breaking news
mid air crash
-
‘సీరియస్ ఇన్సిడెంట్..’ ఎయిరిండియా ఘటనలో కొత్త ట్విస్ట్
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోయిన ఘటనలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తొలుత తీవ్ర టర్బులెన్స్ కారణంగా భావించిన ఈ ఘటనలో.. విమానంలోని సాంకేతిక వ్యవస్థల పనితీరుపై ఇప్పుడు దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ప్రయాణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, నమోదైన హెచ్చరికలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. అసలు ఏం జరిగిందన్నది తేల్చేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) లోతైన విచారణ కొనసాగిస్తోంది.ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320 విమానం AI2379 ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణం సాధారణంగానే సాగుతుండగా.. అకస్మాత్తుగా విమానం ఎత్తు కోల్పోయింది. క్షణాల్లో జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే పైలట్లు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 17 మంది గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా కిందకు జారిన సమయంలో క్యాబిన్లో గందరగోళ పరిస్థితి నెలకొందని ప్రయాణికులు తెలిపారు. కొందరు సీట్ల నుంచి కదిలిపోయారని, ఆకస్మిక కుదుపులతో భయానికి గురయ్యారని చెప్పారు.సాంకేతిక లోపాలపై దర్యాప్తుఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా విమానంలోని పలు సాంకేతిక అంశాలు ఇప్పుడు పరిశీలనలోకి వచ్చాయి. ప్రయాణ సమయంలో విమాన వ్యవస్థలు ఎలా స్పందించాయి? ఏ హెచ్చరికలు నమోదయ్యాయి? ఎత్తు కోల్పోయిన సమయంలో కంట్రోల్ సిస్టమ్స్ పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.ఆటోపైలట్ డిస్కనెక్ట్.. మాన్యువల్ కంట్రోల్లోకి పైలట్దర్యాప్తు వివరాల ప్రకారం.. విమాన ప్రయాణ సమయంలో ఆటోపైలట్ వ్యవస్థ డిస్కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కో–పైలట్ మాన్యువల్‌గా విమాన నియంత్రణ చేపట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థకు సంబంధించిన హెచ్చరికలు కనిపించినట్లు సమాచారం. కొన్ని ఇండికేటర్ స్విచ్‌లు తాత్కాలికంగా పనిచేయకపోవడం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.హైడ్రాలిక్ వ్యవస్థలపైనా అనుమానాలువిమాన నియంత్రణలో కీలకమైన హైడ్రాలిక్ వ్యవస్థల్లోనూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. విమానం దిశను నియంత్రించడం, రెక్కల కదలికలు, ల్యాండింగ్ వ్యవస్థల పనితీరులో హైడ్రాలిక్ వ్యవస్థల పాత్ర కీలకం. అయితే ఈ వైఫల్యాలు విమానం 300 అడుగుల ఎత్తు కోల్పోవడానికి కారణమయ్యాయా? లేదంటే ఇతర సాంకేతిక సమస్యలతో కలిసి ప్రభావం చూపించాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.‘సీరియస్ ఇన్సిడెంట్’గా డీజీసీఏ గుర్తింపుఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్ర ఘటనగా వర్గీకరించింది. దీనిపై AAIB దర్యాప్తు చేపట్టింది. విమానంలోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఇతర సాంకేతిక వ్యవస్థలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విమానం ఎప్పుడు ఎత్తు కోల్పోయింది? ఆ సమయంలో ఏ వ్యవస్థలు పనిచేశాయి? లోపాలు ఏ క్రమంలో వచ్చాయి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఎయిర్‌బస్, ఫ్రాన్స్ నిపుణుల సహకారంఏ320 విమానం కావడంతో తయారీ సంస్థ ఎయిర్‌బస్ నిపుణులు కూడా విచారణలో భాగమవుతున్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ BEA సాంకేతిక సహకారం అందించనుంది. విమాన సాఫ్ట్వేర్, కంట్రోల్ సిస్టమ్స్, హార్డ్‌వేర్ పనితీరును నిపుణులు పరిశీలించనున్నారు.పైలట్ల పరీక్షలపైనా దృష్టిఘటన తర్వాత నిబంధనల ప్రకారం ఇద్దరు పైలట్లకు మాదకద్రవ్య పరీక్షలు నిర్వహించారు. పైలట్ ఇన్ కమాండ్ నమూనాలో వచ్చిన ప్రాథమిక ఫలితం(విఫలమైనట్లు వచ్చింది!)పై మరింత నిర్ధారణ అవసరమని అధికారులు తెలిపారు. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు. ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా ఫ్లయింగ్ డ్యూటీల నుంచి తప్పించారు.విమానం ఎత్తు కోల్పోయి కుదుపులకు లోనుకావడానికి కేవలం వాతావరణ పరిస్థితులే కారణమా? లేదంటే సాంకేతిక లోపాలు కూడా ప్రభావం చూపించాయా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకేసారి పలు విమాన వ్యవస్థలకు సంబంధించిన అంశాలు తెరపైకి రావడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది. -
మొరాయించిన గుల్మార్గ్ గొండోలా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో సోమవారం సాయంత్రం తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. గొండోలా అని పిలిచే కేబుల్ కార్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో 65 క్యాబిన్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అందులోని సుమారు 300 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గాల్లోనే ఉండిపోయారు. కొన్ని క్యాబిన్లు 500 అడుగుల ఎత్తులో ఆగిపోగా పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. దీనికి తోడు భారీ వర్షం కురియడంతో రక్షణ చర్యలకు విఘాతం ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మొదటి విడతగా క్యాబిన్లలో ఉండిపోయిన 179 మంది పర్యాటకులను సురక్షితంగా కిందికి దించారు. తాళ్లు, నిచ్చెనల సాయంతో మరో రెండు గంటల అనంతరం మిగతా వారినీ రక్షించారు. పోలీసులు, ఆర్మీతోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 500 అడుగుల ఎత్తులో నిలిచిపోయిన క్యాబిన్లలో వారిని కిందికి దించడం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారిందని అధికారులు చెప్పారు. -
వైరల్ వీడియో : గాల్లోనే ఢీకొన్న 2 విమానాలు..
-
ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....!
వాషింగ్టన్: అంతరిక్షాన్ని జయించడం కోసం మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే నాసా, పలు దేశాల అంతరిక్ష సంస్థలు అంతరిక్షాన్ని జయించాయి. నాసా, స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించాయి. అమెరికాకు చెందిన ఫైర్‌ఫై కూడా స్పేస్ రేసులో నిలిచేందుకు ఊవిళ్లురుతుంది. అందులో భాగంగా ఫైర్‌ఫ్లై తొలి రాకెట్ ఆల్ఫాను సెప్టెంబర్ 2న ప్రయోగించింది. చదవండి: Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు ఆల్ఫా రాకెట్ లాంచ్ చేసిన కొద్ది సేపటికే ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయింది. కాగా ఫైర్‌ఫ్లై చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. ఫైర్‌ఫ్లై పేలుడుకు సంబంధించిన వీడియోను అధికారికంగా కంపెనీ రిలీజ్ చేసింది. రాకెట్ ప్రయోగంలో చోటుచేసుకున్న లోపాలను సోషల్‌మీడియాలో ఫైర్ ఫ్లై పేర్కొంది. ఫైర్‌ఫ్లై ఒక ప్రకటనలో రాకెట్ లాంచ్ ఐనా రెండు నిమిషాల తరువాత రాకెట్‌లోని ఒక ఇంజన్ పనిచేయడం నిలిచిపోయినట్లు పేర్కొంది. దీంతో ఒకసారిగా రాకెట్ తన నిర్దేశిత మార్గం నుంచి పక్కకు పోయి ఒక్కసారిగా పేలిపోయిందని కంపెనీ పేర్కొంది. ఆల్ఫా రాకెట్ భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టనప్పటికీ, కంపెనీ భవిష్యత్తులో మరిన్నీ ప్రయోగాలను చేపట్టే నమ్మకం తమలో ఏర్పడిందని ఒక ప్రకటనలో పేర్కొంది. రాకెట్లను నిర్మించగల, ప్రయోగించగల కంపెనీగా ఫైర్‌ఫ్లై నిరూపించిందని కంపెనీ తెలిపింది. -
గాలిలో ఢీకొనబోయిన ఇండిగో విమానాలు !
గువాహటి: ఇండిగోకు చెందిన రెండు విమానాలు ఆకాశంలో దాదాపు ఢీకొనే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. గువాహటిలో ఒకదానికొకటి ఎదురుగా వచ్చిన ఈ విమానాలు వెంటుక్రవాసిలో ఢీకొనేముప్పును తప్పించుకున్నాయి. అయినప్పటికీ ఒకదానికొకటి రాపిడి చేసుకోవడంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు బెదిరిపోయారు. దాదాపు నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించినట్టు అధికారులు తెలిపారు. గగనతలంలో సంభవించిన ఈ ఊహించిన ప్రమాదంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు తమ కళ్లు తిరిగి.. అస్వస్థతకు గురైనట్టు అనిపించిందని ఫిర్యాదు చేశారని, క్యాబిన్ సిబ్బందికి వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. గువాహటి లోకప్రియ గోపీనాథ్ బర్దోలై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ముంబై నుంచి గువాహటికి ఇండిగో విమానం వస్తుండగా.. అదే సమయంలో చెన్నై వెళ్లే మరో ఇండిగో విమానం టేకాప్ తీసుకుంది. రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. అయితే, వాతావరణం బాగాలేకపోవడంతో గువాహటి వస్తున్న ఇండిగో విమానం రూట్ మార్చుకుందని, దీనివల్ల రెండు ఎదురెదురుపడ్డాయని అధికారులు తెలిపారు.


