nepal airlines
-
‘పాక్‌లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు!
న్యూఢిల్లీ: భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్ మ్యాప్‌లో చూపిస్తూ నేపాల్ ఎయిర్‌లైన్స్ చేసిన ఒక ఘోరమైన తప్పిదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద ‘నెట్వర్క్ మ్యాప్’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. తప్పు తెలుసుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చి, భారత్‌ను క్షమాపణలు కోరింది.సోషల్ మీడియాలో తీవ్ర దుమారంనేపాల్కు చెందిన అధికారిక విమానయాన సంస్థ ‘నేపాల్ ఎయిర్‌లైన్స్’ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ నెట్వర్క్ మ్యాప్‌లో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో ఉన్నట్లుగా చూపించారు. ఈ మ్యాప్‌ను గమనించిన భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, తీవ్ర వ్యతిరేకత రావడంతో బుధవారం నాడే ఆ వివాదాస్పద పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆఘమేఘాల మీద తొలగించింది.బహిరంగ క్షమాపణలు చెబుతూ..ఈ ఘోర తప్పిదంపై గురువారం నాడు నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ‘మా సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న నెట్వర్క్ మ్యాప్‌లో దొర్లిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి.. మ్యాప్‌లో ఉన్న భౌగోళిక దోషాలు నేపాల్ దేశపు అధికారిక వైఖరిని లేదా నేపాల్ ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు’ అని స్పష్టం చేసింది.లోపాలను సరిదిద్దే పనిలో అంతర్గత విచారణతాము వెంటనే ఆ వివాదాస్పద పోస్ట్‌ను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడించింది. ‘పొరుగు దేశాలతో, స్నేహితులతో మాకున్న బలమైన సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తాం. ఈ పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మేము చింతిస్తున్నాం’ అని నేపాల్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో వివరించింది.ఇది కూడా చదవండి: ‘ఒరేయ్ సూరీడూ... ఉల్లికి లొంగిపోతావురా’? -
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
నేపాల్‌లోని భద్రాపూర్ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి నది వైపు దూసుకెళ్లింది. అయితే.. కాస్త దూరం వెళ్లి ఆగిపోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.08 గంటల సమయంలో చోటుచేసుకుంది. బుద్ధ ఎయిర్వేస్కు చెందిన విమానం 51 మంది ప్రయాణికులు, మరో నలుగురు విమాన సిబ్బందితో నేపాల్ రాజధాని కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 8.23కు బయలుదేరిన విమానం.. 9.08 గంటలకు భద్రాపూర్ చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. రన్‌వేను దాటుకుని 200 మీటర్ల దూరం వెళ్లి.. గడ్డిలోకి కూరుకుపోయింది. ఇంకాస్త ముందుకెళ్లి ఉంటే.. విమానం నదిలోకి పడిపోయి ఉండేది.విమానం రన్‌వేపై నుంచి ముందుకు దూసుకుపోవడంతో భారీ కుదుపులు వచ్చాయి. దీంతో.. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను సురక్షితంగా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు విమానాశ్రయ ప్రతినిధి రింజీ షెర్పా వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు బుద్ధ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (సీఏఏఎన్) అధికార ప్రతినిధి జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. -
ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా వస్తే ఇంకేమైనా ఉందా. ఇక అంతే సంగతలు. ఐతే కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగా నేపాల్‌కి చెందిన రెండు విమానాలు ఎదురు పడి డీ కొనేంత చేరువులోకి వచ్చేశాయి. అయితే పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో నేపాల్ విమానాయన అథారిటీ సీరియస్ అయ్యింది. కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగానే జరిగిందని నిర్థిరిస్తూ.. ముగ్గురు కంట్రోలర్లపై వేటు విధించింది. వివరాల ప్రకారం..శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ 320 విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండుకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీ కొనేంత చేరువకు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం దాదాపు 19 వేల అడుగుల నుంచి దిగుతుండగా..అదే ప్రదేశంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్ చూపించడంతో వార్నింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు సదరు విమాన పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం ఏడు వేల అడుగులకు దిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని అదికారులు ఊపించుకున్నారు. గానీ ఈ ఘటన పట్ల సీరియస్ అయిన నేపాల్ పౌర విమానాయన అథారిటీ ఇది ఉద్యోగుల అజాగ్రత్త కారణంగానే చోటుచేసుకున్నట్లు పేర్కొంది. అంతేగాదు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడూ కంట్రోల్ రూంకు ఇన్చార్జ్గా ఉన్న ముగ్గురు అధికారులను సీఏఏఎన్ సస్పెండ్ చేసింది. దీనిపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. (చదవండి: చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష) -
నేపాల్‌లో కూలిన విమానం
కఠ్మాండు: నేపాల్‌లో వాతావరణం అనుకూలించక 18 మందితో వెళుతున్న ఓ చిన్న విమానం కూలిపోయింది. నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆదివారం పొఖారా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.40కి బయలు దేరిందని తర్వాత 15 నిమిషాలకు దాని నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయని అధికారులు తెలిపారు. విమానంలో ఓ విదేశీయుడు సహా 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్గాకంచి జిల్లాలోని ఖిదిమ్ అటవీ ప్రాంతంలో విమానం శకలాలు కని పించాయని, అందులో ఉన్న 18 మందీ మృతిచెంది ఉంటారని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. పీవీ, సోనియాల మధ్య విభేదాలు! తన తాజా పుస్తకంలో కేంద్ర మంత్రి థామస్ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య రాజీవ్‌గాంధీ హత్యకేసు దర్యాప్తు విషయంలో అప్పట్లో తీవ్ర మనస్పర్ధలు చోటు చేసుకున్నాయట. సొంత పార్టీకి చెంది న పీవీ ప్రధానిగా ఉన్నా.. రాజీవ్ హత్యకేసు దర్యాప్తు నత్తనడకన నడుస్తోందని సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. తరచూ తనకు అవమానం జరుగుతోందంటూ పీవీ ఆవేదన చెందారట. దీంతో ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉండేవికావని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ వెల్లడించారు. ‘సోనియా- ద బిలవ్డ్ ఆఫ్ ద మాసెస్ (సోనియా-జన ప్రియతమ నేత)’ పేరుతో రాసిన తన తాజా పుస్తకంలో థామస్ పలు విషయాలు పేర్కొన్నారు.


