breaking news
Mumbai Train
-
వాళ్లకు 'న్యాయం' చేయడం ఎలా?
మన ప్రజాస్వామ్యం ఎన్నో విధాలుగా మనకు గర్వకారణం. అందుకు విరుద్ధంగా భావించడానికి కూడా అన్ని విధాలుగా ఆస్కారం ఉంది. మన వైఫల్యాల జాబితా చిన్నదేం కాదు. గత వారమే ఈ జాబితాలో మరో భయానక వాస్తవం చోటు చేసుకుంది. మన సమష్టి మనస్సాక్షిపై దీని ప్రభావం సంవత్సరాల తరబడి అలా ఉండిపోతుంది. ఇది అంత తేలిగ్గా మానే గాయం కాదు. ఈ అపరాధ భావన మనల్ని మున్ముందు కూడా వేధిస్తూనే ఉంటుంది. దీన్నుంచి బయటపడేందుకు మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడగలమా? అసలు అలా కష్టపడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మరీ ముఖ్యమైన ప్రశ్న. పన్నెండు మంది(ఇందులో ఒకరు ఇప్పటికే మరణించారు) సాటి పౌరులు వారు. న్యాయం పొందడానికి మీకూ నాకూ ఎంత హక్కు ఉందో... వారికీ అంతే ఉంది. కానీ ఏం జరిగింది? నేరం చేశా రంటూ అభియోగాలు ఎదుర్కొన్నారు. దోషులుగా తొలుత ‘నిరూ పణ’ జరిగింది. 19 సంవత్సరాలు జైల్లో గడిపారు. నిర్దోషులు అయ్యుండీ ‘శిక్ష’ అనుభవించారు. మనం వారిని పట్టించుకోలేదు. వారి దుఃస్థితిని మర్చిపోయాం. వారి ఖర్మకు వారిని వదిలేశాం. నిన్న మొన్న హైకోర్టు తీర్పు వచ్చేవరకూ ఇదే జరిగింది.చెదిరిన భ్రమలుఎట్టకేలకు బాంబే హైకోర్టు తీర్పు వెలువడింది. అప్పుడు గానీ వారు జైలు నుంచి విడుదల కాలేదు. ఇది మనకు సిగ్గుచేటు. ‘‘నిందితుల మీద మోపిన కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టం.’’ మనం తలలు దించుకోడానికి ఈ ఒక్క మాట చాలదా? (ఈ తీర్పు మీద ప్రస్తుతానికి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా, విడుదలైనవారిని తిరిగిజైలుకు రప్పించబోమని వ్యాఖ్యానించింది.)హైకోర్టు తీర్పు అక్కడే ఆగిపోలేదు. వారిపై మోపిన అభియోగాల నిరూపణ సవ్యంగా, సక్రమంగా జరిగిందని మనం అనుకున్నాం. న్యాయం పట్ల మనం ఎంతో నమ్మకం ఉంచాం. అయితే, మన భ్రమలను ఈ తీర్పు పటాపంచలు చేసింది. ‘‘కేసును మోసపూరితంగా క్లోజ్ చేయడం వల్ల ప్రజల విశ్వాసం దెబ్బ తిన్నది.’’సరే, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఈ పన్నెండు మందికి ఎలా ఊరట కలిగించగలం? అసలు ఈ పని మన వల్ల అవుతుందా? వారు జీవితంలో రెండు దశాబ్దాలు కోల్పోయారు. వాటిని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. ఇరవై ఏళ్ల పాటు వారిని తల్లితండ్రులకు, పిల్లలకు, కుటుంబానికి, మిత్రులకు దూరం చేశాం. కోల్పోయిన ఆ జీవితం ఎప్పటికైనా తిరిగొస్తుందా? దీనికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? నాకు తెలియదు. కానీ మనం ఏదైనా చేయాలి.క్షమాపణ చెప్పకూడదా?చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. కాబట్టి ముందుగా మనం క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ లోతైనదిగా ఉండాలి. బేషరతుగా చెప్పాలి. దాన్ని బాహాటంగా ప్రకటించాలి. ఇక్కడ మనం అంటే... ఎవరు? అభియోగాలు మోపి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇరికించిన పోలీసులా? కేసును అన్యాయంగా 20 ఏళ్లు నడిపించిన న్యాయవ్యవస్థ కూడానా? విచారణ ఆరంభ దశలోనే 9 ఏళ్లు గడచిపోయాయి. తర్వాత హైకోర్టు స్థాయిలో వాద ప్రతివాదాలు వినకుండానే, ఈ కేసు మరో 9 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా పడి ఉంది. గత ఏడాదే కేసులో కదలిక వచ్చింది. వారి సహ పౌరులమైన మనం సైతం పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పాల్సిన వారిలో ఉంటామా? ఉంటే, ఆ మనం– అంటే మీరు, నేను, ఈ విశాల సమాజం– తరఫున మాట్లాడే వారెవరు? కచ్చితంగా ప్రభుత్వమే కదా? మనం అనుకుంటున్నట్లు ప్రభుత్వంలోని వారు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, వారి మీదే ఈ బాధ్యత ఉంటుంది. అయితే, క్షమాపణ సరిపోతుందా? ఇప్పటి వరకూ అనుభవించిన క్షోభను పూర్తిగా తొలగించలేక పోయినా, ఈ చర్య ఆ 12 మంది బాధను కొంతైనా తగ్గిస్తుంది. ఇంకా ఏం చేయగలం? నాతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తారో లేదో చెప్పలేను కానీ, దీనిపై నాకంటూ స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది. దాన్ని మీతో పంచుకుంటాను. ఏకీభవించాలో లేదో మీరో నిర్ణయించుకోండి. కానీ, ముందు నా అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.కొత్త జీవితానికి ఆర్థిక పరిహారంఇతరత్రా ఎలా ఉన్నా ఆర్థికంగా అన్నా ఇబ్బందులు లేకుండా వారు తమ శేష జీవితం సుఖంగా గడిపేలా చూడటం మన బాధ్యత. కాబట్టి ఆ మేరకు వారికి ఆర్థిక పరిహారం అందించాలి. ఇది సరిపోతుందని కాదు. మనం అండగా ఉన్నామని చెప్పడానికైనా ఈ సుహృద్భావ చర్య తోడ్పడుతుంది. సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు వారికి ఒక అవకాశం ఇద్దాం. బతుకు పుస్తకంలో ఒక పేజీ తిప్పడానికి సరికొత్త అధ్యాయం ప్రారంభించడానికి మనం సహాయపడదాం. అలా చేస్తామా? మనకు, మన విలువలకు ఇదొక పరీక్ష. వ్యవస్థల కర్కశత్వానికి గురై నలిగిపోయిన సాటి పౌరుల పట్లమనం నిబద్ధతతో ఉండాలి. వారి గురించి ఆందోళన చెందాలి. సమైక్య సమాజంగా, ఒక దేశంగా కొనసాగాలంటే మనం ఇప్పుడే స్పందించాలి. లేనట్లయితే, దెబ్బతింటాం. అద్దంలో చూసుకునే మన ముఖం మన ఒక్కరిదే కాదు, సమష్టిగా మన అందరిదీ! ఆ ప్రతిబింబం ఆహ్లాదకరంగా, భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మరోలా కాకుండా అది అలానే ఉండటం మన మీదే ఆధారపడి ఉంది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ గతేడాది తంగలాన్ మూవీతో అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన మెప్పించింది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ సరసన ది రాజాసాబ్ చిత్రంలో కనిపించనుంది. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయిలో తాను ఓ భయానక అనుభవం ఎదురైందని పేర్కొంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత గురించి నటి మాళవిక మోహనన్ స్పందించింది.మాళవిక మోహనన్ మాట్లాడుతూ..'ముంబయిలో ఒక రోజు రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణించా. రాత్రి 9 గంటల 30 నిమిషాలు అయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ చాలా ఖాళీగా ఉంది. ఆ కంపార్ట్మెంట్లో మేము తప్ప ఎవరూ లేరు. అదే సమయంలో ఒక వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు. అప్పుడు అతడి ప్రవర్తనతో మేమంతా భయానికి గురయ్యాం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్ రాగానే కొంతమంది ప్రయాణికులు మాకు తోడయ్యారు. అప్పుడే మేమంతా ఊపిరి పీల్చుకున్నాం' అని వెల్లడించింది. అయితే అక్కడ ఉన్న మహిళలకు సురక్షితమా కాదా అనే విషయం అదృష్టంపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపింది.మాళవిక మాట్లాడుతూ..'నగరం మహిళలకు ఎంత సురక్షితమైనది అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ముంబయి మహిళలకు సురక్షితం అని ప్రజలు చెబుతారు. కాని నేను ఆ అభిప్రాయాన్ని సరిదిద్దాలనుకుంటున్నా. ఈ రోజు నాకు సొంత కారు, డ్రైవర్ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నన్ను ముంబై సురక్షితంగా ఉందా అని అడిగితే.. నేను అవును అని చెప్పగలను. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు, బస్సులు మరియు రైళ్లలో ప్రయాణించడం, నేను తరచుగా ప్రయాణించడం అదృష్టంగా భావించలేదు. ఆ సమయంలో చాలా ప్రమాదకరంగా అనిపించేది' అని చెప్పుకొచ్చింది. -
వైరల్ వీడియో: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు
Pushpa Movie Allu Arjun Srivalli Song Hook Step In Mumbai Trains: జనాల్లో పుష్ప ఫీవర్ ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. పుష్ప చిత్రాన్ని, అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ఎవరికీ నచ్చినట్లు వారు వాడేస్తున్నారు. సినిమాలోని బన్ని యాక్టింగ్‌కు అశేషప్రేక్షక జనం ఫిదా అయ్యారు. అందులోని పాటలు మరింత హైలెట్ అయ్యాయి. సాంగ్స్ లిరికల్ వీడియోలు విడుదలైనప్పుడే వాటిని స్పూఫ్, కవర్స్‌లా తెగ వాడేశారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు, హైదారబాద్ పోలీసులు సైతం పుష్పరాజ్‌ను బీభత్సంగా ఉపయోగించుకున్నారు. ఇటీవల శ్రీవల్లి సాంగ్‌ను మరాఠీ భాషలో రాసి మరీ పాట పాడాడు ఓ ట్రాఫిక్ పోలీసు. తాజాగా ఇదే పాటపై అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్‌ను అనుకరిస్తూ వైరల్ అయ్యాడు ఒక ఇన్‌స్టా గ్రామ్ యూజర్. ముంబైకి చెందిన ధీరజ్ సనప్ శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ హుక్ స్టెప్పును అనుకరిస్తూ వీడియో చేశాడు. ఆ స్టెప్పుతోనే ముంబై లోకల్ ట్రైన్‌లోకి వెళ్లడం, ప్రజల మధ్య తిరగడం, ఎస్కలేటర్ ఎక్కడం వంటివి చేస్తూ నవ్వు తెప్పిస్తున్నాడు. అల్లు అర్జున్ మ్యానరిజంతో హుక్ స్టెప్పు వేస్తే ధీరజ్ అదే స్టెప్పును సరదాగా అనుకరిస్తూ వీడియో చేసి నెట్టింట్లో వదిలాడు. ఇక ఇది చూసిన నెటిజన్స్ కామెంట్ రూపంలో మెచ్చుకుంటున్నారు. ఆదివారం అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ప్రస్తుతం లక్షకుపైగా వీక్షణలు వచ్చాయి. View this post on Instagram A post shared by Dhiraj sanap (@dhirajjjjj_) ఇదీ చదవండి: హెల్మెట్‌తో 'పుష్ప'రాజ్.. అవగాహన కోసం పోలీసుల వాడకం -
ముంబయి రైలుకు హాల్టింగ్
సాక్షి, కోరుట్ల(కరీంనగర్) : కోరుట్ల, మెట్పల్లి పట్టణ వాసుల కల నెరవేరింది. తొమ్మిది నెలలుగా చేస్తున్న ఉద్యమాలు ఫలించాయి. కళ్ల ముందు నుంచి వెళ్తున్న రైలులో ఎక్కాలంటే 35 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించాల్సిన దుస్థితి తప్పింది. కరీంనగర్– ముంబయి రైలు కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో ఆగాలన్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ఉంటున్న ముంబయి వాసుల ఇబ్బందులు తొలగనున్నాయి. కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో కరీంనగర్–ముంబయి రైలు ఆగాలని మంగళవారం రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది నెలలుగా... గతేడాది అక్టోబర్‌లో కరీంనగర్–ముంబయి రైలు ప్రారంభమైంది. వారానికి రెండు సార్లు నడుస్తున్న ముంబయి–కరీంనగర్ రైలు కేవలం జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న లింగంపల్లి రైల్వే స్టేషన్లో మాత్రమే ఆగడంతో కోరుట్ల, మెట్పల్లి పట్టణాల ప్రజలు ముంబయి వెళ్లడానికి అవస్థలు పడ్డారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల లేదా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వెళ్లి ముంబయి రైలులో ఎక్కాల్సిన దుస్థితి. తమ ఊళ్లలో ఉన్న రైల్వేస్టేషన్ల నుంచి ముంబయి రైలు వెళ్తున్నా తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి ముంబయి రైలు ఎక్కాల్సిన దుస్థితి. కోరుట్ల, మెట్పల్లి రైల్వేస్టేషన్లలో రైలు ఆగాలని కోరుతూ రెండు పట్టణాలకు చెందిన స్థానికులు నిరసన దీక్షలు చేపట్టారు. ముంబయికి చెందిన కోరుట్ల, మెట్పల్లి వాసులు సైతం ముంబయి రైలు ఆగాలని కోరుతూ రైల్‌రోకో ఉద్యమానికి సిద్ధమై ముంబయి రైలులోనే ప్రయాణించి రైలును కోరుట్లలోనే ఆపేందుకు యత్నించారు. ఆ సమయంలో భారీ పోలీసు బందోబస్తు కారణంగా రైలు ఆపడం వీలు కాలేదు. దీంతోపాటు రైల్వే జీఎంకు స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత కోరుట్ల, మెట్పల్లిలో రైలు ఆపాలని కోరుతూ రైల్వే శాఖ ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చారు. ఎట్టకేలకు ఆగనుంది స్థానికుల ఉద్యమాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తోడుగా ఇటీవల పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్న సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో ముంబయి రైలు ఆపాలని కోరుతూ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విన్నవించారు. అనంతరం పట్టుదలతో ప్రయత్నించిన క్రమంలో ముంబయి రైలును ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా కోరుట్ల, మెట్పల్లి స్టేషన్లలో ఒక్కో నిమిషం ఆగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులతో ఇప్పటి నుంచి ముంబయి రైలు కోరుట్ల, మెట్‌పల్లిల్లో ఆగనుంది. ఈ రెండు పట్టణాల నుంచి 60 ఏళ్ల క్రితం ముంబయికి వలస వెళ్లిన వేలాది కుటుంబాలకు స్థానికంగా రైలు ఆగడం ప్రయోజనకరంగా మారనుంది. ప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి.. ముంబయి నుంచి నిజామాబాద్ వరకు నడిచే లోకమాన్య తిలక్ రైలును గతేడాది సెప్టెంబర్ 26న కరీంనగర్‌కు వరకు పొడగించారు. ఆ సమయంలో జిల్లాలో జగిత్యాలకు సమీపంలో ఉన్న ఒక లింగంపల్లి స్టేషన్లో మాత్రమే స్టాప్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల మెట్పల్లి, కోరుట్ల ప్రాంత వాసులు నిరాశ చెందారు. ఆ తర్వాత ఈ రెండు పట్టణాల్లోని స్టేషన్లలో కూడా స్టాప్‌లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. చొరవ తీసుకున్న ఎంపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మొదట ఈ సమస్యపైనే దృష్టి సారించారు. కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల నుంచి నిత్యం ముంబయికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి. ఎందరు ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్తున్నారనే వివరాలతో కూడిన నివేదికను రైల్వేశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ శాఖ మంత్రిని కలిసి రైలును రెండు పట్టణాల్లో ఆపాల్సిన ఆవశ్యకతను వివరించారు. మంత్రి అంగీకరించడంతో అధికారులు రెండు స్టేషన్లల్లో స్టాప్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారానికి ఒక రోజు సెప్టెంబర్ 1 నుంచి రెండు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రస్తుతం వారానికి ఒక రోజు మాత్రమే ఈ మార్గంలో నడుపుతున్నారు. ప్రతీ ఆదివారం రాత్రి 7:45 గంటలకు కరీంనగర్ నుంచి ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. ప్రతీ శనివారం 4:40 గంటలకు అదే స్టేషన్ నుంచి ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. రెండు పట్టణాల్లో స్టాప్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయం తీసుకోవడంతో ముంబాయికి రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. -
ఆరేళ్ల కూతుర్ని రైలులో మరిచిపోయి..
ముంబై : రైలు దిగే తొందరలో ఉన్నపుడు ఏవైనా వస్తువులు మరిచి వెళ్లిపోవటం మామూలే. కానీ ఓ తండ్రి ఏకంగా తన ఆరేళ్ల కూతురిని రైలులో మర్చిపోయాడు. ఈ సంఘటన బుధవారం మహారాష్ట్రలోని కళ్యాణ్ సిటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్ర థానే జిల్లాలోని డాంబీవ్లికి చెందిన ఓం ప్రకాశ్ హరిపాల్ యాదవ్ ‘‘సాయినగర్- దాదర్ ఎక్స్‌ప్రెస్’’ రైలులో షిర్డీ నుంచి కళ్యాణ్ సిటీకి బయలు దేరాడు. రైలు కళ్యాణ్ సిటీకి చేరుకోగానే భార్య, లగేజీతో సహా రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లిపోయాడు. బయటకు రాగానే ఆరేళ్ల కూతురు లిప్సికా గుర్తుకు వచ్చింది. పాప కోసం చుట్టు పక్కల మొత్తం కలయ తిరిగినా పాప కనిపించలేదు. కొద్ది సేపటి అన్వేషణ తర్వాత కూతురిని రైలు బోగిలో నిద్ర పుచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. పాపకోసం రైలు దగ్గరకి వెళ్లే సరికే రైలు స్టేషన్ విడిచి దాదర్ వెళ్లిపోయింది. హరిపాల్ వెంటనే రైల్వే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు గురువారం దాదర్‌లో పాపను గుర్తించి అతనికి అప్పగించారు. -
గోల్డ్ చెయిన్ అమ్మేశా! ముంబై చెక్కేశా!!
‘‘నేను చిన్నప్పటి నుంచి మొండి. ఏ పని చేసినా పట్టుదలతో చేసేదాన్ని. నాకు ఈ యాక్టింగ్ అనే పిచ్చి పట్టడానికి ఓ కథ ఉంది. దానికి కూడా ఈ మొండితనమే కారణం. అప్పుడు నేను స్కూల్లో చదువుతున్న రోజులు. బాలీవుడ్ నటి పద్మినీ కొల్హాపురి మా స్కూలుకు వచ్చి యాక్టింగ్ స్కూల్ మొదలు పెడుతున్నామని ప్రకటించారు. ఇక అప్పటి నుంచీ నటన మీద ఆసక్తి పెరిగింది. ఇంట్లో ఈ విషయం చెప్పా. చిన్నపిల్లను కావడంతో నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. హఠాత్తుగా ఓ రోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవడానికి నా బంగారు గొలుసు అమ్మేసి, ముంబై రెలైక్కేశా. అప్పుడు మా నాన్నకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పా. నా సిన్సియారిటీని గుర్తించి, మా ఇంట్లోవాళ్లు కూడా నా నిర్ణయాన్ని సమర్థించారు.’’ - లక్ష్మీరాయ్