టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల  | CM KCR Announced Kusukuntla Prabhakar Reddy As Munugodu TRS Candidate | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల 

Oct 8 2022 1:18 AM | Updated on Oct 8 2022 1:18 AM

CM KCR Announced Kusukuntla Prabhakar Reddy As Munugodu TRS Candidate - Sakshi

మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి బీ–ఫామ్‌  అందజేస్తున్న కేసీఆర్‌. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌:  మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆయనకు పార్టీ బీ ఫామ్‌ను అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల విలువైన చెక్కును కూడా ఇచ్చారు.

కాగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, మునుగోడులో టీఆర్‌ఎస్‌దే విజయమని చెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement