ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Nepal Airlines Planes Almost Collided 3 Controllers Suspended - Sakshi

ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా వస్తే ఇంకేమైనా ఉందా. ఇక అంతే సంగతలు. ఐతే కంట్రోలర్‌ల అజాగ్రత్త కారణంగా నేపాల్‌కి చెందిన రెండు విమానాలు ఎదురు పడి డీ కొనేంత చేరువులోకి వచ్చేశాయి. అయితే పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో నేపాల్‌ విమానాయన అథారిటీ సీరియస్‌ అయ్యింది.  కంట్రోలర్‌ల అజాగ్రత్త కారణంగానే జరిగిందని నిర్థిరిస్తూ.. ముగ్గురు కంట్రోలర్‌లపై వేటు విధించింది.

వివరాల ప్రకారం..శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ 320 విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండుకు వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం దాదాపు ఢీ కొనేంత చేరువకు వచ్చాయి. ఎయిర్‌ ఇండియా విమానం దాదాపు 19 వేల అడుగుల నుంచి దిగుతుండగా..అదే ప్రదేశంలో నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.

రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్‌ చూపించడంతో వార్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా అధికారులు సదరు విమాన పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఏడు వేల అడుగులకు దిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.  కొద్దిలో  పెను ప్రమాదం తప్పిందని అదికారులు ఊపించుకున్నారు. గానీ ఈ ఘటన పట్ల సీరియస్‌ అయిన నేపాల్‌ పౌర విమానాయన అథారిటీ ఇది ఉద్యోగుల అజాగ్రత్త కారణంగానే చోటుచేసుకున్నట్లు పేర్కొంది. అంతేగాదు  ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడూ కంట్రోల్‌ రూంకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ముగ్గురు అధికారులను సీఏఏఎన్‌ సస్పెండ్‌ చేసింది. దీనిపై ఎయిర్‌ ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

(చదవండి: చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top