breaking news
Neeraj Sharma
-
అమెరికా పౌరసత్వం రద్దు.. ఎవరీ నీరజ్ శర్మ?
న్యూఢిల్లీ: ట్రంప్ ప్రభుత్వం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పౌరసత్వాల రద్దు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మోసపూరిత పద్ధతుల్లో, తప్పుడు సమాచారంతో అమెరికా పౌరసత్వం పొందిన 17 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ జాబితాలో న్యూజెర్సీకి చెందిన భారతీయ సంతతి వ్యాపారవేత్త, మాజీ సీఈఓ నీరజ్ శర్మ (50) పేరు ఉండటం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.వీసా మోసం.. ఫోర్జరీ భారత్‌లో జన్మించిన నీరజ్ శర్మ, ‘మాగ్నానివిజన్ ఎల్ఎల్సీ’ అనే ఐటీ స్టాఫింగ్ కంపెనీని నిర్వహిస్తూ విదేశీ ఉద్యోగుల తరపున హెచ్-1బీ వీసా పిటిషన్లను దాఖలు చేసేవారు. ఒక ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలో ఈ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు చూపుతూ.. ఆయన 11 నకిలీ హెచ్-1బీ పిటిషన్లను సమర్పించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ దరఖాస్తుల కోసం సదరు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ పత్రాలను కూడా సృష్టించినట్లు తేలింది. ఈ మోసం 2015 నుండి 2017 మధ్య కాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు.పౌరసత్వం రద్దుకు దారితీసిన అబద్ధం నీరజ్ శర్మ డిసెంబర్ 2017లో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే పౌరసత్వ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆయన .. తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన వీసా మోసం కేసులో దోషిగా తేలారు. తాజా కోర్టు ఫైలింగ్స్ ప్రకారం.. పౌరసత్వ అర్హతను దెబ్బతీసే తన నేరపూరిత ప్రవర్తనను శర్మ ఉద్దేశపూర్వకంగా దాచారని న్యాయ శాఖ వాదిస్తోంది. మోసపూరిత సమాచారంతో పొందిన పౌరసత్వాన్ని చట్టప్రకారం రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం పట్టుబడుతోంది.ట్రంప్ సర్కార్ వేటలో మరికొందరు అమెరికా ప్రభుత్వం కేవలం వలసల మోసాలకే పరిమితం కాకుండా.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని కూడా ఏరివేస్తోంది. ఈ 17 మంది జాబితాలో చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, మనీలాండరింగ్, వైర్ ఫ్రాడ్, డ్రగ్స్ వంటి ఘోరమైన నేరాలకు పాల్పడి పౌరసత్వం పొందిన వారు ఉన్నారు. వీరిలో ఒక హైతీ వలసదారుడు, కొలంబియాకు చెందిన మాజీ క్యాథలిక్ ప్రీస్ట్, మెక్సికోకు చెందిన వ్యక్తితో పాటు మాజీ యుగోస్లావ్ పౌరుడు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా.. -
ఛత్ భక్తుల కోసం ప్రత్యేక రైలు
న్యూఢిల్లీ: జరిగే ఛత్ పూజకు వెళ్లేవారి సౌకర్యార్థం పాట్నాకు ప్రత్యేక రైలు నడిపేందుకు ఉత్తర రైల్వే నిర్ణయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి స్థిరపడిన ఉత్తర భారతదేశ ప్రజలు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీవరకు ఛత్ పూజ నిమిత్తం సొంత గ్రామాలకు తరలుతున్నారు. వేలాదిగా ఉన్న వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం నుంచి ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి పాట్నా వరకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి నీరజ్ శర్మ తెలిపారు. పండగల సీజన్ నిమిత్తం సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ 10వ తేదీవరకు ఉత్తర రైల్వే 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు నవరాత్రి, ఈద్, దసరా, దీపావళి పండుగలు ముగియగా, ప్రస్తుతం ఛత్ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీటిలో డైలీ, వీక్లీ రైళ్లు ఉన్నాయని, ఈ పండగ సీజన్ మొత్తం సుమారు 3 వేల అదనపు ట్రిప్పులు నడిపామని ఆయన వివరించారు. అలాగే దీనికోసం 130 అదనపు కోచ్‌లను ఆయా రైళ్లకు కలిపామని చెప్పారు. సాధారణంగా పండగల సీజన్లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 30 నుంచి 40 శాతం అదనంగా పెరుగుతుందని శర్మ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 30 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వివరించారు. ఛత్‌పూజను బీహార్ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు.


