కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన నాగమల్లేశ్వరరావు | Nagamalleswara Rao released | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన నాగమల్లేశ్వరరావు

Jun 23 2014 5:53 PM | Updated on Sep 2 2017 9:16 AM

నాగమల్లేశ్వరరావు

నాగమల్లేశ్వరరావు

కిడ్నాపర్ల చెర నుంచి ఇంజనీర్ దండమూరి నాగమల్లేశ్వరరావుకు విముక్తి లభించింది.

అసోం: కిడ్నాపర్ల చెర నుంచి ఇంజనీర్ దండమూరి నాగమల్లేశ్వరరావుకు విముక్తి లభించింది. పోలీసులు ఆయనను కిడ్నాపర్ల నుంచి  క్షేమంగా విడిపించారు. ప్రస్తుతం  నాగమల్లేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగమల్లేశ్వరరావును సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే.  ఈ రోజు మధ్యాహ్నానికి ఇంజనీర్ని విడిపిస్తామని నిన్న పోలీసులు చెప్పారు. చెప్పిన ప్రకారం విడిపించారు.

ప్రకాశం జిల్లా  చీమకుర్తి మండలం కేవీపాలేనికి చెందిన నాగమల్లేశ్వరరావు ఐళ్లుగా అసోంలో వశిష్ట కనస్ట్రక్షన్స్ కంపెనీ రక్షణ విభాగంలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు. గత మంగళవారం రాత్రి హాట్‌ల్యాండ్ జిల్లా ఎన్‌సీ హిల్స్‌లో ఆయన నివాసం ఉంటున్న  మైబాం ప్రాంతం  నుంచి కొందరు అతనిని అపహరించుకు వెళ్లారు. కిడ్నాప్ చేసిన వారు పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే ఆయనను కిడ్నాప్ చేసివారు ఉగ్రవాదులని, విద్యార్థులని రెండు రకాల కథనాలు వినవస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement