breaking news
Nagamalleswara Rao
-
Ambati Murali: కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరిస్తోంది
-
ప్రాణాలతో పోరాడుతున్నాడు నాగ మల్లేశ్వరరావు ని పరామర్శించిన సజ్జల
-
సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఘటన.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి: పొన్నవోలు
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును సీనియర్ హైకోర్టు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రపు బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నేతల దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాక్షసులా వ్యవహరిస్తున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడి వెనుక పాత్రధారులు కాదు.. సూత్రధారులను కూడా అరెస్టు చేయాలి. కూటమి ప్రభుత్వం అరాచకం తారా స్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను పీకు తింటున్నారు’’ అని పొన్నవోలు మండిపడ్డారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఏం జరిగిందో అందరికీ తెలిసింది.. లేకపోతే ఈ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలనుకున్నారని పొన్నవోలు చెప్పారు.పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. నాగమల్లేశ్వరరావు దాడి వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర నాగమల్లేశ్వరరావు గురించి మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనమన్నారు. నరేంద్రపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు. -
మన్నవ సర్పంచ్‌పై హత్యాయత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్/సాక్షి, అమరావతి: మంత్రి లోకేశ్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు ప్రత్యర్థుల రక్తం కళ్ల చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపు ఎక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశ్నించే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పాశవిక దాడే నిదర్శనం. వివరాలివీ.. మన్నవ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీస్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో సర్పంచ్ కిందపడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లోగ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికి స్టాల్‌లోని సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కీ నిర్వహించినట్లు దానిద్వారా తెలుస్తోంది. ఇక ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో ఒకేసారి దాడిచేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సహాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపారు. టీడీపీ అక్రమాలను అడ్డుకుంటున్నందుకే.. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ప్రశి్నంచే వారిపై దాడిచేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైనా దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతోపాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. శాంతిభద్రతలు క్షీణించాయి: అంబటి ఈ ఘటనపై మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం.. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకూ, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణలేకుండా పోయిందని ఒక ప్రకటనలో తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి చేస్తున్న టీడీపీ మూకలు(ఇన్సెట్) నాగమల్లేశ్వరరావు(ఫైల్) -
మన్నవ సర్పంచ్‌పై విచక్షణారహితంగా దాడి
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై దాడి
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
Watch Live : నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
మీ కాళ్ళు పట్టుకుంటా.. దయచేసి.. నాగమల్లేశ్వరావు తండ్రి ఆవేదన
-
పల్నాడు టూర్లో వైఎస్ జగన్ ఫ్యాన్ క్రేజ్
-
డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ పురస్కారం
తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన పలువురు ప్రముఖులకు తెలుగు, సంస్కృత అకాడమీ పురస్కారాలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో కవిత్వం-విమర్శ కేటగిరి కింద ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి పురస్కారం అందించారు. డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకునిగా, అనువాదకుడిగా, అధ్యాపకుడిగా, మీడియా గురుగా సుప్రసిద్ధులు. వివిధ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పని చేసిన ఆయన వాడుక భాష, తెలుగు వ్యాక్యం ప్రధాన అంశాలుగా పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఉస్మానియా నుంచి ఎం.ఏ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్., తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశారు. తెలంగాణ పోరాట కథలపై ఎం.ఫిల్లో పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. తెలుగు కవిత్వంలో ఆధునికత, ఆవిర్భావ వికాసాలపైన చేసిన మౌలిక సాధికార పరిశోధన సాహితీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది. నిరంతర భాషా అధ్యయనం కారణంగా శాసన భాష నుంచి వర్తమాన సాహిత్యం వరకు అనేక అంశాలపై పలువేదికల నుంచి సమ్మెట ప్రసంగించారు. హైదరాబాద్‌లో తెలుగు సాహితీ సమితిని స్థాపించి నెల నెలా సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. రావిశాస్త్రి, డాక్టర్ కేశవరెడ్డి రచనలపై కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సదస్సులు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్‌లతో పాటు న్యూఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్, తిరువనంతపురం, సిమ్లాలలో తెలుగు సాహిత్యంపై ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీకి చెందిన గిరిజన, మౌఖిక సాహిత్య కేంద్రంలో క్రియాశీల సభ్యుడిగా తెలుగు ప్రాంతాల గిరిజన సాహిత్యంపై విజయవాడలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సిమ్లాలో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య ఉత్సవంలో గోండుల కథలపై ప్రసంగించారు. కృష్ణా జిల్లా నెమ్మలూరుకు చెందిన డాక్టర్ సమ్మెట, నిడుమోలు, మచిలీపట్నం, హైదరాబాద్, రాజమండ్రిల్లో విద్యాభ్యాసం చేశారు. న్యూఢిల్లీలో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్‌గా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పని చేస్తున్నారు. పాతికేళ్ల పాటు కొన్ని వేల సార్లు ఆకాశవాణిలో ఉచ్చారణ దోషం లేకుండా వార్తలు చదవడం తన భాషా సేవలో భాగమని తెలిపారు. తెలుగు, సంస్కృత అకాడమీ అవార్డు తన బాధ్యత మరింత పెంచిందని డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు అన్నారు. -
కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన నాగమల్లేశ్వరరావు
అసోం: కిడ్నాపర్ల చెర నుంచి ఇంజనీర్ దండమూరి నాగమల్లేశ్వరరావుకు విముక్తి లభించింది. పోలీసులు ఆయనను కిడ్నాపర్ల నుంచి క్షేమంగా విడిపించారు. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగమల్లేశ్వరరావును సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నానికి ఇంజనీర్ని విడిపిస్తామని నిన్న పోలీసులు చెప్పారు. చెప్పిన ప్రకారం విడిపించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలేనికి చెందిన నాగమల్లేశ్వరరావు ఐళ్లుగా అసోంలో వశిష్ట కనస్ట్రక్షన్స్ కంపెనీ రక్షణ విభాగంలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. గత మంగళవారం రాత్రి హాట్ల్యాండ్ జిల్లా ఎన్సీ హిల్స్‌లో ఆయన నివాసం ఉంటున్న మైబాం ప్రాంతం నుంచి కొందరు అతనిని అపహరించుకు వెళ్లారు. కిడ్నాప్ చేసిన వారు పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే ఆయనను కిడ్నాప్ చేసివారు ఉగ్రవాదులని, విద్యార్థులని రెండు రకాల కథనాలు వినవస్తున్నాయి.