైందని, సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం, మితిమీరిన అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించేం దుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలే దన్నారు. దీంతో చివరగా హైదరాబాద్‌లో కార్యకర్త లను రెచ్చగొట్టి చివరి దశ డ్రామాకు తెరలేపుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తది తరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రచారం దారుణం..: దుబ్బాక సెగ్మెంట్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయని, కానీ కేవలం బీజేపీ నేతల ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు దొరకడం వాస్తవమని, ఆ ఇంటి ఆడపడుచులే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారన్నారు. తాజాగా హైదరాబాద్‌లో రూ.కోటి నగదు పట్టుబడిందని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడిపై దాడి జరిపినట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి చెయ్యి విరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరగడం సహజమని, కానీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు తప్పుదారి పట్టడం సరికాదని హితవు పలికారు. బీజేపీదీ హింసాత్మక మార్గం.. ప్రజల మద్దతు సాధించేలా కార్యక్రమాలు ఉండాలని, బీజేపీ అలాంటి దారి కాకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టినట్లు తమకు సమాచారం ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని సోమవారం హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే కార్యకర్తలకు సమాచారాన్ని చేరవేశారన్నారు. సోమవారం నాటి కుట్రకు సంబంధించిన సమాచారం బీజేపీ క్యాంపు నుంచే తమకు లీకైందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం లేదా ప్రగతిభవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో బీజేపీ సోమవారం కార్యచరణకు సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాఠీచార్జ్ జరిగేలా అవసరమైతే ఫైరింగ్ జరిగేలా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారన్నారు. దీంతో వచ్చే సానుభూతిని దుబ్బాక ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు చూస్తోందని విమర్శించారు. కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి ఓట్లు రాబట్టాలనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఆ కుట్రలను టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది.. బీజేపీ చేసే కుట్రలను టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంటోందని, ఈ అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ బాధ్యులు, ప్రచారకర్తలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్ని ఉపేక్షించొద్దని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. బీజేపీ చేసే కుట్రను భగ్నం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇటు డీజీపీకి తమ పార్టీ తరఫున వినతిపత్రాన్ని కూడా ఇచ్చామన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం వినతి పత్రం ఇస్తామని తెలిపారు. బీజేపీలాంటి రాజకీయ శక్తి పట్ల దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆనంద్, వెంకటేశ్, గోపీనాథ్ తదితరులున్నారు. -
‘స్టార్’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో తన స్టార్ క్యాంపెయినర్ హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 13వ తేదీ నాటి తన ప్రసంగంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపిన ఈసీ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా ఇలాంటి చర్య తీసుకున్నట్లు ప్రకటించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌నుద్దేశించి మాఫియా, కల్తీకోరు అంటూ కమల్‌నాథ్ తూలనాడటాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కమల్‌నాథ్ రాష్ట్ర మహిళా మంత్రి, బీజేపీ అభ్యర్థిని ఇమార్తీదేవిని ‘ఐటెం’ అంటూ పేర్కొనడం వివాదాస్పదం అయింది. నిబంధనావళిని ఆయన పలుమార్లు అతిక్రమించారంటూ ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్య తీసుకుంటున్నట్లు ఈసీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ హోదా ఉన్న నేత ప్రచార ఖర్చును సంబంధిత రాజకీయ పార్టీ భరిస్తుంది. ఆ హోదా లేకుంటే ఆ నేత ప్రచార ఖర్చంతా ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఖర్చు కిందికే వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3వ తేదీన జరిగే ఉప ఎన్నికలకు ప్రచార గడువు నవంబర్ ఒకటో తేదీతో ముగియనుంది. -
సిద్దిపేటలాగా.. దుబ్బాక ఎందుకు లేదు?
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్న కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు దుబ్బాకను ఎందుకు పట్టించు కోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రామలింగా రెడ్డి దుబ్బాకలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేశారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయ లేకపోతున్నానని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. శనివారం దుబ్బాక నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నా అధి కారులు తనకు సహకరించడం లేదని రామ లింగారెడ్డి అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేశా రని చెప్పారు. నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, హరీశ్‌రావు ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అలాంటి హరీశ్ ఏం మొహం పెట్టుకుని దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై రేప్ కేసు ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీశ్‌రావు–రఘునందన్‌రావు ఒకే సామాజిక వర్గం వారని, ఇద్దరూ బంధువులని తెలిపారు. రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. దుబ్బాకను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని, ఏ గ్రామానికి వెళ్లినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. శ్రవణ్‌కుమార్ అనే డాక్టర్ తన సొంత వ్యాపారం నిమిత్తం డబ్బులు తీసుకెళ్తుంటే పట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ అన్నారు. తనిఖీలు, సోదాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్‌హౌస్, టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓ రిటైర్డ్ అధికారికి ప్రత్యేక బృందం ఇచ్చి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక సామాజిక వర్గం వారు రిటైర్ అయినా మళ్లీ పదవులు ఇస్తూ రాష్ట్ర నిధులన్నీ వారి చేతుల్లో పెడుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ కార్యకర్తలు వెనక్కు తగ్గరని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ ఆదివారం సాయంత్రం వరకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త విశ్రమించకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. నో ఎల్ఆర్ఎస్... నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్– నో టీఆర్ఎస్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్ కోరారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని చెప్పారు. పంట బీమా కల్పించకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. -
వారి తిప్పలన్నీ నాలుగు ఓట్ల కోసమే
సాక్షి, హైదరాబాద్: ‘అసంబద్ధ హామీలు, ప్రలోభాలు, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దుబ్బాక ఉపఎన్నికలో డిపాజిట్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మేం మాత్రం మా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయమని అడుగుతున్నాం. ప్రజల్లో నాకున్న విశ్వసనీయతను దెబ్బకొట్టేలా విపక్షాలు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎదుటి వారిని మానసికంగా బలహీన పరిచి నాలుగు ఓట్లు పొందాలనుకునే వారి కుట్ర లను ప్రజాక్షేత్రంలోనే ఛేదిస్తాం. పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నామీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక ఉపఎన్నికలో విజ యం సాధిస్తాం’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రచార సారథి హరీశ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తి పాఠం.. 17 రాష్ట్రాల్లో చేయలేదెందుకో? కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయ కులందరూ ఇక్కడ ప్రచారం చేస్తూ డబ్బు, మద్యంతో పాటు గుళ్లకు, గోపురాలకు డబ్బులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బీజేపీ పుకార్ల పుట్ట, అబద్ధాల గుట్టలా మారి పోయింది. దేశంలో బీజేపీ 17, కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధి కారంలో ఉన్నాయి. అక్కడ చేయని సంక్షేమం, అభివృద్ధి వారికి ఇక్కడ ఎలా సాధ్య మవుతుంది? దుబ్బాకలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసింది. మేం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం. దుబ్బాక చైతన్యవంతమైన నియోజకవర్గం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే ఇన్నేళ్లుగా టీఆర్ఎస్ను ఆదరిస్తూ వస్తు న్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారం, అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రజలకు విడమరిచి చెప్తున్నాం. ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించడం లేదు. ఆ పార్టీ అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తూ, చేయనిదానిని చేసినట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తోంది. వాళ్ల రాష్ట్ర నాయకులు ఇక్కడ కూర్చుని ఒక అబద్దాన్ని పదేపదే చెపితే నిజం అవుతుందనే రీతిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వంగా మేం విఫలమయ్యాయని బీజేపీ ఒక వేలు మా వైపు చూపిస్తే, వారివైపు రెండు వేళ్లు చూపిస్తాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. మేం మాత్రం మా మేనిఫెస్టోలో చెప్పినవి 75 శాతం నెరవేర్చాం. మరో 25 శాతం అమలు దిశగా సాగుతున్నాం. పార్టీకి నా మీద ఉన్న విశ్వాసానికి ప్రతీక దుబ్బాకలో ప్రచార సారథ్య బాధ్యతలు నాకు అప్పగించడం... పార్టీకి నా మీద ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోంది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పారు. నాతో మాట్లాడినపుడు సీఎం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఎంతగా ప్రజల్లో తిరిగితే మా పార్టీకి అంతగా ఓట్లు వస్తాయి కనుక విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించి నాలుగు ఓట్లు పొందాలనేది వారి ప్రయత్నం. వారి తిట్లను కూడా దీవెనలుగా భావిస్తా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరుసార్లు సిద్దిపేటలో గెలిచా. నా పనితీరు ఏంటో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. గతంలో దుబ్బాకలోని పలు గ్రామాలు సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ఉండేవి కాబట్టి వారికి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. విపక్షాలు ఎంతగా దూషించినా దుబ్బాకలో టీఆర్ఎస్ మీద, మా నాయకుడు కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం ఉంది. మరో మూడేళ్ల పాటు నేనే అభివృద్ది బాధ్యతలు తీసుకుంటా అని చెప్పాను కాబట్టి నా మీద విశ్వాసం పెడతారనే పూర్తి నమ్మకం ఉంది. ఎన్నికల సమయంలో పోలీసుల మీద, అధికారుల మీద పిర్యాదులు చేయడం విపక్షాలకు అలవాటుగా మారింది. జనంలో పలుకుబడి లేక అధికారుల మీద పడుతున్నారు. గతంలో పాలేరు ఉప ఎన్నికలోనూ కలెక్టర్‌ను బదిలీ చేయించారు. అక్కడ 45 వేల మెజారిటీతో గెలుపొందాం. బీజేపీ ఉద్దేశపూర్వక దాడి సోషల్మీడీయాలో బీజేపీ పథకం ప్రకారం మా మీద దాడి చేస్తోంది. కిరాయి మనుషులను పెట్టుకుని ఎదుటి వారిని మానసికంగా బలహీనపరచాలనే కుట్రలకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. ‘ప్రజల్లో తక్కువ... సోషల్ మీడియాలో ఎక్కువ’అన్నట్లు ఉంది వారి పరిస్థితి. మేం ప్రజల్లోనే ఉంటూ వారి విషప్రచారాన్ని తిప్పికొడతాం. -
హరీష్ రావు అంటే తెరిచిన పుస్తకం
సిద్దిపేట : దేశంలో రైతులు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక మండలం గుండవెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాలిపోయే మోటర్లు.. బాయికాడ మీటర్లు.. 24 గంటల ఉచిత కరెంటుకు పోటీ.. ఎటుండాలో మీరే తేల్చుకోండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. (నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం: హరీష్ రావు ) మార్కెట్లను ప్రైవేటు చేయబోతున్నారని, అలాంటి బిల్లుకు వ్యతిరేకంగా రేపు పోరాటం చేస్తామని హరీష్ అన్నారు. గుండవెళ్లి గ్రామంలో అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టిస్తామని, అక్కడి గ్రామ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాల్వల కింద భూములు కోల్పోయిన రైతులకు రూపాయి తక్కువలేకుండా సిద్దిపేట తరహా ఇస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసే ఆరోపణలు, సవాళ్లకు తాను భయపడనని అన్నారు. 'హరీష్ రావు అంటే తెరిచిన పుస్తకం లాంటిది. నన్ను తిట్టిన మీకు, మీ విజ్ఞతకే వదులుతున్న. మీకే నాలుగు ఓట్లు తక్కువైతాయి' అని హరీష్ ప్రసంగంలో పేర్కొన్నారు. (కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో : విజయశాంతి ) -
నేడు బిహార్‌లో మొదటి దశ పోలింగ్
పట్నా: నేడు బిహార్‌లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఒక్కో పోలింగ్‌బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించింది. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేయనుంది. ఓటర్లు, సిబ్బందికి మాసు్కల ధారణ తప్పనిసరి చేసింది. అభ్యర్థుల్లో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. వీరిలో జేడీయూ తరఫున 35 మంది, బీజేపీ తరఫున 29 మంది పోటీ చేయనున్నారు. ఆర్జేడీ తరఫున 42 మంది, కాంగ్రెస్ తరఫున 20 మంది బరిలో దిగనున్నారు. ఎల్జేపీ 41 చోట్ల పోటీ చేస్తుండగా, జేడీయూ పోటీ చేస్తున్న 35 చోట్లా అభ్యర్థులను నిలిపింది. కేబినెట్ మంత్రుల్లో 6 మంది ఈ దశలో బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న, ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. -
ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక
సాక్షి, సిద్దిపేట:దుబ్బాక రాజకీయం రసకందాయంలో పడింది. సిద్దిపేటలో సోమవారం జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్ర్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉపఎన్నిక వేడి కాక పుట్టిస్తోంది. టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మొత్తా నికి సోమవారం హైడ్రామాతో ఎవరికెంత మైలేజీ వచ్చిందనే లెక్కలు ఇరుపార్టీలు వేసుకుంటున్నాయి. సోషల్ మీడియాను వాడుకొని అనూహ్యంగా బీజేపీ లబ్ది పొందిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి జవాబుగా అన్నట్లు టీఆర్ఎస్ మంగళవారం బలప్రదర్శనకు దిగింది. దుబ్బాక నియోజకవర్గంలో తొగుటలో యువజన సదస్సు నిర్వహించి భారీగా జనసమీకరణ చేసింది అధికార పార్టీ. అదే విధంగా పోలీసుల తప్పేమీలేదని చెప్పు కొనేందుకు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సోదాలకు సంబంధించిన ఫుటేజీలు బయటపెట్టారు. మరోవైపు బీజేపీ కూడా తమ నాయకుడు బండి సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సోదాల ఫుటేజీ విడుదల సిద్దిపేటలో సోమవారం అసలేం జరిగిం దనే విషయాన్ని తెలిపేందుకు మంగళవారం సిద్ది పేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంజన్ రావు ఇంటిని సోదా చేసిన తీరు, అక్కడ డబ్బులు దొరకడం, అంజన్‌రావు కుటంబసభ్యుల సమక్షంలో లెక్కించడం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఆరాతీయడానికి సంబంధించిన వీడియో పుటేజీలను మీడియాకు అందజేశారు. గతంలో సోదాలు చేస్తే ప్రజలు సహకరించారని, సోమవారం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చి శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపించారు. దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారు: హరీశ్ సిద్దిపేటలోని లెక్చలర్స్ కాలనీలోని అంజన్‌రావు ఇంటిలో దొరికిన రూ.18.67 లక్షల రూపాయలను... పోలీసులే తెచ్చి పెట్టి సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో వందలాదిగా యువకులు అంజన్‌రావు ఇంటి వద్దకు వచ్చి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేసిన విషయం విది తమే. యువత బీజేపీ వైపు ఉందనే సంకేతాలు పోతాయని భావించిన టీఆర్ఎస్ దీనికి విరుగుడుగా.. తొగుట మండలంలో వేలాది మంది యువకులతో మంగళవారం భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించింది. తొగుట గాంధీ సెంటర్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ కమలనాథులపై విరుచుకుపడ్డారు. బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని, అడ్డంగా దొరికినా బుకాయిస్తోందని అన్నారు. ఎన్నడూ కానరాని కిషన్‌రెడ్డి దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కి గతంలో విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు అక్రమంగా డబ్బులు పంచిపెట్టేందుకు సిద్ధమైన రఘునందన్‌రావుకు మద్దతు ఇచ్చేందుకు రావడం శోచనీయం అన్నారు. బీజేపీ ఆందోళనలు.. సిద్దిపేట ఘటనతో నెలకొన్న ఉద్రిక్తతలు రెండోరోజూ కొనసాగాయి. సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోహెడ, చేర్యాల, హుస్నాబాద్, సిద్దిపేట, మద్దూరు, కొమురవెల్లి ప్రధాన రహదారులపై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ అధికారులు టీఆర్ఎస్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల బీజేపీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. పలువురిని అరెస్టు చేశారు. -
దుబ్బాకలో పూర్తి మెజార్టీతో గెలుస్తాం : తలసాని
-
దుబ్బాకలో పూర్తి మెజార్టీతో గెలుస్తాం : తలసాని
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధే పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక, సిధ్దిపేట ఎపిసోడ్ అంతా చూశామని, డబ్బులు దొరికిన విషయం స్పష్టమైందన్నారు. బీజేపీ నేతల తీరు దొంగతనం చేసి దొంగ-దొంగ అని అరిచినట్లుందని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు సిద్దిపేట వెళ్లారని పేర్కొన్నారు. నిన్నటి హై డ్రామాలో జితేందర్ రావు సహా హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయని స్పష్టం చేశారు. (‘కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’ ) బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం ఎంత అంటూ ప్రశ్నించారు. మా క్యాడర్‌కి ఉన్న బలం 60 లక్షలు. తెలంగాణలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం ఎంత? మీలాగే ముట్టడి చేస్తాం అని మా వాళ్లు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు అని మండిపడ్డారు. పోలీసుల సెర్చ్‌లో బీజేపీ నేతల ఇళ్లలో డబ్బులు దొరికిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, హైదరాబాద్ వరదలతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని వ్యాఖ్యానించారు. (ఎంపీ ఆరోపణలపై స్పందించిన సిద్దిపేట సీపీ ) -
ముస్లింలపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
లక్నో: మరో వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న వేళ ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కటియార్‌కు మద్దతుగా నిన్న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. హిందువులకు, ముస్లింలకు సంబంధించిన స్మశాన వాటికల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులకు ఇరుకైన శ్మశాన వాటికలుంటే, ముస్లింలకు మాత్రం విశాలమైన శ్మశాన వాటికలు ఉన్నాయని.. ఇది పూర్తిగా వివక్షేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జనాభా ప్రాతిపదికన శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకే ఒక్క ముస్లిం ఉన్నా వారి శ్మశాన వాటిక మాత్రం చాలా పెద్దగా ఉంటోందని, హిందువులు మాత్రం తమ ఆత్మీయులకు పొలాల పక్కన దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇదెక్కిడి న్యాయం?’ అని ప్రశ్నించారు. ఇక ఉపేక్షించలేమని, ఎవరూ మన ఓపికను పరీక్షించకూడదని సాక్షి మహరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికలపై ఏవిధంగా ప్రభావితం చూపుతాయో తెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఎన్నికలపై ఏవిధంగా ప్రభావం చూపనున్నాయో తెలియాల్సి ఉంది. చదవండి: ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు -
ఓటమి భయంతో అడ్డదారులు
కరీంనగర్ టౌన్: దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వెళ్తున్న తన కారును అడ్డగించి అరెస్ట్ చేసే సమయంలో గొంతు పట్టి కారులో పడేశారని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటే.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు నిర్వహించకుంటే ఫాంహౌస్, ప్రగతిభవన్‌పై సైతం దాడి చేస్తామని హెచ్చరించారు. సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నిరాహారదీక్షకు దిగారు. -
దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి
సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నోట్ల కట్టలపై హైడ్రామా కొనసాగింది. పోలీసుల సోదాలు, బీజేపీ కార్యకర్తల హల్చల్, తోపులాట, డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డగింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదాచేసి పట్టుకున్నామని పోలీసులు చెప్పగా.. పోలీసులే డబ్బులు తెచ్చిపెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, నినాదాలతో సిద్ది్దపేట పట్టణం హోరెత్తింది. దుబ్బాక ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేటలోని లెక్చరర్స్ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. నోట్ల కట్టలతో ఉన్న బ్యాగుతో పోలీసు ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో వందలాది మంది కార్యకర్తలు వచ్చి అంజన్‌రావు ఇంట్లోకి వెళ్లారు. అక్కడ పోలీసుల వద్ద ఉన్న డబ్బులను బలవంతంగా లాక్కొని ఈ డబ్బు పోలీసులే తీసుకువచ్చారని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రఘునందన్‌రావు, అంజన్‌రావు, రాంగోపాల్‌రావులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. గొడవ విషయం తెలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిì సంజయ్ కరీంనగర్ నుంచి బయలుదేరి వస్తుండగా... సిద్దిపేట శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అనంతరం సంజయ్‌ని తిరిగి కరీంనగర్ పంపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పరిస్థితిని వివరిస్తున్న రఘునందన్‌రావు, ఆయన సతీమణి నాకు సంబంధం లేదు: రఘునందన్‌రావు మా అత్తగారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య, కూతురు, మనువరాలు అత్తగారి ఇంటికి వచ్చారని చెప్పారు. ప్రచారంలో ఉన్న తాను మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేశానని, తీయకపోవడంతో అనుమానం వచ్చి సిద్దిపేటకు రాగా పోలీసుల సందడి కనిపించిందని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు ఇల్లంతా చిందరవందర చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రచారం చేసుకుంటున్న తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అంజన్‌రావు ఇంట్లో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట తనిఖీల్లో డబ్బు దొరికింది: పోలీస్ కమిషనర్ దుబ్బాక ఉపఎన్నికల్లో నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దిపేటలో డబ్బు నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మూడు చోట్ల సోదాలు నిర్వహించగా డబ్బులు దొరికాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విజయ్ సాగర్, పోలీసు సిబ్బంది కలిసి... మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సుతోపాటు రఘునందన్‌రావు బంధువులు సురుభి అంజన్‌రావు, సురభి రాంగోపాల్‌రావు ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ సోదాల్లో ప్రతీది రికార్డు చేశామన్నారు. అయితే విషయం తెలుసుకున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 250 మంది అనుచరులతో పోలీసులపై దాడి చేసి రూ. 12.80 లక్షలు తీసుకెళ్లారని చెప్పారు. వీడియో ఫుటేజీల ద్వారా వీరిని గుర్తించి రికవరీ చేస్తామని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబ్బు విషయంపై ప్రశ్నించగా జితేందర్‌రావు డ్రైవర్ తెచ్చి ఇచ్చాడని, ఈ డబ్బులను కొద్దికొద్దిగా దుబ్బాకకు పంపించేందుకు ఇక్కడ పెట్టామని స్వయంగా అంజన్‌రావు చెప్పిన వాగ్మూలం రికార్డు చేశామని సీపీ జోయల్ డేవిస్ వివరించారు. లెక్చరర్స్ కాలనీలోని రఘునందన్‌రావు మామ ఇంటి పక్కన ఉన్న అంజన్‌రావు నుంచి వాంగ్మూలం రికార్డు చేస్తున్న సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విజయ్ సాగర్, సీపీ జోయల్ బీజేపీ గుండాగిరీ: హరీశ్‌రావు దుబ్బాక ఉపఎన్నికల్లో గెలువలేమని తెలుసుకున్న బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళ్లి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో డబ్బుల లొల్లిపై దుబ్బాక ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడారు. బీజేపీ అసత్య ప్రచారానికి దిగుతోందని ఆరోపించారు. మొన్నటికి మొన్న శామీర్‌పేట సమీపంలో బీజేపీ నాయకుల దగ్గర డబ్బులు దొరికాయన్నారు. అనుమానంతో సోమవారం రఘునందన్‌రావు బంధువు ఇంటిని తనిఖీ చేశారని, డబ్బు దొరికితే తమ తప్పులు బయటపడతాయనే ఆలోచనతో బీజేపీ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తించి పోలీసుల వద్దనున్న డబ్బులు గుంజుకపోయారన్నారు. దౌర్జన్యం చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. అమిత్ షా ఆరా.. సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఎంపీ బండి సంజయ్‌ని ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గొంతు పట్టుకొని వాహనంలో కుక్కారని అమిత్ షాకు సంజయ్ వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అభ్యర్థి ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాల గురించి వివరించినట్లు తెలిపాయి. కమలం పార్టీది కపట నాటకం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ గోబెల్స్ ప్రచారం, అభూత కల్పనలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అందులో భాగంగానే పట్టుబడిన డబ్బుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కమలం పార్టీ నానా యాగీ చేస్తూ కపట నాటకం ఆడుతోందన్నా రు. సిద్దిపేటలో జరిగిన పరిణామాలపై సోమ వారం రాత్రి హరీశ్ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా, తహసీల్దార్ సమక్షంలో వీడి యో చిత్రీకరణల మధ్య డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులే స్పష్టం చేశారన్నారు. సోమవారం బీజేపీకి సంబంధించిన ఇద్దరి ఇళ్లతో పాటు టీఆర్ఎస్కు చెందిన సిద్ది పేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, చేగుంట మండలంలో టీఆర్ఎస్ నేత ఇంట్లో కూడా సోదాలు జరిగాయన్నారు. రఘునందన్ ఎన్ని కల్లో ఖర్చు చేసేందుకే డబ్బు నిల్వ చేశామని బంధువు ఇచ్చిన వాంగ్మూలం వీడియో రికా ర్డు ఉందన్నారు. దీన్ని ఎన్నికల అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. వాస్తవాలు తెలియకుండా బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ట్రాప్‌లో పడ్డారన్నారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, దుబ్బాక : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేట వెళుతున్న ఆయనను పోలీసులు మధ్యలోనే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడం, సోదాలు నిర్వహించడం అప్రజాస్వామికమని బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఈ అనైతిక దాడులను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. దుబ్బాక శాసనసభకు ఎన్నిక జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వపు దుందుడుకు చర్యగా అభివర్ణించారు. మరోవైపు రఘునందన్‌రావు మామ గోపాల్‌రావుతో పాటు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు చేశారు. ఈ సందర్భంగా రూ.18.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును బీజేపీ కార్యకర్తలు బలవంతంగా లాక్కెళ్లారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా డబ్బులు లాక్కెళ్లిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిడ్ మాట్లాడుతూ నగదు దొంగిలించినవారిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
కాక రేపుతున్న దుబ్బాక
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోంది. రాష్ట్రం మొత్తం దుబ్బాక వైపే చూస్తుండటంతో అన్ని పార్టీల నాయకులు తమ సత్తా చాటుకునేందుకు శ్రమపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ప్రజల్లో క్రేజ్ పెరిగేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీల విధానాలపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా.. టీఆర్ఎస్ పార్టీపై కాకుండా మంత్రి హరీశ్‌రావుపై విపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు సవాల్ విసురుతుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక కాస్త వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 20 వేలకు పైగా బీడీ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటంతోనే బీడీ కార్మికుల కష్టాలు నేరుగా చూసి వారికి నెలకు రూ.2వేల పెన్షన్ ఇస్తున్నారని మంత్రి హరీశ్‌రావుతోపాటు, టీఆర్ఎస్ నాయకులు మహిళలకు చెప్పి బీడీ కార్మికుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేలా చూస్తున్నారు. అయితే బీడీ కార్మికుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ నాయకులు బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.1,600 ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఇతర పథకాలకు కూడా కేంద్రం డబ్బులు ఇస్తోందని బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో ఎవ్వరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో తేల్చేందుకు తాను సిద్ధమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సవాలు విసిరితే.. రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే ముక్కునేలకు రాసి ఎంపీ పదవి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అంతా బూటకం అని విమర్శిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చేసింది మాజీ మంత్రి ముత్యం రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు చెబుతుండగా.. అసలు గులాబీ జెండా లేనిదే తెలంగాణ వచ్చేదా, అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేశారని ఎవరి వాదనను వారి వినిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హరీశ్‌రావుపై విపక్షాల విమర్శలు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేస్తుండగా.. వారు మాత్రం హరీశ్‌రావును కేంద్రగా చేసుకొని ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు ఇంతకాలం ఈ నియోజకవార్గన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో పోలిస్తే దుబ్బాక వెనకబడి ఉందని ఆరోపిస్తున్నారు. హరీశ్‌రావుకు తమ పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిందని, ఇక్కడికి విచ్చి ఏం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు రఘునందన్ రావు, బండి సంజయ్‌లు విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఇబ్బందులు ఉన్నాయని, మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్ని రైతులను మోసం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అసత్యమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతీ చిన్న విషయాన్ని కూడా తమ ఎన్నికల ప్రచారఅస్త్రంగా మార్చుకొని ఎదుటి పార్టీలకు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలతో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తి పోతోంది. కాంగ్రెస్, బీజేపీలవి దొంగనాటకాలు దుబ్బాక: తెలంగాణ ఉద్యమానికి అడ్డా దుబ్బాక గడ్డ మీద పగటి వేషాలు, పరాయి నాయకులు, కిరాయి మనుషులతో ఆడే దొంగనాటకాలు సాగవని.. చిత్తు చిత్తుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను దుబ్బాక ప్రజలు ఓడిస్తారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండమావులాంటి కాంగ్రెస్, బీజేపీ వెంట వెళ్తే మోసపోతామన్నారు. పోరాటాల గడ్డ దుబ్బాక చరిత్ర ఉత్తమ్, బండి సంజయ్‌లకు ఏం తెలుసని, దుబ్బాక గడ్డ మీద పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతం అణువణువు తెలుసని, చేనేతలు, బీడీ కార్మికులు, రైతుల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ సోషల్ మీడియా అబద్దాల పుట్టగా మారిందన్నారు. తుది శ్వాస విడిచేంత వరకు ప్రజల మధ్యనే ఉన్న రామలింగన్న ఆశయాల సాధనకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా మనముందుకు వచ్చిన సుజాతక్కకు అండగా ఉంటామని పెద్ద సంఖ్యలో వచ్చిన జనంను చూస్తుంటే లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయమైపోయిందన్నారు. చర్చకు రమ్మంటే సంజయ్ పత్తా లేడు దుబ్బాక తెలంగాణ తల్లి చౌరస్తాలో చర్చకు రమ్మంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటివరకు పత్తా లేడని మంత్రి ఆరోపించారు. బీడీ కార్మికులకిచ్చే పింఛన్లలో కేంద్రం రూ.1,600 ఇస్తుందంటు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అందులో కనీసం రూ.16 ఇచ్చినట్లు నిరూపించినా మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే నువ్వు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చెయాలని సవాల్ విసిరారు. లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నాయకులు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతకిషన్‌రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పెరుగు పద్మపర్వతాలు, చౌడు బాల్‌లక్ష్మి, ఎంపీటీసీ రాధామనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. జూటాబాజీ మాటలు బీజేపీకే చెల్లుతాయ్ మిరుదొడ్డి(దుబ్బాక): పొద్దుగాల లేచిన నుంచి నుంచి పొద్దుపోయే దాకా జాటాబాజీ డోకాబాజీ మాటలు మాట్లాడే పార్టీ ఏదైతే ఉందో అది ఒక్క బీజేపీకే చెల్లుతుందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం వివిధ పార్టీకు చెందిన కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకు అభ్యర్థి సోలిపేట సుజాతను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీపీ గజ్జెల సాయిలు, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గులాబీ వైపు ముంపు గ్రామాల ప్రజలు సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్ల కోసం ఆనాడు భూమి ఇచ్చి స్ఫూర్తిగా నిలిచిన ముంపు గ్రామాల ప్రజలు నేడు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముంపు గ్రామం ఎటిగడ్డ కిష్టాపూర్ ప్రజలు శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొన్న పల్లెపహాడ్, నిన్న వేములఘట్, నేడు ఏటిగడ్డ కిష్టాపూర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జెడ్పీటీసీ ఇంద్రాసేనారెడ్డి, శ్రీకాంత్ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందే.. రాయపోలు(దుబ్బాక): కాంగ్రెసోళ్లకు ఓటేస్తే కాలిపోయే మోటార్లు దిక్కయినయి.. ఇప్పుడు బీజేపోళ్లకు ఓటేస్తే మోటార్ల కాడ మీటర్లు పెడ్తమంటున్నరు.. మరి ఎవరికేద్దాం ఓటు.. అని ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లను ప్రశ్నించారు. రాయపోలు మండలం రామారంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోలు మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ తలారి నర్సింలుతో సహా 50 మంది వరకు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ‘టీఆర్ఎస్కు అండగా ఉంటాం’ దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు అండగా ఉంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దుబ్బాకలో నియోజకవర్గంలోని అన్ని మండలాల మాదిగ సంఘం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాదిగల సంక్షేమానికి కృషి చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డప్పు శివరాజ్, మాదిగల రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సాంబయ్య, స్వామి, రాంచంద్రం, బెల్లె బాల్‌నర్సయ్య, స్వామి, చరణ్ తేజ, తదితరులు పాల్గొన్నారు. -
‘పదవి వద్దు, పార్టీలో తగిన గౌరవం ఉంది’
భోపాల్: ఏ పదవులు ఆశించి తాను బీజేపీలో చేరాలేదని, ఆ పార్టీలో తనకు చాలా గౌరవం లభిస్తునందుకు ఆనందంగా ఉందని మధ్య ప్రదేశ్ ఫైర్ బ్రాండ్ జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆయన కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. తన తండ్రి లాగానే తనకి కూడా ఏ పదవి కాంక్ష లేదని అన్నారు. మీకు క్యాబినేట్ మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మీరు ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించగా తాను పదవి కోసం పార్టీ మారలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని కానీ వాటిని నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, మహిళలను, నిరుద్యోగులను కమల్‌నాథ్ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు చెప్పారు. ఇక పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పమని ఆదేశించిన కమల్‌నాధ్ చెప్పలేదని, అలాంటి దురుసు ప్రవర్తన కలిగిన నేతను తానెప్పుడు చూడలేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళలలు అన్నా, దళితులు అన్నా గౌరవం లేదని అందుకే కింది స్థాయి నుంచి ఎదిగిన మహిళను ఐటెమ్ అని సంబోధించడం బట్టే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: ‘నాకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు’ -
బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్
సిద్దిపేట : దుబ్బాకలో టిఆర్ఎస్కు మద్దతుగా మహిళలతో సంఘీబావ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్ డిపో నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మంగళ హరతులు, డప్పు చప్పుళ్లతో మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సహా పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీడి పెన్షనర్లకు 1600 రూపాయలు ఇస్తున్నామని బీజేపీ చేస్తోందంతా పచ్చి అబద్దమని మంత్రి హరీష్ రావు అన్నారు. బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు రాజీనామాకు సిద్దామా అంటూ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. చింతమడక ల పుట్టిదుబ్బాకలో చదువుకున్న కేసీఆర్‌కు దుబ్బాక పైన ప్రేమ ఉంటది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని ప్రశ్నించారు. సోలీపేట సుజాతక్క గెలుపు మహిళలు గెలుపన్నారు. మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయల పెన్షన్ ఇస్తే కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్, బీడీ పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మీ స్కీము ఇస్తోందా అని ప్రశ్నించారు. 'బీజేపీ ఏమి చేస్తామని ప్రచారం చేస్తారు ? విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా ? ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ మక్కలు తెస్తున్నారో బీజేపీ చెప్పాలి' అని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మోసపోతామని తెలిపారు. రామలింగారెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారని అభ్యర్థి సోలీపేట సుజాత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రి లాగా నన్ను ఆశీర్వదించి మీ సేవ కోసం పంపారు. దుబ్బాక ప్రజల ఆశీస్సులతో రామలింగారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. -
దుబ్బాక: కనుమరుగైన టీడీపీ
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో గతంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు కనుమరుగైంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆ పార్టీని వీడిన తర్వాత దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు సైతం కరువయ్యారు. గతంలో పొత్తుల కారణంగా ఇతర పార్టీలకు టికెట్ కేటాయించినా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీలో దింపేందుకు టీడీపీకి అభ్యర్థి కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోవడం గమనార్హం. జిల్లాలో తెలుగు దేశం పార్టీ కనీస ఉనికి కూడా లేకుండా పోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1985లో డి.రామచంద్రారెడ్డి అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత 1989, 1994, 1999 వరకు వరుసగా మూడు సార్లు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యేలు రాజీనామాతో జరిగిన 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ముత్యంరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమి చవిచూసిన ముత్యంరెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభంజనంలో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఇంతటి చరిత్ర ఉన్న టీడీపీకి ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితికి చేరుకుంది. టీజేఎస్, సీపీఎం కూడా దూరమే గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో దుబ్బాక టికెట్ కైవసం చేసుకున్న తెలంగాణ జన సమితి, అప్పుడు పోటీలో ఉన్న సీపీఎం ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ పొత్తులో భాగంగా దుబ్బాక అసెంబ్లీ టికెట్ టీజేఎస్‌కు దక్కింది. దీంతో మనస్తాపానికి గురైన ముత్యంరెడ్డి ఎన్నికల ముందు తమ అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా టీజేఎస్ నుంచి చిన్నం రాజ్‌కుమార్ పోటీలో నిలిచినా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ బీ ఫాంతో మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పోటీలో నిలిచారు. దీంతో పొత్తుల్లో టికెట్ తెచ్చుకున్న టీజేఎస్ అభ్యర్థి కన్నా.. బీజేపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నాగేశ్వర్‌రెడ్డి, టీజేఎస్ నుంచి పోటీ చేసిన చిన్నం రాజ్‌కుమార్‌లు టీఆర్ఎస్లో చేరగా.. అప్పుడు టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేసిన ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. -
దుబ్బాకలో మంత్రి ఎందుకు భయపడుతున్నారు..?
సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోమవారం రోజున తూప్రాన్ వద్ద మూడు గంటల వరకు వాహనం తనిఖీ చేయకుండా నిలిపేశారు. ఫోన్ లాక్కోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న వీడియోలను తొలగించారు. నిన్న రాత్రి అదే వాహనాన్ని 8 గంటల సమయంలో తనిఖీ పేరుతో ఆపారు. అనంతరం ఫోన్ తీసుకొని అందులోని డాటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. (బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే) రాత్రి ఒంటి గంట వరకు కూడా వాహనాన్ని తనిఖీ చేసే టీమ్ రాలేదు. తర్వాత పోలీసులు అక్కడకు చేరుకొని కారును మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా మంత్రి పోలీసులను నడిపిస్తూ.. కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దుబ్బాకలో బీజేపీకి మంత్రిగారు ఎందుకు భయపడుతున్నారు..?. 2014 నుంచి ఇప్పటిదాకా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి. మంత్రి హరీష్ రావు ఎల్కల్ గ్రామ సర్పంచ్‌తో మాట్లాడిన ఆడియో మా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం' అని రఘనందన్‌రావు తెలిపారు. -
బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే..
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా, గద్దె కూలగొట్టినట్లు, టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దుబ్బాకకు ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారని తెలిపారు. దుబ్బాక ప్రజలు ఈ విషయాలన్నీ గమనించాలని విజ్ఞప్తి చేశారు. రూ.3కోట్ల నిధులు స్వాహా అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలిపారు. చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే' దుబ్బాకలో టౌన్‌హాల్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. రహదారుల టెండర్ ఫైనల్ కాకముందే డబ్బులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు. బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో ఇదే విధంగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో చపాతీ మేకర్ గుర్తు ఉన్న అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో అదే విధమైన గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని, హుజూర్‌నగర్‌లో బీజేపీకి జరిగిన పరాభవమే దుబ్బాకలో జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులకు నిజమైన చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, రాజ్యాంగ బద్దంగా, హక్కుగా రావాల్సిన పన్ను బకాయిలను రప్పించాలన్నారు. అంతే తప్ప అబద్ధపు, అసత్యపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. దుబ్బాక ప్రజలను ముమ్మాటికీ మీ మాటను నమ్మరని, బీజేపీకి హుజూర్నగర్, నిజామాబాద్‌లో ఎదురైన ఫలితమే దుబ్బాకలో పునరావృతం కానుందని హరీశ్‌రావు తెలిపారు. -
దుబ్బాక ఉప ఎన్నిక: యువతకు గాలం
దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. పార్టీ బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో సందడి చేయాలంటే యువత పాత్ర కీలకం. వయసు మళ్లిన వారి ఓటింగ్ సైలెంట్‌గా జరగుతుందని గమనించిన నాయకులు యువకులను ఆకర్షించే పనిలో పడ్డారు. వీరిని మచ్చిక చేసుకుంటే.. ఈ నాలుగు రోజులు ప్రచారానికి పనికి రావడంతోపాటు ఓట్లు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో యువకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తాయిలాలు ప్రకటిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నియోజకవర్గంలో 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు 10 శాతం మంది ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 20 వేల మేరకు యువత ఓట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటు పొందిన వారు 5 వేల మేరకు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు, వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు. ఇలా మొత్తం ఓటర్లు, యువకులు, యువతులతోపాటు, వారు చేసే పనులను ఆధారంగా విభజించి వారి అవసరాలను గుర్తించి హామీలుస్తూ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ఎటు మొగ్గు చూపుతారో.. టీఆర్ఎస్ పార్టీ ఇటీవల దౌల్తాబాద్‌లో రెండు వేల మంది యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పార్టీ అనుబంధ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులను నియోజకవర్గంలో తిప్పి యువతను గ్యాదర్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి, యువజన సంఘాల సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారికి కావాల్సిన ఆటవస్తువులు, కిట్లు, జిమ్ములు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఆకర్షిస్తున్నారు. అయితే యువతే ఆధారంగా బీజేపీ ప్రచారం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా బీజేపీ అనుబంధ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదల్, మహిళా మోర్చ ఇలాంటి సంఘాల్లోని యువతను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనుబంధ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ క్యాడర్‌ను పెంచుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నియోజకవర్గంలోని యువతే కాకుండా ప్రచారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులను సైతం నియోజకవర్గానికి పిలిపించుకొని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. లాక్ డౌన్‌తో కళాశాలలు ఇంకా తెరవకపోవడం, ఇతర పనులు కూడా లేకపోవడంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న వారిలో యువత ఎక్కువగా కన్పిస్తోంది. అయితే పోలింగ్ నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో.. యువత ఓట్లు ఎటు మొగ్గుచూపుతాయో వేచి చూడాల్సి ఉంది. 46 మంది అభ్యర్థులు.. 103 నామినేషన్లు దుబ్బాకటౌన్: దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9 వ తేదీ నుంచి నేటి వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చివరిరోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలు చేసిన అభ్యర్థులు.. సోలిపేట సుజాత(టీఆర్ఎస్), మాధవనేని రఘునందన్‌రావు(బీజేపీ), చెరుకు శ్రీనివాసురెడ్డి(కాంగ్రెస్), కత్తి కార్తీక బీఆర్ఎం(ఆల్ ఇండియా ఫార్వర్డు బ్లాక్), గౌటి మల్లేశ్ ( జై స్వరాజ్), లొంగరి రమేశ్ (బహుజన రాష్ట్ర సమితి), సుకూరి అశోక్( రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), మైసంగారి సునీల్(ఇండియన్ ప్రజాబంధు) సుదర్శన్ ఆడెపు (శివసేన), జాజుల భాస్కర్ (శ్రమజీవి పార్టీ), ఎం.జగదీష్ రరాజ్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), వడ్ల శ్యాం ( అన్న వైఎస్సార్ కాంగ్రెస్), చెరుకు విజయలక్ష్మి (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), జై.భరసింహరాయుడు (తెలంగాణ జగ్ హీర్), ఇండిపెండెంట్లుగా బుర్ర రవితేజ, రేవు చిన్న ధన్‌రాజ్, శ్రీకాంత్ సిలివేరు, మోతె నరేష్, మీసాల రాజాసాగర్, కోట శ్యాంకుమార్, షేక్ సర్వర్ హుస్సెన్, పెద్దలింగన్నగారి ప్రసాద్, పోసానిపల్లి మహిపాల్‌రెడ్డి, దొడ్ల వెంకటేశం, కొల్కూరి ప్రసాద్, అడ్ల కుమార్, గొంది భుజంగం, కొట్టాల యాదగిరి, జక్కుల నర్సింలు, మద్దెల నర్సింలు, పెద్దమ్యాతరి బాబు, వడ్ల మాధవచారి, వర్కోలు శ్రీనివాసు, ఉడుత మల్లేశం, కంటె సాయన్న, రణవేని లక్ష్మణ్, బుట్టంగారి మాధవరెడ్డి, వేముల విక్రంరెడ్డి, రేపల్లి శ్రీనివాసు, పెంటం మల్లికార్జున్, పిడిశెట్టి రాజు, బండారు నాగరాజు, కొల్లూరు జగన్మోహన్రావు ముదిరాజ్, జక్కుల రాధారమణి, అల్వాల కృష్ణస్వామి, డి.కిషన్‌రావు లు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపఎన్నిక టీఆర్ఎస్కు గుణపాఠం కావాలి మిరుదొడ్డి(దుబ్బాక): దుబ్బాక ఉపఎన్నికలో ఓటర్లు ఇచ్చే తీర్పుతో టీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం కావాలని మాజీ మంత్రి, ప్రముఖ హాస్య సినీనటుడు బాబూమోహన్ అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం విశ్వకర్మ కర్మ సంఘం సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు బాబూమోహన్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తలబిరుసుతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు. వజ్రాయుధం కంటే విలువైన ఓటును సందించి బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. బీజేపీకి జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ అవినీతి డబ్బులతో ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి పల్లి బాబూమోహన్ ఆరోపించారు. మండల కేంద్రమైన తొగుటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారికి టీఆర్ఎస్లో గౌరవంలేదన్నారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన రఘునందన్‌రావు లాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ది రఘునందన్‌రావును గెలిపించాలని ప్రజలను కోరారు. లక్ష ఓట్లు లక్ష్యంగా యువత కృషి చేయాలి తొగుట(దుబ్బాక): దుబ్బాక ఉప ఎన్నికలో యువత కీలకంగా వ్యవహరించాలని తొగుట ఇన్చార్జి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని కాన్గల్ గ్రామంలో టీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగం ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలిపేట సుజాతమ్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడుమెరుగు మహేష్, మండల అద్యక్షుడు అనిల్ కుమార్, సోషల్ మీడియా మండల కో–ఆర్డినేటర్ బండారు రమేష్ గౌడ్, నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, నరేష్, కుమార్, మహేష్, ఆబిద్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తోందని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని, టీఆర్ఎస్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడుతాయని యువకులు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని బంగారు భవిష్యత్‌ను ఫణంగా పెట్టారన్నారు. తీరా రాష్ట్రం ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగు పడిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే కన్పిస్తుందని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అక్రమ సంపాదన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడం టీఆర్ఎస్కు రివాజుగా మారిందన్నారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం ఆయన గుర్తు చేశారు. 2014, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అబద్ధాలకోరు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి అర్హులైన వారందరి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాక ఫలితాల వైపు రాష్ట్రం మొత్తం చూస్తోందని, సంచలన తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీకి గ్రామాల్లో ఓటర్లే లేరన్నారు. మూడో స్థానంలో నిలిచే బీజేపీకి ఓటు వేయడం వృథా అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం పెద్ద చీకోడులో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం సాక్షి, సిద్దిపేట: రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుల్లో ఆర్థికంగా బలోపేతం అవుతామనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని పెద్ద చీకోడు, రామక్కపేట గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు సూట్‌కేసులు సర్దుకొని వచ్చారని, అయితే ఇక్కడ క్యాడర్ లేకపోవడంతో దారి చూపించే నాథుడే కరువయ్యారని విమర్శించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడైనా దుబ్బాకకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడూ రాని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుండటంతో తాము ప్రజలకు చేరువయ్యామని పేర్కొన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ఏం చేయాలో అర్థంకాని కాంగ్రెస్ నేతలు మాయ మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. ఆపదలో, సంపదలో అందుబాటులో ఉండే నాయకుడికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర నిధులు ఏవీ? రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెబుతున్న బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆసరా పెన్షన్లలో వారు ఇచ్చే వాటా ఎంత? అని ప్రశ్నించారు. ఒక వేళ ఈ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తే.. బీజేపీ పాలిత 17 రాష్ట్రాలలో ఇక్కడి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గ్లోబల్ ప్రచారంలో బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాకలో ముగిసిన నామినేషన్ల ఘట్టం దుబ్బాక టౌన్: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన విషయం విదితమే. మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దుబ్బాక ఉప ఎన్నిక: ఇజ్జత్‌కా సవాల్!
దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు పరీక్షగా మారింది. ఏడాదిన్నర పాలనపై ప్రజల స్పందనకు ఈ ఎన్నికలను కొలమానంగా ఉంటాయనే ఆలోచనతో అధికార టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావుకు ఎన్నికల బాధ్యత అప్పగించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక ఎన్నికలో తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగే తొలి ఎన్నిక కావడంతో ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే.. బీజేపీ కూడా తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతోంది. సాక్షి, సిద్దిపేట: రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత జరిగే దుబ్బాక ఉప ఎన్నిక ఆ పార్టీ పనితీరుకు నిదర్శనంగా నిలవనుంది. దీనిని రుజువు చేసేందుకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలో 1,90,483 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 37,925 ఓట్ల మెజార్టీ, 2018లో 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇదే ఊపులో పార్టీని నడిపించి గత ఎన్నికల కన్నా మెజార్టీ ఓట్లు సాధించేలా టీఆర్ఎస్ ప్యూహ రచన చేస్తోంది. ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారం ముమ్మరం చేశారు. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల ప్రజలతో టీఆర్ఎస్కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయించారు. ఇలా లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ బడా నాయకులంతా దుబ్బాకలోనే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మాణిక్యం ఠాగూర్ వచ్చీ రాగానే జరిగే ఉప ఎన్నిక కావడంతో ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు పర్యాయాలు రెండో స్థానంలో ఓట్లు సాధించిన ఆ పార్టీ.. బలమైన లీడర్ లేకపోయినా క్యాడర్ ఉందనే రుజువైంది. దీన్ని కాపాడుకుంటూ.. మరింతగా బలం పెంచుకునేందుకు పార్టీ ఆలోచిస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీలోని హేమాహేమీ నాయకులైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల, షబ్బీర్ అలీలను నియమించింది. అత్యధిక ఓట్లు సాధించాలంటే స్థానిక బలం కూడా అవసరమని భావించిన కాంగ్రెస్.. మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు, ముత్యం రెడ్డి సానుభూతి ఓట్లు కూడా తోడవుతాయని లెక్కలు వేస్తున్నారు. సత్తా చాటేందుకు బీజేపీ యత్నం ఈ ఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. సత్తా చాటేందుకు ఉవ్వీళ్లూరుతోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు దూకుడు పెం చారు. ముమ్మరంగా ప్రచారం నిర్వహి స్తున్నారు. ఈ ఎన్నికలపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏడు మండలాలకు పలువురు ముఖ్య నాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. పలు మార్లు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రచారం చేయడం, అవసరమైతే మోదీ చరిష్మాను కూడా ఉపయోగించి అధిక శాతం ఓట్లు సాధించేలా వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతోంది. -
అది దుబ్బాక ప్రజలే తేల్చుకోవాలి: మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ వస్తే వందల మందికి ఉద్యోగాలు వస్తాయని యువత చూస్తుంటే దానిని అడ్డుకుంటామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్, ఇంటింటిక నీళ్లు ఇస్తామంటే వాటిని కూడా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2018 హుజుర్నగర్ ఎన్నికల్లో, ఇవాళ నిజామాబాద్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలిచిందని, రేపు దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలే వీడి ఇతర పార్టీలో చేరుతున్నారని ఎద్దేవ చేశారు. (చదవండి: దుబ్బాక: ఎన్నికల ప్రచారం రసవత్తరం) మనిక్కం ఠాగూర్, నాగేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారని, ఇప్పుడు దుబ్బాకలో మీటింగ్ పెట్టి ప్రజలకు ఏం చేప్తారని విమర్శించారు. ఇంటింటికి దుబ్బాకలో నీళ్లు ఇచ్చింది తమ పార్టీయే అని, ఓటు అడిగే హక్కు కూడా టీఆర్ఎస్కే ఉందని ఆయన అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తుంది టీఆర్ఎస్ మాత్రమేనని... కరెంటు ఇవ్వని కాంగ్రెస్ వైపా.. బావుల దగ్గర కరెంటు మీటర్లు పెడతా అంటున్నా బీజేపీ వైపు ఉందామా అని పేర్కొన్నారు. 20 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తుంది ఎవరూ? ఎకరానికి 10 వేలు ఇచ్చింది ఎవరూ? ఆలోచింది దుబ్బాక ప్రజలకు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. (చదవండి: టీఆర్ఎస్కు సవాల్ విసిరిన పొన్నం ప్రభాకర్) -
హరీశ్‌రావును టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్‌రావు అభ్యర్థి గెలుపుకోసం అన్నితానై ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సుజాతను నేరుగా ఢీ కొనడం కంటే హరీశ్‌రావును ఢీ కొంటే ఉపయోగం ఉంటుందని హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి సోలిపేట సుజాతను విమర్ఙంచడం కన్నా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హరీశ్‌రావును టార్గెట్ చేసి విమర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గానికి ప్రచార నిమిత్తం వచ్చిన టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క హరీశ్‌రావును విమర్శించడం, టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత గురించి మాట్లాడడం, ఇతర విమర్శలు చేస్తున్నారు. హరీశ్ లక్ష్యంగా ప్రచారం.. రాష్ట్రంలో 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో హరీశ్‌రావు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్‌లో రేవంత్‌రెడ్డితోపాటు హేమాహేమీలైన కాంగ్రెస్ పార్టీలు ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. అదే విధంగా హుజుర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లోని కీలక నాయకులు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలంటే హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని మాట్లాడాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందని కనిపిస్తోంది. అదే విధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా హరీశ్‌రావును టార్గెట్ చేసి వాఖ్యలు చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని గతంలో హరీశ్‌రావు ఏమి చేశాడని రఘునందన్‌రావు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక్కడిగా హరీశ్‌రావు.. విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కీలక నాయకులంతా దుబ్బాక నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. బీజేపీ నుంచి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో ప్రచారం చేస్తుండగా కేంద్ర, రాష్ట్ర నాయకులు రఘునందన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు దుబ్బాక దారి పడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి హరీశ్‌రావు మాత్రం తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. స్థానిక ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులను కలుపుకొని ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, చిందం రాజుకుమార్‌లను టీఆర్ఎస్లో చేర్పించుకుని కాంగ్రెస్ క్యాడర్‌ను దెబ్బతీస్తున్నారు. మరోవైపు యువజన సంఘాలతో సమావేశాలు, సమీక్షలు, బైక్ ర్యాలీలు నిర్వహించి టీఆర్ఎస్ వైపు ఆకర్షింపచేస్తున్నారు. అదే విధంగా తాగునీటి ఇబ్బందులు పడ్డ దుబ్బాక ప్రాంతానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడం, బీడీ కార్మికుల పెన్షన్లు, చేనేత కార్మికులకు చేయూత, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ ఇచ్చిన పథకాల గురించి పూసగుచ్చినట్లు ప్రజలకు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులు, బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చెబుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చురకలు అంటిస్తున్నారు. ఇలా టీఆర్ఎస్కు ఓటేయాలని, మరో వైపు కాంగ్రెస్, బీజేపీ లను చిత్తుగా ఓడించాలని ప్రచారం చేయడం గమనార్హం. -
బీ ఫామ్ అందుకున్న సోలిపేట సుజాత
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సోలిపేట సుజాత ...ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా బీ ఫామ్ అందుకున్న ఆమె కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సోలిపేట సుజాత మాట్లాడుతూ... ‘సీఎం కేసీఆర్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. మీ లింగన్న లాగే మీకు (దుబ్బాక ప్రజలకు) నేను అందుబాటులో ఉంటాను. అత్యధిక మెజార్టీతో గెలవాలని కేసీఆర్ గారు చెప్పారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాను’ అని అన్నారు. (సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం) దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోలిపేట సుజాత ‘ సీఎం కేసీఆర్ నాకు తండ్రిలాంటివారు. నా భర్త రామలింగారెడ్డి చనిపోతే చిట్టాపూర్‌కు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. రామలింగారెడ్డి ఆశయాల సాధన కోసం నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది’ అని అన్నారు. తన భర్త ఆశయ సాధన కోసం వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని చేతులు జోడించి వేడుకున్నారు. రామలింగారెడ్డి తుదిశ్వాస వరకూ ప్రజల మధ్యనే గడిపారని తాను కూడా ప్రజల్లోనే ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు. (దుబ్బాక బీజేపీలో ముసలం) . -
సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం
సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో దివం గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతి తదితరులు సుజాతను ఓదార్చారు.ప్రచారానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్ ఎస్ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన గొప్ప ప్రజా నాయకుడు రామలింగారెడ్డి అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం ఆ కుటుంబానికే టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ‘సుజాత నాకు చెల్లెలాంటిది. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. మా చెల్లెకు సీఎం కేసీఆర్ సందేశం ఇచ్చి.. టికెట్ ఖరారు చేశారని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం, విశ్వాసం నింపేందుకు వచ్చామని తెలిపారు. సుజాతకు తాను, ఎంపీ ప్రభాకర్ ఎడమ, కుడి భుజాలమని, అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామన్నారు. దుబ్బాక దశ, దిశను మార్చిన గొప్ప నాయకుడు రామలింగారెడ్డి అని కితాబిచ్చారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సుజాతకు తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. రఘునందన్‌కు హైకోర్టులో ఊరట సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండల పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనపై అరెస్టులాంటి బలవంత చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేయబోతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. -
రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుబ్బాక ఎన్నికకు సంబంధించి మంగళవారం వీడియో కాన్ఫరరెన్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..' దుబ్బాక అభ్యర్థి పేరు హైకమాండ్ పరిశీలనలో ఉంది.. అభ్యర్థి పేరు రేపు ప్రకటిస్తాం. యావత్ కాంగ్రెస్ కుటుంబ ఎన్నికగా దుబ్బాక ఎన్నికను నేతలు సహకరించాలి.7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి చోటుచేసుకుంది.సీఎం నుంచి వీఆర్వో వరకు ప్రతీ ఒక్కరూ దోచుకుంటున్నారు.కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణను భ్రష్టు పట్టించాడు. ఎవరూ డబ్బు పంపిణీ చేసిన.. ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలి. (చదవండి : సోలీపేట సుజాతను గెలిపిద్దాం : హరీష్ రావు) తెలంగాణ అమరవీరులకు న్యాయం చేశాడా.. అన్యాయం చేశాడా అనేది ఈ ఎన్నికతో తేలిపోవాలి. దుబ్బాక ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే ఏ చేసేందుకైన సిద్ధం గా ఉన్నాం. రేపటి నుంచి నేను దుబ్బాక లో ఉంటా. గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించండి. ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాట ఇస్తున్న.. దయచేసి పైసలు కట్టొద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీగా చేస్తాం.'అని పేర్కొన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..' దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం నేతలందరూ కృషి చేయాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కీలకం. నేతలందరూ ఓటు నమోదును సీరియస్‌గా తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం డబ్బులు కొల్లగొట్టాలని చూస్తోంది.డబ్బులు చెల్లించవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలి. రెండున్నర ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం.' అంటూ తెలిపారు. (చదవండి : దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు) ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. దౌల్తాబాద్ మండలంలో 8వ తేదీన ఘనంగా మీటింగ్ నిర్వహించనున్నాం. బేషజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నా విజ్ఞప్తి. 2023 ఎన్నికలకు దుబ్బాక ఎన్నిక నాంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం ఉంది. దుబ్బాకలో వచ్చే 15 రోజులు కష్టపడితే విజయం తధ్యం.నాకు కేటాయించిన ప్రాంతాల్లో ఇతర పార్టీల కంటే 5వందలు లేదా 1000 ఓట్లు అధికంగా తెచ్చే ప్రయత్నం చేస్తా. ' అంటూ వెల్లడించారు. -
సోలీపేట సుజాతను గెలిపిద్దాం : హరీష్ రావు
సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించారు. దీంతో ఎలాగైనా సీటును కైవసం చేసుకునేందుకు పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 'తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేదల కోసం ఎంతగానో కృషి చేశారు. దుబ్బాక దశ-దిశను మార్చిన గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రామలింగారెడ్డి సతీమణి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. (దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు) రామలింగారెడ్డి భార్య అంటే మాకు చెల్లె లాంటిది. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం రామలింగారెడ్డి సతీమణిని కలిసి మాతో పాటు ప్రచారానికి తీసుకెళ్లడానికి వచ్చాం' అని తెలిపారు. సోలీపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకొని దుబ్బాకను మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలీపేట సుజాత మాట్లాడుతూ..కేసీఆర్ తనకు కన్నతండ్రి లాంటివారన్నారు. తన భర్త చనిపోతే కేసీఆర్ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. పార్టీ టికెట్ కేటాయించినందుకు కెసిఆర్ , మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. (దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత) -
దుబ్బాక ఉప ఎన్నికలు: కోవిడ్ నిబంధనలు
కోవిడ్ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల నియమావళిని విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో పాటు రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి చెన్నయ్య సూచించారు. ఆయన సోమవారం ఎన్నికలు, ప్రచారం తదితర నిబంధనలు, కొత్త మార్గదర్శకాలను సమగ్రంగా ‘సాక్షి’కి వివరించారు. సాక్షి, దుబ్బాక: ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో ప్రతివ్యక్తి ముఖానికి మాస్కు ధరించాలి. ఎన్నికల అవసరాలకు ఉపయోగించే హాలు, ప్రాంగణాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్, సబ్బు, నీరు తప్పక అందుబాటులో ఉంచాలి. సాధ్యమైనంత వరకు సామాజిక దూరం నిబంధనలు అనుసరించడానికి వీలుగా పెద్ద హాల్స్‌ను గుర్తించి వాటిని ఉపయోగించాలి. నామినేషన్ పత్రాల దాఖలు, పరిశీలన, ఎన్నికల గుర్తులు కేటాయింపు వంటి ప్రక్రియలకు సామాజిక దూర నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్ అధికారి తన చాంబర్‌ను విశాలంగా ఉండేలా చూసుకోవాలి. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని తరలించడానికి వీలుగా వాహనాలు సమకూర్చుకోవాలి. ఈవీఎం, వీవీ ప్యాట్ల ఎంపిక ప్రక్రియ పెద్ద హాళ్లలోనే నిర్వహించాలి. ఆ సమయంలో చేతులకు గ్లవ్స్ అందుబాటులో ఉంచాలి. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు.. రోడ్ షోలలో ఇప్పటి వరకు 10 వాహనాలకు అనుమతి ఉండగా, ప్రస్తుతం 5 వాహనాల కాన్వాయ్‌తోనే రోడ్ షోలు నిర్వహించుకోవాలి. సామాజిక దూరం పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఫేస్ మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లు వినియోగించుకోవాలి. ఎన్నికల అవసరాల కోసం ఉపయోగించే గది, ప్రాంగణాల వద్ద శానిటైజర్స్, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి. కోవిడ్ – 19 మార్గదర్శకాలు అననుసరించి సభలు, ర్యాలీలు నిర్వహించుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు బహిరంగ సభలకు అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం ముందుగానే అధికారులకు బహిరంగ ప్రదేశం(మైదానం)తో పాటు ప్రాంగణం ప్రవేశం, నిష్క్రమణ పాయింట్లను చూపించాలి. సభకు వచ్చే వారి సంఖ్యను అధికారులకు ముందుగానే తెలియజేయాలి. ఎన్నికల కమిషన్ సూచించినట్లుగా సువిధ యాప్‌ను ఉపయోగించి బహిరంగ సభలకు స్థలాల అనుమతి తీసుకోవాలి. పోలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు సెల్ఫోన్లు తీసుకెళ్లరాదు, కేంద్రాల్లో ఫొటోలు తీయరాదు. నామినేషన్ల సమయంలో ఇలా.. అభ్యర్థి నామినేషన్ సమరి్పంచే సమయంలో రిటర్నింగ్ కార్యాలయానికి అభ్యర్థి వెంట ఇద్దరికి, రెండు వాహనాలకు మాత్రమే అనుమతి. పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తును పూర్తిచేసి ప్రింట్ తీసుకోవచ్చు. నామినేషన్ ఫాం, అఫిడవిట్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించాలి. అభ్యర్థులు డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత ప్లాట్ ఫాంలో ఆన్లైన్ డిపాజిట్ చేయవచ్చు. ట్రెజరీలో కూడా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా భద్రతా సిబ్బందికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వీళ్లకు పోస్టల్ బ్యాలెట్ ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బందికి మాత్రమే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉండేది. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లుపైబడిన వారికి, అత్యవసర రంగంలో ఉన్న సిబ్బంది, కోవిడ్ సోకిన, అనుమానిత, క్వారంటైన్లో ఉన్న ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. నియామకాలు మరిచిన ప్రభుత్వం: రఘునందన్‌రావు సాక్షి, దౌల్తాబాద్ (దుబ్బాక): కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన యువతను నిరుద్యోగులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆరేళ్ల పాలనలో దుబ్బాకకు జరిగిన అభివృద్ధి ఏమీలేదన్నారు. సిద్దపేట, గజ్వేల్‌లలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కేంద్ర నిధుల వల్లనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు ప్రతి పారీ్టకి ఉందని, బీజేపీకి ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని హితువు పలికారు. ఈ సందర్భంగా ముబరాస్‌పూర్ వార్డు సభ్యుడు కోట శ్రీనివాస్ తో పాటు పలు గ్రామాలకు చెందిన యువత రఘునందన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్, మండల కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు రాజగోపాల్, భిక్షపతి, రమే‹Ù, స్వామిగౌడ్, కనకరాజు, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులంటే ఎన్నికల కమిషన్‌కు కళ్లు, చెవులు వంటి వారని, స్వేచ్ఛ, శాంతియుత, పారదర్శక విధానంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోర పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్న అధికారులతో సోమవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరోరా ఏం మాట్లాడారంటే.. ► కోవిడ్ నేపథ్యంలో రానున్న ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ► ఓటర్ల రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ► ఎన్నికల్లో పెద్ద ఎత్తున ధనం, మద్యం పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించే వారిపై స్థానిక ఎన్నికల అథారిటీల సమన్వయంతో నిరంతర నిఘా ఉంచాలి. ► ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. సీ–విజిల్, 1950 కాల్ సెంటర్‌పై ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాలి. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 80 ఏళ్లు నిండిన వారికి, దివ్యాంగులకు అవకాశం కల్పించామన్నారు. ► మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో సేఫ్ ఎలక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ► వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్, బిహార్ ఎన్నికల పరిశీలకులుగా వెళ్తున్న ముఖ్య కార్యదర్శులు ఆర్పీ సిసోడియా, రాంగోపాల్‌తో పాటు కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ పీయూష్‌కుమార్ సహా మరో 20 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. -
రైతుబంధు దోపిడీ పథకం: డీకే అరుణ
సాక్షి, చేగుంట(తూప్రాన్): రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలన్నిటికీ కేంద్రం నిధులే ఖర్చు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో డీకే అరుణ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించగా బోనాల ఊరేగింపుతో మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ గ్రామాల్లోని స్వచ్ఛభారత్, ఉపాధిహామీ పనులు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, పింఛన్లు, బియ్యం అన్ని పథకాలకు కేంద్రం నిధులనే వాడుకొని తామే చేసామని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 3లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. డబుల్బెడ్రూం ఇళ్లు, యవకులకు నిరుద్యోగ భృతి, దళితుల మూడెకరాల భూమి వంటి హామీలను మరిచిపోయారన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలే అభివృద్ధి చెంది మిగితా నియోజకవర్గాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదో ప్రభుత్వం ప్రజలకు సమాధానం తెలపాలన్నారు. రైతుబంధు పెద్ద దోపిడీ పథకమని ఎక్కువ వ్యవసాయ భూమలు ఉన్న రైతులకు లక్షల రూపాయలు, సామాన్య రైతులకు వేల రూపాయలను ఇస్తూ పేద రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టాలతో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎల్ఆర్ఎస్తో వేలాది రూపాయలు గ్రామ పంచాయతీలకు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావును గెలిపించాలని డీకే అరుణ ప్రజలనుకోరారు. భారత్‌ను భయపెట్టాలనే దేశాలు ప్రధాని నరేంద్రమోదీ అంటే భయపడుతున్నాయి. రామజన్మ భూమి మొదలుకొని దేశంలోని చాలా సమస్యలకు ప్రధాని పరిష్కారం చూపుతున్నారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్, సిద్దిపేట పార్టీ జిల్లా అధక్షులు గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉమాదేవి, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నాయకులు గోవింద్, మండలశాఖ అధ్యక్షులు భూపాల్, ఉపాధ్యక్షులు ఎంర్ రమేశ్, మాజీ సర్పంచులు బాల్‌చందర్, రాజగోపాల్, మాజీ ఎంపీపీ పాండుతో పాటు పలు గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
-
ఎన్నికలు @ కోవిడ్
న్యూఢిల్లీ: ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ఐదుగురే పాల్గొనాలి..పోలింగ్ బూత్‌లలో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి..ఈవీఎం బటన్ నొక్కే ముందు ఓటర్లు గ్లవ్స్ ధరించాలి..కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) తాజాగా విడుదల చేసిన ఎన్నికల మార్గదర్శకాల్లో ఇవి కొన్ని..! కేంద్రం విడుదల చేసిన కోవిడ్–19 కంటైయిన్మెంట్ మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాలను రాజకీయ పార్టీలు నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. కోవిడ్–19 సమయంలో జరిగే సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. డిపాజిట్లను కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్ల వాడకం వంటి ప్రామాణిక రక్షణ చర్యలను కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉండే ఓటర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేస్తామని ఈసీ తెలిపింది. ఒకవైపు, కరోనా మహమ్మారి ముప్పు మరింత తీవ్రం కానుందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఈసీ నిబంధనలకు లోబడి మొట్టమొదటి ఎన్నికలు బిహార్ అసెంబ్లీకి జరిగే అవకాశాలున్నాయి. అయితే, బిహార్ ఎన్నికలపై ఈసీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈసీ జారీ చేసిన విస్తృత మార్గదర్శకాలివీ.. ► నామినేషన్ దాఖలు, పత్రాల పరిశీలన, గుర్తుల కేటాయింపు వంటివి సజావుగా సాగేందుకు భౌతిక దూరం నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి చాంబర్ ఉండాలి. అభ్యర్ధులకు రిటర్నింగ్ అధికారి ముందుగానే సమయం కేటాయించాలి. ► నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లే అభ్యర్ధి వెంట ఇద్దరు వ్యక్తులు, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. ► ఇంటింటి ప్రచా రం సమయంలో భద్రతా సిబ్బంది మినహాయించి అభ్యర్థి సహా ఐదుగురే పాల్గొ నాలి. రోడ్‌షోల్లో పాల్గొ నే వాహన కాన్వాయ్‌లో భద్రతా సిబ్బందిని మిన హాయిస్తే ఐదు వాహనాలే ఉండాలి. ► కోవిడ్–19 మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సమావేశాలు, సభలు ఏర్పాటు చేసుకోవాలి. ► జిల్లా ఎన్నికల అధికారి ముందుగా అనుమతించిన చోటే బహిరంగ సభలు జరపాల్సి ఉంటుంది. సభలకు హాజరయ్యే వారు భౌతిక దూరం వంటివి పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఎన్నికల సభలకు హాజరయ్యే వారి సంఖ్య రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎస్డీఎంఏ) పేర్కొన్న పరిమితికి లోబడి ఉండేలా చూడటం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ బాధ్యత. ► పోలింగ్‌కు కనీసం ఒక రోజు ముందు పోలింగ్ స్టేషన్లను తప్పనిసరిగా పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలి. ► అన్ని పోలింగ్ స్టేషన్ల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌స్కానర్లు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్దే ఓటర్లకు థర్మల్ స్కానింగ్ చేపట్టాలి. ► ఓటర్లందరికీ శరీర ఉష్ణోగ్రతలు గమనించాలి. అనుమానాస్పదంగా ఉంటే రెండు పర్యాయాలు ఉష్ణోగ్రతలు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ జారీ చేసిన సురక్షిత స్థాయికి మించి కనిపిస్తే వారికి పోలింగ్ ముగిసే చివరి గంటలో ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. ► కోవిడ్–19 సోకి క్వారంటైన్లో గడుపుతున్న వారికి కూడా పోలింగ్ ముగిసే ఆఖరి గంటలో అవకాశం కల్పిస్తారు. ► పోలింగ్ బూత్‌లో ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కేముందు వారికి డిస్పోజబుల్ గ్లవ్స్ అందజేస్తారు. ► పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 1,500 మంది ఓటర్లకు బదులు.. వెయ్యి మందికి మించి ఉండరాదు. ► ఎన్నికల ప్రక్రియ సమయంలో కోవిడ్–19 సంబంధిత ఏర్పాట్లు, నివారణ చర్యలు వంటివి పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నోడల్ అధికారులు ఉంటారు. ఎన్నికల అధికారుల శిక్షణ కూడా ఆన్లైన్లోనే జరిపే అవకాశం ఉంది. ► ఎన్నికల సిబ్బందిలో కోవిడ్–19 లక్షణాలున్న వారిని గుర్తించి, వారికి బదులుగా మరొకరిని నియమించే ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. ► ఓట్ల లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈవీఎంలు, వీవీప్యాట్లను శానిటైజ్ చేయాలి. -
దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసే విషయమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) శుక్రవారం ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ తప్పక పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా దుబ్బాక శాసన సభ సభ్యుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి (57) ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.(దుబ్బాక ఎమ్మెల్యే ‘సోలిపేట’ కన్నుమూత) పార్లమెంటులో అడుగుతా: ఉత్తమ్‌కుమార్ రెడ్డి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని, తెలంగాణలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడతామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళితులకు 3 ఎకరాలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు. ఇటీవల తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి పార్లమెంట్లో అడుగుతానని పేర్కొన్నారు. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అండగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. (‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో ఉద్యమం) కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి కరోనా కేసుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌పై కేసీఆర్ సర్కారు ఇచ్చిన లెక్కలు తప్పని నిరూపిస్తామని, కరోనా మరణాలపై మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీసీసీకి వివరాలు అందించాలని పిలుపునిచ్చారు. కోవిడ్ మరణాల విషయంలో కేసీఆర్ సర్కారు గోప్యత పాటిస్తుందని ఆరోపించిన ఆయన.. మహమ్మారితో మృతి చెందిన పేద వర్గాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి సీఎం కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. హైకోర్టు చెప్పే వరకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ప్రభుత్వానికి కనిపించలేదా అని నిలదీశారు. ఇప్పటికైనా కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రంట్‌లైన్ వారియర్లుగా పనిచేస్తూ మృతి చెందిన హెల్త్, శానిటేషన్, పోలీసులు, జర్నలిస్టులకు రూ. 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు, వైఫల్యాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. -
సరైన సమయంలో ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 57 స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను సరైన సమయం చూసి ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 56 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి, కొన్ని రాష్ట్రాల్లో వరద బీభత్సం కారణంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ఆ అధికారి చెప్పారు. ఎనిమిది స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల గడువు తేదీ సెప్టెంబర్ 7 నాటికి ముగుస్తుంది. మిగిలిన 49 స్థానాలకు సెప్టెంబర్ తర్వాత వరకు ఉంది. శుక్రవారం ఈ అంశంపై సమీక్షించిన ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను సరైన సమయంలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బిహార్‌లో ఒక లోక్‌సభతో పాటు మధ్యప్రదేశ్‌లో 27 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. -
‘మధ్యంతర’ సందడిలో బ్రిటన్
చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయి రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ ఎట్టకేలకు వచ్చే నెల 12న పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయిదేళ్లకోసారి ఎన్నికలు జరిగే బ్రిటన్‌లో నాలుగేళ్లలో ఎన్నికలు రావడం ఇది రెండోసారి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడమే మార్గమని గత రెండు నెలలుగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వాదిస్తున్నారు. అయితే సొంత పార్టీతోపాటు విపక్షమైన లేబర్ పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఆయన మాట నెగ్గలేదు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్)పై ఉన్న తుది గడువు అక్టోబర్ 31తో ముగియవలసి ఉండగా, వచ్చే ఏడాది జనవరి 31 వరకూ పొడిగిం చడానికి ఈయూ అంగీకరించడంతో లేబర్ పార్టీ తన వైఖరి మార్చుకుంది. దాంతో మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమమైంది. క్రిస్మస్ పండుగ హడావుడి ఉండే డిసెంబర్లో ఎన్నికలు రావడం 1923 తర్వాత బ్రిటన్‌లో ఇదే మొదటిసారి. అయితే ఈ ఎన్నికల తర్వాతనైనా ఇప్పుడున్న అనిశ్చితి తొలగుతుందని స్పష్టంగా చెప్పగల పరిస్థితి లేదు. ఎందుకంటే అటు రాజకీయ పక్షాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈయూ నుంచి వైదొలగడంపై అస్పష్టత ఉంది. ఒకప్పుడు బ్రెగ్జిట్‌కు బలంగా అనుకూ లత వ్యక్తం చేసిన వర్గాలు ఇప్పుడంత సుముఖంగా లేవు. 2015 ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీకి అధికారం చేజారుతుందన్న భయం పట్టుకుంది. ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ నెగ్గుతుం దని జోస్యం చెప్పాయి. ఆ పార్టీ బ్రెగ్జిట్‌కు గట్టి వ్యతిరేకి. దాంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కామెరాన్ అలవిగాని హామీలిచ్చారు. తామొస్తే బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి అవసరమైతే ఈయూ నుంచి వైదొలగుతామన్నది ఆ హామీల్లో ఒకటి. నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని బ్రెగ్జిట్ అనుకూల పార్టీ వల్ల తమకు నష్టం ఉండకూడదని భావించే కామెరాన్ ఈ హామీ ఇచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. అంత వరకూ లిబరల్ డెమొక్రాట్లతో కలిసి అధికారాన్ని పంచుకున్న కన్సర్వేటివ్‌లకు ఊహించని స్థాయిలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయిలో మెజారిటీ వచ్చింది. 650 స్థానా లున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆ పార్టీకి 331 స్థానాలు లభించాయి. అధికారం దక్కుతుందనుకున్న లేబర్ పార్టీ విపక్షంగా ఉండిపోయింది. లిబరల్ డెమొక్రాట్లు, బ్రెగ్జిట్ పార్టీ తుడిచిపెట్టుకు పోయాయి. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ సాకు చూపి రిఫరెండం నుంచి తప్పించుకోవచ్చుననుకున్న కన్సర్వేటివ్ పార్టీ ఇరుక్కుపోయింది. ఫలితంగా కామెరాన్‌కు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా 2016లో రిఫరెండం నిర్వహించకతప్పలేదు. అందులో 51.9 శాతంమంది ఈయూ నుంచి బయ టకు రావడంవైపే మొగ్గు చూపారు. ఫలితంగా కామెరాన్ వైదొలగి ఆ స్థానంలో థెరిస్సా మే ప్రధాని అయ్యారు. 2017 జూన్‌లో మధ్యంతర ఎన్నికలు జరిగాక కన్సర్వేటివ్‌ల బలం బాగా తగ్గి పోయింది. అది 218 స్థానాలకు పరిమితమై, 10 స్థానాలున్న డెమొక్రటిక్ యూనియనిస్టు పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బ్రెగ్జిట్‌పై ఆమె ఈయూతో కుదుర్చుకొచ్చిన ఒప్పందాలను పార్లమెంటు వరసగా మూడుసార్లు తోసిపుచ్చడంతో థెరిస్సా రాజీ నామా చేయకతప్పలేదు. ఆమె స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్‌ను కూడా ఈ కష్టాలే వెంటా డాయి. పార్లమెంటులో అత్యధికులు ఆయన కుదుర్చుకొచ్చిన ఒప్పందాన్ని తిరస్కరించారు. ఆ ఒప్పందం వల్ల బ్రిటన్ 9వేల కోట్ల డాలర్లు నష్టపోవాల్సివస్తుందని నిపుణులు లెక్కలేశారు. బ్రెగ్జిట్ తుది గడువు దగ్గరపడుతుండగా పార్లమెంటులో ఎటూ తేలకపోవడంతో బోరిస్ జాన్సన్ చివరకు మధ్యంతర ఎన్నికల ప్రతిపాదన చేశారు. ఇప్పటికైతే ప్రజాభిప్రాయం ఆయనవైపే ఉంది. కానీ అది చివరివరకూ నిలబడుతుందన్న నమ్మకం లేదు. 2017 ఎన్నికల ముందు థెరిస్సా మే సైతం అందరి కన్నా ముందున్నారు. తీరా ఫలితాల్లో సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. పార్టీలో ఉన్న తన వ్యతిరేకుల ప్రాబల్యం పెరగకుండా చూడటం, ప్రజల్లో బ్రెగ్జిట్ అనుకూల తను మళ్లీ పెంచడం ఇప్పుడు బోరిస్ జాన్సన్ లక్ష్యాలు. వీటిల్లో ఆయన ఎంతవరకూ సఫలీకృతుల వుతారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాను ఈయూతో మెరుగైన ఒప్పందం కుదుర్చుకొచ్చినా పార్లమెంటులో తనకెవరూ సహకరించలేదని జాన్సన్ ప్రచారం చేస్తారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడంతా మారింది. ఆర్థిక అనిశ్చితి, సామాజిక అభద్రత చవిచూసిన అనేక ప్రాంతాలు 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసినా...ఆ తర్వాత లేబర్ పార్టీవైపు మొగ్గుచూపాయి. బ్రెగ్జిట్ అనుకూ లుర ఓట్లు దూరం చేసుకోకూడదన్న భావనతో లేబర్ పార్టీ మునపట్లా బ్రెగ్జిట్‌ను గట్టిగా వ్యతి రేకించడం లేదు. తాము వస్తే మరోసారి బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి దేశ ప్రయోజనాలు కాపా డతామని హామీ ఇస్తోంది. అదే సమయంలో దానితో సంబంధం లేని సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తోంది. ఇక తిరిగి పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్న లిబరల్ డెమొక్రాట్లు అసలు బ్రెగ్జిట్ జోలికే పోవద్దన్న తమ పాత వాదనను బలంగా వినిపిస్తున్నారు. బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్య లకు ఈయూ సభ్యత్వాన్ని సాకుగా చూపడం రాజకీయ నేతలు చేసిన తప్పు. బ్రెగ్జిట్‌లో ఇమిడి ఉండే సమస్యలేమిటో ఈ నాలుగేళ్లలో ప్రజలకు బాగా అర్థమైంది. దేశంలో పేదరికం ఎన్నడూ లేనంత పెరిగింది. జాతీయ ఆరోగ్య సర్వీస్(ఎన్హెచ్ఎస్)కు నిధుల కేటాయింపు బాగా తగ్గింది. అదొక్కటే కాదు... మొత్తంగా సంక్షేమానికి భారీ కోతలు అమలవుతున్నాయి. వీటన్నిటా లేబర్ పార్టీ వైఖరిపై ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ సమర్థతపై పార్టీలోనే సందేహాలున్నాయి. వీటిని కోర్బిన్ అధిగమించవలసి ఉంది. తాజా ఎన్నికలు ఇప్పుడున్న అనిశ్చితికి తెరదించితే మళ్లీ బ్రిటన్ చురుగ్గా ముందుకెళ్తుంది. -
నేడే ఎన్నికలు
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నేడు జరగనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు ఎన్నికలు, 18 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాల(సతారా, సమస్తిపూర్)కు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ప్రచారంలో బీజేపీ పైచేయి సాధించగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకుగాను ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారంలో వాడుకుంది. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ఉప సమరం జరిగే రాష్ట్రాలు.. యూపీలో 11, గుజరాత్ 6, బిహార్ 5, అస్సాం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానాలకు కూడా నేడు పోలింగ్ జరగనుంది. బరిలో ప్రముఖులు మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (నాగ్‌పూర్–నైరుతి), కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్ (భోకర్), పృథ్వీరాజ్ చవాన్ (కరాడ్) శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి) హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ (కర్నాల్), కాంగ్రెస్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (కైతాల్), కుల్దీప్ బిష్ణోయి (ఆదమ్పూర్), దుష్యంత్ చౌతాలా (ఉచన్‌కలాన్) విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు. అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం 100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో ఫస్ట్లు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎన్నికల్ని వివిధ కోణాల నుంచి చూస్తే ఎన్నో ఫస్ట్లు కనిపిస్తాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగే తొలి ఎన్నికలివి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ చెక్కు చెదరని నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ► కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. కశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్న విమర్శలు వచ్చినప్పటికీ, రావణకాష్టంలా రగులుతున్న సమస్యకు ఏదో ఒక పరిష్కారం వచ్చిందనే అభిప్రాయమైతే జనంలో కనిపించింది. అందుకే ఈసారి ప్రచారంలో స్థానిక అంశాలను పట్టించుకోకుండా ఆర్టికల్ 370 రద్దునే ప్రధాని మోదీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. జాతీయ భావాన్ని రగిల్చి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ► ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలివి. బీజేపీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన చర్య ఇది. దీని ప్రభావం ముస్లిం ఓటర్లపై ఎలా పడుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలతో ముస్లింలు, ముఖ్యంగా మహిళా ముస్లింలను బీజేపీ ఏ మేరకు ఆకర్షించగలదో తేలిపోనుంది. ► 2014 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. గెలిచిన తర్వాత అనూహ్యంగా మరాఠాల ఆధిపత్యం ఉన్న మహా రాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌ను, జాట్ల ప్రాబల్యం ఉన్న హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌ను సీఎంలుగా చేసింది. ఇప్పుడు వారే సీఎంలుగా ఎన్నికలకు వెళుతోంది. మరి మరాఠా, జాట్ల దారి ఎటో తెలిసిపోతుంది. ► ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలివి. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో పార్టీపై దృష్టిపెట్టలేక పోతున్నారు. దశ, దిశను నిర్దేశించే నాయకత్వలేమితో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు ఇంకెన్ని చేదు అనుభవాలను మిగల్చబోతున్నాయో ! విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు. అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం 100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. -
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న ముగ్గురు సభ్యులు (కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్రస్వామి) ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అవసరమైంది. ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి వివరాలిలా ఉన్నాయి.. - బుధవారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 14తో ముగుస్తుంది. - 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. - ఈ నెల 19వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. - ఈ స్థానాలకు అవసరమైతే ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుంచి ఓట్ల లెక్కింపు. - ఈ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసరుగా పి.బాలకృష్ణమాచార్యులు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరుగా పి.వి.సుబ్బారెడ్డి వ్యవహరిస్తారు. -
అఖిలేశ్ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!
న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని, ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ– ఆర్ఎల్డీ ‘మహా గఠ్ బంధన్’ సీట్లు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాయా వ్యాఖ్యలతో మహాగఠ్‌బంధన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ‘ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కూటమితో పనిలేకుండా ఒంటరిగానే బరిలో నిలుస్తాం. రాష్ట్రంలో బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్న 10 సీట్లను బీఎస్పీ గెలుచుకుంది. ఎస్పీ ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు’ అని వివరించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 9 మంది, బీఎస్పీ, ఎస్పీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది. ములాయం కుటుంబీకులే గెలవలేదు యూపీలో బీఎస్పీ–ఎస్పీ– ఆర్ఎల్డీతో ఏర్పాటైన మహాగఠ్‌బంధన్ వృథాయేనని మాయావతి అన్నారు. ‘యాదవుల ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు. మన పార్టీ ఓట్లు వాళ్లకు పడ్డాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచింది. యాదవుల ఓట్లు అఖిలేశ్ యాదవ్ కుటుంబీకులకు కూడా పడలేదు’ అని తెలిపారు. కూటమి లేకున్నా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎందుకంటే అతడు తండ్రి(ములాయం సింగ్ యాదవ్)లాంటి వాడు కాదు’ అని మాయ పేర్కొన్నారు. ‘అఖిలేశ్‌తో విభేదించిన అతడి బాబాయి శివ్‌పాల్‌యాదవ్, కాంగ్రెస్ కారణంగానే యాదవుల ఓట్లు చీలాయి. అఖిలేశ్ భార్య డింపుల్‌ను కూడా గెలిపించుకోలేకపోయాడు. అతని ఇద్దరు సోదరులూ ఓడారు. మనం ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం’ అని తెలిపారు. సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడతాం: అఖిలేశ్ సామాజిక న్యాయం కోసం బీఎస్పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరేగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ఫెరారీ, సైకిల్ (ఎస్పీ ఎన్నికల గుర్తు) మధ్య పోటీ. ఫెరారీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. అంశాల ప్రాతిపదికన కాకుండా వేరే రకంగా ఎన్నికలు జరిగాయి. టీవీలు, సెల్ఫోన్ల ద్వారా ప్రజలతో వాళ్లు(బీజేపీ)మైండ్ గేమ్ ఆడారు. అది నాకూ అర్థం కాలేదు’ అని పేర్కొన్నారు. ఆ యుద్ధ తంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామన్నారు. -
ప్రశాంతంగా కర్ణాటక ఉప ఎన్నికలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రెండు శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు శనివారం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. బళ్లారి, మాండ్య, శివమొగ్గ లోక్‌సభ స్థానాలు, రామనగర, జమఖండి అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఐదు చోట్లా ప్రతిపక్ష బీజేపీ ఒంటరిగా, అధికార కాంగ్రెస్–జేడీఎస్‌లు ఉమ్మడిగా పోటీకి దిగాయి. మొత్తం 66.8 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది. ఈ నెల 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్యే ఉంది. విజయంపై అన్ని పార్టీలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
కర్ణాటకలో బీజేపీ అభ్యర్థి జంప్
బెంగళూరు: కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ స్థానానికి ఈనెల 3న ఉప ఎన్నిక జరగనుండగా బీజేపీకి ఆ పార్టీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ గట్టి షాకిచ్చారు. బీజేపీ నేతలు తనను పట్టించుకోవడం లేదంటూ తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాగా, ఈ స్థానం నుంచి జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి భార్య అనిత పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ తప్పుకోవడంతో ఆమె గెలుపు మరింత తేలిక కానుంది. గురువారం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నేను ఫోన్ చేసినా మాట్లాడటం లేదు. ప్రచారంలో నేతలెవరూ నన్ను కలుపుకుని పోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్‌కు వెళుతున్నా. జేడీఎస్ అభ్యర్థికే మద్దతిస్తా’ అని తెలిపారు. -
తొలి ముస్లిం లోక్‌సభ సభ్యురాలు
లక్నో: కైరానా (యూపీ) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన తబస్సుమ్ హసన్ చరిత్ర సృష్టించారు. 2014 నుంచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టిన యూపీ ముస్లింగా ఆమె చర్రిత సృష్టించారు. బీజేపీ అభ్యర్థి మృగంకా సింగ్‌పై తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల మెజార్టీతో కైరానా నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో లోక్‌సభలో యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి ముస్లింగా తబస్సుమ్ నిలిచారు. 2014లో బీజేపీ-ఆప్నాదళ్ కూటమి మోదీ హవాతో రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన సీట్లను కాంగ్రెస్-ఎస్సీ కూటమి సొంతం చేసుకుంది. వీరిలో ఒక్క ముస్లిం కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎస్సీ- బీఎస్సీ కూటమి ముస్లిం అభ్యర్ధులను బరిలో నిలపలేదు. ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక యూపీ ముస్లిం లోక్‌సభ సభ్యురాలిగా తబస్సుమ్ నిలవగా, రాజ్యసభలో ఇద్దరు ముస్లింలు జావేద్ అలీ ఖాన్, తన్జీమ్ ఫాట్మాలు ఎస్సీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
-
కైరానా విపక్షాల కైవసం
సాక్షి, న్యూఢిల్లీ : కైరానా(ఉత్తరప్రదేశ్) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్ హసన్ తన సమీప ప్రత్యర్థి మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో విపక్షాలు(సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్) అన్నీ కలసి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోవడమే పరాజయానికి కారణమని ఓటమి అనంతరం మృగంకా వ్యాఖ్యానించారు. ఫలితాలు నిరాశకు గురి చేసినా, భవిష్యత్‌లో తిరిగి నియోజకవర్గంపై పట్టు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో అంతర్గత కలహాల వల్లే ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చిందనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీను ఓడించాయని అన్నారు. ఇందుకు బీజేపీ మరింత సన్నద్ధం కావాల్సివుందని అభిప్రాయపడ్డారు. కాగా, కైరానా ఉప ఎన్నికలో విజయం సాధించిన తబస్సుమ్ మాట్లాడుతూ ఈ విజయం కైరానా ప్రజలదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి రాష్ట్రంలో లేదని చెప్పడానికి ఈ ఫలితమే నిదర్శమని అన్నారు. మహ్మద్ అలీ జిన్నా వివాదాన్ని తెరపైకి తెచ్చి ఉప ఎన్నికలో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కైరానా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ ఫిబ్రవరిలో అర్థాంతరంగా తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన తనయ మృగంకా సింగ్‌ను కైరానా నుంచి బీజేపీ బరిలో నిలిపింది. -
ఉప ఎన్నికల్లో కమలానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఓటమితో భంగపడింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే నిలుపుకోగలిగింది. పాల్ఘడ్(మహారాష్ట్ర)లో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. భండారా-గోండియా స్థానాల్లో(మహారాష్ట్ర)లో ఎన్సీపీ ఘనవిజయం సాధించింది. ఇక కైరానా(యూపీ) లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ పోటీదారు మృగంకా సింగ్‌పై ఘన విజయం సాధించారు. ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్‌ను నిలబెట్టాయి. నాగాలాండ్ సొలె లోక్‌సభ స్థానం ఫలితాల్లో ఎన్డీపీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 28 తేదీన నాలుగు లోక్ సభ స్థానాలకు, 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగా, కాసేపట్లో తుది ఫలితాలు తేలనున్నాయి. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే... కర్ణాటక ఆర్ఆర్ నగర్(రాజరాజేశ్వరి నగర్) స్థానంలో, పాలస్ కడేగావ్-మహారాష్ట్రలో, అంపతి-మేఘాలయలలో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పంజాబ్‌లోని షాకోట్ కాంగ్రెస్ అభ్యర్థి అకాలీదల్ అభ్యర్థిపై విజయం సాధించారు. షాకోట్ అకాలీదల్ సిట్టింగ్ స్థానం. ఉత్తర ప్రదేశ్‌లోని నూర్పూర్(అసెంబ్లీ స్థానం)లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. మహేస్తల-పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైంది. చెంగన్నూర్-కేరళలో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. జోకిహట్(బిహార్)లో జేడీయూకు ఘోర పరాభవం ఎదురైంది. ఆర్జేడీ పార్టీ అభ్యర్థి విజయం సాధించటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆర్జేడీ నేతలు, దీనిని విపక్షాల సమిష్టి విజయంగా అభివర్ణించారు. జార్ఖండ్‌లోని గోమియా స్థానంలో బీజేపీ అభ్యర్థి, సిలీ స్థానంలో జేఎంఎం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉత్తరాఖండ్ థరేలీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, మూడు రోజుల(సోమవారం) క్రితం మూడు రాష్ట్రాల్లోని 4 లోకసభ స్థానాలకు, 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్ కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘడ్, భండారా-గోండియా, నాగాలాండ్‌లోని సోలె లోక్‌సభ స్థానాలకు, దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు(నూర్పూర్-యూపీ, షాకోట్-పంజాబ్, జోకిహట్-బిహార్, గోమియా, సిలీ-జార్ఖండ్, చెంగన్నూర్-కేరళ, పాలస్ కడేగావ్-మహారాష్ట్ర, అంపతి-మేఘాలయ, థరేలీ-ఉత్తరాఖండ్, మహేస్తల-పశ్చిమ బెంగాల్, రాజరాజేశ్వరి నగర్(ఆర్ఆర్ నగర్)-కర్ణాటక స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పాలక, ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. -
4 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు.. నేడు ఉప ఎన్నికలు
న్యూఢిల్లీ : నేడు దేశ వ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానా లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే నూపుర్(ఉత్తర ప్రదేశ్), షాకోట్(పంజాబ్), జోకిహట్(బిహార్), గొమియా, సిల్లీ(జార్ఖండ్), చెంగన్నూరు(కేరళ), పాలుస్ కడేగావ్(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్) మహేస్థల( పశ్చిమబెంగాల్) అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. మే 31న లెక్కింపు చేపడతారు. బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణంతో యూపీలోని కైరానాకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ మద్దతుతో లోక్‌దళ్ అభ్యర్థి తబస్సుమ్ ఆమెపై తలపడుతున్నారు. గోరక్‌పూర్, పూల్పూర్ ఫలితాలు కైరానాలో పునరావృతమవుతాయని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్లో బీజేపీ ఎంపీ చింతామన్ వంగర మరణంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆశ్చర్యకరంగా వంగర కుమారుడు శ్రీనివాస్ శివసేన తరఫున బరిలో ఉండగా.. బీజేపీ నుంచి గవిట్ పోటీపడుతున్నారు. భండారా–గోండియా సిట్టింగ్ ఎంపీ ఆ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
ఉప ఎన్నికల్లో ఉగ్రవాది పోటీ!
సాక్షి, లాహోర్: మహ్మద్ యాకూబ్ షేక్.. లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థ కీలక సభ్యుడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాంటి షేక్ త్వరలో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. షరీఫ్ ఉద్వాసనతో ఖాళీ అయిన ఎన్ఏ-120 నియోజకవర్గం నుంచే అతను ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఈ మేరకు ఎల్ఈటీ అనుబంధ సంస్థ అయిన డిఫా-ఎ-పాకిస్థాన్ కౌన్సిల్ మద్ధతు ఇవ్వాలంటూ మిగతా పార్టీలకు ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 17న జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా అయూబ్ యాకూబ్ కు ఓటేసి గెలిపించాలని డిఫా పెద్దలు విజ్ఞప్తి చేశారు. యాకూబ్ ఓ గొప్ప దేశ భక్తుడని, సేవ చేసే అవకాశం కల్పించాలంటూ ప్రజలను డిఫా కోరారు. ఎనర్జీ బల్బు గుర్తుతో అయూబ్ పోటీ చేయబోతున్నాడు. మిల్లీ ముస్లిం లీగ్ పార్టీ(హఫీజ్ సయ్యద్ స్థాపించిన పార్టీ) తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాద కీలక సభ్యులంతా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పరిపాటిగా మారిపోయింది. 1972 భవల్పూర్లో జన్మించిన యాకూబ్ లష్కర్ ఏ తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడు. లాహోర్ ముస్లిం యూనివర్సీటీ నుంచి డిగ్రీ పట్టా పొందాడు. ఉగ్రసంస్థలో కీలక సభ్యుడిగా ఉన్న యాకూబ్ ఏడాదికి మూడు నాలుగు సార్లు సౌదీ ఆరేబియా వెళ్తూ నిధుల సేకరణ చేపడుతుంటాడు. పలు కీలక బాధ్యతలను కూడా నిర్వహించిన యాకూబ్. మరికొన్ని ఉగ్రసంస్థల్లో కూడా సహయకుడిగా పని చేశాడు. 2012 లొ అమెరికా ట్రెజరీ సంస్థ యాకూబ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో కూడా చేర్చింది. ప్రస్తుత ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) అభ్యర్థి కుల్సుమ్ నవాజ్‌పై యాకూబ్ తలపడబోతున్నారు. -
ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్